Wednesday, 31 October 2012

సీమాంధ్రలో నో బతుకమ్మ?!!


ఉయ్యాల బ్లాగరు మిత్రుడు మంచి ప్రశ్న ఒకటి అడిగాడు. బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ పండుగను తెలంగాణా వాసులు తెలంగాణలో జరుకోవడంతోపాటు న్యూయార్క్, డల్లాస్, అట్లాంటా, సిడ్నీ, దుబాయి, లండన్ లాంటి ప్రపంచంలోని పలుచోట్ల ఉన్న తెలంగాణ వాసులు జరుపుకున్నారు. మనదేశంలో సూరత్, ఢిల్లీ, ముంబాయి, షోలాపూర్ లాంటి పలుచోట్లకూడా అక్కడ ఉన్న తెలంగాణ వాసులు బతుకమ్మపండుగ జరుపుకున్నారు. కానీ సీమాంధ్రలో గుంటూరులోగానీ, బెజవాడలోగానీ, ఒంగోలు, కర్నూలు లల్లో, ఇంకెక్కడా బతుకమ్మ పండగ జరుపుకోలేదు. కారణం?

ఎవరి పండగలు వారివి. సీమాంధ్రులు బతుకమ్మ పండగ ఎందుకు జరుపుకోలేదనేది ఇక్కడ ప్రశ్నకాదు. అలాగే తెలంగాణవాసులు సంక్రాంతికి కోళ్ళపందాలు, అట్లతద్ది, పైడితళ్ళి పండగలు చేసుకోరు. కానీ అక్కడి తెలంగాణవాసులు ఎందుకు బతుకమ్మ పండగ చేసుకోలేదు? ఏం, పట్టుమని పదిమంది తెలంగాణ ఆడపడుచులు సీమాంధ్ర పట్టణాల్లో లేరా? ఎందుకు లేరు?

వ్యవసాయానికి సాగునీరులేక, పంటలు పండక, పనులు దొరకక తెలంగాణావాసులు దశాబ్దాలుగా నౌసారి, భీమండి, బొంబాయి, షోలాపూరు, దుబాయి, మస్కట్, రియాద్ వలస వెళ్ళి పనులు వెతుక్కుంటున్నారు. బ్రతుకుతెరువుకోసం అక్కదికి వెళ్ళినవారు తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారు. ఇటీవల ఐటీ బూమ్‌లో అందరితోపాటు తెలంగాణవాసులు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లకు వెళ్ళారు. ఉద్యమంలో భాగంగా జరుగిన సంస్కృతి పునర్నిర్మాణంలో  భాగంగా అక్కడా బతుకమ్మ జరుపుకున్నారు.

కానీ ఏవ్యవసాయకూలీలూ పనులకోసం పక్కనే ఉన్న గుంటూరుకో, కర్నూలుకో వెల్లిన ధాకళాలు కనపడవు. ఉద్యోగస్తులు కూడా ఎవరూ సీమాంధ్ర ట్రాన్స్‌ఫర్‌కు ఇష్టపడరు. కారణం: మనుషులు పొట్టకూటికోసం వలస వెలతారు, కానీ పొట్టకంటే కూడా మనిషి రక్షణ, మర్యాదలకు విలువనిస్తాడు, అవి దొరకనిదగ్గరకు వలస వెల్లడు.

హైదరాబాదు రాజధాని కనుక ఇక్కడ పనులు దొరుకుతున్నాయి కనుక మేం వస్తున్నాం అని చెప్పుకునే వారు తెలుసుకోవాల్సిన విషయం: సీమాంధ్రులు ఒక్క హైదరాబాదులోనే కాదు, నల్లగొండ,నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ఇలా ఎక్కద చూసినా పళ్ళె, పట్టణం తేడాలేకుండా తెలంగాణలో సీమాంధ్రులు నివాసం ఏర్పరుచుకుని ఉన్నారు. చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఒక గుంటూరు వాడ ఉంటుంది, అక్కడ సీమాంధ్రవారు నివాసం ఏర్పరుచుకుని ఉంటారు. మరి సీమాంధ్రలో మాత్రం తెలంగాణవారు ఎందుకు లేరు?

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమయిన విషయం, తెలంగాణలో సీమాంధ్రవారు మాత్రమేకాదు, ఎప్పటినుంచో బిహారీలు, మార్వాడీలు, సింధీలు, పంజాబీ, మహరాష్ట్రియన్లు, కన్నడిగలు ఉన్నారు, తెలంగాణ వాసులతో మమేకమయి నివసిస్తున్నారు, వారి వారి సంస్కృతిని, ఐడెంటిటీని కాపాడుకుంటునారు. సీమాంధ్రలో తోటి తెలుగువారయిన తెలంగాణప్రజలు లేనట్లే, అక్కడ బిహారీలు,  పంజాబీలు, మహరాష్ట్రియన్లు ఎవరూ లేరు. కారణం అక్కడ కొత్తవారిని కలుపుకుపోయే స్వభావం తక్కువకనుక, పక్కవారిని తక్కువవారిగా చూడడం, అణచివేయడం పరిపాటి కనుక.


 ఈపరిస్థితికి ఇంకా ఫ్యూడలిజం వాసనలు తొలగిపోని సీమాంధ్రలో జనం కులాలుగా విభజించబడి తమకులమే అధికమనే భావన కలిగిఉండడం ఒక కారణం కావొచ్చు.  ముఠాకక్షలు, దళితులపై దాడులు సాధారణమయిన ఇక్కడ కొత్తవారికి రక్షణ అనిపించదు. ఇటీవల తెలంగాణ ఉద్యమం బలపడినతరువాత వీరి పరప్రాంత అసహనం మరీ పెరిగింది. తెలంగాణవాసులు గుడికెల్దామని వెలితే దాడులు, వైజాగ్‌లో బాక్సింగ్ పోటీలకని వెల్లినవారిపై దాడులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.

17 comments:

  1. బందరు, బెజవాడ విషయం తెలియదు గాని, వైజాగ్, విజయనగరం ప్రాంతాల్లొ మర్వాడీలు చాలా మంది ఉన్నారు. వ్యాపారాలు చేస్తు బాగానే స్థిరపడ్డారు. ఇంకా, విజయనగరం జిల్లా లోని మా మండల కేంద్రంలోనూ, మా గ్రామంలో కూడా కొంతమంది రాజస్తానీలు స్వీట్ షాప్ పెట్టుకుని నివసిస్తున్నారు. మేమంతా వీళ్ళతో సఖ్యంగానే ఉంటాం.

    ReplyDelete
  2. i dont know about bandar but in vja we have marvadi area specially in 1 town, most of the people in that area are maarvadi,they have a big community and also in some areas of west side of vijayawadda. also u can see other communties near besant road area which is a god business area this information is just to say that there are no other people in vijayawada.i dont abotu othere thngs which u mentioned.please convey real facts rather than illusions.
    thank you

    ReplyDelete
  3. తింగరోడా, మరి మార్వాడీలు/సిక్కులు ఇన్నాళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ లో (హైదరాబాద్ తో సహా) ఉంటూ వారి పండుగలు ఎందుకంత ఆర్భాటంగా చేసుకోరు. నువ్వూ నీ పచ్చకామెర్ల రాతలూనూ!

    ReplyDelete
    Replies
    1. @Anonymous31 October 2012 16:25

      వాళ్ళ పండుగలను హైదరాబాద్‌లో చక్కగా జరుపుకుంటారు. గుజరాతీలు హైదరాబాద్‌లో డాండియాలూ, గర్భాలూ కూడా చేసుకుంటారు. కానీ ఇవి బావిలో కప్పలకు తెలిసే అవకాశం లేదు.

      Delete
    2. ఏం నువ్వు హైదరబాద్ దాటి బైటకి వెల్లలేదా? రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్ల కూడ గుజరాతీలు, మలయాళీలు వాళ్ళ పండుగలు బ్రహ్మాండంగా జరుపుకుంటారు...

      Delete
  4. హైదరాబాదులో వున్న సినిమా ఇండస్ట్రీలోకి తెలంగాణా వారిని రానివ్వరు. పటన్ చెరువులో వున్న పరిశ్రమలలోకి, తెలంగాణా మొత్తంగా వున్న వారి బట్టల దుకాణాలు, పాఠషాలలు, కళాశాలల్లోకి తెలంగాణా వారిని రానివ్వరు. అంతెందుకు హైదారాబాదులో వున్న అగ్రికల్చరల్ యూనివార్సిటీకి కూడా తెలంగాణా వీసీ హుళక్కే. అలాంటిది అక్కడ తెలంగాణా వారిని బతక నిస్తారా? బతకాలంటే భాషను యాసను మార్చుకుని, కాందిశీకుల్లా బతకాల్సిందే.

    ReplyDelete
  5. Why it is always about Seemandhra people? Telangana people might be here or not. If they are present in Seemandhra districts and not participate in Batukamma function, its at their fault not on Seemandhra folks!
    Marwadis, sindhis, Punjabis and other folks are every where. Seemandhra people travel to other places and know these facts. People like you live in your own cocoon all life long and dont even know any thing about other places. For ex; there are more tamilians in tirupathi and some place in nellore than telugus. Similarly kannadigas present in Ananthapur and orissa people live in Srikakulam vijaya nagaram.
    Evevry body respect Hyderabad and every one want to go there. Looks like all your efforts are to take over Hyderabad rather development of rest of Telangana.
    Write ups like this convey message against Telangana movement to other folks like us who resides out side the state.
    Any movement to be successful should get support from all across which is only possible by honesty and legitimate arguments, not just by blaming it on others.

    ReplyDelete
    Replies
    1. @Anonymous 31 October 2012 18:57

      It is very common for other state people to live in boarder districts. It is the same case with otherside of the boarder as well. Middle coast landlords and politicians are the main opposers of Telangana and these is the main issue. No other state people live in those districts. those are close to Telangana but telanganaites do not like to migrate there for obvious reasons.

      Delete
    2. so.. that is whose problem?

      The simple reason why people are migrating from all parts of Andhra Pradesh to Hyderabad (especially)is that we developed Hyderabad as a whole and sole city in the state. There are no opportunites for even engineers in many cities like Guntur, Rajahmundry, Nellore, Kakinada, Warangal, Kurnool, Tirupati like big cities. Vijayawada and Visakhapatnam are marginally OK. Check the population growth rate of these cities from last few decades. It is declining because people are migrating to larger cities like Hyderabad, Bangalore, Chennai, Mumbai and Delhi like cities. None of the governments are worried about developing the rest of the country except these cities.

      If your point is to say that people of Telangana are able embrace Andhrites but Andhrites are not ready to reciprocate, you need to know more about people of Andhra Pradesh before you make up all these cock & bull stories.

      Delete
    3. @Anonymous9 November 2012 18:35

      as I already mentioned in the post, andhraites are there in telangana not just in hyderabad, but in every remote place.

      Delete
  6. actually telagana esp hyderabad is providing jobs and so people from many areas migrate to the so called telangana area. rayalaseems is very backward than telangana in all aspects. just visit the area once and then decide what to write. u are wrong. when these andhra/seems areas are not able to provide any jobs how people can migrate and settle here on a large scale???

    ReplyDelete
    Replies
    1. @Anonymous31 October 2012 20:13

      As I already mentioned in the post, andhraites are there in telangana not just in hyderabad but in every remote village or town.

      Krishna, Guntur, karnool are in the boarders of telangana, rich in agriculture and are in short of agriculture labour. Many people from agriculture labour background from Mahaboobnagar, nalgonda are migrating to other parts of India but surprisingly not to their nabouring districts. Hope you get the point.

      Delete
    2. So you have problem with Andhraites living in remote areas of telangana .. but no problem with Marwadi's present in the same place.

      Where as in the comment above this you have mentioned your problem with landlords and politicians but not with common folk?

      These kind of double standards are the things why every one else do not like or support your movement.

      By the way Mahaboob Nagar is a telangana dist. But for any need or business ppl come to Kurnool, not to Hyd. According to u its the other way. Same with Suryapet.. they go to Vijayawada. Even Mahaboob Nagar MP him self dont even care about that city, I been there lived and noticed .. a fact u can not deny. Fight against every 'politician'(not just a few who r anti-telangana)then eveni will also come forward and I support you, I support Telangana, I support the prosperity of Indian, I support well being of every human being.

      Delete
    3. @Anonymous2 November 2012 06:28

      Can you show me where I said I have problem with andhraites in remote villages of Telangana? I only mentioned the fact that there are andhraites living together with telanganaites in telangana but vice versa is not true.

      Delete
  7. నేను ఆంధ్ర వాడిని. మీరు చెప్పినదానిలో కొంత వాస్తవం ఉన్నాది. ఈ రోజుల్లో మార్వాడిలు లేని ఊరు చాలా తక్కువ. మద్రాస్ లో షావుకారు పేట, పారిస్ అంతా ఆక్రమించేశారు. వాళ్లదోక పెద్ద చైన్, అదొక ప్రత్యేక లోకం.

    SriRam

    ReplyDelete
  8. విడిపోవాలని తహతహలాడే తెలంగాణవాళ్ళు అందరిని కలుపుతిరిగేవాళ్ళు, రాష్త్రం ఒక్కటిగా ఉండాలనికోరుకునే ఆంధ్రవాళ్ళు ఎవ్వరని కలుపుకోలేరు!హ హ హ... ఏం స్కూల్ బాబు నీది?

    ReplyDelete
  9. కృష్ణా జిల్లాలో మా అమ్మమ్మ వాళ్ల వూర్లో బతుకమ్మ జరుపుకోవడం నా చిన్నప్పటినుండీ చూశా....వాళ్ళేదో సంస్కృతిని బతికిస్తున్నామనో తెలంగాణావాళ్ళను కలుపుకున్నామనో చేసుకోవట్లా...వూర్లో అలా అలవాటైంది చెసుకుంటున్నారు...
    అదేదో ఒక్క వూరు, గణాంకాలు తీసుకురా, సీమాంధ్ర మొత్తంలో ఎంత అని అడగకండి, నాదగ్గర లేవు. బతుకమ్మ చెయ్యకూడదనో, సగినాలు వండకూడదనో మాకేమి లేదండి. వండడం వచ్చి రుచిగా అనిపిస్తే ఏప్రాంతపు వంటైనా, ఏదేశపు వంటైనా చేసుకుని తినడానికేం నొప్పి మాకు?
    నా చిన్నప్పుడు వినాయకచవితికి మా వూరు చెరువు చుట్టూ వెతికి మరీ పత్రి తెచ్చేవాళ్లం నా యీడు పిల్లలందరం, మరివ్వాళ ఆ పండుగ జరుపుకోవడమే పెద్ద పనైపోయింది. ఇందులో సంస్క్రుతిని నాశనం చెయ్యాలనో, పట్టించుకోవట్లేదనో కారణాలేవీ లేవు, కేవలం కుదరటంలేదంతే. రాష్ట్రం విడిపోవాలనేదానికి దయచేసి యిటువంటి కారణాలు మాత్రం చెప్పకండి.
    యిక విదేశాల్లో మన పండుగలు జరిపే బ్యాచుల గురించి ఎంత తక్కువచెప్పుకుంటే అంత మంచిది. వీళ్ళల్లో చాలామందికి విదేశాలకెళ్ళకముందు అవెలా జరుపుకుంటారో కూడా తెలియదు. దగ్గరనుండి చూసిన అనుభవంతో చెప్తున్నా.. ఇక్కడకొచ్చాక గుంపులో గొవిందా అనో, బ్యాచ్ లో కలవచ్చుకదా అనో, నగలు పెట్తుకునేదానికొక సందర్భం కావలనో జరుపుకోవడమే.


    ReplyDelete

Your comment will be published after the approval.