చంద్రబాబు పాదయాత్ర మొదలు పెట్టడానికి ఒక నెలరోజులు ముందుగా డిక్లరేషన్లమీద డిక్లరేషన్లు జేసిండు. బిసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ డిక్లరేషన్. ఇన్నిరోజులు లేనిది ఒక్కసారిగా పాదయాత్రముందే ఈడిక్లరేషన్లు ఎందుకు జేసిండు అని ఆలోచిస్తే ఈపాదయాత్రకీ డిక్లరేషన్లకూ ఉన్న లింకేందో తెలుస్తది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు పాదయాత్ర సీమాంధ్రలో జేసినా, తెలంగాణలో జేసినా జనం చేత తిట్లు తిట్టించుకోవాల్సిందే.
జనం వచ్చి తెలంగాణకు ఎందుకు అడ్డుపడ్డవు అని అడిగితే సమాధానం లేదు. నువ్వు ముఖ్యమంత్రిగ ఉన్నప్పుడు మాబతుకులెందుకు రైతులకేం జేసినవ్, ఇప్పుడు లెస్స జెప్పుతున్నవ్ అంటె సమాధానం లేదు.ఏదో రెండు మూడు డిక్లరేషన్లు జేస్తె జనం అందరినీ గాకపోయినా కనీసం కొన్నివర్గాలవారిని మంచి జేసుకోవచ్చు. పాదయాత్రలో ఈవర్గాల మనుషులను తనతోపాటు నడిపిస్తే కొంచెం రక్షణగా ఉంటది అనేది బాబు ఐడియా.
మాదిగ దండోరా నాయకుడు మందక్రిష్ణ నిజంగ చంద్రబాబు వర్గీకరణ డిక్లరేషన్ను నమ్మండో, ఇంకేదయినా లోపాయికారీ ఒప్పందం జేసుకుండో మనకు తెలువదు కానీ మందక్రిష్ణ బహిరంగంగా చంద్రబాబు పాదయాత్రకు మద్దతు ఇవ్వడమే కాకుండా పాదయాత్రలో తన మనుషులను చంద్రబాబు చుట్టూ రక్షణవలయంలా నడిపించి తెలంగాణలో ప్రజలు చంద్రబాబును తెలంగాణపై వైఖరేందని నిలదీయకుండా జేస్తుండు.
వర్గీకరణ డిక్లరేషన్ ఐడియా బాగానే వర్కయినట్టుంది గానీ ఇంతకూ చంద్రబాబు డిక్లరేషన్లకు విలువెంత?మోసగాడి మాటలను నమ్మేదెట్ల? చంద్రబాబు ఇంతవరకు ఎప్పుడు మాటమీద నిలబడ్డడని ఇప్పుడు నిలబడడానికి? వర్గీకరణపై నిర్ణయాత్మక సమయం వచ్చినప్పుడు చంద్రబాబు నేను వర్గీకరణకు వ్యతిరేకం కాదని అన్నా గానీ అనుకూలమన్నానా అంటే? నాకు మాలలూ, మాదిగలూ రెండు కళ్ళలాంటివారు, మాపార్టీ రెండువర్గాల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటుంది, రెండువర్గాల్లో మాపార్టీనాయకులను ఉద్యమాలు జేయమంటాం అని జెపితే?
అయినా వర్గీకరణపై మాత్రం తేల్చడానికి చంద్రబాబెవరు, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే గదా? దళితుల్లో మాదిగల శాతం సమైక్యాంధ్రలో కంటే తెలంగాణలో అధికం. అంటే తెలంగాణ మాదిగలకు నిజమైన న్యాయం తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలయినపుడే జరుగుతుంది. వర్గీకరణ డిక్లరేషన్ జూసి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం జేస్తే నాడా కొనుక్కోవడానికి గుర్రాన్ని అమ్ముకున్నట్టే. మందక్రిష్ణా, జెర సోంచాయించు!!
ఎందుకీ ప్రయాస విశ్వరూప్, మీరు పెద్ద పెద్ద వ్యాసాలు రాసిన మన 'మంద' బాబు వినే రకమా? మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అని మన పెద్దలన్నా ...... మంద కృష్ణ విషయంలో 'దెబ్బలు' కుడా పనిచెయ్యవు.
ReplyDelete