వందల సంవత్సరాలు పరాయి పాలనలో మ్రగ్గిపోయిన తెలంగాణ, స్వాతంత్రం వచ్చి ఇన్నాల్లయినా ఇంకా స్వయం పరిపాలనకు నోచుకోలేదు. దేశ చరిత్రలో స్వాతంత్రం కోసం అతిపెద్ద సాయుధ పోరాతం చేసిన తెలంగాణ ప్రజలకు స్వయం పాలన ఇంకా ఒక స్వప్నం గానే మిగిలిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా వివక్షకు గురవుతూ, తమ వనరులు తమకల్లముందే దోపిడీకి గురవుతుంటే తమవనరులపై హక్కు కొరకు చేస్తున్న తెలంగాణ ఉద్యమం ఇప్పుడు అడుగడునా కష్టాలు ఎదుర్కొంటుంది.
ఈబ్లాగు యొక్క ఉద్దేశం తెలంగాణ ఉద్యమంపై ప్రభుత్వం, మీడియా, రాజకీయపార్టీలు చేస్తున్న వంచనను ఎండగట్టి నిజాలను తెలియజేయడం. సీమాంధ్ర ప్రజలపై మాకెలాంటి కోపం లేదు, భాగో అన్నా, దోపిడీ అన్నా అది ఇక్కడి మావనరులను కొల్లగొట్టే కొద్దిమంది దోపిడీ వర్గాన్నే తప్ప సామాన్యుడిని కాదని సీమాంధ్ర ప్రజలకు చెప్పటం.
ధన్యవాదాలు!!
తెలంగాణాని కోటి రతనాల వీణ అని ఎందుకన్నారు?
ReplyDelete