లగడపాటి రాజగోపాల్ ఈరోజు పార్లమెంటులో రెచ్చిపోయాడు. తెలంగాణ నిజమవడానికి రోజులు దగరవుతున్నకొద్దీ ఫ్రస్ట్రేషన్‌తో పిచ్చిపడుతున్న లగడపాటి సైకోలో మారి ఈరోజు పార్లమెంటులో తోటి ఎంపీలపై పెప్పర్‌స్ప్రే చల్లాడు, స్పీకర్ పోడియం అద్దాలు పగలగొట్టాడు, మైకులు విరగ్గొట్టాడు. మరో తెదెపా ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పార్లమెంటులోకి కత్తి తెచ్చాడని సమాచారం. వీరి చర్యలు నిజంగా ఈరోజు పార్లమెంటు పవిత్రతకు కళంకం కలిగించేవి. వీరి చర్యలు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు.
అయితే నాకు వీరిపై కోపం రావడంలేదు, కేవలం వీరి ఉన్మాద స్థితిపై జాళి వేస్తోంది. పాపం, ఎక్కడ తాము అక్రమంగా కూడగట్టుకున్న కోట్లు కరిగిపోతాయో, తమ అక్రమాలు బయటికి వస్తాయో, కబ్జాలు వెలుగులోకి వస్తాయో అనే భయంలో వచ్చిన ఉన్మాదంలో వారు ఈచర్యకు తెగబడ్డారు.
అయితే ఈపిచ్చి పనులనూ, కుప్పిగంతులనూ కూడా కొందరు సమర్ధిస్తున్నారంటే ఇది ఆత్మవంచనకు పరాకాష్ఠ తప్ప మరోటి కాదు. జేపీమీద ఒక తెలంగాణవాది చెయ్యి చేసుకున్నప్పుడో, ఏపీ అసెంబ్లీలో గవర్నర్ దగ్గరనుండి బడ్జేత్ పేపర్లు లాక్కున్నప్పుడో తాటికాయలంత అక్షరాలతో ఉద్యమాన్ని బూతులు తిట్టిన కొందరికి మాత్రం ఈరోజు ఘటన తప్పుగా అంపించట్లేదట. పైగా పెప్పర్ స్ప్రే మారణాయుధం కాదు కాబట్టి తప్పులేదంట. ఇంతకన్నా ఆత్మవంచన మరోటి ఉంటుందా?
adhe enti alla thiduthunnaru ayeena seemandhraa bahgath singh kadaa ??? meeru N tv , TV 9 , Andhra jyothi ,Eeendau chudaraa ayeeena vilava veerrudu bhagath singh
ReplyDelete