కొంతమందికి బుద్ధి సరిగా వికసించకపోవడం వలన చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. అలాంటివారు వాస్తవాలను అంగీకరించక ఎప్పుడూ మేమేం చేస్తే అదే రైటు, ఎదుటివారేం చేసినా అది తప్పే అని వాదిస్తుంటారు. ఆశ్చర్యం ఏమిటంటే అలాంటివారంతా సీమాంధ్రా ఎంపీలుగానూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులుగానూ పదవులు వెలగబెట్టడం. వీరికి దన్నుగా ఉండే వర్గం వారు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తుంటారు.
వీరికి తమ ప్రత్యర్ధి వర్గాన్ని ఒక విషయంపై వెక్కిరించేప్పుడు అరే, తాముకూడా ముందు ఇలాంటి పనే చేశాం అని అస్సలు స్ఫురించదు, ఒకవేళ ఎవరైనా గుర్తు చేసినా పట్టించుకోరు. అలాగే తాము ఏదైనా చర్యను సమర్ధించుకునేప్పుడు ఇంతకంటే చిన్నవిషయంపైనే ఎదుటివారు చేసినపుడు తాము తిట్టిపోసిన విషయాలూ గుర్తుకురావు.
ఉదాహరణకు:
- తాము తమిళులు తమ ఉద్యోగాలూ, నీళ్ళూ దోచుకుంటున్నారని ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడితే అదో పెద్ద గొప్ప విషయం. సరిగ్గా అదే డిమాండ్లతో తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం కోరితే అది తప్పు.
- తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే అదో మహా పాతకం, దేశసమగ్రతకు ముప్పు. తాము కేంద్రాన్ని ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తే అది మాత్రం ఒప్పు.
- రాష్ట్రంలో తెలంగాణబిల్లును తిరస్కరించే తీర్మానాన్ని అజెండాలో లేకుండా, సభ ఆర్డర్లో లేకుండా ఉండగా ముప్పై సెకన్లలో చదివి గెలిపించుకుంటే ఒప్పు. పైగా ఇది "unchallanged vote" అని ముఖ్యమంత్రి సమర్ధించుకోవచ్చు. అదే కేంద్రం అజెండాలో చేర్చకుండా బిల్లు ప్రవేశపెడితేనే అది పెద్ద తప్పు.
- తెలంగాణవారు తాము ఒక మార్చ్ చేసుకుంటానంటే అనుమతించక నిర్భందాలూ విధిస్తే కడుపుమండి నాలుగు విగ్రహాలు కూలదోస్తే అది మహాపాతకం. అదే తమ ఉద్యమాల్లో జాతీయనేతల విగ్రహాలను తీరుబడిగా కూలదోస్తుంటే ఒప్పు. అంబేద్కర్ విగ్రహాలను పధకం ప్రకారం కూలదోస్తే ఒప్పు.
- తెలంగాణ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే అదో మహానేరం. అదే తమ ఎంపీలు వీధిరౌడీల్లా ప్రవర్తించి తోటి సభ్యులపై పెప్పర్ స్ప్రే చల్లితే అది ఒప్పు. వీడియోల్లో స్పష్టంగా గాలిలోకి విచక్షణారహితంగా స్ప్రే చేస్తున్నట్లూ, స్పీకర్ పై కూడా స్ప్రే చేసినట్లూ తెలుస్తున్నా కేవలం ఆత్మ రక్షణ అని వాదిస్తారు.
ఇంకొన్ని
* అసెంబ్లీలో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలి, కాని పార్లమెంటులో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోకూడదు.
* అసెంబ్లీ ఆవరణలో ఒక ఎంఎల్ఏ పై ఒక అనామకుడు చెయ్యి చేసుకుంటే ప్రజాస్వామ్యం ఖుని అవుతుంది, కాని సాక్షాత్తు అసెంబ్లీలోనే ఒక ఎంఎల్ఏ ఇంకో ఎంఎల్ఏపై దాడి చేస్తే ప్రజా స్వామ్యం ఉద్దరించబడుతుంది (http://www.youtube.com/watch?v=TO_QaM7PzRQ)
* తెలంగాణా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెసువారు దేశ ద్రోహులు, కాని తెలంగాణా ఏర్పాటు చేస్తాం అని మాట ఇచ్చి ఆ మాట తప్పిన బాబు, చిరు, జగన్ లాంటి వారు దేశం ముద్దు బిడ్డలు.
* - సినీనటి శ్రీయను కొందరు అడ్డుకుని "జైతెలంగాణ" అని అనమని బలవంతపెడితే మొత్తం తెలంగాణవాదులందరూ దానికి భాద్యత వహించాలి. అదే నటి తమన్నాను కొట్టినంతపని చేసి "జైసమైక్యాంధ్ర" అనమని బలవంతపెడితే ఎక్కడి దొంగలు అక్కడ గప్‌చుప్.
-- అదుర్స్ సినిమాను నడపకుండా అడ్డుకుంటామనిచెబితే వారు సంఘవ్యతిరేకులు. అదే రాంచరణ్ సినిమా తూఫాన్, మరో అల్లు అర్జున్ సిన్మా విడుదల కానీయకపోతే అది ఒప్పు.
- తెలంగాణలో సకలజనుల సమ్మె చేస్తే అది విద్యార్థుల చదువులు ఖరాబు చేస్తుంది అని గగ్గోలు ( అందులో సగం దినాలు దసరా సెలవులే అయినా). అదే ఆంధ్రాలో వరసపెట్టి బందులు చేసినా, ప్రభుత్వ పాఠశాలలు నెలలతరబడి నడపక, ప్రైవేటు స్కూళ్ళు మాత్రం నడిపినా అది తప్పుకాదు.
మీరు సామాన్యులు కాదురాబాబూ. లగడపాటికి తక్కువ, అశొక్‌బాబుకు ఎక్కువ.

