జగనన్న విడిచిన బాణం షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రలు జేస్తుంటే కర్నూలులో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ వై.ఎస్.విజయమ్మ ఇలాగందట. "ఒక రామోజీరావు, ఒక మురళీమోహన్, నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్, ఒక సుజనా చౌదరి... వీళ్లందరికీ ఏ మార్గదర్శకాల ప్రకారం మీరు కేటాయింపులు చేశారు? అదే గైడ్‌లైన్స్ ప్రకారం రాజశేఖర్‌రెడ్డి గారు చేస్తే తప్పవుతుందా?"
అమ్మా, విజయమ్మా సత్యం బలికినవు. చంద్రబాబు ఏగైడ్‌లైన్స్ మీద ప్రభుత్వ సంపదను తన అణుచరులు, బినామీలకు పంచి పెట్టిండో మీఆయన గుడ అదే గైడ్‌లైన్స్ మీద ప్రభుత్వ సొమ్మును నీకొడుక్కు పంచి ఇచ్చిండు. ఒకడు దోపిడీకి తలుపులు తెరిస్తే ఇంకొకడు గోడలే కూలగొట్టి మరీ దోచేశిండు. ఒకడు దోచింది సింగపూరు, స్విస్స్ బ్యాంకులకు తరలిస్తే మరొకడు నన్నెవడడుగుతడనే ధీమాతో బాజాప్తుగ దోచుకుని పత్రికలు, టీవీలు, సిమెంటు ఫ్యాక్టరీలు పెట్టుకుండు. ఒకడు పగటి దొంగ, మరొకడు గజదొంగ. ప్రజలదృష్టిలో ఇద్దరూ దొంగలే.
మీకు దోచుకోవడంలో ఒకరితో ఒకరికి పోటీ. ప్రజలను మోసం జెయ్యడానికి పోటీ, పాదయాత్రలు జెయ్యడానికి పోటీ. ఒకడిది రెండు కళ్ళసిద్ధాంతం, మరొకడిది రెండు నాల్కల సిద్ధాంతం. మొత్తంగా మీరిద్దరూ ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు అన్నవిషయం ప్రజలకు సరిగ్గా తెలిసొచ్చింది.ఇంతకూ తమరిబాధ మీకొడుకును జైల్లో పెట్టినందుకా, చంద్రబాబును తోడుగా జైల్లో పెట్టనందుకా?
hello boss, do you have any GOS or govt giving lands at subsidy rates ,regarding sanctions to above mentioned persons or companies
ReplyDelete@Anonymous22 November 2012 12:46
DeleteI am quoting Vijayamma here. Please check Vijayamma for further details.