Monday, 19 November 2012

ఆంధ్రజ్యోతి సమర్పించు..వేమూరి వారి సీమాంధ్రోపనిషత్!


తెలంగాణ ఎప్పుడు తెస్తారు, ఎలా తెస్తారని నిగ్గదీసి అడగాలట.. ఎవరినో తెలుసా?
తెలంగాణ ప్రకటన చేసి వెనుక్కుపోయిన కేంద్రాన్ని కాదట! తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్‌ను కూడా కాదట!! తెలంగాణ అష్టవంకరలు పోయిన మన్‌మోహన్‌సింగ్‌ను, సోనియాగాంధీని అంత కన్నా కాదట!!!
తెలంగాణ రాజకీయ బానిసలను చేతుల్లో పెట్టుకుని తెలంగాణకు అడ్డం పడిన టీడీపీని కాదట!
ఎన్టీఆర్ ట్రస్టుభవన్ నుంచి సీమాంధ్ర రాజీనామా డ్రామాలాడించిన చంద్రబాబును కూడా కాదట!!
ఒక్క లేఖతో పోయేదానిని వంద తాలుమాటలతో మభ్యపెడుతున్న నారావారిని అంత కన్నా కాదట!!!
చంద్రబాబు బిస్కట్లకు అలవాటు పడి తెలంగాణ ఉద్యమంపై దాడి చేస్తున్న టీటీడీపీ బాంచలను,
సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకొని పార్లమెంటులో వీరంగం వేసిన జగన్‌మోహన్‌రెడ్డి, ఆయనకు అంటకాగుతున్న వైఎస్సార్ పార్టీ నాయకులు … వీరెవరిని కాదంటా!
మరెవరినో తెలుసా….తెలంగాణ ఎప్పుడు, ఎలా తెస్తాడో కేసీఆర్, టీఆర్‌ఎస్ మాత్రమే చెప్పాలంట!
100 అసెంబ్లీ స్థానాలు, 16 లోక్‌సభ స్థానాలు వస్తే తెలంగాణ ఎలా వస్తుందో చెప్పాలట!!
కేసీఆర్‌కు ఈయన కత్తే కాదు, డాలు కూడా ఇస్తాడట!!!
ఏమి జాణతనం, ఎంత వక్రనీతి, తమరు వెనక నుంచి పొడవకుంటే చాలు…
తెలంగాణ ఎలా వస్తుందో వేమూరి వారికి తెలియక కాదు ..
తెలంగాణ ఉద్యమాన్ని దొంగదెబ్బ తీసే కుహకం…
అసంతృప్తుల దాడిని తెలంగాణ ఉద్యమం మీదకు మళ్లించే కుట్ర …
చీలి కూలి కునారిల్లుతున్న చంద్రబాబును ఆయన పార్టీని క్రేన్లు పెట్టి లేపాలని తాపత్రయం!
అయ్యా వేమూరీ,
తెలంగాణలో సీమాంధ్ర నాయకత్వంలోని పార్టీలన్నింటినీ ఓడిస్తే మా పని సగం పూర్తయినట్టే!
తెలంగాణ ప్రజల చేతికి సగం అధికారం వచ్చినట్టే…స్వయం నిర్ణయాధికారం మా చేతికి వచ్చినట్టే!!
తెలంగాణలోని సీమాంధ్ర పార్టీలను తుడిచిపెడితే ఏ ప్రభుత్వమైనా హైదరాబాద్‌లో ఎలా బతికి బట్టకడుతుంది?
అప్పుడు ప్రత్యేక రాష్ట్రం నడుచుకుంటూ వస్తుంది!
ఇవన్నీ మీకు తెలిసినా.. ఎందుకీ సీమాంధ్రోపనిషత్తులు?
(ఒక జర్నలిస్టు మిత్రుడు)

3 comments:

  1. ఆర్యా!
    నమస్కారం... పోస్టుకు సంబంధించని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు క్షమించగలరు..
    మీ బ్లాగును అత్యధిక బ్లాగులు కలిగి వేగంగా పనిచేసే తెలుగు బ్లాగు ఆగ్రిగేటర్ " బ్లాగిల్లు " లో జతచేయడం జరిగింది. మీరు కూడా మా

    విడ్జెట్ మీ బ్లాగులో కలిపి సహకరించ మనవి.

    ReplyDelete
  2. kammani varthalu ala kakunte yela untayi.

    ReplyDelete
  3. ABN ki telisindi rende. Okati,jagan ki vyatirekam ga matladatam,rendu telangana.

    ReplyDelete

Your comment will be published after the approval.