Monday, 27 June 2011

ఆంధ్రా అక్టోపస్ అసలు స్వరూపం


గడచిన ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలతరువాత అక్టోపస్ గురించి వినని వారుండరు. అక్టోపస్ సముద్రం అడుగున ఉంటుంది,   ఎనిమిది కాల్లతో తన ఎరను బంధించి రక్తం పీల్చి చంపేస్తుంది, శత్రువు దాడి చేస్తే నల్లని విషాన్ని చిమ్మి తప్పించుకుంటుంది. అప్పుడప్పుడు అక్టోపస్ జాతకాలు కూడా చెబుతుంది. ఆంధ్రా అక్టోపస్  కూడా ఇవన్నీ చేస్తుంది. అధికారయంత్రాంగంలో తనకున్న బలంతో పేదలరక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంది, గిట్టని తెలంగాణవాదంపై విషం చిమ్ముతుంది, ఎలక్షన్లపై జాతకాలూ చెబుతుంది. దీనిపేరే లగడపాటి.


ఆంధ్రా అక్టోపస్‌కు చెందిన లాంకో కంపనీ ప్రభుత్వం నుండి 108 ఎకరాల భూమిని పొందింది. అయితే ఇది వక్ఫ్ భూమి అని తరువాత తేలింది. వక్ఫ్ భూములను అమ్మే అధికారం ఎవరికీ లేదు. హైకోర్టు స్టే ఇచ్చినా అక్టోపస్ తన అధికారాన్ని ఉపయోగించి మాయచేసి లాంకోహిల్స్‌ను పూర్తి చేశాడు. ఐటీపార్కు కోసం ప్రభుత్వం దగ్గర కొట్టేసిన భూమిలో కనీసం పావు వంతు కూడా ఐటీ పార్కు కట్టకుండా అంతా కమర్షియల్ ఫ్లాటులు కట్టిన అక్టోపస్ భూమికి ఆనుకుని ఉన్న కుంటలూ, గుట్టలూ, ఆఖరుకు స్మశానం, గుడి కూడా వదలకుండా కలిపేసుకున్నాడు. అయితే పాపం రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంతో లాంకోహిల్స్ ఇప్పుడు దివాళా తీసింది. తెలంగాణ వస్తే ఇంకా రియల్ ఎస్టేట్ పడిపోయే ప్రమాదం ఉండడంతో పాటు వక్ఫ్‌భూములపై, ఆక్రమణలపై విచారన జరిగే అవకాశం కూడా ఉండడంతో ఈఅక్టోపస్ తెలంగాణ ఎలాగైనా ఆపాలని కంకణం కట్టుకుంది.

ఆంధ్రా అక్టోపస్‌కు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు. అయితే ఎలక్షన్ అఫిడవిట్‌లో మూడో సంతానం గురించిని దాసిన విషయంపై విచారణ నడుస్తుంది. ఇంకా ఆంధ్రా అక్టోపస్ హవాళా కుంభకోణంలోనూ, ఇన్సూరన్సు కుంభకోణంలోనూ కూడా భాగం ఉన్నట్టు తెలుస్తోంది. ఈఅక్టోపస్‌కు చెందిన లాంకో ఇంఫ్రా ఈక్కడెక్కడైతే పవర్ ప్లాంటులు కడుతుందో అక్కడ అన్ని చోట్లా ఆయా రాష్ట్రప్రభుత్వాలతో కోర్టు కేసులు ఎదుర్కుంటోంది.

4 comments:

  1. 2004 ముందు లగడపాటి ప్రత్యేక తెలంగాణాని సమర్థించాడు. అప్పట్లో అతనికి రియల్ ఎస్టేట్స్ ప్రోజెక్ట్ లేదు. లాంకో థర్మల్ పవర్ స్టేషన్ అతనికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది.

    ReplyDelete
  2. $విశ్వరూప్ గారు

    #అధికారయంత్రాంగంలో తనకున్న బలంతో పేదలరక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుంది, గిట్టని తెలంగాణవాదంపై విషం చిమ్ముతుంది, ఎలక్షన్లపై జాతకాలూ చెబుతుంది. దీనిపేరే లగడపాటి.

    సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో మీకు మీరే సాటి :). ప్రవీణ్ అన్యా చెప్పింది నిజం. కేవలం కుత్సిత వ్యాపారావసరాలకోసం మనసులో లేని సమైక్యతను నటించడం వీరి వంతైతే ఇక కులాన్ని బట్టి గుడ్డిగా మద్దితిచ్చే కులభుజంగాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. 'ఈ శాస్త్రంలో పట్టా - ఆ శాస్త్రంలో పచ్చడి' అని పదే పదే డోప్పాలు కొట్టుకోవడంమే కానీ అసలైన సామాజిక 'సామాన్య' శాస్త్రాన్ని చదవరు..గజ్జినుంచి బయటపడి చదవలేరూ:(. "పల్లే పల్లెన పల్లేర్లు మొలిసే తెలంగాణలోన..మన పంట సేలలోన" అని తమ పంటికింద బాధను చెప్పిన సామాజిక సూక్తికారుడి మాటలు ఈ ఆక్టోపాస్ వారి తైనాతీలు కొద్దిగా సామాన్యుల గురించి ఆలోచిస్తే జాతికి మంచిది.

    ReplyDelete
  3. హైదరాబాద్‌లో ల్యాంకో హిల్స్ అన్న ఒక మెగా ప్రాజెక్టు వీళ్ళది ఉంది. తెలంగాణా ఉద్యమంతో అది అటకెక్కింది. వేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టు భవిష్యత్ ఇప్పుడు తెలంగాణా వస్తే మటాషే.

    ReplyDelete

Your comment will be published after the approval.