Sunday 10 July 2011

వెక్కిరిస్తూనే కాపీకొడతారు

తెలంగాణ ఉద్యమకారులు ఏం చేసినా సమైక్యవాదులు వెక్కిరిస్తారు. కానీ అలా వెక్కిరించిన మనుషులే తిరిగి అవే పనులను కాపీకొడతారు. ఇక్కడ ఒక విద్యార్థి జాక్ ఉంటే అక్కడా ఒక విద్యార్థి జాక్ వెలుస్తుంది. ఇక్కడ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ జాక్ చైర్మన్‌గా వ్యవహరిస్తే అక్కడ కూడా ప్రొఫెసరునే జాక్ చైర్మన్‌గా పెట్టుకుంటారు. అయినా తిరిగి ఇక్కడ ఉద్యమాలు చేసే విద్యార్థులనూ, ప్రొఫెసర్లనూ వెక్కిరిస్తూనే ఉంటారు.

ఇక్కడ ఉద్యమకారులు తెలంగాణ కలాకారుల ఆటాపాటలతో హోరెత్తిస్తుంటే అక్కడ వారి ఉద్యమానికి పాడుకోవడానికి పాటలు లేక లగడపాటి నిరాహారదీక్ష చేస్తుంటే రింగ రింగా పాట పెట్టుకుని గంతులేశారు. చివరికి డబ్బులిచ్చి ఈమధ్యనే గజల్ శ్రీనివాస్‌తో ఏదో పాట రాయించుకున్నారు. ఇక్కడ ఒక మహాఘర్జన పెడితే అక్కడా ఒక సీమాంధ్ర మహాఘర్జన పెట్టే ప్రయత్నం చేస్తారు, కాకపోతే ఆచరణలో వెయ్యిమంది కూడా రాకా అది సీమాంధ్ర మహామ్యావ్‌మ్యావ్ అవుతుందనేది వేరే విషయం. ఇక్కడ విగ్రహాలు కూలగొడితే  అక్కడా విగ్రహాలు కూలగొడుదామని వెదికనట్టున్నారు, అయితే ఎక్కడా తెలంగాణ వారి విగ్రహాలు దొరకక పోవడంతో నోర్మూసుకున్నారు.

తాజాగా తెలంగాణ ఉద్యమకారుల రోడ్డుపై వంటా వార్పు కార్యక్రమాన్ని కూడా కాపీ కొట్టడం ఈమొత్తం కాపీ కార్యక్రమానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. తెలంగాణ ఉద్యమకారులు శాంతియుతంగా నిరశన తెలుపడానికి వినూత్నంగా ఏర్పాటుచేసిన రోడ్డుపై వంటల కార్యక్రమం పూర్తి సక్సెస్ అయ్యింది. అయితే సమైక్యవాదులు మాత్రం అక్కసుతో ఆకార్యక్రమాన్ని కూడా వెక్కిరించారు. కొందరు బ్లాగుల్లో కూడా వెక్కిరించారు. అయితే ఇప్పుడు అదేకార్యక్రమాన్ని కాపీకొట్టి గుంటూరులో  చేశారు. అక్కడ కనీసం ఉద్యమ నేతలకుటుంబాలు కూడా పాల్గొనక అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినా మన పచ్చపత్రిక మాత్రం అది గొప్పగా సక్సెస్ అయ్యిందని వార్త రాసింది.

ఇంతకూ నేను చెప్పేదేమిటంటే సీమాంధ్ర కుహనా సమైక్యవాదులారా, మీకెలాగూ సొంతగా ఆలోచించే తెలివిలేదు, మీవి ఎప్పటికైనా కాపీ బతుకులే.. అయితే ఒకవైపు మీరే వెక్కిరిస్తూ మీరే కాపీ కొడితే అభాసుపాలయేది మీరేనని తెలుసుకోండి.

19 comments:

  1. అంతే కాదు - మనకు ప్రజా గాయకుడు గద్దర్ ఉన్నాడని వాళ్ళూ, లోగడ తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిన వంగపండును కాళ్ళు, గడ్డం పట్టుకొని బ్రతిమాలి,ఇప్పుడు సమైక్యాంధ్రకు మద్దతు పలికించి పాటలు పాడించుకొన్నారు

    ReplyDelete
  2. Telangana ante anta abhimanamunna KCR ki, Hyd lekunda telangana iste teesukuntademo adugu. tanaki kavalasinatlu develop chesukomanu. vintaadaa? vinadu. endukante vaadiki kaalasindee hyd aastule. adi teluskovoy pichchodaa!!

    ReplyDelete
  3. మేము A B C లు చదువుకుంటే వాళ్ళు A B C చదువుతారు అ ఆ లు చదివితే అంద్రోళ్ళు కూడా అదే చదువుతారు
    ఇంకా చెప్పొచ్చు ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళామే అనేసి. ఇక్కడే తెలుస్తుంది logical thinking పెడసరి వాదానికి వ్యత్యాసం.

    ReplyDelete
  4. మంచి విశ్లేషణ. వీళ్ళు గుడ్డిగా తెలంగాణా వాళ్ళు చేపట్టి, విజయవంతం చేసిన కార్యక్రమాలను కాపీ కొడుతున్నారు. కాని తేడా అల్లా తెలంగాణాలో ప్రజల మద్దతు ఉండడం వల్ల అవి విజయవంతం అవుతుంటే, ఆంధ్రాలో అది లేకపోవడం వల్ల ఘోరంగా విఫలమౌతున్నాయి.

    ReplyDelete
  5. సమాజం గురించి ఆలోచించకుండా మెటాఫిజికల్‌గా జీవించేవాళ్ళు భాషా సమైక్యత కోసం రోడ్ల మీద భోజనాలు ఎలా చేస్తారు? సమైక్యాంధ్ర జె.ఎ.సి. నాయకులకే లేని సామాజిక స్పృహ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎందుకు ఉంటుంది?

    ReplyDelete
  6. @కిరణ్

    అసలు లాజికల్ థినింగ్ అంటే అర్ధం కూడా తెలుసా తమకి? ఒకవైపు పెడసరివాదన చేస్తూనే మరొవైపు ఎదుటివారిని పెడసరి వాదన అనడం ఎక్కడి అలవాటో జనాలకు.

    @శ్రీ

    ఒకవైపు పిచ్చి పిచ్చి ప్రేలాపణలు చేస్తూ సంస్కారం లేకుండా ఎదుటివారిని పిచ్చోడా అనే మూర్ఖ కుసంస్కార శిఖామణులకు ఎంత చెప్పినా అర్ధం కాదు. హైదరబాద్ తెలంగాణలో అంతర్భాగం, నువ్వేంటి బోడి హైదరాబాద్ లేకుండా తెలంగాణ తీసుకోమని ఆఫర్ ఇచ్చేది? On the contrary హైదరాబాద్ మీద కన్నేసి సమైక్యత, జాతి, భాష లాంటి దొంగనాటకాలాడే వారి దురాశ హైదరాబాద్ కోసమని తెలిసిందే.

    @శ్రీకాంతాచారి

    వీల్ల కార్యక్రమాలు ఘోరంగా ఫెయిల్ అయినా గొప్పగా సక్సెస్ అయ్యిందంటూ రాయడానికి సీమాంధ్రా మీడియా ఉంది కదా? సీమాంధ్రా జాక్‌లో నలుగురు జనాలు కలిసి ఒక ప్రాటన ఇచ్చినా అది మెయిన్ హెడ్డింగ్ అవుతుంది.

    @ప్రవీణ్

    వీల్ల ఉద్యమమే నాయకులు, మీడీయా ఆడించే నాటకం కదా, ఇదీ అందులో భాగమే.

    ReplyDelete
  7. విశ్వరూప్ గారు,

    ఈ శ్రీ అనే వాడు నా బ్లాగులో కూడా చాలా అసహ్యంగా రాసాడు. ఈ శ్రీ అనే అతనికి సంస్కారం తెలియదు. ఎక్కడనుండి వస్తారో వీళ్ళంతా. వీళ్ళు చాలా వరకు పచ్చ పార్టీ భక్తులు. వారి అసహ్య మయిన మాటల ద్వారా వారి నిజమయిన సంస్కారాన్ని చూపిస్తారు.

    ReplyDelete
  8. ఇంద్రసేనా గారూ, ఇలాంటి వెధవలను బ్లాగుల్లోనుండి తరిమెయ్యాలండి.

    ReplyDelete
  9. "ఇక్కడ విగ్రహాలు కూలగొడితే అక్కడా విగ్రహాలు కూలగొడుదామని వెదికనట్టున్నారు, అయితే ఎక్కడా తెలంగాణ వారి విగ్రహాలు దొరకక పోవడంతో నోర్మూసుకున్నారు"

    Wonderful but just a suggestion to the andheras. Perhaps they can destry Nehru's statues because he called them imperialists :)

    @Anonymous:

    "లోగడ తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిన వంగపండును కాళ్ళు, గడ్డం పట్టుకొని బ్రతిమాలి,ఇప్పుడు సమైక్యాంధ్రకు మద్దతు పలికించి పాటలు పాడించుకొన్నారు"

    Slight correction: Vangapandu is still supporting division of andhera pradesh. The only change in his stand is that he iis now demanding trifurcation with a hefty package for Uttarandhra. His daughter Vangapandu Usha is very active in dhoom dhaam's.

    ReplyDelete
  10. @Sree
    తమ స్వార్థం కోసం - మద్రాసు, కోయంబత్తూరు, తంజావూరులోని తెలుగు వాళ్ళను గాలికి వదిలేసి, ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకొన్నామని ప్రగల్భాలు పలికే సీమాంధ్రుల్లా మేం వెధవలు కాము. హైదరాబాదే కాదు, తెలంగాణలో ఇంచ్ భూమిని కూడా వదులుకోంరా పిచ్చోడా! నడవనీ యుద్ధం... మేం వెయ్యేళ్ళయినా పోరాడుతాం. మమ్మల్ని కాపీ కొడుతూ మీరూ పోరాడండి. నిండా మునిగిన వాళ్ళం ... మాకేం చలి! ఇక మిమ్మల్ని ముంచుతాం - అదే మా "బంపర్ ఆఫర్".

    ReplyDelete
  11. తమిళనాడులో తెలుగు మీడియం స్కూళ్ళు మూసేసి, దుకాణాల మీద తెలుగు బోర్డులు తీసేసి అక్కడి తెలుగువాళ్ళని రెండో తరగతి పౌరులుగా చూసినా మన కుహనా సమైక్యవాదులకి ఏమీ పట్టలేదు. ఇప్పుడు హైదరాబాద్‌ని పొందడమే అసలైన తెలుగు జాతి లక్షణం అంటున్నారు.

    ReplyDelete
  12. @ అనానిమస్

    తంజావూరు, కోయంబత్తూరు సంగతులు వదిలేయండి, ఆంధ్రప్రదేశ్కు ఆనుకుని ఉన్న ఇతర రాష్ట్రాలలోని తెలుగు మాట్లాడే ప్రాంతలను కలుపమని కూడా వీరు ఏనాడూ ఉద్యమాలు చెయ్యలేదు. అప్పుడు కలిసిందీ హైదరాబాద్ కోసమే, ఇప్పుడు సమైక్యత అంటూ నాటకాలాడేదీ హైదరాబాద్ కోసమే.

    ReplyDelete
  13. భాష మిథ్య, సమైక్యత మిథ్య, హైదరాబాద్ మీద వ్యామోహమే నిజం.

    ReplyDelete
  14. $విశ్వరూప్ గారు

    బావుంది..:)) ఈ కాపీ-పేస్టు యవ్వారాన్నీ చూస్తుంటే సమెక్కుడు/పచ్చ వాదుల్లో ఎక్కువమంది సాఫ్టేర్లుగా వెలగబడుతున్నారని అర్ధమవుతుంది. మన బ్లాగుల్లో గుడ్డలు చింపుకుని మరీ సమైక్యమంటూ గీకే వాళ్ళూ ఇదేకోవ... ఈ లెక్కన చూసినా సాఫ్టేరు ఉద్యోగాలు తెలంగాణకు అందకుండాపోయాయని తెలుస్తుంది. మీరు చెప్పింది తర్కసహితం.

    ప్రవీణ్ అన్యా చేసిన వ్యాఖ్యల్లో

    # అక్కడి తెలుగువాళ్ళని రెండో తరగతి పౌరులుగా చూసినా మన కుహనా... హైదరాబాద్‌ని పొందడమే అసలైన తెలుగు జాతి లక్షణం

    #భాష మిథ్య, సమైక్యత మిథ్య, హైదరాబాద్ మీద వ్యామోహమే నిజం.

    నిజవే...ఈ సమెక్కుడు ప్రేమాభిమానాలు... మా తాతగారి స్నేహితుడి చినమామ అల్లుడికి[ఈడిది మా కులమే లెండి;)] హైద్ లో యాపారం ఉందనో లేక మా అయ్యకి స్థిరచరాస్తులు ఉన్నాయనో.. ఇలా ఏదో ఒక సిగ్గులేని, బయటకు చెప్పుకోలేని కారణాన్ని తమవాదానికి మూలంగా పెట్టుకుని పైకి భాష మీదనో ప్రజలమీదనో కరువులో కొట్టుకొచ్చిన కులభుజంగాల్లెక్కన బుసలు కొడుతుంటారు. ఒక పది సంవత్సరాల క్రితపు పచ్చ డ్రామోజీ రాజ్యంలో ఇయన్నీ సరిపోయేయోమో..ఇప్పుడో కాలం మారే..ప్చ్!

    మిథ్య అనే తెలుగుపదం కన్నా ట్రాష్ అనే ఆంగ్లపదమే ఇక్కడబావుంది :)

    ReplyDelete
  15. @praveen

    >>భాష మిథ్య, సమైక్యత మిథ్య, హైదరాబాద్ మీద వ్యామోహమే నిజం>>
    నిప్పులాంటి నిజాన్ని చక్కగా చెప్పారు.

    @రాజేశ్

    సమైక్య రాష్ట్రంలో ఎక్కువబాగుపడింది మధ్యకోస్తా భూస్వామ్య వర్గమే. ఇక్కడ ఏసామాజికవర్గం పెత్తనం ఉంటుందో తెలిసిందే కదా? మొత్తం జనాభాలో ఐదు శాతం కూడా లేని వీరు డబ్బు, అధికారంతో ఇంకింత డబ్బునూ, అధికారాన్ని కొల్లగొడుతూ ఉన్నారు. సమైక్యరాష్ట్రం కావలసింది వీరికోసమే. లగడపాటి, రాయపాటి, మేకాపాటి అంతా ఘనాపాటీలే.

    ReplyDelete
  16. తమిళనాడు జనాభాలో 35% మంది తెలుగువాళ్ళు ఉన్నా వాళ్ళందరూ తెలుగులో తమిళం కలిపి మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలుగు సహజంగా మర్చిపోలేదు, తెలుగు మీడియం స్కూల్‌లో చదువుకునే అవకాశం లేక మర్చిపోయారు. తమిళనాడులో ఉన్న తెలుగువాళ్ళ బాధలు మన కుహనా సమైక్యవాదులకి పట్టవు కానీ హైదరాబాద్ లేకపోతే గుండె ఆగిపోతుందనుకుంటారు.

    ReplyDelete
  17. $విశ్వరూప్ గారు

    వాస్తవం చెప్పారు.సదరు కుల ఘనాపాటీలు వారి తైనాతీ కులభుజంగాలకే సమైక్యమో మరోటో కావాల్సింది..ఇహ వీరి వాదాల/రాతల వెనక ఉన్న కరుడుగట్టిన కులగజ్జి, స్వార్ధం గమనించక పోలో అంటే పోలోమనే గొర్రెలు మిగిలిన మద్దతుదారులు.. సెత్!

    వచ్చేది దొరల తెలంగాణా అట..ఒక పచ్చమేతావి ఉవాచ..! మరిప్పుడు ఉందో బడుగుల ఆంధ్రానా? ఇంకొకాయన ఉద్యమం వల్ల ఒక గర్బిణీకి ఇబ్బంది అయింద౦ట.. నిజవేనే..హస్మీ? ఇంకా ఎన్నిలాంటి పిచ్చికామెడీ మాటలు వినాల్సివస్తుందో..డ్రామోజి నిర్వహణ..సె౦ద్రయ్య డైరెక్షన్లో.. ;)

    ReplyDelete
  18. ఈ శ్రీ అనే అతనికి చారిత్రక సత్యాలే కాదు భౌగోళిక విషయాలపై కూడా ఏమాత్రం అవగాహన ఉన్నట్లు లేదు. ఒకవేళ హైదరాబాదు లేకుండా మాకు తెలంగాణా ఇచ్చేట్లయితే. మీ హైదరాబాదుకు ఎక్కణ్ణించి వచ్చిపోతవు? ఇక్కడికి వచ్చిపోవాలనుకునే ప్రతి కిళ్ళీకోట్టు వ్యాపారికి కూడా హెలీక్యాప్టర్ లేదా విమానం ఎరేంజ్ చేత్సవా ఏం?

    ReplyDelete
  19. You are right. See how Potti Sree Ramulu copied the KCR's so called fast to death.

    ReplyDelete

Your comment will be published after the approval.