Tuesday, 22 May 2012

సీమాంధ్రలో ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి?


ఫొటో: సమైక్యాంధ్ర “ఉద్యమం”లో భాగంగా కడపలో ఒక పెట్రోల్ బంకును ధ్వంసం చేస్తున్న టిడీపీ గూండాలు



ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం:

1952 లో ఆంధ్రాలో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టులదెబ్బకు ఆంధ్రాలో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం లాంటివారు ఓడిపోయి రాజకీయనిరుద్యోగులయిపోయారు. టంగుటూరి ప్రకాశం గారు ముఖ్యమంత్రి పదవికోసం కష్టపడ్డా అది తమిలుడు రాజాజీకే దక్కింది. దీంతో వీల్లందరికీ తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకు వచ్చింది. అంతకుముందు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజన ఊసెత్తని ప్రకాశం, ఎప్పుడో ముప్పైల్లో వచ్చిన ప్రతిపాదనకు మోకాలడ్డిన నీలం ఆంధ్రులకు స్వరాష్ట్రం కావాలన్నారు. తప్పు లేదు..వాళ్ల వాళ్ళ సొంత అజెండాలు మనకనవసరం..ఉద్యమం మంచి చెడ్డలు తప్ప.

రాజాజీ అప్పటి ప్రతిపాదిత నందికొండ ( ఇప్పటి నాగార్జునసాగర్) నుండి కొంత నీటిని మద్రాసుపట్టణానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇది క్రిష్ణా, గుంటూరులో ఉన్న భూస్వామ్యవర్గాలకు నచ్చలేదు. ఇదే అదను అనుకొని రాజకీయంగా దెబ్బతిన్న బెజవాడ, నీలం, ప్రకాశం లాంటి నాయకులు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమం మొదలు పెట్టారు. ఇక్కడ ఆంధ్రా నాయకుల, క్రిష్ణా, గుంటూరు భూస్వాముల ప్రయోజనాలే ఈఉద్యమానికి కీలకమయ్యాయన్నది గమనించాల్సిన విషయం.

అంతకుముందు గుంటూరులో కొన్ని గుమస్తా ఉద్యోగాలు తమిలులకు ఇచ్చారంటూ చిన్న గొడవ కూడా బయల్దేరింది. తమిలులు తమ అవకాశాలను దోచుకుంటున్నారనేది ఉద్యమంలో ముఖ్యంగా ప్రచారం అయింది. అంటే ఇప్పటి తెలంగాణ ఉద్యమం లాగానే అప్పుడు కూడా ఉద్యోగాలు, నీళ్ళు ప్రధానాంశాలు కాగా తరువాత అది తెలుగువారి ఆత్మగౌరవంగా మారిపోయింది.

అప్పటి జేవీపీ కమిటీ మద్రాసు లేకుండా రాష్ట్రాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంది. అయితే అప్పటి ఉద్యమంలో ఎవరికీ పక్కన తెలంగాణలో ఉన్న తెలుగు వారు గుర్తుకు రాలేదు. మద్రాసు లేకపోతే సరే తెలంగాణలో ఉన్న తెలుగువారిని కూడా కలపాలి అని ఎవరూ ప్రతిపాదించలేదు, ఉద్యమించలేదు. కానీ తమకి రాని, తమిలులు అధికమయిన మద్రాసుకోసం మాత్రం పోరాడారు, అమాయకుడు పొట్టి శ్రీరాములును పొట్టన బెట్టుకున్నారు.

జై ఆంధ్రా ఉద్యమం:


1969 తెలంగాణ ఉద్యమం తరువాత ముల్కీ నిబంధనల అంశం సుప్రీం కోర్టుకు చేరింది. చివరికి సుప్రీం కోర్టు తమ తీర్పులో ముల్కీ నిబంధనలు న్యాయమయినవే అని తేల్చింది. దీనికి కొద్దినెలలు ముందుగానే అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసిమ్హారావు సీమాంధ్రలో భూసంస్కరణలను అమలు చెయ్యడానికి ప్రయత్నిస్తుంటే అప్పటి ఆంధ్రా మంత్రులు, ఇతర నాయకులకు ఇది నచ్చడంలేదు. పీవీపై ఈవిషయంపై ఆంధ్రా నాయకులు కోపంతో రగులుతున్నారు.

ముల్కీ నిబంధనల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుతో వీరికి చక్కగా అదును చిక్కింది. ఇంకేం ఒక్కసారిగా ఆరుగురు మంత్రులు రాజీనామా చేసి జై-ఆంధ్ర ఉద్యమం లేవనెత్తారు. ఇక్కడ కూడా ఉద్యమం కొందరు భూస్వామ్య వర్గాల ప్రయోజనాలకోసమేనని తెలుస్తుంది.

అయితే ముల్కీ రూల్స్ ఏపక్షపాత నేతో బలవంతంగా వీరిపై రుద్దలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రులు వీరికి అన్యాయం చేయలేదు. కేవలం సుప్రీం కోర్టు ఇది న్యాయమేనని ధృవీకరించింది. అయినా దేశంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించకుండా వీరు ఉద్యమాన్ని లేపారు. కొన్ని నెలలు అల్లకల్లోలం సృష్టించారు.

ఎలాగయితేనేం ఈఉద్యమం ద్వారా వీరు తాము కోరుకున్న ఫలితాన్ని రాబట్టగలిగారు. ముల్కీ రూల్స్ రద్దయ్యాయి,పీవీ ముఖ్యమంత్రి పదవినుండి దిగిపోయాడు, భూసంస్కరణలు ఆగిపోయాయి. ఒక్కసారిగా ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ కూడా ఆగిపోయింది. ఈఉద్యమం మొదలవడం, ఆగిపోవడం అంతా కూడా తెలంగాణకు న్యాయం జరుగుతుంటే అడ్డుకోవడానికే తప్ప నిజంగా విడిపోవడానికి కాదనీ, కలిసి ఉండడంలో విపరీతంగా లాభపడుతున్నవీరికి విడిపోవాలని లేదనీ తెలుస్తుంది.


సమైక్యాంధ్ర ఉద్యమం:

2009 డిసెంబరు తొమ్మిదిన చిదంబరం తెలంగాణ ప్రకటించగానే సీమాంధ్రలో రాత్రికి రాత్రే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయింది. అంతకుముందు పదేళ్ళుగా తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఏనాడూ అడ్డుచెప్పనివారు, పైగా తెలంగాణ వస్తే రాజధాని గుంటూరు దగ్గరొస్తుందని భూముల ధరలు పెంచిన వారు, అన్నిపార్టీలూ తెలంగాణ అంశాన్ని మానిఫెస్టోల్లో చేర్చినప్పుడు, మద్దతు ప్రకటించినపుడు అడ్డుచెప్పక వారినే గెలిపించినవారు, కనీసం బిల్లు పెట్టండి మేం మద్దతు ఇవ్వకపోతే అడగండి అని రెండ్రోజులముందు చంద్రబాబు అన్నా అడ్డు చెప్పనివారికి ఒక్కసారి సమైక్యతలోని సద్భావన గుర్తొచ్చింది. ఇంకేముంది వెంటనే తెలంగాణ ప్రజలను "మీరు మాతో కలిసుండాల్సిందే" అంటూ సమైక్యాంధ్ర ఉద్యమం చేశారు.


ఎవరైనా తమ హక్కులకోసం ఉద్యమం చేస్తారు. మీరు మాతో కలిసి ఉండాల్సిందే అంటూ ఎదుటివారి హక్కులకు అడ్డుపడడానికి చేసిన ఉద్యమం చరిత్రలో ఇదే మొట్టమొదటిది.

ఈఉద్యమం కూడా మిగతా రెండు ఉద్యమాల లాగే సమైక్య రాష్ట్రంలో అమితంగా లాభపడుతున్న కొద్దిమంది ధనిక, భూస్వామ్య, పెట్టుబడిదారులకోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఉద్యమానికి దలితులెవరూ మద్దతివ్వకపోగా వారు విభజనే కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈవిధంగా సీమాంధ్రలో జరిగిన మూడు ప్రధాన ఉద్యమాలు ధనిక భూస్వామ్య వర్గాలు, కొందరు నేతల ప్రయోజనం కోసం చేసినవి కాగా ఈ మూడు ఉద్యమాల్లో మూడు రకాలుగా ఉద్యమాలు చేశారు. ఒకసారి ఇప్పుడు తెలంగాణలో ఏఅంశాలమీద ఉద్యమం జరుగుతుందో అదే అంశాలమీద జరిగిన ఉద్యమం. అప్పుడు అవేకారణాలమీద విడిపోవడం వీరికి ఒప్పుగా తోచగా ఇప్పుడది తప్పుగా తోస్తుంది. మరో ఉద్యమంలో ఇప్పటివాదనకు పూర్తిభిన్నంగా ఇప్పుడు కలిసి ఉందామన్న వారు అప్పుడు విడిపోదామన్నారు..అదికూడా కనీసం దేశంలో అత్యంత ఉన్నతమయిన న్యాయపీఠం ఒక తీర్పునిస్తే దాన్ని గౌరవించకుండా!

అంటే ఇక్కడ ఉద్యమాలకు ఒక సిద్ధాంతాలు, గట్రా ఉండవు. ఇక్కడి భూస్వామ్య, ధనిక వర్గాల ప్రయోజనాలు కాపాడేందుకు వీల్లు ఏదయినా వాదించగలరు అనితెలుస్తోంది. రేప్పొద్దున కేంద్రప్రభుత్వం సమైక్య రాష్ట్రాన్ని అలాగే ఉంచి తెలంగాణకు న్యాయం జరిగేలా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే మల్లీ ఈనాయకులే తమ స్వరం మార్చి రాష్ట్రాన్ని విడగొట్టాలనే డిమాండ్ చేయగలరు.

నిజమైన ప్రజా ఉద్యమాలు:

మరి ఇక్కడ నిజమయిన ప్రజా ఉద్యమాలు జరగలేదా అంటే జరిగాయి. మొన్న కాకరాపల్లిలో థెర్మల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం, కారంచేడు దళితుల ఊచకోతకు వ్యతిరేకంగా చేసిన ఉద్యం, ఇలాంటివే మరికొన్ని. వీటికి ఇక్కడి ఏపెద్దనాయకుడు తమ మద్దతునివ్వడు, గట్టిగా పోరాడడు, ఏదో మొక్కుబడి ఖండనలు తప్ప. పేదోల్లకి న్యాయంజరిగేలా చేసే ఉద్యమాలకు ఇక్కడ కనీసంచదువుకుని పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా మద్దతివ్వదు, ఎందుకంటే వీరిలో అత్యధికులు సీమాంధ్ర ధనిక భూస్వామ్య వర్గాలవారే కాబట్టి.

18 comments:

  1. "గెలిచిన టంగుటూరి ప్రకాశం గారు ముఖ్యమంత్రి పదవికోసం కష్టపడ్డా అది తమిలుడు రాజాజీకే దక్కింది"

    You are wrong. ప్రకాశం గారు మదరాసు మనదే నినాదం పై పోటీ చేసి ఖంఘు తిన్నారు. ఆయన గెలవలేదు సరి కదా, డిపాసిట్టు కూడా దక్కించుకోలేదు.

    http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_1951/STATISTICALREPORTS_51_MADRAS.pdf

    Constituency : 125 HARBOUR NUMBER OF SEATS 1
    1 . KRISHNA RAO M INC 21314 46.68%
    2 . IBRAHIM SAHEB M IND 11264 24.67%
    3 . PRAKASAM M KMPP 7287 15.96%
    4 . RAJAMANNAR CHETTY M FBL(RG) 2698 5.91%
    5 . RAJAGOPALACHARI M IND 1819 3.98%
    6 . BASHYAM M IND 649 1.42%
    7 . PARASURAMA NAICKER M IND 285 0.62%
    8 . AZIZUDDIN SAHEB M IND 217 0.48%
    9 . SHANMUGHAM M IND 130 0.28%

    http://eci.nic.in/eci_main1/Contesting.aspx

    Q 17. Which candidates lose the deposit?

    Ans. 3354. A defeated candidate who fails to secure more than one sixth of the valid votes polled in the constituency will lose his security deposit.

    ReplyDelete
    Replies
    1. @Jai

      You are right. Prakasam himself lost but tried to form government!!

      Delete
    2. అంతే కాదు పద్నాలుగు వేలతో ఓడిపోయిన ఈయనకు దాంట్లో వోట్ల లెక్కింపులో అక్రమాలు కనిపించాయట. గెలిచిన కాంగ్రెస్ అభ్యర్తి మంత్రి కృష్ణారావు గారిపై కేసు వేసారు (ఆంధ్ర పత్రిక; డిసెంబర్ 14; 1952). ఒకవైపు పొట్టి శ్రీరాములు గారు చావుతో కొట్లాడుతుంటే, ఈయనకు ఎమెల్ఎ కావాలని సరదా.

      Delete
    3. మీరు ప్రకాశంగారికన్నా గొప్పోళ్ళు మరి. ఆయన పేరెత్తే అర్హత లేనివాళ్ళు కూడా విమర్శించడమే. ఛీ దీనమ్మ జీవితం

      వోట్ల లెక్కింపులో అక్రమాలు కనిపించడం తప్పా జై గారూ? అహ తెలంగానాలో అటువంటి సందర్భాలు ఒక్కటీ లేవా?

      Delete
    4. @SHANKAR.S: తీర్పు తెలుసుకోకుండానే తొందరు పడ్డారు తమరు.

      అక్రమాలు జరిగాయని, లంచాలు పంచారని ఈయన గారు వేసిన అభాండాలు కొట్టేయబడ్డాయి. పైగా జరుమానా కట్టాలని నిర్ణయం.

      విషయాన్ని వదిలేసి అర్హతల గురించి మాట్లాడడం న్యాయమేనా? బూతులు తిడితే మీకొచ్చే ఆనందమేమిటో?

      Delete
    5. "బూతులు తిడితే మీకొచ్చే ఆనందమేమిటో?"

      బూతులు తమ సంస్కృతిలో కలిగిన ఓ తెలంగాణావాదీ మీకు నా కామెంట్లో ఏమి బూతులు కనిపించాయో సెలవీయగలరా? ఒక వేళ మీరు నేనన్న "ఛీ దీనమ్మ జీవితం" నే బూతుగా పరిగణిస్తే దానిని చాలా సినిమాలలో "ఛీ వెధవ జీవితం" అని ఇలాంటివి కూడా చూడవలసి వస్తోందే అన్న అర్ధంలో ఎవరి జీవితాన్ని వారు కామెడీగా తిట్టుకునే మాటగానే వాడటం జరిగింది. నేనూ అదే అర్ధంలో వాడాను. ఒకవేళ మీరు దాన్ని బూతుగా అనుకున్నా ఆ తిట్టింది మిమ్మల్ని కాదు మహానుభావా. ఇలాంటివి చూడాల్సి వస్తున్నందుకు నా జీవితాన్ని నేనే తిట్టుకున్నాను.

      (బూతులు తెలంగాణా సంస్కృతిలో భాగం అని వాక్రుచ్చింది నేను కాదు మహానుభావా సాక్షాత్తూ కచరా మహాశయులే)

      Delete
    6. @SHANKAR, S

      /* బూతులు తమ సంస్కృతిలో కలిగిన ఓ తెలంగాణావాదీ */
      /* కచరా మహాశయులే */

      మీకామెంటు ద్వారా మీసంస్కారాన్ని బయట పెట్టుకున్నారు. బూతులు ఎవరి సంస్కృతిలో భాగమో ఒక్కసారి కాస్త గుంటూరు, క్రిష్ణా జిల్లాలను తిరిగిచూసి తెలుసుకోండి. కేసీఆర్ అలా ఎన్నడూ చెప్పలేదు, చెప్పినదానికి వక్రభాష్యం చెప్పి కుసంస్కారాన్ని చాటుకోకండి.

      కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పేరుకు ఇంగ్లీషులో కేసీఆర్, తెలుగులో కచంశేరా లేదా కచంరా అవుతుంది. ఈకచరా ఎక్కడినుంచి వచ్చిందో చెబుతారా?

      అడ్డమైన రాతలు రాసి విషయాన్ని పక్కదోవపట్టించి వెకిలిమాటలు రాయడానికి ఇది సీమాంధ్రవాదుల బ్లాగు కాదు.

      Please don't comment if you can't comment on the subject discussed in the post.

      Delete
    7. "కేసీఆర్ అలా ఎన్నడూ చెప్పలేదు"

      తమరు ఎప్పుడూ టీవీలు చూడలేదా? లేదా స్వయంగా కచారా గారు లుచ్చా, లంగాగాళ్ళు, లఫంగా వంటి ఆణిముత్యాలని టీకాతాత్పర్యసహితంగా విపులంగా వివరించి అవి తెలంగాణా సంస్కృతి అని వాక్రుచ్చిన వీడియోల లింకులు మీకు యూ ట్యూబ్ లో ఎక్కడైనా దొరుకుతాయి. లేదా నన్ను ఇమ్మన్నా ఇస్తాను. విని తరిద్దురుగాని.

      "ఈకచరా ఎక్కడినుంచి వచ్చిందో చెబుతారా? "

      అబ్బే కచారా పుట్టుపూర్వోత్తరాలు నాకు తెలియవండీ. కొంతమంది వాళ్ళ పూర్వీకులది బొబ్బిలి అంటారు. ఇంకొంతమంది ఇంకేదో ఊరు చెప్తారు. :))

      "అడ్డమైన రాతలు రాసి విషయాన్ని పక్కదోవపట్టించి వెకిలిమాటలు రాయడానికి ఇది సీమాంధ్రవాదుల బ్లాగు కాదు. "

      సారీ అండీ. మర్చేపోయాను. ఇది అసలు చరిత్రనే వక్రీకరించి, ఇష్టం వచ్చినట్టు "కారు"కూతలు కూసే తెలంగాణావాళ్ళ బ్లాగు కదూ. అన్నట్టు బూతుల గురించి టాపిక్ ఎత్తి విషయాన్ని పక్కదోవ పట్టించింది జై గొట్టుముక్కల అనే మీ తెలంగాణా వారే. మీరు కుసింత ఆలోచించి మాట్లాడండి విశ్వరూప్ గారూ.

      "Please don't comment if you can't comment on the subject discussed in the post."

      మీ కామెంట్ నాకు, జై గారికి మధ్య జరిగిన డిస్కషన్ లోంచి వచ్చింది. ఆయన నా కామెంట్ లో "బూతుల" గురించి పాయింటవుట్ చేశారు కాబట్టి ఆయనకీ జవాబు ఇచ్చాను. ఒక్క సారి పైకి వెళ్లి నా కామెంట్లన్నీ శ్రద్ధగా చూడండి.

      Delete
    8. మీ కామెంట్ కి నేను ఇచ్చిన జవాబు ప్రచురించలేదు. ఆ సమాధానంలో బూతూ లేదు, ద్వేషం లేదు. మరి ఎందుకు ప్రచురించలేదా అని ఆలోచిస్తే నాకు అర్ధమైనదేంటంటే బేసికల్ గా మీకు నిజాన్ని అంగీకరించే ధైర్యం లేదు.

      Delete
    9. @SHANKAR, S

      అయ్యా, తమరి అంత గొప్ప కామెంటును ప్రచురించడానికి ధైర్యం కావాలా? టపాలో రాసిన విషయంపై చర్చించే ధమ్ములేదుగానీ అడ్డమైన కుల్లురాతలు రాస్తుంటే ప్రచురించాలా? "దీనమ్మ జీవిథం" అనేది మీకు బూతుగా తోచలేదు.. అలాగే కేస్సీఆర్కు లుఛ్చా, లఫంగా అనేవి బూతులు అనిపించలేదు. నిజానికి అవి బూతులు కాదు, తిట్లు. బూతులే అయితే మీరు కామెంటులో రాయగలిగేవారుకారు. ఆయన మాత్రం తిట్టింది ఎవరిని? పనికిమాలిన తెలంగాణాకు చెందిన కాంగ్రేస్, టీడీపీ ఎమ్మెల్యేలను. దాన్ని మీరు వక్రీకరిస్తూ "బూతులు తమ సంస్కృతిలో కలిగిన ఓ తెలంగాణావాదీ ", "బూతులు తెలంగాణా సంస్కృతిలో భాగం అని వాక్రుచ్చింది నేను కాదు మహానుభావా సాక్షాత్తూ కచరా మహాశయులే" అంటూ రాస్తారా, మీకుసంస్కారం తెలియడంలేదూ? బూతుల సంస్కృతి ఎలా ఉంటుందో తెలియాలంటే కాస్త క్రిష్ణా, గుంటూరు చుట్టిరండి..రాయడంకాదు, వింటేనే చెవుల్లో సీసంపోసినట్టు ఉంటుంది. మీది అదే సంస్కృతి కదా..మీకు వీనులవిందుగా ఉంటాయేమో!


      /**అబ్బే కచారా పుట్టుపూర్వోత్తరాలు నాకు తెలియవండీ. కొంతమంది వాళ్ళ పూర్వీకులది బొబ్బిలి అంటారు. ఇంకొంతమంది ఇంకేదో ఊరు చెప్తారు. **/

      బొబ్బిలి నుండి వస్తే ఏంటి, తెక్కలినుండి వస్తే మీకేంటి? ఏంటి మీబాధ? మీకుళ్ళు బుద్ధిని వెనకేసుకోవడానికి మరో కుళ్ళు కామెంటు!!

      /**మీరు ప్రకాశంగారికన్నా గొప్పోళ్ళు మరి. ఆయన పేరెత్తే అర్హత లేనివాళ్ళు కూడా విమర్శించడమే. ఛీ దీనమ్మ జీవితం **/
      ఓహో..మీకెన్ని అర్హతలున్నాయో..తెలంగాణా సంస్కృతినే తిట్టిపోయడానికి.

      /**సారీ అండీ. మర్చేపోయాను. ఇది అసలు చరిత్రనే వక్రీకరించి, ఇష్టం వచ్చినట్టు "కారు"కూతలు కూసే తెలంగాణావాళ్ళ బ్లాగు కదూ.**/
      వక్రీకరణో, సక్రమమో తెలియడానికి మీకు అసలు చరిత్రేమన్నా తెలుసా?

      /**మీ కామెంట్ నాకు, జై గారికి మధ్య జరిగిన డిస్కషన్ లోంచి వచ్చింది. ఆయన నా కామెంట్ లో "బూతుల" గురించి పాయింటవుట్ చేశారు కాబట్టి ఆయనకీ జవాబు ఇచ్చాను. ఒక్క సారి పైకి వెళ్లి నా కామెంట్లన్నీ శ్రద్ధగా చూడండి.**/

      మీరు జైకి మాత్రమే సమాధానం ఇచ్చి ఉంటే నేను ఊరుకునేవాన్ని, తెలంగాణా సంస్కృతిపైనే తమ కుళ్ళుబుద్ధిచూపించారుగదా మహానుభావా?

      PS: Don't take pains in posting further. They won't be published. To publish your silly comments that do not add an iota of value to the discussion there is no need of any courage. All that is required is infinite patience which I do not have.

      You may check that I publish comments that are also against my views if they maintain healthy discussion, their comments add some value to the discussion.

      Delete
  2. >>>> బిల్లు పెట్టండి మేం మద్దతు ఇవ్వకపోతే అడగండి అని
    రెండ్రోజులముందు చంద్రబాబు అన్నా అడ్డు చెప్పనివారికి ఒక్కసారి సమైక్యతలోని సద్భావన గుర్తొచ్చింది. <<<<
    చాలా బాగా చెప్పారు.
    ఇప్పుడు కూడా చంద్ర బాబు "నేను తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడను మాట్లాడబోను" అంటున్నాడు,
    "పార్లమెంటు లో బిల్లు పెడితే తెలుగు దేశం అడ్డుకోబోదు" అంటున్నాడు.
    చూస్తూ వుండండి
    చరిత్ర పునరావృతమవుతుంది.
    వాళ్ళ బతుకులే అంత...!
    నిజాయితీ లేని బతుకులు.
    మాట పై నిలబడలేని నక్క జిత్తులు

    ReplyDelete
  3. @Jai, Can you show the proof where Prakasam contested on 'Madras Manade' platform?

    @Viswaroop, So many stalwarts lost in the election in 1952. From telangana Madapati Hanumantha Rao lost badly, so is Kaloji Narayana Rao, Jamalapuram Kesav Rao, Makdoom Mohiyuddin.. and even BR Ambedkar, morarji desai lost in bombay.

    >> అటువంటి సందర్భాలు ఒక్కటీ లేవా?
    @Shankar, అసలు వీరి 69 ఉద్యమ విపరీత నేపధ్యమే దాని కధానాయకుడు (చెన్నారెడ్డి) ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి సుప్రీంకోర్టు చేత 6 సంవత్సరాలు డీబార్ చెయ్యబడటం మూలంగా వచ్చింది.

    >> ఎప్పుడో ముప్పైల్లో వచ్చిన ప్రతిపాదనకు మోకాలడ్డిన నీలం ఆంధ్రులకు స్వరాష్ట్రం కావాలన్నారు.
    చేతికి ఏది వస్తే అది వ్రాయటమే.. ముప్పైల్లో నీలం సంజీవరెడ్డి స్థాయి ఏంటి అసలు? పాతికేళ్ళ వయసు లేదు. కనీసం ఎమ్మెల్యే కూడా కాదు.. ఆయన మోకాలడ్డటమేంటి? ఈ మోకాలి వ్రాతలు ఏంటో?

    ReplyDelete
    Replies
    1. @satya

      Please check "వాళ్ల వాళ్ళ సొంత అజెండాలు మనకనవసరం..ఉద్యమం మంచి చెడ్డలు తప్ప" in the same post.

      Issue is neither about their defeat nor why they started the agitation, but the changing agenda of the agitations and how they always benefit one section.

      If an individual's agenda is matching with people's agenda and individual gets benefited by bringing up the cause it is not at all a problem. But if individual because of his personal agenda starts an agitation overnight and paints it as people's agenda then it is issue.

      Delete
    2. The changing agenda of 1969 agitation is dethrone KBR. K. Kesasv Rao openly made statement if the Chief minister resigns the agitation will automatically gets settle down.

      ప్రకాశం గారు మొదటినించి ఆంధ్రరాష్ట్ర ఉద్యమం లో అంత చురుకుగా పాల్గొన్నది లేదు.. ఆయన ఎప్పుడూ మద్రాస్ రాజకీయాల్లోనూ, పార్టీ వ్యవహారాల్లోను బిజీగా గడిపేవారు. ఎప్పుడన్నా ఉద్యమం నిర్వహిస్తున్న శ్రేణులు, సభలకు ఆయన్ను పెద్దరికం వహించమని కోరినప్పుడు వెళ్ళేవారు. 52 ఎన్నికల్లో ఆయన శస్త్రచికిత్స చేయించుకొని ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళలేదు. ఇంక మద్రాస్ మనదే నినాదం తో పోటీ చేసారనేది శుద్ద అబద్దం. 52 లో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం స్వామి సీతారాం ప్రయత్నాలు సాగిస్తున్నప్పుడు, ప్రకాశం గారు ఉద్యమానికి నాయకత్వం వహించాలని డిమాండ్ చేస్తూ తమనంపల్లి అమృతరావు, ప్రత్తి శేషయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఆయన నివాసం ముందు నిరాహారదీక్ష చేపట్టారు.

      మరోవైపు రాజకీయ అఙ్ఞాతంలో కాలం వెళ్ళబుచ్చుతూ, 52 ఎన్నికల్లో ఏ రకంగాను పాల్గొనని రాజాజి, కేంద్ర నాయకుల పుణ్యమా అని నాటి గవర్నర్ శ్రీ ప్రకాశ అండ తో ఉన్నఫళాన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే అది సంకీర్ణ ప్రభుత్వం. నేడో, రేపో అన్నట్లు ఉంది. అప్పటికి కమ్యూనిస్టులు ఆయన్ను నాయకత్వం వహించమని ప్రతిపాదన కూడా తెచ్చారు...

      నేపధ్యం ఇలా ఉండగా, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం చేసారని తెలంగాణ వాదులు దుష్ప్రచారం చెయ్యటమెందుకు? మద్రాస్ ముఖ్యమంత్రి పదవి ఆయనకు కొత్తా కాదు, అది అంతుకోలేనంత దూరం లేను లేరు. తెలంగాణా, విశాలాంధ్ర కాలం నాటికి ఆయన రాజకీయాలకు దూరం గా ఉన్నారు.. తత్సంభంద చర్చల్లో ఆయన పాల్గొన్న ధాఖలా లేదు.. అయినప్పటికి మీకు ఆయనపై ఎందుకు కోపం? ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథల పేరుతో ఆ వ్రాతలెందుకు? తెలంగాణ వాదం పేరుతో తెలుగుజాతి అందరూ గౌరవించదగ్గ నేతల మీద ఇలాంటి అరాచకరాతలు ఆ వాదానికి శొభనిస్తాయా?

      Delete
    3. @satya

      1) You are supposed to give reasons for changing agendas in agitations in seemandhra here not in telangana.
      2) There is no question of changing agendas in Telangana as there was never any mass movement for samaikyandhra. Please be aware that we are discussing about changing agendas in mass movements, not some individual's statements.
      3) Prakasam was a key person in andhra rashtra movement and biggest beneficiary. But here the allegation is that with his stubborn and arrogant behavior he has become cause for potti sreeramulu's death.

      Delete
    4. >> and biggest beneficiary.

      What a sick thinking... The people of andhra are the biggest beneficiary of andhra state. There was no tall leader who can meet his stature. Nehru himself requested to lead the new state though he is not from congress, besides lot of aspirants from congress..

      Prakasam is stubborn and a tough nut.. But never in his life he built his career on someone else sacrifice.

      It is your pathetic assumption that Amarjeevi is such a fragile character. He neither sat on the request of Prakasam nor anybody can negotiate with his will power.

      Delete
  4. Satya wrote "తెలంగాణ వాదం పేరుతో తెలుగుజాతి అందరూ గౌరవించదగ్గ నేతల మీద ఇలాంటి అరాచకరాతలు ఆ వాదానికి శొభనిస్తాయా?"

    Nothing new in your argument. చనిపోయినవాళ్ళందరూ మంచివాళ్ళనీ, బతికున్నవాళ్ళే చనిపోయిన తమ గురువులు లేదా నాయకుల పేర్లు చెడగొడతారనీ వాదించే రకం stereotype వాదన లాగ ఉంది.

    ReplyDelete

Your comment will be published after the approval.