Tuesday 15 May 2012

రెండు కళ్ళ సిద్ధాంతి

"తెలంగాణ, సీమాంధ్రా నాకు రెండు కళ్ళలాంటివి, రెండు చోట్లా మాపార్టీని కాపాడుకోవడమే మాలక్ష్యం, తెలంగాణలో తెలంగాణకు అనుకూలంగా సీమాంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా మేము ఉద్యమిస్తం, ఆవిధంగా చాలా స్పష్టమైన వైఖరితో ముందుకుపోతున్నాం" ఇదే మన చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం. ఏమాత్రం నిజాయితీ ఉన్న మనిషైనా ఒక రాజకీయ పక్షం ఇలా రెండుకళ్ళవైఖరి కలిగిఉండడాన్ని ఒక నీతిబాహ్యమైన, మోసపూరిత విధానంగా ఒప్పుకుంటారు, పచ్చకామెర్లొచ్చిన పచ్చబాబులు తప్ప. 

ఒక ఇష్యూపై రెండువర్గాలు ఘర్షణపడుతున్నప్పుడు ఆప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయపార్టీ తమవైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సరే వైఖరి చెప్పడం సాధ్యం కాదు అనుకుంటే కనీసం తటస్థంగా ఉండాలి, అంతేకానీ ఇలా రెండుచోట్లా ఉద్యమం చేసి రెండుచోట్లా రాజకీయంగా లాభపడదాం, కేంద్రం ఏవైఖరి చెప్పినా అందుకు వ్యతిరేక సెంటిమెంటును కొళ్ళగొడదాం అని వ్యవహరించడం పచ్చి అవకాశవాదం. 

ప్రస్తుతం దేశంలో రగులుతున్న కొన్ని సమస్యలపై రెండుకల్లవిధానాన్ని అప్లై చేస్తే ఎలాగుంటుందో చూద్దాం:

అవినీతి, జన్‌లోక్‌పాల్ బిల్లు: మాపార్టీలో ఉన్న అవినీతిపరులైన నాయకులందరికీ జన్‌లోక్‌పాల్ బిల్లు ఇష్టం లేదు, ఆబిల్లు వస్తే వారికి అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు దండుకోవడం కష్టం. కానీ మాపార్టీలో మధ్యతరగతి కార్యకర్తలు అవినీతికి వ్యతిరేకం. కాబట్టి మాలంచగొండి నేతలు ఈబిల్లుకు వ్యతిరేకంగా, మిడిల్ క్లాస్ కార్యకర్తలు బిల్లుకు అనుకూలంగా ఉద్యమిస్తారు. మాపార్టీ ఇద్దరికీ మద్దతిస్తుంది, ఉద్యమానికి కావల్సిన మెటీరియల్‌ను ఇద్దరికీ సప్లై చేస్తుంది, ఆవిధంగా మేము ముందుకు పొతా ఉంటాము.

మహిళా రిజర్వేషన్: మాపార్టీలో మహిళలు రిజర్వేషన్ కావాలంటున్నారు, కొందరు పురుషులు మాత్రం దానికి వ్యతిరేకం. కనుక మేము ఇద్దరినీ రెండువైపులా ఉద్యమించమని చెప్పాం. మేము ఇద్దరికీ మద్దతిస్తున్నాం, ఆవిధంగా మేము స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నాం.

అయోధ్య, బాబ్రీ మసీదు: మాపార్టీలో ఉన్న హిందువులేమో అక్కడ గుడి కట్టాలంటున్నారు, ముస్లిములేమో మసీదు కట్టాలంటున్నారు. మేము ఇద్దరికీ అనుకూలం కనుక ఇద్దరికీ కత్తులు సప్లై చేసి పొడుచుకుని చావండని చెప్పాం. మాపార్టీ ఈవిషయంపై అన్ని పార్టీలకన్నా అత్యంత స్పష్టమైన వైఖరి కలిగి ఉంది.

దళితుల వర్గీకరణ: మాపార్టీకి మాలలు, మాదిగలు రెండు కళ్ళలాంటివారు. మాకు ఇద్దరి వోట్లూ ముఖ్యమే. ఈరెండు వర్గాల్లో ఎవరివోట్లు రాకపోయినా మాపార్టీకి డిపాజిట్లు దక్కడం కష్టమవుతుంది. అందుకే మేం మాపార్టీలో మాలలకూ, మాదిగలకూ ఇద్దరికీ ఉద్యమాలు చేసుకోవడానికి స్వేఛనిచ్చాం. ఇద్దరినీ వేర్వేరుగా ఉద్యమాలు చేసుకొమ్మనీ, ఎప్పుడయినా ఎదురుపడితే ఒకర్నొకరు కొట్టుకోమనీ సలహా ఇచ్చాం. ఇలా ముందుకు పోతాఉన్నామని నేను మనవి చేసుకుంటాఉన్నాను.  

ఇంతకూ తనపార్టీలో రెండువర్గాలకు ఉద్యమించుకోవడానికి స్వేచ్ఛనివ్వడానికి ఈయనెవరు? స్వేచ్ఛనిచ్చింది భారత రాజ్యాంగం. ఈయనిచ్చింది స్వేచ్చకాదు, రెండువర్గాలమధ్య మంటరాజెయ్యడానికి కావల్సిన నిప్పు. 

ప్రజలను ఏనాయకులూ ఎల్లకాలం మోసగించలేరు. ఈ మోసగాళ్ళ ఆటలు తమమోసం సాగినన్నాల్లు మాత్రమే నడుస్తాయి. మోసం బట్టబయలయాక కూడా ఇంకా మోసం చేద్దామనుకుంటే చివరికి రెండు కళ్ళూ పోయి గుడ్డికళ్ళు మిగుల్తాయి, ప్రస్తుతం ఈరెండుకళ్ళ సిద్ధాంతి పరిస్థితి ఇదే.  

16 comments:

  1. విశ్వరూప్ మీరు tongue twister ఆట ఆడితే మొదటి ప్రైజ్ ఖాయం.
    "తెలంగాణలో తెలంగాణకు అనుకూలంగా సీమాంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా మేము ఉద్యమిస్తం" - ఈమాట చంద్రబాబు ఎక్కడ అన్నాడో రెఫెరెన్సు పెట్టండి. నోటికి వచ్చిన విషయాల్ని ప్రచారం చేయటం కాదు.

    ఇక విషయానికి వస్తే, ఇదే రెండు కాళ్ళ సిద్ధాంతాన్ని పరకాల్ లో ఎవరికీ మద్దతు ఇవ్వాలి అనే దాని ఫై TJAC కి కూడా అన్వయిద్దాం.

    TJAC : మాకు BJP , TRS రెండు ముఖ్యమే. ఏదో ఒక పార్టీ అంటే తెల్చుకోలేం (?) మాలో సగం మంది BJP కి ప్రచారం చేస్తారు, సగం మంది తెరాస కి ప్రచారం చేస్తారు.

    అదయ్య సంగతి. ఒక నియోజక వర్గం లో రెండు పార్టీ లు ఉంటె దేనికి సపోర్ట్ చేయాలో తేల్చుకోలేక పోతోంది జాక్. కానీ ఒక రాష్ట్రాన్ని విడదీసే విషయం లో మాత్రం తేల్చేయాలట. తన దాక వస్తే కానీ నొప్పి తెలియలేదు.

    ఒక ప్రాంతం పేరు చెప్పి ఆంధ్ర ప్రజలని అడ్డంగా విడదీసాడు కెసిఆర్. దానికి మీలాంటి చదువుకున్నవాళ్ళు కూడా సపోర్ట్. ఎం చేస్తాం పోయేకాలం.

    "తనపార్టీలో రెండువర్గాలకు ఉద్యమించుకోవడానికి స్వేచ్ఛనివ్వడానికి ఈయనెవరు? స్వేచ్ఛనిచ్చింది భారత రాజ్యాంగం. ఈయనిచ్చింది స్వేచ్చకాదు, రెండువర్గాలమధ్య మంటరాజెయ్యడానికి కావల్సిన నిప్పు. "

    నిప్పు ఇవ్వటం కాదు ఆంధ్ర ప్రదేశ్ ని నిలువునా తగలెట్టింది కెసిఆర్. దానికి సపోర్ట్ మీలాంటి వాళ్ళు.

    ప్రజలను ఏనాయకులూ ఎల్లకాలం మోసగించలేరు. ఈ మోసగాళ్ళ ఆటలు తమమోసం సాగినన్నాల్లు మాత్రమే నడుస్తాయి. మోసం బట్టబయలయాక కూడా ఇంకా మోసం చేద్దామనుకుంటే చివరికి రెండు కళ్ళూ పోయి గుడ్డికళ్ళు మిగుల్తాయి, ప్రస్తుతం ఈరెండుకళ్ళ సిద్ధాంతి పరిస్థితి ఇదే. "

    మీరు చెప్పింది కరెక్టే. కెసిఆర్ మరియు మీలాంటి వాళ్ళు చేసే ఆపద్ధపు ప్రచారాలు, పడికట్టు పిడి వాదనలతో ఎంతో కాలం ప్రజలని మోసం చేయలేరు. అప్పుడు మీకు ఆ గుడ్డి కళ్ళు కూడా మిగలవు.

    ReplyDelete
    Replies
    1. /*"తెలంగాణలో తెలంగాణకు అనుకూలంగా సీమాంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా మేము ఉద్యమిస్తం" - ఈమాట చంద్రబాబు ఎక్కడ అన్నాడో రెఫెరెన్సు పెట్టండి.*/

      అనేకసార్లనాడు, యూట్యూబ్‌లో పాతవీడియోలు చూడండి. పదాలు కాస్త అటూ ఇటూగా.

      /*TJAC : మాకు BJP , TRS రెండు ముఖ్యమే. ఏదో ఒక పార్టీ అంటే తెల్చుకోలేం */
      ఒక ఆశయసాధనకోసం ఏర్పడ్డ ఒక జాక్ అదేఆశయంతో పనిచేస్తున్న రెందూ పార్టీల్లో ఎటూ తేల్చుకోలేకపోవడం ఆజాక్ నిశ్పాక్షికతను సూచిస్తుంది. ఒక రాజకీయపార్టీ పెట్టిన నాయకుడు ప్రజలకు సమంధించిన ఒక ఇష్యూపై రెండు ప్రాంతాల్లో రెండురకాలుగా మాట్లాడి, తననేతలతో రెండువైపులా ఉద్య్మాలు చేపించినట్టు నాటకమాడడం అవకాశవాదమవుతుంది. ఈసున్నితమైన తేడాను మీరు గమనించాలి.

      ఎటూ తేల్చుకోలేకపోతే తటస్థంగా ఉండాలి, రెండువైపిలా నేనే యుద్ధం చేస్తానంటే రెండుకళ్ళూ పోతాయి.

      /**ఒక ప్రాంతం పేరు చెప్పి ఆంధ్ర ప్రజలని అడ్డంగా విడదీసాడు కెసిఆర్. **/

      పొరపాటు. పాలకులు తమ పరిపాలనలో పక్షపాతం ద్వారా ప్రజలను విడదీశారు. ఆపక్షపాతాన్ని కేసీఆర్ ఎత్తిచూపాడు. ఈఉద్యమం కేసీఆర్తో రాలేదు. పాలకుల పక్షపాతం కూడా ఇప్పుడు మొదలవ్వలేదు.

      /**నిప్పు ఇవ్వటం కాదు ఆంధ్ర ప్రదేశ్ ని నిలువునా తగలెట్టింది కెసిఆర్. **/
      మల్లీ పొరపాటు. నిలువునా తగలబెట్టింది లగడపాటి, చంద్రబాబు, మిగతా సమైక్యాంధ్ర నాయకులు. కేంద్రప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వీరు ఆనిర్ణయానికి కట్టుబడీ ఉండకుండా, కనీసం తమ పార్టీ విధానాలకూ, మానిఫెస్టోలకూ, తాము అంతకు ముందు ఒకరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ప్రజలను రెచ్చగొట్టి వచ్చినరాష్ట్రాన్ని నిలువునా రాష్ట్రాన్ని తగలబెట్టారు. దానికి మీబోటివారి వత్తాసు.

      /**మీరు చెప్పింది కరెక్టే. కెసిఆర్ మరియు మీలాంటి వాళ్ళు చేసే ఆపద్ధపు ప్రచారాలు, పడికట్టు పిడి వాదనలతో ఎంతో కాలం ప్రజలని మోసం చేయలేరు. అప్పుడు మీకు ఆ గుడ్డి కళ్ళు కూడా మిగలవు.**/

      మోసం ఎవరిదో ఇప్పుడు ప్రజలు గ్రహించారు గనకే చంద్రబాబుకు రెండుప్రాంతాల్లో దిక్కులేకుండా పొయ్యింది.

      Delete
    2. Read this link: https://plus.google.com/111113261980146074416/posts/M86qtBJJMAB

      Delete
    3. "అనేకసార్లనాడు, యూట్యూబ్‌లో పాతవీడియోలు చూడండి. పదాలు కాస్త అటూ ఇటూగా."
      దీన్నే tongue twisting అంటారు. పదాలు కాస్త అటు ఇటు గా కాదు. అవే పదాలైనా స్వరం మారిస్తే అర్థం మారిపోతుంది. సరే, కాస్త పదాలు అటు ఇటు అయిన, చంద్రబాబు అలా అన్న వీడియోలు నేను చూడలేదు. దయచేసి లింక్స్ ఇవ్వండి మిగిలిన బ్లాగ్ మిత్రులకి కూడా తెలుస్తుంది.

      "ఒక ఆశయసాధనకోసం ఏర్పడ్డ ఒక జాక్ అదేఆశయంతో పనిచేస్తున్న రెందూ పార్టీల్లో ఎటూ తేల్చుకోలేకపోవడం ఆజాక్ నిశ్పాక్షికతను సూచిస్తుంది"
      అదే మరి. JAC ఎటూ తేల్చుకోలేకపోతే నిష్పాక్షికత, అదే తెలుగుదేశం లేదంటే కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతే అది రెండు కళ్ళ సిద్ధాంతం. ఏమి ద్వంద్వ నీతి స్వామీ. కేవలం తె-వాదులకి మాత్రమే సాధ్యమయ్యే వాదన.

      "పొరపాటు. పాలకులు తమ పరిపాలనలో పక్షపాతం ద్వారా ప్రజలను విడదీశారు. ఆపక్షపాతాన్ని కేసీఆర్ ఎత్తిచూపాడు. ఈఉద్యమం కేసీఆర్తో రాలేదు. పాలకుల పక్షపాతం కూడా ఇప్పుడు మొదలవ్వలేదు"
      అవునా? తెలంగాణా ఎందుకులే, కేవలం మీ నియోజకవర్గం ని తీసుకుందాం. గత 50 సంవత్సరాలుగా ఎవరు పరిపాలించారు. సీమంధ్ర వాళ్ళా లేక మీ ప్రాంతం వాళ్ళా. ఒకవేళ పక్షపాతం చూపించి ఉంటే మీ నాయకులనే నిలదీయాలి కానీ. అడ్డమైన రాతలెందుకు. నిజానికి ప్రాంతాలకి అతీతంగా అన్ని చోట్ల వెనకబాటు తనం ఉంది. అలాగే అన్ని ప్రాంతాలలోను బాగుపడ్డ ఊర్లు ఉన్నాయి. ఉదాహరణకి ఉత్తరాంధ్ర, విశాఖ మన్యం etc . పాలకుల వివక్ష వల్లనే విడిపోవాలి అనుకుంటే తెలంగాణా తో పాటు ఆ ప్రాంతాలని కూడా కలిపి కొత్త రాష్ట్రము కావాలని కోరే వాళ్ళు గా. మరి కేవలం తెలంగాణా ప్రాంతం మాత్రమే వేరు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే ప్రాంతీయత భావం. రేపు తెలంగాణా ఏర్పడితే, ఉత్తర తెలంగాణా నుండో, మన్యం నుండో, JR KCR ఇదే గోల మొదలెడతాడు. వాడిది పోయేదేముంది. పోతే వెంట్రుక వస్తే కొండ.

      "నిలువునా తగలబెట్టింది లగడపాటి, చంద్రబాబు, మిగతా సమైక్యాంధ్ర నాయకులు. కేంద్రప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వీరు ఆనిర్ణయానికి కట్టుబడీ ఉండకుండా, కనీసం తమ పార్టీ విధానాలకూ, మానిఫెస్టోలకూ, తాము అంతకు ముందు ఒకరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ప్రజలను రెచ్చగొట్టి వచ్చినరాష్ట్రాన్ని నిలువునా రాష్ట్రాన్ని తగలబెట్టారు. దానికి మీబోటివారి వత్తాసు. "

      అయ్యా, ఇలాంటి తల తోక లేని విభజన వాదానికి మీబోటి వాళ్ళ వత్తాసు లేకపోతే ఆ తరువాత జరిగిన పరిణామాలకి మా బోటి వాళ్ళ వత్తాసు అనే మాటే వచ్చేది కాదు (నేను వారికీ , వారు చేసిన దానికి వత్తాసు అని ఎక్కడ రాయక ముందే వారు చేసిన దానికి నేను వత్తాసు పలికినట్టు రాసేసారు. ఇంకో twister . పోనీ ఎక్కడిన అలా రాసి ఉంటే రెఫెరెన్సు ఇవ్వండి.) ఇక ఇచ్చిన మాటకి కట్టుబడే దాని గురించి మాట్లాడే అర్హత నాకు తెలిసి చాల మంది భారతీయులకి లేదు. రాజకీయనాయకులు ఎన్నో చెప్పారు. కానీ నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా అని అడగం. మళ్లీ వచ్చే ఎన్నికల్లో అవే వాగ్దానాలు. మళ్లీ గొర్రెల్లాగా వెళ్లి వాళ్ళకే వోట్ వేస్తాం. అంతెందుకు కెసిఆర్ అసెంబ్లీ లో తెరాస పెట్టకముందు మాట్లాడిన దానికి తరువాత మాట్లాడిన దానికి పొంతన లేదు. మరి కెసిఆర్ మాట మర్చలేదా? దీనికేమంటావ్? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.

      "మోసం ఎవరిదో ఇప్పుడు ప్రజలు గ్రహించారు గనకే చంద్రబాబుకు రెండుప్రాంతాల్లో దిక్కులేకుండా పొయ్యింది."
      చంద్రబాబు కి దిక్కులేకుండా పోయింది అందుకు కాదు. కలి కాలం కదా సహజమే. JP లాంటి వాళ్ళకి కాకుండా కెసిఆర్, జగన్ లాంటి వాళ్ళకు మద్దతు పెరగడం సహజమే.

  4. "అనేకసార్లనాడు, యూట్యూబ్‌లో పాతవీడియోలు చూడండి. పదాలు కాస్త అటూ ఇటూగా."

  5. మల్లీ పొరపాటు. నిలువునా తగలబెట్టింది లగడపాటి, చంద్రబాబు, మిగతా సమైక్యాంధ్ర నాయకులు. కేంద్రప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వీరు ఆనిర్ణయానికి కట్టుబడీ ఉండకుండా, కనీసం తమ పార్టీ విధానాలకూ, మానిఫెస్టోలకూ, తాము అంతకు ముందు ఒకరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ప్రజలను రెచ్చగొట్టి వచ్చినరాష్ట్రాన్ని నిలువునా రాష్ట్రాన్ని తగలబెట్టారు. దానికి మీబోటివారి వత్తాసు.

    viswaroop garu remember samaikhyandhra is a by product of your hatred against andhra people ur leaders gave a key to spread apprehensions in andhra people by the people whom u mentioned
    1.can you name one person who condemmed kcr's 'jaago baago' comments even a learnt person,an intellectual jai shankar didn't condemm his comments
    2.not even a single t-vadi condemmed pocharam's comment on andhra people and BTW who is pocharam to dictate andhra people on whom to vote or not to vote

    you may say these words said in frustration and anger then u call payyavula kesav's 'sucide bombers' comment as undemocratic why dont u people take it as anger and frustration.

    instead of spreading hatred u could have atleast tried to convince andhra people then there wouldn't any samaikhyandhra.

    the more the hatred against andhra people the more the distant will be ur dream.

    finally,kcr is also culprit in this mayhem and arson

    ReplyDelete
    Replies
    1. "samaikhyandhra is a by product of your hatred against andhra people"

      Why did this by-product suddenly come up on December 10? Thereby hangs a tale.

      Why did Babu & Chiru support Telangana demand in 2009?

      "can you name one person who condemmed kcr's 'jaago baago' comments"

      No, not even Chandra Babu condemned this statement. Why?

      BTW, I can't find a single link to this statement. The context can be gauged only from the original statement, not knee jerk reactions.

      "not even a single t-vadi condemmed pocharam's comment on andhra people"

      Many T-bloggers & netizens condemned Pocharam.

      "u could have atleast tried to convince andhra people"

      We already did this. Even Babu & Chiru were "convinced" (or pretended to do so). What is the point in trying to convince those who went back on their word overnight?

      Delete
  6. మల్లీ పొరపాటు. నిలువునా తగలబెట్టింది లగడపాటి, చంద్రబాబు, మిగతా సమైక్యాంధ్ర నాయకులు. కేంద్రప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వీరు ఆనిర్ణయానికి కట్టుబడీ ఉండకుండా, కనీసం తమ పార్టీ విధానాలకూ, మానిఫెస్టోలకూ, తాము అంతకు ముందు ఒకరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ప్రజలను రెచ్చగొట్టి వచ్చినరాష్ట్రాన్ని నిలువునా రాష్ట్రాన్ని తగలబెట్టారు. దానికి మీబోటివారి వత్తాసు.
    @viswaroop garu
    the anti-telangana campaign(samakhyandhra) which you call is a by-product of hatred spread by kcr against andhras, it is u people who gave a key to create aprehensions in minds of andhras by lagadapati and co.(of which u call samaikhyandhra gang)

    kcr is also an equal culprit and he will definitely pay for his sin in near future.
    if you still want illusion people with ur twisted fact that kcr is not responsible for any hatred across the two regions its upto you

    remember the more the hatred the more the distant will be ur dream

    ReplyDelete
    Replies
    1. @ANIL

      Oh! I see!Great news. But how come the by-product of hatred turn to asking for being united? How come the by-product takes birth overnight?

      As far as I know state was in much better shape until Dec 9th 2009. How come the 10 year spread of hatred(??) did nothing but your 15 days of agitation, that too for the cause of being united which supposed to make congenial environment turns state into ugly mess?

      Remeber! Exposing reality will not cause any hatred, but suppression of reality with fake movements would do.

      Delete
    2. viswaroop garu

      when ur leaders are right nobody can stop you not even chandrababu or lagadapati or some xyz can ur leaders(congress or tdp) resign for telangana cause?
      when the agenda is to gain political mileage how can you expect them to fulfil people's demands.

      and BTW without people's support fake and overnight originated movements cannot stand even for a minute

      Delete
  7. బాగా రాసారు.
    "ప్రజలను ఏనాయకులూ ఎల్లకాలం మోసగించలేరు." - నిజమే. చంద్రబాబు లాంటి వాళ్ళు ఎంతో కాలం జనాన్ని మోసం చెయ్యలేరు. అది చేతకానపుడు మూసుక్కూచోవాలి. లేదా తెవాదులను చూసైనా నేర్చుకుని రంగంలోకి దిగాలి. అతడొక ఎమెచ్యూర్ మోసగాడు. ఆర్గనైజ్డ్ మోసం, సస్టెయిన్డ్ మోసం, చెయ్యాలంటే సిగ్గు పడకుండా తెవాదుల్లాంటి ప్రొఫెషనల్స్ దగ్గర నేర్చుకోవాలి, తప్పులేదు.

    ReplyDelete
    Replies
    1. @తుమ్మల శిరీష్ కుమార్

      పోసుకోలు కబుర్లెందుకు?తెవాదులు మోసం జేస్తే అది మీబ్లాగులో బయటపెట్టండి, ఇక్కడ రెండుకళ్ళసిద్ధాంతం ఎందుకు మోసం గాదో రాయగలిగితే రాయండి.

      మోసం జేసెటోడు ప్రజలు ఎన్నుకోకున్నా మామను దించి అధికారంలోకొస్తడు, ఢిల్లీల చక్రం దిప్పుతడు, మోసం జేసెటోడు ఒకసారి ఉచితం వద్దని తరువాత కలర్ టీవీలు, ఖాతలల్ల డబ్బుల పంపిణీలు అంటడు. మోసం జేసెటోడు ఇయ్యల బిల్లు బెట్టి జూపియ్యున్రి, మద్దతు ఇయ్యకపోతె అడుగుండ్రి అంటడు, రేపు ఎవర్నడిగి నిర్ణయం తీసుకున్రు అంటడు. మోసం జేసెటోడు ఇక్కడోమాట గక్కడోమాట జెప్పుతడు. ఇయ్యాల రాజకీయాలల్ల మోసగాడెవరో చిన్నపోరగానికి గుడ ఎరికే.

      Delete
    2. మోసం కాదని నేనెక్కడన్నాను?

      Delete
    3. "చంద్రబాబు రెండుకళ్ళసిద్ధాంతంలో నీతి(?) అర్ధం కావలంటె తెవాదులు తమ రంగుకళ్ళజోళ్ళు తీసిచూడాలి" ఇలాంటి లైనేదో తమ బ్లాగులో చూసినట్లు గుర్తు. నాక్కొంచెం కల్లద్దాలు పెద్దయే ఉన్నవిగని తమరు పచ్చ కళ్ళద్దాలు తీసి జెర సమజయ్యేట్లు జెపుతరా గన్ల నీతేందో?

      Delete

Your comment will be published after the approval.