Tuesday, 28 June 2011

పోలవరం సత్యాలు -2


కొంతమంది అతితెలివి చూపిస్తూ మీదగ్గర పారిశ్రామికీకరన జరగితే మేం కాదంటున్నామా, మాకు నీల్లెక్కువ వస్తే మీరెందుకు కాదంటారు అని అమాయకంగా అడుగుతారు. పారిశ్రామికీకరన అవసరం లేదు అని ఎవరూ చెప్పరు, కానీ పారిశ్రామీకరణ ఎక్కడ జరిగినా రాష్ట్రంలో అందరికీ అవకాశాలు లభిస్తాయి, ఆ కంపనీల వోనర్లెవరో, జీడీపీ పెరిగితే అది ఎవరి జేబుల్లోకి వెలుతుందో అందర్రికీ తెలిసిందే. అయితే అసలు పోలవరం నిజంగా వారు చెబుతున్నట్టు ఆప్రాంతం వ్యవసాయం కోసమేనా?

పోలవరం ఎవరికోసం?

పోలవరం కుడి కాలువ ద్వారా 1,29,00 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తే ఎడమ కాలువ ద్వారా 1,62,000 హెక్టేర్ల ఆయకట్టు లభిస్తుంది. అయితే ఎడమకాలువ వెల్లే ప్రాంతంలోనే ఇటేవలే తాడిపూడి, పుష్కరం అనే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తిచేశారు. ఇదివరకే ఇదే ప్రాంతంలో చంగల్‌నాడు, తొర్రిగెడ్డ, ఏలేరు లిఫ్ట్ ఇరిగేష్న్లు వాడకంలో ఉన్నాయి. వీటి ద్వారా ఎడమకాలువల ఆయకట్టులో 95% ఇప్పటికే ఉన్న ఆయకట్టు. మిగతా ఐదు శాతం అసలు సాగుభూమి కాదు. ఎడమ కాలువ వెల్లే ప్రాంతంలో కూడా మెజారిటీ ప్రాంతం బావులద్వారా, గొట్టపు బావులద్వారా సాగులో ఉంది. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోలా భూగర్భ జలాలు అడుగంటలేదు కాబట్టి బావులద్వారా వ్యవసాయం బాగానే సాగుతుంది. కుడి, ఎడమ కాలువలు కలిపి 75% ఆయకట్టు ఇప్పటికే ఏదో ఒక రీతిలో ఉన్నదే.

మరి ఇప్పటికే ఆయకట్టు ఉన్న ప్రాంతంలో ఇంతమందిని నిరాశ్రయులను చేస్తూ, రాజమండ్రి నగరాన్ని రిస్కు చేస్తూ ఈప్రాజెక్టు ఎవరికోసం అంటే విశాఖ, కాకినాడలో కొత్తగా రాబోయే పరిశ్రమలకోసం. ఇక్కడ జిండాల్ అల్యూమినియం ప్లాంటుతో పాటు అనేక కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి, వీటికి పెద్దేత్తులో నీరు అవసరం. అంటే పోలవరం అందరూ అనుకునేట్టుగా డెల్తా రైతులకోసం కాదు, విశాఖ, కాకినాడలో పరిశ్రమలకోసం.


కొంతమంది అతితెలివివారికోసం ఇక్కడ ఒక క్లారిఫికేషన్: నాఉద్దేషం కాకినాడ, విశాఖపట్నంలో భారీ పరిశ్రమలు రావొద్దని కాదు. కానీ పరిశ్రమల అవసరంకోసం భారీ నీటిప్రాజెక్టులు ప్రభుత్వం కట్టదు. ఒకవేళ కడితే అది ఇతర తాగు, సాగు నీటి అవసరాలు తీరిన తరువాత. అలా చెబితే అసలు ప్రాజెక్టుకు CWC నుండి అనుమతి కూడా రాదు, అందుకే ఆయకట్టు గురించిన అబద్దాలు. 



ముంపు, నిర్వాసితులు:

పోలవరం ద్వారా 270 గ్రామాల్లో లక్షా ఇరవై వేలమంది నిర్వాసితులవుతారనేవి 2001 జనాభాలెక్కల ఆధారంగా ప్రభుత్వ లెక్కలు. అయితే వాస్తవానికి ఇంకా ఎక్కువ గ్రామాలు మునిగిపోతాయి, అక్కడ గతపదేల్లలో ఇంకా ఎక్కువ జనాభా పెరిగింది అని ఎంజీవోలు చెబుతున్నాయి. వీరి అంచనా ప్రకారం కాలువల తవ్వకం వలన నిర్వాసితులయ్యేవారిని కలుపుకుంటే  మొత్తం నిర్వాసితులు నాలుగు లక్షల మంది వరకూ ఉంటారు. అందులో మెజారిటీ దళితులు, ఆదివాసీలు. లక్ష ఎకరాలు కూడా కొత్తగా ఆయకట్టు తీసుకురాని ఒక ప్రాజెక్టుకోసం నాలుగులక్షలమంది ప్రజలు తమ ఇల్లు, పొలాలు వదులుకుని మరోచోటికి వెల్లాలి.

ఇందులో పావువంతుదాకా ఆయకట్టుకింద వ్యవసాయం చేసుకుంటున్నవారు. అంటే లక్ష ఎకరాల కొత్త ఆయ్కట్టుకోసం 25వేల ఎకరాల ఆయకట్టు భూమిని వదులుకోవాలి. వీరికి పునరావాసంలో మల్లీ ఆయకట్టుకింద భూములు దొరకడం కల్ల. ఆదివాసీలు అడవిపైనే ఆధారపడతారు, వారిని తరలించడమంటే వారి పొట్ట కొట్టడమే.

ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు:

ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో కొంత ఒరిస్సా, చత్తీస్‌ఘర్ లలో కూడా ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాలలో ముంపును తప్పించడానికి మన ప్రభుత్వం చూపించిన పరిష్కారం అక్కడ ఎత్తయిన అడ్డుకట్ట కట్టడం. ఈ అడ్డుగోదల ఖర్చు ప్రాజెక్టు ఖర్చుకు అదనం. అయితే దీనిపై ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం జరగలేదు, వరదలను దృష్టిలో పెట్టుకుంటే ఎంత అడ్డుకట్ట కట్టాలనే దానిలో ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదు.

ఈ ప్రాజెక్టును ఎలాగయినా అడ్డుకోవాలనే సంకల్పంతో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పావులు కదుపుతూ సుప్రీం కోర్టుకు వెల్లాడు. సుప్రీం కోర్టులో కేసు వోడిపోయే అవకాశాలే మనరాష్ట్రానికి ఎక్కువ. అంటే కేసు వోడిపోతే మనం పెట్టే ఖర్చంతా శుద్ద వేష్టు. అంటే ఇప్పుడేదో ఈప్రాజెక్టువల్ల ఉపయోగం ఉందని కాదు గానీ అప్పుడు పూర్తిగా ఆపేయాల్సి వస్తుంది.

ఇన్ని సమస్యలు ఉన్నా ఈప్రాజెక్టు కావాలని అన్ని రాజకీయ పార్టీలూ రోజూ ఉద్యమాలు చేస్తున్నది ఎవరికోసం అంటే కొందరు పారిశ్రామిక వేత్తలు, మరియు ప్రాజెక్టు వస్తే తాము మూడో పంటకూడా వేసుకోవచ్చునేమో నని ఆశపడే కొందరు ధనికులు.

ఇందులో ఉన్న పర్యావరణ సమస్యలు, విజయవాడ, రాజమండ్రికి వరద ప్రమాదాలగురించి మరో టపాలో.

Ref: http://www.downtoearth.org.in/content/why-polavaram-pointless-project
http://www.bannedthought.net/India/PeoplesTruth/PeoplesTruth02-200807.pdf

16 comments:

  1. "రాజమండ్రి నగరాన్ని రిస్కు చేస్తూ..." "విజయవాడ, రాజమండ్రికి వరద ప్రమాదాలగురించి.."
    మా ప్రాంతం గురించి మీరేమీ బెంగపడనవసరం లేదు. మా ప్రాంతం గురించి మేము చూసుకొంటాం. మీ ప్రాంతంగురించి మీరు చూసుకోండి

    ReplyDelete
  2. @ఇంద్రసేనా,
    అసలు నేను ఆంధ్రజ్యొతి చదవలేదు, నేను చూసినవన్ని national environment related magazines. ఆబొమ్మ మాత్రం ఆంధ్రజ్యొతి లోనిది.

    ReplyDelete
  3. @ఆంధ్రుడు

    మాకు మీఅంత సంకుచిత మనస్సు లేదు లెండి. ఒకరికి చెందకుండా అన్నీ మాకే కావాలి అనే దురాశ మాకు లేదు, పక్కవాడికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోము. మీప్రాంతంలో సోంపేటల, కాకరాపల్లి లాంటి ఉద్యమాలు జరిగినప్పుడు కూడా స్పందించిది తెలంగాణవారే అని తెలుసుకోండి. రిస్కు ఎవరికయినా రిస్కే. మీప్రాంత నాయకులు మిమ్మల్ని మోసం చేస్తుంటే అదే నిజమని మీరనుకుని మాతో కోట్లాడితే నిజం చెప్పాల్సిన భాద్యత మామీద ఉంది.

    ReplyDelete
  4. ఇంద్రసేనా గారు,

    మీకోసం రెఫరెన్సులు కూడా అప్‌డేట్ చేశాను. మీరు మీ అభిప్రాయాన్ని టపాద్వారా రాస్తానంటే అందుకు స్వాగతం, అయితే కొంతమంది మూర్ఖుల్లా చేతికొచ్చిన అంకెలేసి ముంపు 4500 ఎకరాలని తేల్చకుండా కాస్త శాస్త్రీయమైన వాదన చేస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  5. ఆంధ్రుడు గారు,

    మరో మాట, విడిపోయి మీప్రాంతం బాగు మీరు చూసుకోండి, మాప్రాంతం బాగు మేం చూసుకుంతాం అంటే మోకాలడ్డం పెడతారు. ప్రస్తుతం కలిసే ఉన్నాం, కలిసి ఉన్నప్పుడు అన్ని ప్రాంతాల బాగు చూసుకోవాలి, ఎక్కడ ప్రాజెక్టు కడితే ఎక్కువ లాభం కలుగుతుంది అనేది చూసుకోవాలి. మీప్రాంత నాయకుల్లాగా మీరు కూడా సంకుచిత ధోరణితో ఆలోచించడం కాస్త తగ్గించండి.

    ReplyDelete
  6. @దేడ్‌దమాక్

    నువ్వు దేడ్‌దమాక్‌వని తెలుసుగానీ మరీ ఇంత పెద్ద మూర్ఖుడివని ఇంకా తెలుసుకోలేకపొయ్యాను. వెల్లి ప్రభుత్వ పెద్దలను Central Water COmission దగ్గర నువ్విప్పుడు ఒప్పుకున్నట్టే ఈప్రాజెక్టువల్ల కొత్త ఆయకట్టులేదు, పరిశ్రమల కోసమే, దానికోసమే నాలుగు లక్షల ప్రజలను నిర్వాసితులను చేస్తున్నాం అని చెప్పి పరిమిషన్ తెచ్చుకోమను. పరిశ్రమలకోసమే పక్కన తాగునీరు, సాగునీరు లేక ఎండిపోతున్న ప్రాంతాలకు అవసరమయిన ప్రాజెక్టులను కాదని దీనికి జాతీయహోదాకోసం అప్లై చేస్తున్నామని చెప్పమను. సిగ్గులేకపోతేసరి.

    ఇంతకూ ముంపు నాలుగువేల ఎకరాలని ఎలాతేల్చావో చెప్పు. మిగతా లెక్కల్లో ఇంకెన్ని తప్పులున్నాయో, మచ్చుకు ఒక్కటి అడిగా, సమాధానం లేదు. ప్రాణహిత ఖర్చు నలభై వేలకోట్లని ఎవడు చెప్పాడు? మూడోతరగతి పుస్తకాల తెలివితేటలు లేనివాడు కూడా కబుర్లు చెప్పేవాడే.

    ReplyDelete
  7. కొంతమంది అతితెలివివారికోసం ఇక్కడ ఒక క్లారిఫికేషన్: నాఉద్దేషం కాకినాడ, విశాఖపట్నంలో భారీ పరిశ్రమలు రావొద్దని కాదు. కానీ పరిశ్రమల అవసరంకోసం భారీ నీటిప్రాజెక్టులు ప్రభుత్వం కట్టదు. ఒకవేళ కడితే అది ఇతర తాగు, సాగు నీటి అవసరాలు తీరిన తరువాత. అలా చెబితే అసలు ప్రాజెక్టుకు CWC నుండి అనుమతి కూడా రాదు, అందుకే ఆయకట్టు గురించిన అబద్దాలు.

    ReplyDelete
  8. ప్రాజెక్టుల నిర్మాణం priorities ఇలా ఉంటాయి.

    1. త్రాగునీరు
    2. సాగునీరు
    3. పరిశ్రమలు

    మొదటి రెండో ప్రాధమ్యతలు చూడకుండా మూడోది కావాలనడం, ఒక పక్క ప్రజలు త్రాగే నీరు లేక అలమటిస్తున్నా, అది వదిలేసి ఇంకొపక్క మూడో కారుకు నీరు కావాలనడం బహుశా సమెక్కుడు వాదానికి మూల సూత్రాలేమో!

    ReplyDelete
  9. ఇంద్రసేనా గారు,

    మీ టపా చూశాను.

    1. మీరిచ్చిన లెక్కల్లోనే నిర్వాసితులు 27, 998 కుటుంబాలు. సగటున కుటుంబానికి అయిదుగురు చొప్పున లెక్కేసుకోండి. ఇంతకూ మీరిచ్చిన ఫిగర్లు 2001 జనాభా లెక్కలు. 2011 జనాభా లెక్కల్లో ఇంకా పెరిగారు. కాలువల ముంపు లెక్కలోకి తీసుకోలేదు. పైగా ముంపుకు ప్రభుత్వ లెక్కలు చాలా తక్కువ చూపించాయి.

    2. 7,21,000 ఎకరాల ఆయకట్టులో ఇప్పటికే ఉన్న ఆయకట్ట్ ఎంత?తాడిపూడి, పుష్కరంలిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు , ఇదివరకే ఇదే ప్రాంతంలో చంగల్‌నాడు, తొర్రిగెడ్డ, ఏలేరు లిఫ్ట్ ఇరిగేష్న్లు ఎక్కడ సాగునీరు ఇస్తున్నాయి, పోలవరం కుడి కాలువ ఎక్కడ నీల్లిస్తుంది? విశాఖలో మెట్టప్రాంతాలు ఉన్నాయి, కానీ అక్కడ ఎడమకాలువ కింద ఉన్న ప్రాంతంలో బావులద్వారా సాగునీరు అందుతుంది, భూగర్భ జలాలు పైనే ఉన్నాయి. నీల్లు అసలు లేని దగ్గర ఇవ్వాలా, ఉన్నదగ్గరే కాలువలు కావాలా?

    3. ముంపుకు సంబంధించి రెఫరెన్సు ఇస్తారా? అది హెక్టేర్లా, లేక ఎకరాలా? అదీ ప్రభుత్వ లెక్కలు తప్పు కాదనుకుంటే. ఆయకట్టు లెక్కలు తప్పు ఇచ్చినవారు ముంపు లెక్కలు తప్పు ఇవ్వరా?

    4. >>>ఇది పచ్చి అబద్దం. గోదావరి,కృష్ణ, విశాఖ జిల్లాలో మెట్ట ప్రాంత భూముల కోసం డిజైన్ చెయ్యబడింది ఈ ప్రాజెక్ట్.
    మీరు ఆకట్టుకు సంబంధించిన సరి అయిన లెక్కలు, ఇంతకుముందే ప్రాజెక్టులు నీల్లు అందిస్తున్న ప్రాంతాల వివరాలు ఇవ్వకుండా ఇలా క్లెయిం చెయ్యలేరు.

    5. >>> నాగార్జున సాగర్ తెగితే పల్నాడు పోతుంది.హుస్సేన్ సాగర్ తెగితే హైదరాబాద్ మునుగుతుంది.
    నాగ్రార్జునసాగర్ దగ్గర డాం కట్టడానికి అనువయిన ప్రాంతం ఉంది, నాగార్జున సాగర్ కట్టేప్పుడు వరద ముంపు లెక్కలు తీసుకున్నారు. పోలవరంకు ఇది సరిగాలేదని చెప్పింది నేను కాదు, ప్రఖ్యాత ఆంధ్రా ఇరిగేషన్ ఎక్స్పర్టు కే.ఎల్. రావు, హనుమంతరావులూ.

    ReplyDelete
  10. >>>కృష్ణ డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, నాగర్జున సాగర్ నుండి నీటి విడుదల తగ్గించి శ్రీశైలం ద్వారా రాయలసీమ, తెలంగాణా ప్రాజెక్ట్ లకి నికర జలాలు అందించ గలదు.

    1. తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాల వాటా ఉంది, లేనిది ప్రాజెక్టులు!! ప్రాజెక్టులకు మోక్షం రాకుండా నికరజలాలను ఎలా అందిస్తారు?
    2. రాయలసీమ క్రిష్ణా బేసిన్లో లేదు కాబట్టి రాయలసీమ ప్రాజెక్టులకు నికరజలాల వాటా ఉండదు. అన్ని ప్రాజెక్టులూ మిగులు జలాల ఆధారంగానే కట్టారు. మరి నికర జలాల వాటా ఎలా ఇస్తారు?

    ReplyDelete
  11. ఒక్కో ఎక్స్పర్టు ఒక్కోటి చెబుతాడు, మీరు మాత్రం వై.ఎస్. రాజశేఖర రెడ్డి చెప్పింది తప్ప వేరే ఎవరు చెప్పిందీ వననంటే ఎట్లా? ధవళేస్వరం, ప్రకాశం బ్యారేజీ మొత్తం ప్రాంతాలకు నీల్లివ్వదని నాకూ తెలుసు. నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, అందులో మొదటి రెండూ ఈమధ్యే పూర్తి చేశారు, వాటి కాలువలు పోలవరం కుడికాలువకు సమాంతరంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం, తెలంగాణ విషయం వచ్చేవరకూ అమ్మో లిఫ్ట్ ఇరిగేషనా అని తలలు బాదుకునే వారు సీమాంధ్రలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి మాట్లాడరు.

    ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు తెచ్చుకుందని అంతా (తెలంగాణవారు కాదు, మీవారు, బయటి వారు) చెబుతుంటే మీరు మాత్రం ప్రభుత్వ రిపోర్టునే చూపిస్తే ఏం లాభం?

    //ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఒక్కొక్క లెక్క ఇస్తాడు. హనుమంత రావు గారు చెప్పింది ఏమీ వేదం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏమీ జరగదు.
    ఇలాగే ఇంజనీరింగ్ డెసిషన్లను రాజకీయ నాయకులు ప్రభావితం చేయడం వలన 2008 వరదల్లో కర్నూలు మునిగిపొయ్యిందని మీరు కాస్త గమనించాలి. జాగ్రత్తలు తీసుకున్నామనే ప్రభుత్వం ఎప్పుడూ చెబుతంది, కానీ తీసుకోదు.

    K.L.Rao నాగార్జునసాగర్ ఎడమకాలువ అలైన్మెంటు మార్చి తెలంగానలో మూడులక్షల ఎకరాల ఆయకట్టు తగ్గించి దాన్ని తీసుకెల్లి ఆంధ్ర ప్రాంతంలో పెట్టిన పెద్దమనిషి. ఆయన కూడా సీమాంధ్రాకు వ్యతిరేకంగా చెబుతాడని మీరనుకుంటున్నారా?

    ReplyDelete
  12. >>3 ) కొన్ని పక్షి జాతులకి దెబ్బ.
    మనుషుల ప్రాణాల కన్నా పిట్టల ప్రాణాలు ఎక్కువనా?

    ఇక్కడేం మనుషుల ప్రాణాలు ప్రాజెక్టులేకపోతే పోవడం లేదే, అంత ఎక్జాగరేషన్ అవసరమా? పైగా ప్రాజెక్టువల్ల నిర్వాసితులైన ఆదివాసీల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడొచ్చు. ప్రాణాలు పోతుంది తెలంగాణ జిల్లాల్లో. అక్కడేమో ముప్పై ఏల్లుగా ఒక SLBC, SRS-II పూర్తికాక మనుషులు ఫ్లోరైడ్ వల్ల చస్తున్నారు. అక్కడలేని జాతీయహోదాలు ఇక్కడ ఆయకట్టు స్థిరీకరణకోసం అవసరమా?

    మీరు ఇది చాలా రెలీఫ్ పాకేజీ అని చెప్పిన పాకేజీ పేపర్ వరకే, వాస్తవానికి మనప్రభుత్వం ఎన్నడూ రిలీఫ్ పాకేజీ సరిగా ఇచ్చిన పాపాన పోలేదు. అందులో కొందరు ఆయకట్టు కింద భూములు కూడా కోల్పోతున్నారు. ఇదంతా కేవలం ఉన్న ఆయకట్టు స్థిరీకరనకోసం అవసరమా?

    ReplyDelete
  13. ఇంద్రసేనా గారు,

    ఇప్పుడు కేంద్రం పోలవరం,ప్రాణహిత రెండింట్లో ఒకదాన్నే దత్తత తీసుకుంటా నంటుంది. ఆ పరిస్థితిలో మీరు దేనికి ప్రాముఖ్యత ఇస్తారు?

    ReplyDelete
  14. ఇంద్రసేనా,

    మీ పీపీటీ చూశాను.

    1. మీరు ముంపు 28 వేల ఎకరాలు అని చెప్పింది కేవలం ప్రాజెక్టు (డాము) వలన జరిగే ముంపు. ఇందులో డాం, హెడ్, ఎడమ కాలువ, కుడి కాలువల ముంపు వివరాలు ఇచ్చారు, రిజర్వాయర్ లెవెల్ పెరగడం వలన వచ్చే ముంపు ఎకరాల వివరాలు లెవ్వు. ఎందుకంటే ఇప్పుడే దాని సేకరణ టెందర్లలో భాగం కాదు.

    2. 270 గ్రామాలు, వాటిని ఆనుకుని ఉన్న ప్రాంతాలు అన్నీ కలిసి 28 వేల ఎకరాలేనని మీఅభిప్రాయమా?

    3. ఇది ప్రభుత్వ అధికారిక వాదన. ప్రభుత్వం వారు అనుమతికోసం తప్పుడు లెక్కలు ఇచ్చారన్నదే విమర్శకులు చెబుతున్నది, కనుక ప్రభుత్వం చూపించిన ఆయకట్టు కొత్త ఆయకట్‌గా మీరు భావిస్తే అది పొరపాటు. 7,20,000 ఎకరాల ఆయకట్‌లో కేవలం ప్రకాశం బారేజీ ద్వారా సాగులో ఉన్నది రెండు లక్షల ఎకరాలు.

    ReplyDelete
  15. శ్రీకాంత్ అడిగింది అర్ధం ళేని ప్రశ్నకాదు, అర్ధవంతమయిన ప్రశ్న. రెండింటిలో ఏదో ఒక్కదానికే జాతీయ హోదా లభిస్తుంది. అసలు కొందరు మేతావులు ప్రాణహిత అక్కరలేదని వాదిస్తున్నారు. మీరు మీవోటు ప్రాణహితకే అని చెప్పినందుకు ధన్యవాదాలు.

    నాకు తెలిసి పోలవరం లేకపోతే ప్రాణహిత-చేవెల్ల బదులుగా గోదావరి జలాలను తెలంగాణకు ఇచ్చాపురం నుండే తరలించవచ్చు. అప్పుడు ఖర్చు సగానికి పైగా తగ్గుతుంది. ప్రస్తుతానికి నాదగ్గర వివరాలు లేవు. అంటే ప్రాణహిత ఖర్చులో సగం ఖర్చు పోలవరం లెక్కలోకే వస్తుంది.

    ఇక తెలంగాణలో ఇతర ప్రాజెక్టులు మీరు వద్దనలేదు. కానీ మనదగ్గర అన్ని ప్రాజెక్టులూ ఒకేసారి కట్టేంత డబ్బు లేదు. అప్పుడు ప్రయారితైజేషన్ అవసరం. ఇప్పటికే మొదలై, అన్ని అనుమతులూ ఉండి, ప్రాజెక్టులు లేకపోవడం వలన తాగు, సాగు నీరులేక ఎండిపోతున్న ప్రాజెక్టులు మనకు ప్రయారిటీనా, లేక నీల్లు ఉన్న ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరనకోసం చేసే ప్రాజెక్టు ప్రయారిటీనా అనేది ఇక్కడ ముఖ్యం.

    ReplyDelete
  16. @దేడ్ దమాక్

    నీమొహం. నీకు అసలు ఏరివర్ ఎక్కడుందో కూడా తెలుసా, క్రిష్ణా ప్రాజెక్టులు గోదావరిపై పెట్టే పిచ్చి మొహమా? ఎంత పర్సెంటేజీ క్రిష్నా బేసిన్ రాయలసీమలో ఉంది, ఎంత తెలంగానలో ఉందో మల్లోసారి చూసుకో. మొత్తం ఎన్ని ప్రాజెక్టులు అటువైపు వెలుతున్నాయి, అందులో ఎన్ని మిగులు జలాల ఆధారంగా కట్టినవి అనే లెక్కలు కూడా చూసుకో. నీలాగా అన్నీ మా మధ్యకోస్తాకే రావాలనే సంకుచిత మనస్కులం మేంకాదు. రేపు విడిపోతే నీసంకుచిత బుద్ది రాయలసీమకేమీ దక్కనీయదని తెలిసి వాల్లు కూడా విడిపోతే తెలంగాణతో కలిసి ఉంటామంటున్నారు. అసలు శ్రీబాగ్ ఒప్పందం వల్ల మేము నష్టపొయ్యామని రాసుకున్నప్పుడు ఎక్కడపోయింది ఈబుద్ది? పదే పదే నీమూర్ఖత్వాన్ని బయట పెట్టుకోకు.

    నీకుల్లు వాదనకు ఒక సాంపుల్:
    పక్కప్రాంతంలోనయితే: అసలు చమ్మతో కూడా బంగారం పండించొచ్చు. అదే మన ప్రాంతంలో నయితే: అసలు ఎవరు చెప్పారండీ వ్యవసాయం లాభదాయకమని? ఎన్ని కాలువలు డెల్టాకొచ్చినా వ్యవసాయం లాభదాయకం కానే కాదు.

    ReplyDelete

Your comment will be published after the approval.