తెలంగాణ అంశంపై తాజాగా చిదంబరం నిన్నటి రోజు మరో ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఆంగ్లంలో యధాతధంగా(పీటీఐ):
“This is a unique situation where political parties in Andhra Pradesh are divided down the middle. Congress, Telugu Desam, CPI, CPI(M) are all divided. The only party which claims to be undivided is BJP because it has only one member”
ఈఒక్క ప్రకటనలో చిదంబరం మూడు తప్పులు దొర్లించాడూ.
మొదటి తప్పు: సీపీఐ తెలంగాణ అంశంపై ఏమీ విడిపోలేదు. సీపీఐ తెలంగాణా ఏర్పాటును సమర్ధిస్తుంది, తెలంగాణకోసం కొన్ని సంవత్సరాలుగా ఉద్యమంలో పాల్గొంటుంది. అయినా మన హోంమంత్రి భాషలో సీపీఐ తెలంగాణా అంశంపై రెండుగా చీలిపోయింది.
రెండో తప్పు: సీపీఎం కూడా తెలంగాణా అంశంపై చీలిపోలేదు. సీపీఎం ఎప్పుడైనా తాము విధానపరంగా విశాలాంధ్రకు కట్టుబడి ఉన్నాము, కానీ కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటే తాం అడ్డగించబోము అనే చెప్పారు. అయినా మన హోంమంత్రి భాషలో సీపీఎం కూడా తెలంగాణా అంశంపై చీలిపోయింది.
మూడో తప్పు: బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కాదు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా బీజేపీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానితో సంబంధం లేకుండా ఎప్పుడూ తెలంగాణకు అనుకూలంగానే ఉన్నది. ఆంధ్రాలో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలుచుకున్నప్పుడు కూడా తెలంగాణకు వారు అనుకూలంగానే ఉన్నారు.
ఒక ప్రకటనలో ఇన్ని తప్పులు చేసినవాడు అసలు తెలంగాణ సమస్య పరిష్కారానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో. విచిత్రంగా ఈనాడు మాత్రం తన వార్తలో ఈతప్పులన్నీ సరిదిద్ది జనం తెలంగాణపై కేంద్రం పొరపాట్లు గ్రహించకుండా జాగ్రత్త పడింది.
పై చిదంబరం ఆంగ్ల ప్రకటనకు యెల్లో జర్నిలిజానికి పేరుగాంచిన యెల్లో పత్రిక అనువాదం ఇదీ:”తెలంగాణ అంశంపై అసాధారణ స్థాయిలో రాష్ట్రంలోని కాంగ్రెస్, తెలుగుదేశంలు నిట్టనిలువునా చీలిపోయాయి. చీలిపోలేదని చెప్పుకుంటున్న భాజపాకి ఉన్నది.. ఇద్దరే సభ్యులు. తెరాస, సీపీఐలు తెలంగాణకు పూర్తి అనుకూలం. ఈ స్థితిలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీలపై ఏదో ఒక పరిష్కారాన్ని బలవంతంగా రుద్దలేం” అని కేంద్ర హోం మంత్రి చిదంబరం స్పష్టం చేశారు.” ఇదీ మన ఈనాడు కథ.
source: missiontelangana.com