Friday, 22 July 2011

అంధేరా సర్కారు,మీడియాల అమానవత్వం




తెలంగాణ సాధనకోసం ఆత్మబలిదానాలు జరగడం కొత్తకాదు, ఇప్పటికే ఆరువందలకు పైగా యువకులు ఆత్మబలిదానాలు చేశారు. ఈఆత్మహత్యలు ఆపాలని ఇక్కడి ప్రజలు, స్వచ్చంద సంస్థలూ, ఉద్యమ నేతలు ఎంతగా కోరుతున్నా తాము తెగించి ఉద్యమిస్తుంటే కొంతమంది తమధనబలంతో తమరాష్ట్రాన్ని ఆపుతున్నారనే నిస్పృహతో నిరాశకు గురయి ఇక్కడి యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెన్సేషన్లకు మాత్రమే విలువ ఇచ్చి ఉద్యమాలను తక్కువ చేసి చూపించే మీడియా ఈవిధంగానయినా తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చెబుతుందని, స్యూసైడ్‌నోట్ ద్వారానయినా కనీసం తమగొంతును ఒకసారి ప్రపంచానికి వినిపించాలని యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

మొన్న ఒక తెలంగాణ యువకుడు ఇక్కడినుండి ఢిల్లీ దాకా వెల్లి ఢిల్లీ నేతలకు తన గొంతు వినిపించాలని ఆరుపేజీల స్యూసైడ్ నోట్ రాసి పార్లమెంటు ముందు చెట్టుకు ఉరిపోసుకుని మరణించాడు. ఈసంఘటన తెలంగాణయావత్తునూ కదిలించింది. అయితే ఈ మరణానికి మన అంధేరా ప్రభుత్వ, అంధేరా మీడియా స్పందన మాత్రం అత్యంత హేయంగా ఉండి వీరిలో పెరిగిపోయిన అమానవత్వాన్ని తెలియపరుస్తుంది.

ఎక్కడో విదేశాల్లో, ఏదో యాక్సిదెంటులో ఎవరైనా చనిపోతే శవాన్ని మర్యాదలతో దేశానికి తీసుకొస్తారు. కానీ మనదేశంలో, పార్లమెంటు ముందు ఒకవ్యక్తి బలిదానం చేసుకుంటే శవాన్ని అక్కడే శ్మశానానికి తరలించమని అక్కడి మన ఏపీభవన్ వారు లేఖ రాయడం అత్యంత హేయమైన విషయం.

శవాన్ని కాసేపు ఏపీ భవన్లో ఉంచి నివాళులర్పించుకుంటామని తెలంగాణ కాంగ్రేస్, తెరాస, సీపీఇ నేతలంతా కోరినా వారిని పట్టించుకోక పైగా శవాన్ని వారి కుటుంబానికి అందజెయ్యాలనే కనీస ఇంగితగ్నానాన్ని మరిచి శ్మశానానికి తరలించమని ఆదేశాలు ఇచ్చారు. అది ఈ అంధేరా సర్కారు ఆదేశాలమేరకు అక్కడి ఏపీ భవన్ ఆఫీసరు లెటరు రాశాడట. అసలే కడుపు రగిలిపోతున్న తెలంగాణ నేతలను ఈఆదేశం ఇంకా భాధించడంతో అక్కడి అధికారిపై ఒక తెలంగాణ ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యను, అతని ఆశయాన్ని ఏమాత్రం కవర్ చెయ్యని మన అంధేరా మీడియా ఆవేశంలో జరిగిన సంఘటనను మాత్రం భూతద్దంలో పెట్టి చూపించింది.

విశాలాంధ్ర పేరుతో తెలంగాణపై విషం చిమ్మే ఒక వర్గానికి అందులో మనసును కదిలివేసే ఆత్మబలిదానం కనబడడం లేదు గానీ వారి గుడ్డికల్లకు శవరాజకీయాలు కనిపిస్తున్నాయి. అంధుల్లారా, శవరాజకీయాలలో ఆరితేరినవారు ఎక్కడివారో సహజమరణాలను తన అక్కౌంట్లో వేసుకుని రెండు సంవత్సరాలుగా ఓదార్పులు చేస్తున్నఘనులనడగండి..సిగ్గులేకపోతే సరి.


1 comment:

  1. $విశ్వరూప్ గారు

    తెలంగాణ కోసం "నేనుసైతం-ఒక సమిధ" అంటూ తననుతానూ ఆత్మబలిదానం గావించుకున్న యాదిరెడ్డి గారి మరణవార్త చాలా హృదయవిదారకరమైనది. ఈ విధంగా ఆత్మబలిదానం చేసిన వారి ఆత్మశాంతి కలగాలంటే సాధ్యమైనంత త్వరగా సామాన్యుడు కలలుగంటున్న తెలంగాణా రావాలి. సంయమన సమయం దాటిపోయింది. నడుముకట్టి పోరాడాలి..లాడాయి చేయాలి. లేకపోతే నేటి కుత్సితకులరాజకీయాలతో విసిగివేసారిన యువత మనస్తాపంతో ఆత్మబలిదాన౦తోనే తెలంగాణా వస్తుందనే దయనీయమైన ఆలోచనకి రావచ్చు. దీన్ని ఆపాలి!

    #పార్లమెంటు ముందు ఒకవ్యక్తి బలిదానం చేసుకుంటే శవాన్ని అక్కడే శ్మశానానికి తరలించమని అక్కడి మన ఏపీభవన్ వారు లేఖ రాయడం

    నిజంగానే అత్యంతహేయమైనది. మనిషన్నవాడి ఆత్మకు క్షోభ కలిగించే విషయం. మరోకోణంలో ఇలాంటి అమానుషత్వ సంఘటనలు జరగడమూ ఒకందుకు మంచిదే. సామాన్యుడికి సామ్రాజ్యవాదుల ధనమదం గురించిన వాస్తవాలు తెలుస్తాయి.

    #..కడుపు రగిలిపోతున్న తెలంగాణ నేతలను ఈఆదేశం ఇంకా భాధించడంతో అక్కడి అధికారిపై ఒక తెలంగాణ ఎమ్మెల్యే చేయి ..

    ఆ దుస్థితిలో భావోద్వేగాలు ఉన్న సామాన్యమానవుడు ఎలా ప్రవర్తిస్తాడో హరీష్ రావు గారు అలానే ప్రవర్తించారు. యాదిరెడ్డి గారి మరణం వారిని ఎంతగా కలచివేసిందో దీన్నిబట్టి అర్ధం అవుతుంది. తమవ్యక్తి చనిపోతే దానికి అసుపత్రి మీద దాడి చేసి వైద్యుల్ని కొట్టిన సందర్భాలను సమర్ధించిన ప్రచారమిధ్యమాలకి పాపం ఇప్పుడేమోచ్చిందో! అప్పటికీ హరీష్ రావు గారు వెంబడే ఎంతో విజ్జత ప్రదర్శించి క్షమాపణ చెప్పారు. తెలంగాణ లక్ష్యసాధనకి ఈ ఘటన అడ్డుకాకూడదని వారు దిగివచ్చి స్పందించిన తీరు వారి నైతికతను,నిబద్దతను స్పృష్టంగా తెలియజేస్తుంది. అయినా కూడా ఆగకుండా ఘటనని కులంతో ముడిపెడుతూ పెట్రేగిపోతున్న హీన మిధ్యమాల ప్రచారం వెనక వున్న దురుద్దేశాలు అర్ధం అవుతున్నవి.

    #అయితే ఆత్మహత్యను, అతని ఆశయాన్ని ఏమాత్రం కవర్ చెయ్యని మన అంధేరా మీడియా ఆవేశంలో జరిగిన సంఘటనను మాత్రం భూతద్దంలో..

    మిధ్యామాల మాదాకవళం..మరింతగా దిగజారిపోయి.. అశుద్దం కొసం ఆరాటపడుతుంది.సెత్..!:(.

    ReplyDelete

Your comment will be published after the approval.