Wednesday, 29 June 2011

సీమాంధ్ర ఎంపీల వ్యాపారాలు, పార్లమెంటులో ప్రశ్నలు


తెలంగాణవాదులు నిధులపంపిణీలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురయింది అని చెప్పగానే సీమాంధ్రవాదులు అందుకునే వాదన మీ ఎమ్మెల్యేలూ, మంత్రులూ అంతా ఏం చేస్తున్నారు? మీనాయకులు చేతకానివారయితే దానికి ప్రభుత్వమేం చేస్తుందీ అని. నాయకులు ఎవరైనా సొంతలాభాలే చూసుకుంటారు, మీప్రాంతానికి నిధులు అందడానికి మీనాయకుల గొప్పతనం కారనం కాదు, కేవలం నిధుల పమిపిణీని నిర్ణయించే ముఖ్యమంత్రి మీవాడు కావడం వలన, మందబలం ఉండడం వలన అని చెబితే వారికి అర్ధం కాదు.

సరే, ఇంతకూ సీమాంధ్ర నాయకులు ఎంతగొప్పవారు అంటే , వీరిలో అత్యధికులకు చేసేది పార్ట్‌టైం రాజకీయాలు, ఫుల్‌టైం వ్యాపారాలు. మనరాష్ట్రానికి ఎందుకు ఎక్కువ కేంద్రమంత్రిపదవులు దక్కడంలేదని అడిగితే ప్రధాని ఇచ్చిన సమాధానం ఇలా పార్ట్‌టైం  రాజకీయాలు చేసేవారికి మత్రిపదవులు ఇవ్వడం జరగదని.

వీరు వ్యాపారాలు చేసుకుంటే సరే, కానీ అధికారాన్ని వారి వ్యాపార విస్తృతికి వాడుకోవడం సరీయినది కాదు. కానీ అనేకమంది ఆంధ్రా ఎంపీలు తమవ్యాపారలాభాలకోసం తమ పదవులు వాడుకుంటున్నారు. ఆఖరుకు పార్లమెంటులో ప్రజాసమస్యలకోసం వినియోగించాల్సిన ప్రశ్నోత్తరాల సమయం వీరు వ్యాపారాలకోసం వాడుకుంటున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరనలు:

లగడపాటి రాజగోపాల్:

విజయవాడ ఎంపీ అయిన లగడపాటి రాజగోపాల్ లాంకో ఫౌండర్ అన్న విషయం తెలిసిందే. ఈయన పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్న:
“Whether the Central Government proposes to give some concessions to small power units generating 25 MW of power. If so, the details thereof; and if not, the reasons for not giving concessions.”

లాంకో పవర్ ప్రాజెక్టుల వ్యాపారం చేస్తునదనేది తెలిసిందే.


కావూరి సాంబశివరావు:

కావూరి సాంబశివరావు ఏలూరు ఎంపీ అయి ఉండగా ఈయన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపనీ కన్స్ట్రక్షన్, ఇంఫ్రా వ్యాపారాలు చేస్తాడని తెలిసిందే. ఈయన అడిగిన ప్రశ్న:

“Whether the Government proposes to empower the NHAI to extend working capital loans to road developers to help them tie over credit crunch and maintain speedy implementation of road projects.”

రాయపాటి సాంబశివరావు:

గుంటూరు ఎంపీ రాయపాటి జయలష్మి గూపు ఓనరు. ఈయన అనేక ఇతర వ్యాపారాలతోపాటు కన్స్ట్రక్షన్, రోడ్ల వ్యాపారాలు చేస్తాడు. ఈయన అడిగిన ప్రశ్న:

“Whether the NHAI has recently sought comments of various stakeholders on hybrid models to implement highway projects. If so, the details thereof along with the views of the various parties involved.”

నామా నాగేస్వర్:

మధుకాన్ చైర్మన్ నామా ఖమ్మం ఎంపీ. ఖమ్మం తెలంగాణలో భాగమయినప్పటికీ ఇతను ఏవర్గం కొమ్ము గాస్తాడో తెలిసిందే. ఈయన అడిగిన ప్రశ్న:

"Whether the Government proposes to start eight-lane access control express highways. If so, the details thereof along with the locations where the expressways are proposed, state-wise and national highway-wise.”

ఇదండీ, ఈవిధంగా మన ఆంధ్రా ఎంపీలు రాజకీయాలను వ్యాపారానికి వాడుకుంటూ పార్లమెంటులో ప్రజలసమస్యలగురించి చర్చించాల్సిన అమూల్యమయిన సమయాన్ని తమ వ్యాపారాల అవసరాలకోసం ప్రభుత్వ కార్యక్రమాలు ఎలాఉపయోగపడుతాయో తెలుసుకోవడం కోసం వాడుతున్నారు.


Tuesday, 28 June 2011

లొక్‌సత్తా తెలంగాణకు దగ్గరవుతోందా?

లొక్‌సత్తా పత్రిక ఎడిటర్ గంగాధరరావు గారి లొక్‌సత్తా టైంస్‌లోని వ్యాసం  ఈక్రింద చూడవచ్చు. తెరాసపై, కేసీఆర్‌పై  దుమ్మెత్తిపొయ్యడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నప్పటికీ ఈవ్యాసం తెలంగాణవాదానికి అనుకూలంగానే ఉన్నది. ఇటీవలే లోక్‌సత్తా శ్రీక్రిష్ణ కమిటీ 8వ అధ్యాయాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన కూడా చేసింది. ఈపరిణామాలను చూస్తుంటే లోక్‌సత్తా ఆలస్యంగానైనా తెలంగాణ అంశంపై న్యాయం వైపు అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది.

*******************

అన్ని పార్టీల మద్దతూ అవసరమే
- కొంగర గంగాధరరావు
ఈ వేళ తెలంగాణలో నూటికి 90 శాతం మంది ప్రజల బలమైన వాంఛ తెలంగాణ రాష్ట్రం. ఈ ఉద్యమాన్ని కెసిఆర్ కళ్ళతోనో లేక తెలంగాణ కాంగ్రెస్/టిడిపి నాయకుల దృష్టితోనో చూస్తే, అది తెలంగాణ ప్రజల్లో ప్రబలంగా ఉన్న ఆకాంక్షను అవమానించడమే అవుతుంది. మరి ఇంత ప్రబలంగా ఉన్న ఈ వాంఛ సఫలీకృతం కావడానికి గల అడ్డంకులేమిటి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయిందని పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు వేయకుండా సాగతీయడానికి గల కారణాలేమిటి? 

మనమందరం విస్మరించకూడని విషయం మరొకటుంది. ఏ ఉద్యమంలోనైనా ప్రజలందరూ పాల్గొనరు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో నిజంగా పాల్గొన్న యోధులు వేలల్లోనే ఉన్నారు. కాని అది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లొంగదీసుకొంది. మరి లక్షలాది ప్రజలు రోడ్లపైకి వచ్చినా, కోరుకొంటున్నది దేశ సార్వభౌమత్వానికి ఏ రకంగానూ భంగకరం కాని, ఒకప్పుడు ప్రత్యేకంగా వుండి నేడు సమై క్య ఆంధ్రప్రదేశ్‌లో అస్తిత్వాన్ని కోల్పోయిన తెలంగాణ రాష్ట్రాన్నే అయినా, కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసి మరీ వెనుక అడుగులు ఎందుకు వేస్తోంది? దీనికి కారణభూతులు ఎవరు? తెలుసుకోవాలంటే ముందుగా మనం ఉద్యమ మూలాల్లోకి వెళ్ళాలి. 

1953 అక్టోబరులో ఆంధ్ర రాష్ట్ర మేర్పడినప్పుడు చెన్న పట్టణాన్ని తమిళులకు కోల్పోయిన ఆంధ్ర ప్రజల్లో, నాయకుల్లో విశాలాంధ్ర ఏర్పడాలన్న కోరిక పురుడు పోసుకొంది. అంతకు రెండు శతాబ్దాల క్రితం తెలుగు మాట్లాడే ప్రాంతాలు విడిపోయాయి. ఆంధ్ర మహాసభ తదితర కార్యక్రమాలతో ఇటు హైదరాబాద్ రాష్ట్రంలోను, అటు కోస్తాంధ్ర, రాయలసీమలోను తెలుగు మాట్లాడే ప్రాంతాలు కలిసి పోతే మరింత ఎదగగలమని ఆశ పొడసూపింది. 1948లో పోలీస్ యాక్షన్ ద్వారా భారత్‌లో విలీనమయిన హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగువారిని, నిజాం నవాబుల కాలంలో అనుభవించిన బాధలు, విశాలాంధ్ర వైపు అడుగులు వేసేలా చేశాయి. 

అయితే వాటితోపాటే అనుమానాలు ఏర్పడ్డాయి. వివిధ చారిత్రక కారణాల వల్ల అటు ఆంగ్ల విద్యలో, ఇటు లౌక్యంలో ఎంతో ముందంజలో ఉన్న కోస్తాంధ్ర ప్రజ లు అటు రాయలసీమ ప్రాంత ప్రజల్లో, ఇటు తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోయారు. రాయలసీమ వాసులతో శ్రీబాగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుని కలుపుకున్న కోస్తాంధ్ర నాయకత్వం ఇటు తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకోవాలని తహతహలాడింది. 

అందుకే పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం తదితర ఒడంబడికలు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకుల మధ్య జరిగాయి. ఫజల్ అలీ కమిషన్, అయిదేళ్ళు ఆగి ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగి కొత్తగా ఎన్నికయిన ఆ ప్రజాప్రతిధులు ఇరు ప్రాంతాల శాసనసభలలోను మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదిస్తే అప్పుడు విశాలాంధ్రను ఏర్పరచాలని అభిప్రాయపడింది. 

కాని నిజాం ప్రతినిధి మోయిన్ నవాజ్ జంగ్ ఐక్యరాజ్యసమితిలో స్వతంత్ర హైదరాబాదు రాజ్యానికి సంబంధించి ఇచ్చిన అర్జీ తదితర కారణాల వల్ల భారత ప్రభుత్వం హైదరాబాదు రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించింది. ఐదు జిల్లాలను మహారాష్ట్రలో, మూడు జిల్లాలను కర్ణాటకలో కలిపి మిగిలిన హైదరాబాదు ప్రాంతాన్ని (తెలంగాణ) సీమాంధ్రతో జోడించింది. భాష తెలిసిన ఎవరికయినా ఇది జోడింపు (అఛిఛ్ఛిఛ్ఛీ) మాత్రమేనని, కలయిక/ విలీనం (అఝ్చజూజ్చఝ్చ్టజీౌn) కాదని తెలిసిపోతుంది. 

ఈ జోడింపు తెలంగాణ ప్రాంత ప్రజల్లోని అభద్రత భావాన్ని తొలగించకపోగా మరింత పెంచింది. పాలనా వ్యవహరాల్లో ఉపయోగపడేందుకు తెలుగు, ఆంగ్లం ఎక్కువగా తెలిసిన సీమాంధ్ర వారిని ఉన్నతాధికారులుగా హైదరాబాద్ తీసుకురావడం, తెలుగు వారయినా నిజాం పాలనలో ఉర్దూ మాధ్యమంలో చదువుకోవడం వల్ల సీమాంధ్రులతో పోటీబడే స్థాయిలో తెలంగాణ ప్రజలు లేకపోవడం ఈ దూరాన్ని పెంచింది. ఒక కాకి పదికాకులను పిలిచినట్లుగా సీమాంధ్ర ఉన్నతాధికారులు సీమాంధ్ర విద్యాధికులకు పెద్దపీట వేసి తివాచీ పరచి ఆహ్వానించడంతో తెలంగాణ ప్రజానీకానికి తమచోటే తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సిరావడం బాధాకరంగా పరిణమించింది. 

అగ్నికి వాయువు తోడైనట్లుగా సీమాంధ్రుల అభిజాత్య అహంకారపు ధోరణి తెలంగాణ ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఇక ఉర్దూ కలగలిసిన తెలంగాణ తెలుగు మాండలికాన్ని సీమాంధ్రులు చిన్నచూపు చూడటం విద్వేషాగ్నిని రగిల్చింది. తమ దైన భాష, సంస్కృతి తమ చోటే తిరస్కృతికి గురికావడం తెలంగాణ ప్రజానీకం తిగరబడేలా చేసింది. దానికి విద్యార్థి నాయకులు త్యాగం, కొద్దిమంది తెలంగాణ రాజకీయనాయకుల స్వార్థం తోడవడంతో 1969లో ఉవ్వెత్తున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఎగసింది. 

అప్పటికింకా ఐక్యరాజ్యసమితిలో నిజాం మంత్రి మొయిన్ నవాజ్ జంగ్ పెట్టిన అర్జీ తేలకపోవడం, జాతీయ సమగ్రత అంశాలు కలగలిసి ఉండటంతో ఇందిరాగాంధీ నేతృత్వంలోని నాటి జాతీయ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ససేమిరా అంది. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారిని ప్రలోభ పరచి, ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది. తెలంగాణ ప్రజానీకానికి తాయిలాలు వేసి ఉద్యమాన్ని చల్లార్చి రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఉంచడంలో సఫలీకృతం అయింది. 

అప్పుడప్పుడు అసంతృప్త తెలంగాణ రాజకీయ నాయకులు ఈ కాంక్షను వాడుకోవాలని చూసినా 1969లో మోసపోయిన తెలంగాణ ప్రజానీకం అంత త్వరగా స్పందించ లేదు. కాని 2002లో చంద్రబాబుపై కోపంతో ప్రత్యేక తెలంగాణ సమరాంగణంలో దూకిన కల్వకుర్తి చంద్రశేఖర్‌రావు ఉరఫ్ కెసిఆర్ ఈ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. విద్వేష భావాలు రెచ్చకొడుతూనే ఎక్కడా హింసాత్మక రూపం తలదాల్చకుండా అటు అణచివేతకు అవకాశమీయకుండా ఇటు ఉద్యమ స్ఫూర్తి చల్లారినప్పుడల్లా తనదైన ఎత్తుగడలతో ఉవ్వెత్తున ఎగసిపడేలా చేస్తూ కెసిఆర్ చేసిన ఉద్యమ ప్రస్థానం తెలంగాణ ప్రజానీకపు ప్రగాఢ కాంక్షను మరింత బలీయం చేసింది. 

బలమయిన ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హెలిక్టార్ ప్రమాదంలో కోల్పోవడంతో చంద్రబాబును ఎదుర్కోలేమన్న భయంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కెసిఆర్‌ను ప్రోత్సహించింది. తత్ఫలితమే కెసిఆర్ నిరాహార దీక్ష, 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి ప్రకటన. మొయిన్ నవాజ్ జంగ్ అర్జీకి కూడా 1975లో ఐక్యరాజ్యసమితిలో కాలం చెల్లిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్ 10న పార్లమెంటులో సైతం ప్రకటించిన జాతీయ ప్రభుత్వం ఆ తరువాత చంద్రబాబు ఎదురుదాడికి తల్లడిల్లింది. 

అంతవరకు ప్రత్యేక తెలంగాణకు ఉత్తుత్తి మద్దతు ప్రకటించిన చంద్రబాబు, ఇది తనపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రయోగించిన అస్త్రంగా గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు. సీమాంధ్రలో డిసెంబర్ 10 నుంచి ప్రజ్వరిల్లిన సమైక్యాంధ్ర ఉద్యమం ఇటు చంద్రబాబు అప్రకటిత మద్దతుతో, అటు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు హైదరాబాదులో వున్న ప్రయోజనాల దృష్ట్యా ఉవ్వెత్తున ఎగియడంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వెనక్కి తగ్గింది. పరిష్కారాలు వెతకడం కోసం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. సంవత్సరం పాటు కాలహరణం చేసిన శ్రీకృష్ణ కమిటీ మరింత వివాదాస్పదంగా తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ రహస్యంగా 8వ అధ్యాయాన్ని సమర్పించి జస్టిస్ శ్రీకృష్ణ ప్రతిష్ఠను పాతాళానికి తొక్కింది. 

మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తిరిగి ఊపందుకునే ప్రయత్నంలో వుంది. అయితే సంవత్సరం క్రితం ఉన్న ఆనందోత్సాహాలు, తెలంగాణ వస్తుందన్న విశ్వాసం ఇప్పుడు లేవు. మోసపోయామన్న బాధ, పోరాడాలన్న కసి తప్ప ఏంచేస్తే తెలంగాణ వస్తుందో తెలియని పరిస్థితిలో తెలంగాణ ప్రజానీకం, నాయకత్వం వుంది. కారణాలేమి టి? 

ఉద్యమం అంత ఉద్ధృతంగా సాగినా ఫలితాన్ని సాధించడంలో ఎందుకు విఫలం అవుతోంది? అసలు ప్రత్యేక తెలంగాణ సాధనకు గల అడ్డంకులేమిటో ఒకసారి పరిశీలిద్దాం. తరచి తరచి చూస్తే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ బలమే దానికి బలహీనతగా పరిణమించిందని అర్థమవుతుంది.కెసిఆర్‌పై అధికంగా ఆధారపడటం ఉద్యమ గమనానికి ఎంతఅవసరమైందో, లక్ష్యసాధన లో అంతే అడ్డంకిగా నిల్చింది. కారణాలు విశ్లేషిద్దాం. 

(అ) నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు సీమాంధ్రులకు అభ్యంతరం లేదు. కానీ ఉద్యమంలో ఉద్రేకం చల్లారకుండా వుండేందుకు కెసిఆర్, అతన్ని అనుసరిస్తూ ఇతర తెలంగాణ ప్రాంత నాయకులు వాడిన పదజాలం సీమాంధ్రులను గాయపరచింది. అందుకే తమకు పోయేదేమి లేకున్నా, తమ నాయకుల స్వార్థ ప్రయోజనాలు ఇమిడివున్నా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సామాన్య సీమాంధ్రులు సైతం బలపరిచారు. 

(ఆ) తెలంగాణలో ప్రబలంగా వున్న తెలుగుదేశం పార్టీని నిర్వీర్యపరుస్తాడనుకున్న కెసిఆర్ తెలంగాణలో తమని కూడా తుడిచి పెడుతున్న విషయాన్ని గమనించిన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణ ఇచ్చి కెసిఆర్‌ను మరింత బలపరిస్తే ఆ ప్రాంతంలో తమకు నూకలు చెల్లినట్లేనని గ్రహించింది. 

(ఇ) అటు సీమాంధ్రలో చంద్రబాబును పక్కనపెట్టి ముందుగా వై.ఎస్.జగన్ అంటే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం భయపడుతోంది. అటు జగన్ బలాన్ని అంచనా వేయలేక, ఇటు తెలంగాణ ప్రకటిస్తే ఆ కారణంతో అటు సీమాంధ్రలో జగన్ తమని తుడిచిపెడితే తమగతి రెంటికీ చెడ్డ రేవడి అవుతుందేమోనని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తల్లడిల్లుతోంది. 

(ఈ) ఇక ఎలాగూ తెలంగాణ వస్తోంది కాబట్టి, తెలంగాణలో ప్రత్యర్థుల నిర్మూలనకు కెసిఆర్ పూనుకున్నారు. టిడిపిిని దాదాపుగా తుడిచిపెట్టిన కెసిఆర్ తమను విడిచి పెడతారని కాంగ్రెస్ అధినాయకత్వం భావించడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో కెసిఆర్ ప్రభ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణ ఇవ్వాలంటే భయపడే రీతిలో వుంది. 

అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వనట్లేనా? దీనికెవరిని నిందించాలి? మితిమీరిన కెసిఆర్ స్వార్థ నాయకత్వమా? కెసిఆర్‌పై అతిగా ఆధారపడి మిగిలిన రాజకీయ పక్షాలను తెలంగాణలో శూన్య స్థితికి తెచ్చిన రాజకీయ జేఏసీ కారణమా? తెలంగాణ ఏర్పాటు రాజకీయ ప్రక్రియ అని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాల్సిన అవసరం వున్నదన్న విషయం మరచి, తెలంగాణలో జై తెలంగాణ అనని రాజకీయ పక్షాల అస్థిత్వాన్ని నిర్మూలించాలన్న వ్యూహం తెలంగాణ ఉద్యమం పట్ల ఆత్మహత్యా సదృశం అయ్యిందా? దీనికెవరిని నిందించాలి? 

ఖచ్చితంగా రాజకీయ జేఏసీనే. రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు స్వార్థం లేనిదే మనుగడలేదు. పైచేయి సాధించడం, ప్రత్యర్థులను తుదముట్టించడమే రాజకీయ పక్షాల లక్ష్యం. కానీ రాజకీయ జేఏసీ లక్ష్యం అదికాదు. స్వార్థం దానిగుణం కాదు. కేవలం ఉద్యమ ఉద్ధృతికి కెసిఆర్‌పై ఆధారపడవలసి వచ్చినా, ఇతర రాజకీయ పక్షాల నిర్మూలనలో కెసిఆర్‌కు రాజకీయ జేఏసీ సహకరించడమే ప్రస్తుత దుర్గతికి కారణం. నిరాహార దీక్ష రెండోరోజునే పళ్ళరసం తాగిన కెసిఆర్ దిమ్మతిరిగేలా విద్యార్థి ఉద్యమ నాయకత్వం హెచ్చరికలు పంపి కెసిఆర్‌ని నిరాహార దీక్ష కొనసాగించేలా చేసిన వైనం, రాజకీయ జేఏసీ మరచిపోయింది. 

కేసీఆర్‌పై ఆధారపడుతూనే అతడిని, అతడి రాజకీయ వ్యూహాలను అదుపులో పెట్టవలసిందిపోయి, కెసిఆర్ చెప్పినట్లుగా చేసి ఇతర రాజకీయ పక్షాలకు దూరమయ్యింది. అన్ని రాజకీయ పార్టీలకు విశ్వాసం కలిగించి, తెలంగాణ రావడం ఆ పార్టీలకు శరాఘాతం కాదని, అన్ని రాజకీయ పక్షాలకు కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కూడా సమాదరణ ఉంటుందనే భావన కల్పించడం మరచిపోయి, కెసిఆర్ అడుగులకు మడుగులొత్తని రాజకీయ పక్షాల పీచమణచేందుకే తన శక్తి యుక్తులనుపయోగించింది. పర్యవసానమే ఈ దుస్థితి. 

ఇకనైనా రాజకీయ తదితర జేఏసీలు ప్రాప్తకాలజ్ఞతతో అన్ని రాజకీయ పక్షాలతోనూ చర్చించి వాటి విశ్వాసాన్ని చూరగొనాలి. రాజకీయ పక్షాలు సహకరించకుండా, వాటి పీచమణచడం ద్వారా తెలంగాణ సాధించడం అసాధ్యం. అలాకాకుండా అన్ని రాజకీయ పక్షాలను సమాదరిస్తూ, వాటికి విశ్వాసాన్ని కలిగించగలిగితే రాజకీయ ప్రక్రియలో అన్ని రాజకీయ పక్షాలను పాల్గొనేలా చేయగలిగితే ఉద్యమంలో ఉద్ధృతి రేకెత్తించేందుకు సీమాంధ్ర ప్రాంతీయులపై ద్వేషాన్ని వెళ్ళగక్కే విధానం పోయినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుసాధ్యమవుతుంది. అలాకాకుండా ప్రస్తుతం జరుగుతున్నట్లుగా అంతా కేసీఆర్ మయం అనుకుంటే 2014 ఎన్నికల్లో అన్ని తెలంగాణ సీట్లు (పార్లమెంట్,అసెంబ్లీ) కెసిఆర్ గెలుచుకున్నా తెలంగాణ రాదు, 

అలాగే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చినా ప్రస్తుత పరిస్థితులే ఆంధ్ర ప్రాంత ఎంపీలపై ఆధారపడటంఅప్పుడూ వుంటే బిజెపి కూడా తెలంగాణ ఇవ్వదు. తెలంగాణ రావాలంటే అన్ని రాజకీయ పక్షాల సహకారం అవసరం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహిస్తున్న రాజకీయ, విద్యార్థి తదితర జేఏసీలు ఈ విషయాన్ని గ్రహించి తదనుగుణమైన కార్యాచరణను చేపడితే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం కల సాకారమవుతుంది. 

- కొంగర గంగాధరరావు
లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు
-- 

పోలవరం సత్యాలు -2


కొంతమంది అతితెలివి చూపిస్తూ మీదగ్గర పారిశ్రామికీకరన జరగితే మేం కాదంటున్నామా, మాకు నీల్లెక్కువ వస్తే మీరెందుకు కాదంటారు అని అమాయకంగా అడుగుతారు. పారిశ్రామికీకరన అవసరం లేదు అని ఎవరూ చెప్పరు, కానీ పారిశ్రామీకరణ ఎక్కడ జరిగినా రాష్ట్రంలో అందరికీ అవకాశాలు లభిస్తాయి, ఆ కంపనీల వోనర్లెవరో, జీడీపీ పెరిగితే అది ఎవరి జేబుల్లోకి వెలుతుందో అందర్రికీ తెలిసిందే. అయితే అసలు పోలవరం నిజంగా వారు చెబుతున్నట్టు ఆప్రాంతం వ్యవసాయం కోసమేనా?

పోలవరం ఎవరికోసం?

పోలవరం కుడి కాలువ ద్వారా 1,29,00 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తే ఎడమ కాలువ ద్వారా 1,62,000 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తుంది. అయితే ఎడమకాలువ వెల్లే ప్రాంతంలోనే ఇటేవలే తాడిపూడి, పుష్కరం అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తిచేశారు. ఇదివరకే ఇదే ప్రాంతంలో చంగల్‌నాడు, తొర్రిగెడ్డ, ఏలేరు లిఫ్ట్ ఇరిగేష్న్లు వాడకంలో ఉన్నాయి. వీటి ద్వారా ఎడమకాలువల ఆయకట్టులో 95% ఇప్పటికే ఉన్న ఆయకట్టు. మిగతా ఐదు శాతం అసలు సాగుభూమి కాదు. ఎడమ కాలువ వెల్లే ప్రాంతంలో కూడా మెజారిటీ ప్రాంతం బావులద్వారా, గొట్టపు బావులద్వారా సాగులో ఉంది. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోలా భూగర్భ జలాలు అడుగంటలేదు కాబట్టి బావులద్వారా వ్యవసాయం బాగానే సాగుతుంది. కుడి, ఎడమ కాలువలు కలిపి 75% ఆయకట్టు ఇప్పటికే ఏదో ఒక రీతిలో ఉన్నదే.

మరి ఇప్పటికే ఆయకట్టు ఉన్న ప్రాంతంలో ఇంతమందిని నిరాశ్రయులను చేస్తూ, రాజమండ్రి నగరాన్ని రిస్కు చేస్తూ ఈప్రాజెక్టు ఎవరికోసం అంటే విశాఖ, కాకినాడలో కొత్తగా రాబోయే పరిశ్రమలకోసం. ఇక్కడ జిండాల్ అల్యూమినియం ప్లాంటుతో పాటు అనేక కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి, వీటికి పెద్దేత్తులో నీరు అవసరం. అంటే పోలవరం అందరూ అనుకునేట్టుగా డెల్తా రైతులకోసం కాదు, విశాఖ, కాకినాడలో పరిశ్రమలకోసం.


కొంతమంది అతితెలివివారికోసం ఇక్కడ ఒక క్లారిఫికేషన్: నాఉద్దేషం కాకినాడ, విశాఖపట్నంలో భారీ పరిశ్రమలు రావొద్దని కాదు. కానీ పరిశ్రమల అవసరంకోసం భారీ నీటిప్రాజెక్టులు ప్రభుత్వం కట్టదు. ఒకవేళ కడితే అది ఇతర తాగు, సాగు నీటి అవసరాలు తీరిన తరువాత. అలా చెబితే అసలు ప్రాజెక్టుకు CWC నుండి అనుమతి కూడా రాదు, అందుకే ఆయకట్టు గురించిన అబద్దాలు. 



ముంపు, నిర్వాసితులు:

పోలవరం ద్వారా 270 గ్రామాల్లో లక్షా ఇరవై వేలమంది నిర్వాసితులవుతారనేవి 2001 జనాభాలెక్కల ఆధారంగా ప్రభుత్వ లెక్కలు. అయితే వాస్తవానికి ఇంకా ఎక్కువ గ్రామాలు మునిగిపోతాయి, అక్కడ గతపదేల్లలో ఇంకా ఎక్కువ జనాభా పెరిగింది అని ఎంజీవోలు చెబుతున్నాయి. వీరి అంచనా ప్రకారం కాలువల తవ్వకం వలన నిర్వాసితులయ్యేవారిని కలుపుకుంటే  మొత్తం నిర్వాసితులు నాలుగు లక్షల మంది వరకూ ఉంటారు. అందులో మెజారిటీ దళితులు, ఆదివాసీలు. లక్ష ఎకరాలు కూడా కొత్తగా ఆయకట్టు తీసుకురాని ఒక ప్రాజెక్టుకోసం నాలుగులక్షలమంది ప్రజలు తమ ఇల్లు, పొలాలు వదులుకుని మరోచోటికి వెల్లాలి.

ఇందులో పావువంతుదాకా ఆయకట్టుకింద వ్యవసాయం చేసుకుంటున్నవారు. అంటే లక్ష ఎకరాల కొత్త ఆయ్కట్టుకోసం 25వేల ఎకరాల ఆయకట్టు భూమిని వదులుకోవాలి. వీరికి పునరావాసంలో మల్లీ ఆయకట్టుకింద భూములు దొరకడం కల్ల. ఆదివాసీలు అడవిపైనే ఆధారపడతారు, వారిని తరలించడమంటే వారి పొట్ట కొట్టడమే.

ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు:

ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో కొంత ఒరిస్సా, చత్తీస్‌ఘర్ లలో కూడా ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాలలో ముంపును తప్పించడానికి మన ప్రభుత్వం చూపించిన పరిష్కారం అక్కడ ఎత్తయిన అడ్డుకట్ట కట్టడం. ఈ అడ్డుగోదల ఖర్చు ప్రాజెక్టు ఖర్చుకు అదనం. అయితే దీనిపై ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం జరగలేదు, వరదలను దృష్టిలో పెట్టుకుంటే ఎంత అడ్డుకట్ట కట్టాలనే దానిలో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదు.

ఈ ప్రాజెక్టును ఎలాగయినా అడ్డుకోవాలనే సంకల్పంతో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పావులు కదుపుతూ సుప్రీం కోర్టుకు వెల్లాడు. సుప్రీం కోర్టులో కేసు వోడిపోయే అవకాశాలే మనరాష్ట్రానికి ఎక్కువ. అంటే కేసు వోడిపోతే మనం పెట్టే ఖర్చంతా శుద్ద వేష్టు. అంటే ఇప్పుడేదో ఈప్రాజెక్టువల్ల ఉపయోగం ఉందని కాదు గానీ అప్పుడు పూర్తిగా ఆపేయాల్సి వస్తుంది.

ఇన్ని సమస్యలు ఉన్నా ఈప్రాజెక్టు కావాలని అన్ని రాజకీయ పార్టీలూ రోజూ ఉద్యమాలు చేస్తున్నది ఎవరికోసం అంటే కొందరు పారిశ్రామిక వేత్తలు, మరియు ప్రాజెక్టు వస్తే తాము మూడో పంటకూడా వేసుకోవచ్చునేమో నని ఆశపడే కొందరు ధనికులు.

ఇందులో ఉన్న పర్యావరణ సమస్యలు, విజయవాడ, రాజమండ్రికి వరద ప్రమాదాలగురించి మరో టపాలో.

Ref: http://www.downtoearth.org.in/content/why-polavaram-pointless-project
http://www.bannedthought.net/India/PeoplesTruth/PeoplesTruth02-200807.pdf

Monday, 27 June 2011

ఆంధ్రా అక్టోపస్ అసలు స్వరూపం


గడచిన ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలతరువాత అక్టోపస్ గురించి వినని వారుండరు. అక్టోపస్ సముద్రం అడుగున ఉంటుంది,   ఎనిమిది కాల్లతో తన ఎరను బంధించి రక్తం పీల్చి చంపేస్తుంది, శత్రువు దాడి చేస్తే నల్లని విషాన్ని చిమ్మి తప్పించుకుంటుంది. అప్పుడప్పుడు అక్టోపస్ జాతకాలు కూడా చెబుతుంది. ఆంధ్రా అక్టోపస్  కూడా ఇవన్నీ చేస్తుంది. అధికారయంత్రాంగంలో తనకున్న బలంతో పేదలరక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంది, గిట్టని తెలంగాణవాదంపై విషం చిమ్ముతుంది, ఎలక్షన్లపై జాతకాలూ చెబుతుంది. దీనిపేరే లగడపాటి.


ఆంధ్రా అక్టోపస్‌కు చెందిన లాంకో కంపనీ ప్రభుత్వం నుండి 108 ఎకరాల భూమిని పొందింది. అయితే ఇది వక్ఫ్ భూమి అని తరువాత తేలింది. వక్ఫ్ భూములను అమ్మే అధికారం ఎవరికీ లేదు. హైకోర్టు స్టే ఇచ్చినా అక్టోపస్ తన అధికారాన్ని ఉపయోగించి మాయచేసి లాంకోహిల్స్‌ను పూర్తి చేశాడు. ఐటీపార్కు కోసం ప్రభుత్వం దగ్గర కొట్టేసిన భూమిలో కనీసం పావు వంతు కూడా ఐటీ పార్కు కట్టకుండా అంతా కమర్షియల్ ఫ్లాటులు కట్టిన అక్టోపస్ భూమికి ఆనుకుని ఉన్న కుంటలూ, గుట్టలూ, ఆఖరుకు స్మశానం, గుడి కూడా వదలకుండా కలిపేసుకున్నాడు. అయితే పాపం రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంతో లాంకోహిల్స్ ఇప్పుడు దివాళా తీసింది. తెలంగాణ వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ పడిపోయే ప్రమాదం ఉండడంతో పాటు వక్ఫ్‌భూములపై, ఆక్రమణలపై విచారన జరిగే అవకాశం కూడా ఉండడంతో ఈఅక్టోపస్ తెలంగాణ ఎలాగైనా ఆపాలని కంకణం కట్టుకుంది.

ఆంధ్రా అక్టోపస్‌కు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు. అయితే ఎలక్షన్ అఫిడవిట్‌లో మూడో సంతానం గురించిని దాసిన విషయంపై విచారణ నడుస్తుంది. ఇంకా ఆంధ్రా అక్టోపస్ హవాళా కుంభకోణంలోనూ, ఇన్సూరన్సు కుంభకోణంలోనూ కూడా భాగం ఉన్నట్టు తెలుస్తోంది. ఈఅక్టోపస్‌కు చెందిన లాంకో ఇంఫ్రా ఈక్కడెక్కడైతే పవర్ ప్లాంటులు కడుతుందో అక్కడ అన్ని చోట్లా ఆయా రాష్ట్రప్రభుత్వాలతో కోర్టు కేసులు ఎదుర్కుంటోంది.

లగడపాటి vs KTR

లగడపాటి, కేటీఅర్ లమధ్య ఆసక్తికరమయిన చర్చ HMTV వారి బిగ్‌షోలో జరిగింది. ఎంతో ఆసక్తి కరంగా జరిగిన ఈచర్చలో అనేక అంశాలు చర్చలోకి వచ్చాయి. చర్చలో లగడపాటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు హైదరాబాద్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడం జరిగింది అనేది అవాస్తవమని, అది కేవలం సమైక్యవాదుల ప్రాపగాండా అని ఒప్పుకున్నారు. అలాగే విడిపోతే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గానీ కేంద్రపాలితప్రాంతంగా గానీ ఉంచడం కుదరదని అది తెలంగాణకే చెందాలని కూడా ఒప్పుకున్నారు. చర్చలో ఏకోసానా లగడపాటి కేటీఆర్‌కు సమాధానం ఇవ్వలేకపోయారు.

పూర్తి చర్చ దొరకలేదు, కొంతభాగం మాత్రం యూట్యూబ్‌లో క్రింది వీడియోల్లో చూడవచ్చు.



Saturday, 25 June 2011

పోలవరం సత్యాలు - 1




పోలవరం అనే ప్రాజెక్టు గోదావరి నదిపై ధవళేస్వరం నకు కొంచెం ఎగువన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ఈప్రాజెక్టుపై ఎన్నో కాంట్రావర్సీలు ఉన్నప్పటికీ రాజకీయనాయకుల వత్తిడితో త్వరలో దాదాపు జాతీయహోదా కూడా రాబోతున్నట్టు సమాచారం. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తికాకుండానే, ఆతరువాత ఒక్కప్రాజెక్టు కూడా చేపట్టకుండానే ఇప్పటికే ప్రాజెక్టు ఉన్నప్రాంతానికి మరో ప్రాజెక్టు అవసరమా లాంటి విషయాలు వదిలేసి అసలు ఈప్రాజెక్టు ఎంతవరకు సమర్ధనీయం అనే విషయం చర్చిద్దాం.

పోలవరం వలన ఏర్పడే ఆయకట్టు 3 లక్షల హెక్టేర్లు ( సుమారు ఏడు లక్షల ఎకరాలు). అయితే ప్రభుత్వం చూపిస్తున్న ఆయకట్టులో 2.5 లక్షల ఎకరాలు ఇప్పటికే ప్రకాశం బారేజీకింద ఉన్న ఆయకట్టు. అంటే కొత్తగా వచ్చే ఆయకట్టు 4 లక్షల ఎకరాలు. ఈప్రాజెక్టు వలన ముంపుకు గురీయే ప్రాంతం అక్షరాలా 1.2 లక్ష ఎకరాలు (కొందరు మేతావులు దీనిని 4500 ఎకరాలుగా చెబుతున్నారు) అంటే 47 వేల హెక్టేర్లు. అందులో 11,782 హెక్టేర్ల మాగాణీ, 32,667 హెక్టేర్ల మెట్ట, 2,481 హెక్టేర్ల ఆటవీ ప్రాంతం. మొత్తం నిర్వాసితులు 276 గ్రామాలలోని 1,17,034 మనుషులు (2001 జనాభా లెక్కల ప్రకారం). అంటే ప్రతి 4 ఎకరాల ఆయకట్టుకోసం ఒక ఎకరం భూమి మునిగిపోతుంది, ఒక మనిషి నివాసం కోల్పోవలిసి వస్తుంది. అసలు మొత్తం ప్రభుత్వం చెప్పే ఆయకట్టులో 75% వరకూ ఇప్పటికే ఏదో ఒకరకమయిన ఇరిగేషన్ ఉందని అంచనా.

ఇంతే అనుకుంటే బాగుండేది కానీ, ఈముంపుకు ఇంకా కథ ఉంది. ఇక్కడ విలువయిన గ్రాఫైట్ గనులు కూడా మునిగిపోతున్నాయి. గ్రాఫైట్ మునిగిపోవడం వలన జరిగే నష్టం ఒక ఎత్తు కాగా ఆగ్రాఫైట్ నీటిలో కలిసి నీటిని కాలుష్యం చెయ్యడం మరో ఎత్తు.

ఇంకా ముంపులో ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా మునిగిపోతుంది. నిర్వాసితులలో ఎక్కువభాగం ట్రైబల్స్. ట్రైబల్స్‌ను మరో చోటికి తరలించడం ద్వారా వారి జీవనవిధానానికి లోటు. ఇక ట్రైబల్స్‌కు అడవిపై ఉండే హక్కులకు సంబంధించిన కేసు విచారణలో ఉంది. ఆకేసు వ్యవహారం తేలేంతవరకూ ట్రైబల్స్‌ను తరలించే హక్కు ప్రభుత్వానికి లేదు.

గోదావరి నీటిలో సెడిమెంటేషన్, స్లిట్ ఫామేషన్ ఎక్కువ. దానివలన డాంకు ప్రమాదం ఏర్పడొచ్చు.

ప్రస్తుత ప్రాజెక్టు డిజైన్ 2003లో ఏర్పరిచారు, కాబట్టి అప్పటి వరదల డాటా ప్రకారం ఏర్పడింది. కానీ 2008లో గడచిన వందేల్లళో రానంత వరదలు వచ్చాయి. ఇలా వస్తే ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు రాజమండ్రి పట్టణం మొత్తం కొట్టుకుపోతుంది.

ఇందులో ఇంకా అనేక అంశాలు ఉన్నప్పటికీ సమయాభావం వల్ల ఎక్కువ రాయలేకపోవడం జరిగింది. ఈప్రాజెక్టు సమర్ధకులు చెప్పే ఇంకోవిషయం 900MW పవర్ జెనరేషన్ కాగా, కేవలం 900MW పవర్ కోసం ఇంత ఖర్చు పెట్టడం నాడా ఉంది కదా అని గుర్రం కొనుకోవడం లాగ. పవర్ జెనెరేషన్ ఖర్చులో పెట్టుబడిపై వడ్డీని కూడా చూడాలి, అలా చూసినప్పుడు థెర్మల్ పవర్‌కే తక్కువ ఖర్చు.

2010 లెక్కలప్రకారం ప్రస్తుత ఖర్చుల అంచనా 16 వేలకోట్లు. పూర్తయే సరికి బహుళార్ధక ప్రాజెక్టులు వేటికయినా నాలుగురెట్లు ఖర్చు పెరుగుతుంది. అయితే ఈ అంచనాలో పునరావాసం ఖర్చు గానీ, మైన్సూ, ఆటవీ ప్రాంతం ఖర్చు గానీ ఉన్నట్లు లేదు. ఇక కోల్పోయే వన్యమృగ సంపద, ప్రకృతి సంపద లాంటివాటికి లెక్కేలేదు. ఇంతాచేసి ఇదేమీ కరువు ప్రాంతం కాదు, తక్కువలోతులోనే భూగర్భ జలాలు ఉండే తీరప్రాంతంలో. మరి ఈ తెల్ల ఏనుగు ఎవరికోసం అయ్యా అంటే వోట్లకోసం పదవులకోసం పంతాలకు పొయ్యే కొంతమంది రాజకీయనాయకుల స్వార్ధం కోసం.



Ref: http://www.downtoearth.org.in
http://www.conflicts.indiawaterportal.org/sites/conflicts.indiawaterportal.org/files/conflicts_polavaram.pdf

Thursday, 23 June 2011

దేడ్ దిమాక్ వాదనలు -2

దేడ్ దమాక్ వాదన 1: తమరి ప్రశ్నకు సమాధానం వచ్చినతరువాత అసలు ప్రశ్ననే మార్చేసే దేడ్‌దిమాక్ పనులు జెయ్యొద్దు. తమరి ప్రశ్న వలసవాద ప్రభుత్వమంటూ ఉద్యోగాలు చెయ్యడానికి సిగ్గులేదూ అని, మరొకసారి చదువుకోండి. బ్రిటిష్ ప్రభుత్వంలో మీపెద్దలెవరూ పనిచెయ్యలేదా, లేక వారికి సిగ్గులేదా, అది చెప్పక వలసవాదం నిర్వచనానికి ఎందుకు వెలతారు? ఎలాంటి పెత్తనాలు వలసవాదం కిందికి వస్తాయో ఏవిరావో చెప్పగలిగేంత శాస్త్రం తమ దగ్గర లేదు గానీ కనీసం తమరు చెప్పిన వాదనకు కట్టుబడి ఉండండి.

దేడ్ దమాక్ వాదన 2: చేదే సామర్ధ్యం మనిషికి ఉంది అది బావిలోనయినా, లిఫ్టు ఇరిగేషన్లో నయినా, లేనిది will. పోలవరానికి ఇంకా ఏమేం అవసరం ఎంతమందికి పునరావసం కావాలి, ఎంత ఆటవీ సంపద మునిగిపోవాలి, తీరా ఎన్ని ఎకరాలకు నీల్లు వస్తున్నాయనేది తరువాత మాటాల్డుకుందాం. ఎంత దేడ్ దిమాక్‌లయినా మరీ కనీసం ఒక వాదనకు కట్టుబడకపోతే ఎలా? తమరిలాంటి దేడ్ దిమాక్లు బావి ఉన్నా దాహంతో ఎండిపోతారేమో కానీ మిగతావారు అలా కాదని గమనించండి.

దేడ్ దమాక్ వాదన 3: అడ్డంగా దొరికిపోయినతరువాత కూడా వెధవకబుర్లు. పీఠభూముల్లో కూడా నదీజలాలొస్తే బంగారం పండిచ్చొచ్చని మీదేడ్ దమాక్కు తెలవకపోతె తెలుసుకోండి.

దేడ్ దమాక్ వాదన 4: మల్లీ అదే అతితెలివి.దేడ్‌దమాక్కు తెలియని విషయం క్రిష్ణా నది చాలా ఎత్తులో ప్రవహిస్తుందని, దానికి టోపాలజీ సమస్య లేదని. అయినా ఊరుకోదు కదా, తెలియని విషయాలపై కూడా జడ్జ్‌మెంట్లు.

గోదావరిలో కొన్నిచోట్ల టోపాలజీ సమస్య ఉన్నా అన్నిప్రాంతాలకూ వనరులు అందజెయ్యడం ప్రభుత్వ భాద్యత.. ఇక్కడ పల్లం ఉంది కదా అని ఉన్నచోటే మల్లీ మల్లి నీల్లివ్వరు, లేనిదగ్గర ఇస్తారు. దానికోసం అవసరమయితే లిఫ్టు చేసి కూడా. అది తమ అతితెలివికి ఎక్కదులే.


దేడ్ దమాక్ వాదన 5: ఓహో: ఎ.యం.ఆర్. ప్రాజెక్టు, భీమా కూడా గోదావరిపైనే ఉన్నాయా? మరీ ఇంతగొప్పతెలివితేటలా తమరివి, ఏదో అనుకుని అనవసరంగా సమాధానాలిస్తున్నాను. ఛ, ఎంత కాపీ పేస్టు తెలివి తేటలయితేమాత్రం ఇంతఘోరమా, ఎల్లి మూడో తరగతి సోషల్‌బుక్కు చదువుకోండి, సిగ్గులేకపోతే సరి. మిగతా వాటిలో పేపర్ పైనెన్నున్నయ్, వాస్తవంగ ఉన్నవెన్ని?

దేడ్ దమాక్ వాదన 6: మల్లీ అదే అతితెలివితేటలు ప్రదర్శించి దొరికిపోవడం. తమరు చెప్పిన వాదన మీదగ్గర పారిశ్రామీకరన జరుగుతుంటే మేమేడుస్తున్నామా, అని. ఇప్పుడు దొరికిపొయ్యాక ఇలా ప్లేటు ఫిరాయించడం. సాగునీటిలో మావాటా మాకు కావాలని అడుగుతున్నాం, మీకు కాకుండా మాకు రావాలని మేమనట్లా, దాన్నే ఏడుపు అనే తమరి దురాశ తెలుస్తూనే ఉంది.


దేడ్ దమాక్ వాదన 7,8: అసలు వీటికి ఇంకా సమాధానాలు కావాలా? ఇక్కడ చివరికి కన్‌ఫ్యూషన్ ఏమయినా ఉంటే మీరు అసలు దేడ్ దమాక్‌లా, లేక జీరో దమాక్‌లా అనేదే.

ఇంకా ఈదేడ్‌దమాక్‌లతో వాదన ఇంకా సాగదీసే ఉద్దేషం లేదు, గుడ్‌బై.