Monday 30 May 2011

తెలంగాణ ఏర్పాటుకు నేనెందుకు వ్యతిరేకం?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎందుకు వ్యతిరేకమో ఒక సగటు సమైక్యవాదికి గల కారణాలు:

1) హైదరాబాదులొ నేను ఇల్లస్థలాలూ, ఫ్లాట్సూ కొనుక్కున్నాను. ఇప్పుడు విడిపోతే నా ప్రాపర్టీ ధరలు పడిపోతే? వామ్మో వాయ్యో... ( అంతా నా స్వార్ధమే... సామాన్య జనం ఎటుపోతే నాకేం).

2) ఇప్పటిదాకా మాకు తేరగా క్రిష్ణా జలాలు వస్తున్నాయి మాకు న్యాయమయిన వాటాలేకపోయినా. ఇప్పుడు మీరాష్ట్రం ఏర్పడితే మరి రాష్ట్రాల మధ్య నీల్లవాటా బోర్డు నిర్ణయిస్తుంది కదా. అప్పుడు ఇప్పటిలాగా మాకు తేరగా నీల్ల రావుకదా ఎలా, అమ్మో?(ఇప్పుడు మాకు దక్కాల్సినదానికంటే ఎక్కువ దక్కుతుందనేది నిజమేననుకోండి).

3) ఇప్పుడంటే APSEBలోనూ, APSRTC లోనూ, అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లలోనూ అన్నిచోట్ల పై అధికారులు మావారే కాబట్టి మావాల్లు మెల్లగ దొడ్డిదారిలో దూరిపోతారు. లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఎలాగూ ఉంది మావారికి ఉద్యోగాలు ఇప్పించడానికి. ఇవన్నీ కాకపోతే దొంగ సర్టిఫికెట్ పెట్టి తెలంగాణ కోటాలో ఉద్యోగం తెచ్చుకోవచ్చు.

రేపు రాష్ట్రం ఏర్పడితే మాప్రాంతంలోని ఉద్యోగాల్లోనే మాలో మేమే పోటీపడాలికదా, ఎలా మరి?

4) ఇప్పుడంటే తెలంగాణ మాతో ఉంది కాబట్టి అందరం కలిసి ఇక్కడ తినేస్తాం కానీ రేపు విడిపోతే మాలో మేమే (సీమ, ఆంధ్రా వాల్లం) మీరు దోచుకుంటున్నారంటే మీరని కొట్టుకుంటాం, అలా మేం కొట్ట్కోవడం అవసరమా?

5) ఇప్పుడంటే తెలంగాణాకు చెందాల్సిన ఫండ్సన్నీ మాకు వచ్చేస్తున్నాయి, విడిపోతే మాప్రాంతంలోని ఆదాయంపై మాత్రమే మేము ఆధారపడాలి, అలా అయితే ఎలా?

6) ఇప్పుడంటే సమైక్య రాష్ట్రంలో మాకులం వాల్లు బలమయిన స్థానంలో ఉన్నారు. అధికారం మాకులానికి లేక ఫలానా కులం వారికే ఎప్పుడూ దక్కుతుంది. రేపు రాష్ట్రాలు విడిపోయి చిన్న రాష్ట్రం అయితే బడుగు వర్గాలు మమ్మల్ని వెనక్కి నెట్టేసి అధికారం చేజిక్కించుకుంటే, అమ్మో ఎలా?

7) మాకు సొంత గుండెకాయ లేదే? ఇంతకుముందు మద్రాసే మాగుండె అనుకున్నాం. అది అందకపొయ్యేసరికి హైదరాబాదే మాగుండె అని ఇప్పుడనుకుంటున్నాం. ఇప్పుడు విడిపోతే మాగుండెకాయ వెతుక్కోవాలి, ఎక్కడుందో ఏమో?

5 comments:

  1. పెద్ద రాష్ట్రమైతే ఎక్కువ నిధులు వస్తాయి. అన్నీ మా ప్రాంతంలోనే వాడుకోవచ్చు.

    పెద్ద రాష్ట్రమైతే ఎక్కువ ఎమ్మెల్యేలు, మత్రులు... వారిలో ఎక్కువ మంది మావారే. ముఖ్యంగా పెద్దరాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ మావాడే!

    పెద్ద రాష్ట్రమైతే ఎక్కువమంది ఎంపీలు, ఎక్కువ కేంద్ర మంత్రులు, అందులో ఎక్కువ మంది మావారే.

    పెద్ద రాష్ట్రమైతే పెద్ద బద్జెటు, ఎక్కువ నిధులు, అన్నీ మాప్రాంతంలోనే వాడుకోవచ్చు.

    పెద్ద రాష్ట్రమైతే పెద్ద బడ్జెటు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు, అవన్నీ మావోళ్ళకే.

    ReplyDelete
  2. కొంతమంది సీమాంధ్రవాదులు ఇక్కడ బండబూతు కామెంట్లు రాస్తూ తమ సంస్కృతిని ప్రదర్శిస్తున్నారు. తమ ఐడెంటిటీని చెప్పుకోవడానికి ఇష్టపడక సహృద్భావ చర్చలో పాల్గొనాలనుకొనే బ్లాగరులకోసం అనానిమస్లను అనుమతించడం జరిగింది. ఈ సౌలభ్యాన్ని దుర్వినియోగం చేస్తూ బూతులు రాసే మానసిక దౌర్బల్యులారా, మీకామెంట్లద్వారా మీరు మీవాదాన్ని బలహీనపరుస్తున్నారని తెలుసుకోండి.

    ReplyDelete
  3. సమైక్యవాదం ఇక్కడ సమైక్యవాద మీడియా చెపుతున్నంత బలంగా లేదు. తెలంగాణా నిజంగా వస్తుందనుకుని వైజాగ్‌లో రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు ధరలు పెంచేసిన రోజులు ఉన్నాయి. చివరికి జన సంచారం తక్కువగా ఉన్న కంబాలకొండ చుట్టు పక్కల ప్రాంతాలలో కూడా రియల్ ఎస్టేట్స్ ధరలు పెంచేశారు. శ్రీకృష్ణ కమిటీ వర్ట్యువల్‌గా తెలంగాణా వ్యతిరేక నివేదిక ఇచ్చింది. ముస్లింలు తెలంగాణాకి వ్యతిరేకం అని నివేదికలో వ్రాసింది. ఒవైసీ కుటుంబం నిజాం నవాబులకి బంధువులు కావడం వల్లే ఒవైసీలు తెలంగాణాని వ్యతిరేకిస్తున్నారనే నిజాన్ని కావాలని దాచి పెట్టింది.

    ReplyDelete
  4. ప్రవీణ్‌శర్మ గారు,

    మీరు ఉత్తరాంధ్రకు చెంది కూడా నిజాయితీగా న్యాయమైన తెలంగాణ డిమాండుకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రజాస్వామికవాదులు నిజమైన ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగినా తమ ప్రాంతాలకు అతీతంగా మద్దతు ఇస్తారు. ప్రతి అంశాన్ని తమ ప్రాంత,కుల,సొంత లాభాలపరంగా ఆలోచించేవారే తెలంగాణ ఉద్యమంలో ఉన్న న్యాయాన్ని గ్రహించలేకపోతున్నారు.

    ఈబ్లాగుల్లో కూడా మీలాగే అనేకమంది సీమాంధ్రకు చెందిన ప్రజాస్వామికవాదులు తెలంగాణకు మద్దతు ఇస్తున్నారు. అలాగే తెలంగాణకు చెందిన అనేకమంది సోంపేట లాంటి సీమాంధ్ర ప్రజాపోరాటాలకు మద్దతు ఇస్తున్నారు. కానీ neo uban uppar caste seemandhra elite మాత్రం తమ కల్లకు రంగుటద్దాలు పెట్టుకుని తమ సంకుచిత ధోరణి ప్రదర్శిస్తూనే ఉన్నారు.

    ReplyDelete
  5. అరిగిపోయిన రికార్డులు తిప్పే విశాలాంధ్ర మొరుగుడు సభ వాళ్ళు ఉన్నారు. జెర్మన్ భాష మాట్లాడేవాళ్ళ కోసం ఆస్ట్రియా, జెర్మనీ అనే రెండు దేశాలు ఉన్నాయని మర్చిపోతారు. ఒక భాషకి రెండు రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదు అని వాదిస్తారు. మన రాష్ట్రంలో రెండు వందల కులాలూ, ఉపకులాలూ ఉన్నాయి. ఈ కులాలు ఎన్నడూ ఏకంగా ఉండలేదు, వాటిని ఏకం చెయ్యడానికి మేతావులు ప్రయత్నించడం లేదు. కేవలం ప్రాంతాలు ఏకంగా ఉండాలని ఈ మేతావులు ఎందుకనుకుంటున్నారో అర్థం కాదు.

    ReplyDelete

Your comment will be published after the approval.