Wednesday, 29 June 2011

సీమాంధ్ర ఎంపీల వ్యాపారాలు, పార్లమెంటులో ప్రశ్నలు


తెలంగాణవాదులు నిధులపంపిణీలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురయింది అని చెప్పగానే సీమాంధ్రవాదులు అందుకునే వాదన మీ ఎమ్మెల్యేలూ, మంత్రులూ అంతా ఏం చేస్తున్నారు? మీనాయకులు చేతకానివారయితే దానికి ప్రభుత్వమేం చేస్తుందీ అని. నాయకులు ఎవరైనా సొంతలాభాలే చూసుకుంటారు, మీప్రాంతానికి నిధులు అందడానికి మీనాయకుల గొప్పతనం కారనం కాదు, కేవలం నిధుల పమిపిణీని నిర్ణయించే ముఖ్యమంత్రి మీవాడు కావడం వలన, మందబలం ఉండడం వలన అని చెబితే వారికి అర్ధం కాదు.

సరే, ఇంతకూ సీమాంధ్ర నాయకులు ఎంతగొప్పవారు అంటే , వీరిలో అత్యధికులకు చేసేది పార్ట్‌టైం రాజకీయాలు, ఫుల్‌టైం వ్యాపారాలు. మనరాష్ట్రానికి ఎందుకు ఎక్కువ కేంద్రమంత్రిపదవులు దక్కడంలేదని అడిగితే ప్రధాని ఇచ్చిన సమాధానం ఇలా పార్ట్‌టైం  రాజకీయాలు చేసేవారికి మత్రిపదవులు ఇవ్వడం జరగదని.

వీరు వ్యాపారాలు చేసుకుంటే సరే, కానీ అధికారాన్ని వారి వ్యాపార విస్తృతికి వాడుకోవడం సరీయినది కాదు. కానీ అనేకమంది ఆంధ్రా ఎంపీలు తమవ్యాపారలాభాలకోసం తమ పదవులు వాడుకుంటున్నారు. ఆఖరుకు పార్లమెంటులో ప్రజాసమస్యలకోసం వినియోగించాల్సిన ప్రశ్నోత్తరాల సమయం వీరు వ్యాపారాలకోసం వాడుకుంటున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరనలు:

లగడపాటి రాజగోపాల్:

విజయవాడ ఎంపీ అయిన లగడపాటి రాజగోపాల్ లాంకో ఫౌండర్ అన్న విషయం తెలిసిందే. ఈయన పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్న:
“Whether the Central Government proposes to give some concessions to small power units generating 25 MW of power. If so, the details thereof; and if not, the reasons for not giving concessions.”

లాంకో పవర్ ప్రాజెక్టుల వ్యాపారం చేస్తునదనేది తెలిసిందే.


కావూరి సాంబశివరావు:

కావూరి సాంబశివరావు ఏలూరు ఎంపీ అయి ఉండగా ఈయన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపనీ కన్స్ట్రక్షన్, ఇంఫ్రా వ్యాపారాలు చేస్తాడని తెలిసిందే. ఈయన అడిగిన ప్రశ్న:

“Whether the Government proposes to empower the NHAI to extend working capital loans to road developers to help them tie over credit crunch and maintain speedy implementation of road projects.”

రాయపాటి సాంబశివరావు:

గుంటూరు ఎంపీ రాయపాటి జయలష్మి గూపు ఓనరు. ఈయన అనేక ఇతర వ్యాపారాలతోపాటు కన్స్ట్రక్షన్, రోడ్ల వ్యాపారాలు చేస్తాడు. ఈయన అడిగిన ప్రశ్న:

“Whether the NHAI has recently sought comments of various stakeholders on hybrid models to implement highway projects. If so, the details thereof along with the views of the various parties involved.”

నామా నాగేస్వర్:

మధుకాన్ చైర్మన్ నామా ఖమ్మం ఎంపీ. ఖమ్మం తెలంగాణలో భాగమయినప్పటికీ ఇతను ఏవర్గం కొమ్ము గాస్తాడో తెలిసిందే. ఈయన అడిగిన ప్రశ్న:

"Whether the Government proposes to start eight-lane access control express highways. If so, the details thereof along with the locations where the expressways are proposed, state-wise and national highway-wise.”

ఇదండీ, ఈవిధంగా మన ఆంధ్రా ఎంపీలు రాజకీయాలను వ్యాపారానికి వాడుకుంటూ పార్లమెంటులో ప్రజలసమస్యలగురించి చర్చించాల్సిన అమూల్యమయిన సమయాన్ని తమ వ్యాపారాల అవసరాలకోసం ప్రభుత్వ కార్యక్రమాలు ఎలాఉపయోగపడుతాయో తెలుసుకోవడం కోసం వాడుతున్నారు.


5 comments:

 1. That was so pathetic and over-selfishness and must be condemned. Thanks for sharing true face.

  ReplyDelete
 2. I welcome you to criticise them for taking up issues related to personal business. But, here the issues is personal profit. How do you prevent "T-MPs cum businessmen" from doing the same once Telangana is granted? If you can do so in T-state, you can do it now also.
  However there are two follies in your argument..
  1. They must have asked many other people-related questions. You have selectuvely quoted them.
  2. Could you guarantee if MPs supporting Telangana cause have business, they do not ask even a single question related to their business?

  ReplyDelete
 3. andhrudu

  1. Questions that I listed are just examples. There could be many more questions that they asked for their personal benefit. Even if they ask one question in the interest of their personal business, then it is a crime.
  2. Let us discuss about the same MPs are getting benefited by being MPs in a large state like Andhra pradesh in my next post.

  ReplyDelete
 4. నేను ఆంధ్రా వాడిని.మీరు పైన రాసిన లిస్ట్ లో ని వ్యక్తులందరు ఒకరిని మించి ఒకరు పనికి మాలినవాళ్ళు. ఈ కావురి సాంబశివరావు పార్లమేంట్ కు ఎన్నో సార్లు ఎన్నికయ్యాడు. కాని ఎప్పుడు నోరు పెద్దగా మెదపినట్లు ఉండడు. కాని తెలంగాణా విషయం లో మాతం పెద్ద పుడింగిలా నోరు మెదిపాడు.ఇతను మొదటి నుంచి శరద్ పవార్ వర్గం. ఇక లగడపాటి గారు విషయానికి వస్తే విజయవాడ లో నిరాహార దీక్ష చేస్తున్న యం పి ఎమీటీ, అక్కడ నుంచి తప్పించుకొని వెళ్లి పరిగెత్తుకొంట్టూ నింస్ లో కి పోయి అడ్మిట్ కావటమేమిటి? అతనికి ఎమైనా బాధ్యత ఉందా? ఇదేమైనా సినేమానా?

  JayahO

  ReplyDelete
 5. very well written. hats off to you

  ReplyDelete

Your comment will be published after the approval.