Monday 11 November 2013

యూటీతో లూటీ కొనసాగింపు

ఇన్నాళ్ళూ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్టు చెప్పిన పలువురు సీమాంధ్ర నేతలు ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్‌ను యూటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమంత్రులు చిరంజీవి, పురుందరేష్వరి ఇప్పుడు యూతీ రాగాన్ని ఎత్తుకున్న వారిలో ప్రముఖులు.

నిజానికి సీమాంధ్ర ప్రజలపై వీరికేమన్నా చిత్తశుద్ది ఉంటే విభజన అనివార్యమైన స్థితిలో సీమాంధ్ర ప్రజల హక్కులకోసం పోరాడాలి. రాజధానికోసం ప్యాకేజీనో నీటికేటాయింపులకోసమో పోరాడీతే సీమాంధ్ర ప్రజలకు బాగుండేది. కానీ వీరు ఇదేదీ అడక్కుండా హైదరాబాదును మాత్రం యూటీ చేయాలని ఎందుకంటున్నారు? యూటీ చేస్తే ఎవరికి లాభం?

హైదరాబాదును యూటీ చేస్తే హైదరాబాద్ ఆదాయం కేంద్రానికి వెల్తుంది. దీనివలన తెలంగాణకు గానీ, సీమాంధ్రకు గానీ లాభం ఉండదు. హైదరాబాద్ యూనివర్సిటీలలో తెలంగాణ వారికి గానీ, ఆంధ్రా వారికి గానీ ప్రవేశం ఉండదు. మరలాంటప్పుడు హైదరాబాద్ యూటీ చేస్తే సీమాంధ్రకేం ఒరుగుతుంది?

అయితే సీమాంధ్ర నేతలకు కావల్సింది తమ సొంత ప్రయోజనాలూ, తమ ఆర్ధిక లాభాలూ తప్ప ప్రజల బాగు కాదు గదా. ఈనేతలందరికీ హైదరాబాదు చుట్టుపక్కల వేల ఎకరాల భూములు ఉన్నాయి. అన్నీ బినామీ పేర్లతో ఉన్న కబ్జా భూములు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం తమ మీద కేసులు పెడుతుందో, కేంద్రపాలిత ప్రాంతమయితే కేంద్రం నుంచి చక్రం తిప్పవచ్చనేది వీరి ఆశగా కనిపిస్తుంది. అందుకే ముఖ్యంగా ఈడిమాండు కేంద్ర మంత్రులదగ్గరినుండి వస్తుంది. అయితే రోజులు ఎప్పటికీ ఒక్కలా ఉండవు కదా? వీరిపిచ్చిగానీ, ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతమయినా రాబోయేది వీరి ప్రభుత్వమని ఏంటి గ్యారంటీ? 

No comments:

Post a Comment

Your comment will be published after the approval.