Tuesday, 31 May 2011

ఔను, తెలంగాణ రైలు జీవిత కాలం లేటే!

1956 లో ఫజల్ అలి కమీషన్ రిపోర్టుతో మొదలయిన తెలంగాణ రైలుకు అడుగడుగునా కష్టాలు, మోసాలే ఎదురయ్యాయి. మాటిమాటికీ పట్టాలు తప్పిస్తున్న స్వార్ధపూరిత రాజకీయ నాయకుల మోసాల ఫలితంగా ఈరైలు ఇప్పటికే జీవిత కాలం లేటు అయ్యింది.

1956లో ఆంధ్రా నాయకుల సామ్రాజ్యవాదానికి కమ్యూనిష్టుల స్వార్ధ విశాలాంధ్ర నినాదమనే బ్లాక్‌మెయిలు తోడవడంతో పట్టాల్లు తప్పిన తెలంగాణ రైలును తిరిగి పట్టాలపై నిలబెట్టడం కోసం తెలంగాణ వాసులు ప్రాణాలకు తెగించి పోరాడారు. అయితే ఏం లాభం, కుత్సిత నాయకుల రాక్షస నీతి ఫలితంగా వందల ప్రాణాలు నేలకొరిగాయి, ప్రజల ఆవేశం పోలీసుల దమనకాండ, నాయకుల వంచన, ప్రభుత్వ కపటనీతి వలన మూగపోయింది.

తెలంగాన రైలును మేము తీసుకొస్తామన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిమెజారిటీ తెచ్చుకోలేక కుత్సిత చంద్రబాబు మద్దతు తీసుకోవడం వలన 2000లో ఉత్తరాంచల్, చత్తీస్ఘర్, ఝార్ఖండ్ అనే మూడు రైళ్ళను ఏర్పాటు చేసిన ఎండీయే ప్రభుత్వం తెలంగాణ రైలును మాత్రం విస్మరించింది. 2001లో చంద్రశేఖరుడు తన స్వార్ధం కోసమే అయినా సరే మల్లి మరచిపోయిన తెలంగాణా రైలును ప్రజలకు గుర్తు చేశాడు. అయినా రైలు పట్టలపైకి మాత్రం రాలేకపోయింది.

తెలంగాన రైలు విషయంలో నేను మద్దతు ఇస్తానంటూ 2004లో మాట ఇచ్చిన దుష్టబుద్ది రాజశేఖరుడు ఏరు దాటగానే తెప్ప విషయం మరిచిపొయ్యాడు. 2008 ఎలక్షన్లొచ్చేసరికి మల్లీ మోసగాడు చంద్రబాబు నేను మారాను, నేను మీ తెలంగాణకు జరిగిన అన్యాయం తెలుసుకున్నాను అంటూ మాట మార్చి తెలంగాణ రైలును తన మానిఫెస్టోలో పెట్టుకుని మరీ ఎలక్షన్లలోకి వెల్లి 36 సీట్లు గెలుచుకున్నాడు.

చివరికి రెండువేల ఎనిమిదిలో చిదంబరం తెలంగాణ రైలును మొదలు పెడుతున్నామని చెప్పగానే ఒక్కసారి కుత్సిత నాయకుల వికృత రూపాలన్నీ బయటపడ్డాయి. నేను మారాను, తెలంగాణకు నేను మద్దతిస్తాను అంటూ, ఒకరోజు ముందు వరకూ బిల్లు పెట్టండి మద్దతివ్వ్వకపోతే అడగండి అన్న నక్కబాబు ఒక్కసారి మాటమార్చి ఎవరినడిగి ఈ అర్ధరాత్రి ప్రకటన అంటూ బీరాలు పొయ్యాడు, ఒకపక్క తన మనుషుల చేత తనే స్వయంగా కృత్రిమ ఉద్యమం రూపొందించాడు. మరోపక్క ఇచ్చేదీ తెచ్చేదీ మేమేనన్న వారంతా ఒక్క సారి అడ్డం తిరిగి రాజీనామాల డ్రామాలు చేశారు. అసలు లేనే లేని సమైక్యరైలును పీసీ సర్కార్లా మాయచేసి చూపించారు. ఏదయితేనేం తెలంగాణ రైలును మల్లీ పట్టాలు దించేశారు.

ఇంతలో మాయదారి శ్రీక్రిష్ణ కమిటీ వచ్చింది, మయసభలాగా అంతా మాయజేసి ఒక దిక్కుమాలిన రిపోర్టు తయారుజేసింది, తెలంగాణ రైలు మరో రెండడుగులు వెనక్కి వెల్లిపొయ్యింది.

చూస్తుండగానే ఒక జీవితకాలం గడచిపొయ్యింది. తేడా అల్లా ప్రజలకు ఇప్పుడు మునుపటిలా లేరు. నక్కబాబులూ, సోనియమ్మలు ఇంకా ప్రజలను ఏమార్చడం సాధ్యం కాదు. ఇప్పుడు ఇచ్చేదీ తెచ్చేదీ మేమే నన్నా, నేను మారాను నాకు తెలంగాణాకు జరిగిన అన్యాయం అర్ధమయింది అన్నా ప్రజలు నమ్మరు. మరి తెలంగాణా రైలుకు మద్దతు ఇస్తారో లేక తెలంగాణలో మీపార్టీల నాయకులు కాలుపెట్టలేకుండా చేసుకుంటారో మీ ఇష్టం. ఒక జీవిత కాలం ఇప్పటికే గడచిపోయింది, ఇప్పుడు ఇంకో జీవితకాలం ప్రజలు ఆగే స్థితిలో లేరు, మరి వినాయకులూ మీవైఖరి తేల్చుకోండి.

23 comments:

 1. ఎప్పుడూ మీరేంజేస్తారు, మీ వైఖరేంది అని అడిగేబదులు ముందు మేరేంజేస్తారో చెప్పరాదే.నీ బ్లాగోలకి మీ సాటి తెలంగాణా వాదులే ఒక్క వ్యాక్యాణం చేయకపోతే నీ బ్లాగులో లగడపాటి,జనార్ధన్ రెడ్డి,చంద్రబాబు,చంద్రమోహన్ రెడ్డి,కేశవ్,యనమల లాంటి వాల్లు వచ్చి మీకు జై తెలంగాణా అంటారా బాబు.ఎంత అమాయకత్వం నీది.


  @వందల ప్రాణాలు నేలకొరిగాయి...

  >>అసలు తెలంగాణ కోసం పిరికిగా ఆత్మహత్యలు చేసుకున్నవారి పేర్లు,తల్లి తండ్రులపేర్లు,ఆర్దిక స్థితి, కులం, మతం, ఊరి పేరు,విద్యార్హత,ఎక్కడ ఎప్పుడు ఎలా ఆత్మహత్య చేసుకున్నారో ఒక పట్టిక రూపంలో వివరంగా ప్రచురించగలవా? ఉట్టి మాటలు కట్టిపెట్టి కనీసం నీ సాటి అమరులయిన(???) తెలంగాణా పిరికివీరుల మీద కనీస గౌరవముతో అయినా నేనుజెప్పినట్టు జేయరాదే తమ్మి. ముందు నీకు దమ్ము ఉంటే ఈ వ్యాఖ్యానాన్ని తీసేయకుండా నేను చెప్పిన పని మొదలుపెట్టు. మాటలొద్దు చేతలు గావాలే !!!

  ReplyDelete
 2. నిజం గారు,
  లగడపాటి, చంద్రబాబు ఎలక్షన్ల ముందు వరకూ జైతెలంగాణ అని చానాసార్లే అన్నారు. ఇప్పుడంటే మాట మార్చారు గానీ మీ యెర్రం నాయడు అధ్యక్షతన ఒక కమిటీ వేసి రాష్ట్రస్థాయిలో పార్టీవర్గాలతో చర్చించి మరీ తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రజలకు కూడా నక్కబాబు అసలు స్వరూపం తెలిసింది కాబట్టి టీడీపీని తెలంగాణలో ఛీకొడుతున్నారు.

  సాటి మనుషులు, యువకులు ప్రాణాలు కోల్ఫోతుంటే కనీస సానుభూతి కూడా లేక ఎగతాళి చేసే మీలాంటి రాతిహృదయాలు ఎప్పటికీ మారరు, ఇంకా మీకు లిస్టు కావాలా? మీకామంటును పబ్లిష్ చెయ్యడానికి ధైర్యం అవసరం లేదు కానీ ఇలాంటి కామెంటు రాసినందుకు మీరు సిగ్గుపడాలి.

  ReplyDelete
 3. విశ్వరూప్ గారు,
  నేను తెలంగాణ ద్వేషిని కాను, నా మేనకొడలు తెలంగాణా కోడలు, నా మిత్రులు చాలామంది తెలంగణా వారే.

  సాటి మనుషులు చనిపోతుంటే దైర్యం చెప్పండి,పోరాడండి, సమర్ధించకండి. పిరికి వారి చావులని మీ అనవసరమైన ఉద్యమాలకి వాడుకోకండి. అవును అర్దంలేని ఉద్యమాలకి ఆత్మహత్యలు చేసుకునేవారి మీద ఎలా స్పందించాలి.

  సమర్ధనలొద్దు మిత్రమా. అమరవీరుల పట్టీ తయారీ మొదలు పెట్టు. ఉత్తి మాటలొద్దు.కార్యాచరణ ముఖ్యం.

  ReplyDelete
 4. నిజం గారు,

  ఆత్మహత్యలనెవరూ సమర్ధించరు, విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకోవడం ఏ ఉద్యమంలో నయినా ఎన్య మాత్రం సమంజసం కాదు. ఆత్మహత్యలను తెలంగాణవాదులు ఉసిగొల్పుతున్నారనేది ఒకానొక సీమాంధ్ర ప్రాపగాండా తప్ప అందులో ఎంత మాత్రం నిజం లేదు.

  ఆత్మహత్యలను సరైన రీతిలో అర్ధం చేసుకోకుండా సీమాంధ్ర మీడియా తప్పుదారి పట్టిస్తుంది. ఎంత కష్టపడ్డా ఎన్ని ఉద్యమాలు చేసినా తెలంగాణ రాకపోగా కనీసం మీడియా తప్పుడు రాతలు రాస్తుంటే, నాయకులు వంచన చేస్తుంటే నిస్పృహకు గురయిన సామాన్య విద్యార్థుల ప్రొటెస్ట్ ఆత్మహత్య. ఫ్రస్ట్రేషంకు గురయినపుడు ఒకడు విధ్వంసం చేస్తడు, మరొకడు ఆత్మహత్య చేసుకుంటాడు.. అసలు ఈపరిస్థితికి కారణం ఏమిటనేది ఆలోచించాలి.

  ReplyDelete
 5. మరి వందమందికి పైగా ఉన్న శాసన సబ్యులు కాని, 17 మంది లోక్‌సభ సబ్యులలో,ఎమెల్సీలలో కనీసం వారి కుటుంభ సభ్యులు కాని కనీసం ఒక్కరు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు. ఒక్క ధనవంతుడు, ఒక్క కల్లెక్టర్, ఒక్క ఉన్నత స్థాయి పోలీస్ అదికారి ఒక జడ్జి, ఒక్క ఎన్నారై చనిపోలేదే. నేను క్లియరుగా చూశాను హరీష్ రావ్ ఒక డబ్బలో ఎదొ ద్రవం తన వొంటిమీద పోసుకుని కెమెరాలముందు ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించడం, అవునా కాద చెప్పండి. నాయకుడెప్పుడు చెప్పడు చేసి చూపిస్తారు,అన్న హజారే గారిలాగా. దైర్యముంటే ఎంతో భవిష్యత్తు ఉండే యువకులొద్దు ఒక్క 60 సంవత్సరాలు నిండిన ఒక్క ఒక్క శాసన సభ్యుడు ఒక్క రాజకీయ నాయకుడిని మీడియా కెమెరాలముందు కాకుండా తన ఇంట్లొ కెమెరా ముందు తెలంగాణాకోసం ఆత్మహత్య చేసుకోమనండి చూద్దాం. మీరు ప్రతిదీ సమర్ధించుకుంటున్నారు తప్ప వాస్తవాలపట్ల నిజాయీతిగా స్పందించటంలేదు. మరి సీమాంద్ర మీడియాలో పనిచేస్తున్న తెలంగాణా వారినందరిని రాజీనామాలు చేసే వారినందరిని బయటకురమ్మని ఒక పిలుపు ఇవ్వాండి, మీ గొప్ప నాయకులయిన కల్వకుర్తి దొరగారు, హరీష్ రావ్,కేటీఆర్,కవిత గార్లు కూడా ఇలాంటి పిలుపు ఇవ్వమని చెప్పండి.

  ReplyDelete
 6. మీరే అన్నారుగా వారు నాయకులని, మరి నాయకులు సామాన్యుడిలాగా నిరాశా నిస్పృహలకు లోనయి ఫ్రస్ట్రేషన్లో ఎక్కడయినా ఆత్మహత్య చేసుకుంటాడా? అలా చేసుకుంటే అతను నాయకుడెలా అవుతాడు? పోనీ సమైక్యాంధ్ర కోసం ఎవరైనా నాయ్కులు ఆత్మహత్య చేసుకుంటారంటారా?

  రెండవ విషయం అనా హజారే లాగ ఒక 50 ఏల్లు నిండిన పెద్దమనిషి 2008 సెప్టెంబరులో నిరాహార దీక్ష చేపట్తాడు. (ఆత్మహత్య కాదు నిరాహార దీక్ష అని గమనించండి, అన్నా హజారే కూడా ఆత్మహత్య చేసుకోలేదు, నాయకులు ఆత్మహత్యలు చేసుకోరు). దానిఫలితంగానే మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలయింది, కేంద్రప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆతరువాత కొంతమంది రాజకీయనాయకులు మాటమార్చి డబ్బూ, అధికారంతో లేని ఉద్యమాలు సృష్టించడం వలన ఇప్పుడు తాత్కాలికంగా తెలంగాణ ఆగింది. పోలికను గమనిస్తారని ఆశిస్తున్నాను.

  అన్నా హజారే దీక్ష వలన లోక్పాల్ బిల్లుకు ప్రభుత్వం ఒప్పుకున్నా, రాబోయే రోజుల్లో లగడపాటి లాంటి నాయకులెవరో మాయచేసి లోక్పాల్ బిల్లును ఆపే ప్రమాదం లేకపోలేదు.

  ReplyDelete
 7. మీరు ప్రతిదాన్నీ మీకు కావలసిన వాటిని మాత్రం చక్కగా ఏరుకుని నిస్సిగ్గుగా సమర్దించుకుంటారు కాని, సరే ఈ విషయం వదిలి మీ అమరవీరుల పట్టీ తయారీ మొదలు పెట్టారా ???

  ReplyDelete
 8. ఏది నిస్సిగ్గు అండి? ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలోనయినా, జై ఆంధ్ర ఉద్యమంలోనయినా, స్టీల్ ప్లాంట్ కోసం చేసిన ఉద్యమంలోనయినా, సమిక్యాంధ్ర ఉద్యమంలోనయినా నాయకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారా? అలా అడగడంలో ఉన్న నిస్సిగ్గు మీకు కనపడడం లేదా?

  అమరవీరుల పట్టిక నాదగ్గరలేదు, నాకా అవకాశం లేదు కానీ ఈ వీడియో చూడండి.
  http://www.youtube.com/watch?v=siqt7V2E-Lk

  ReplyDelete
 9. ఇదంతా ఎందుకు సారూ, ఈ ఆంధ్ర నాయకులకి అంత ధైర్యం దమ్ము ఉంటె తెలంగాణా వద్దు సమైక్య ఆంధ్ర నే ముద్దు అని ఎలేచ్షన్స్ పాల్గొనండి.
  అప్పుడు తెలిసి పోతుంది కదా ఎవరి కోరిక ఏంటి అనేది.

  ReplyDelete
 10. @cricket lover
  వాల్లకంత ధమ్ముల్లేక ప్రతిపక్షం అధికార పక్షంతో కుమ్ముక్కయిపొయి అవిశ్వాసం పెట్టడం లేదు కదండీ. మరో మూడు సంవత్సరాలు ఆగాల్సిందే. ఈలోపు స్థానిక ఎన్నికల్లో ఎలాగూ తెలిసిపోతుంది.

  ReplyDelete
 11. సవాళ్ళు ఎదుటివాళ్ళకు వేసేముందు తమరి ఘనతవహించిన తెలంగాణా మంత్రులు అంధ్రప్రదేశ్ మంత్రిగా అంటూ ప్రమాణంచేసి నిస్సిగ్గుగా తెలంగాణా అంటూ పాటపాడుతున్నారు,ఇద్దరు తెలంగాణా మంత్రులు ఒకరినొకరు తిట్టుకుంటూ అరెస్ట్ అయ్యి బయటికి వచ్చి నిస్సిగ్గుగా తిరుగుతున్నారు. సరే అంధ్ర నాయకులకు దమ్ములేదు ఒప్పుకుందాం దమ్ము దైర్యం పుష్కలంగా ఉన్న తెలంగాణా నాయకులను ఎవరినైనా అంధ్రలొ జరిగే ఎన్నికలలో నిల్చొని గెలవమనండి చూద్దాం? మీ తెలంగాణా నాయకులని అంధ్రామీడియాలో కనిపించొద్దని చెప్పండి చూద్దాం.తెలంగాణా ఉద్యోగస్తులందరిని అంధ్రా మీడియాలో నుండి ఇతర సంస్థలనుండి రాజీనామాలు చేసి బయటకు రమ్మనండి చూద్దాం. పనిలెక ఖాళీగ ఉన్న ముసలి వాళ్ళని,నోరొక్కటి మాత్రమే వాడే కొంతమంది ఇంటర్వ్యూలని గుదిగుచ్చి గొప్ప పని చేసామని అనుకుని మీరు నాకు ఒక విడియో లంకె ఇచ్చారు. నేను కూడా అంతకంటే గొప్పగా ఆంధ్రా అంతా తిరిగి సమైఖ్య అంధ్ర గురించి చెప్పించగలను. ఒక్క రాజకీయ నాయకుడు కాని,వారి పిల్లలు కాని, దనవంతులు కాని ఒక్క ఎనారై కాని ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు అంటే సమాధానం చెప్పకుండ ఈ డొంకతిరుగుడు కబుర్లెందుకు మిత్రమా. మీ అమరవీరుల చిట్ట తయారీ గురించి అడుగుతే దాటవేస్తారెందుకు మీరు చెప్పిన విడియో లంకెలో 300 మంది బలిదానమంటే మీరు ఆరొందలంటారు. లెక్కలు ఎవరికి కావలసినట్టు వాల్లు చెప్పుకుంటున్నారు. మీరు సమైఖ్య ఆంధ్ర కోసం ఎవరూ ఎందుకు చనిపోరు అంటే నవ్వు వస్తుంది. ఇప్పుడున్నది సమైఖ్యాంధ్రానే కదా. ఉన్నదానికోసం ఎందుకు చావడం. కాస్త ఇంగిత జ్ఞానం వాడాలి మిత్రమా.ముందు మీ తెలంగాణా సినిమాలలో ఎందుకు ఆంధ్ర అగ్ర కుల హీరోలని తీసుకుంటున్నారు తెలంగాణా హీరోలని ఎందుకు తీసికోవడం లేదు??????????????????? ఎప్పుడయిన ఎవరినైనా ప్రశ్నించారా???ఎవరు మీ అవకాశాలను దోచుకుంటున్నది??? మీకు కష్టపడటం రాదు, బద్దకం ఎక్కువ,ఆవేశం ఎక్కువ, అసూయ చాలా ఎక్కువ, ఓపిక తక్కువ అని ముందు ఒప్పుకొనండి. తెలు-గోడు అనె పేరుతో ఒక సమైఖ్యవాది అమెరికాలో ఉండి తన ఉద్యోగం చేసుకుంటూ కూడా పది భాగాల ఒక ఉద్యమం పది అబద్దాలు శీర్షికన వెలువరించిన టపాలు చూసి ఎంతో మంది జర్నలిస్టులు కూడా చెయలేని పని ఇతనొక్కడు చెసిన విధం చూసి దానిని శ్రీక్రిష్న కమిటీకి కూడా ఇత్చారంటే అర్థం చేసుకొండి నిబద్దత అంటే ఎమిటో!!! ఉత్తి కబుర్లు కాదు వాస్తవం అర్థం చేసుకుని చేతల్లో చూపించండి. ముందు మీ తెలంగాణా నాయకులని అడగండి మీరెం చేసారు, చేస్తారు అని.

  ReplyDelete
 12. విశ్వరూప్ గారు మీరు నిజాయితీగా నా వ్యాఖ్యని ఉన్నదిఉన్నట్టుగా ప్రచురించినందుకు అదీ ఇంతత్వరగా అంగీకరించినందుకు దన్యవాదాలు. ఇదే నేను కోరుకునేది.

  ఇప్పటివరకు చరిత్రలో తెలంగాణా కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారి పూర్తి వివరాలతో ఒక పట్టీ తయారు చేసి మీ నిబద్దత చాటుకొనండి. మీకు ముందుగానే అభినందనలు !!!

  ReplyDelete
 13. అసలు ఏంటండి మీసోది, ఊరికే అనవసరంగా అర్ధం పధం లేకుండా వాదిస్తారు? అమర వీరుల చిట్టా నేనెందుకు తయారుచెయాలి, మీరేమన్న నాకు మేనేజరా, మీరు అసైన్మెంట్లు ఇస్తే నేను పూర్తిచెయ్యడానికి? అమరవీరుల ఊసు నేనెక్కడా ఎత్తలేదే? అసలు కనీసం ఆ పదం కూడా వాడలేదే? అసలు ఆత్మబలిదానం చేసుకున్న వారిని నేనయితే అమరవీరులు అనుకోను.. అంతకంటే పోలీసు కాల్పుల్లో, లాఠీ దెబ్బల్లో మృతిచెందిన వారు ఎందరో ఉన్నారు, 69లోనూ, ఇప్పుడూ. ఇకపోతే నేనిచ్చిన వీడియో ఖాలీగా ఉన్న ముసలోల్లు మాట్లాడింది కాదు, ఆతమ్హత్యలు చేసుకున్న వారి కుటుంబాల గోడు. అసలు ఆత్మహత్యలగురించి నేనెక్కడయినా ఎత్తానా, ఎందుకు ఊరికే టైంవేస్ట్ చేస్తారు?

  మీకు ఒకసారి చెబితే అర్ధం కాదు లాగుంది. నిస్పృహకు గురయినవారు ఆత్మబలిదానం చేసుకుంటారు, ఎనారైలూ, నాయకులు నిస్పృహకు గురికారు. పోనీ వెరైటీగా మీసమైక్య ఉద్యమంలో ఎవరైనా నాయకులో ఎనారైలో ఆత్మహత్యలు చేసుకుంటారా అంటే అది చెప్పరు, పైగా నేను రాయని విషయంపై ఒకటే సోది. ఉన్నదానికోసం ఉద్యమాలు నటించేవారు ఉన్నదానికోసం చస్తే తప్పేమిటి? పైగా ఇంగిత గ్నానం, మీకుందా??

  ఆ వీడియో తీసింది సంవత్సరం కింద, అప్పుడు మూడొందలు ఉంటే ఇప్పుడూ మూడొందలే ఉండాలా? కాస్త బుర్రుండాలి మాట్లాడితే. మీ పక్షపాత బుద్దికి తెలుగోడు పది అబద్దాలు అంటూ రాసిన అబద్దాలు మంచిగా కనబడుతాయి, తెలంగాణ వాడు చేసే పనులు తప్పుగా కనిపిస్తాయి, ఏదయినా విషయం ఉంటే రాయండి, ఊరికే బ్లాంకెట్ స్టేట్మెంట్లు గాదు.

  మీడియా మొత్తం మీగుప్పిట్లో పెట్టుకుని మీరు చెప్పారు కాబట్టి అందరు ఉద్యోగస్తులు రాజీనామా చేసి వీధిన పడాలా? సిగ్గుండాలి మాట్లాడ్డానికి. అసలు సినిమా ఇండస్ట్రీ అంతా ఆంధ్రా వారిచేతిలోనే ఉంది గదా, మేము తెలంగాణ హీరోలను పెట్టుకోవాలా? ఎందుకు? అయితే వినండి: ఒకవేళ తెలంగాణ వారు సినిమాలు తీసినా, తెలంగాణ వారు ఏ డిపార్ట్మెంట్లో పై అధికారిగా ఉన్నా, తెలంగాణ వారు ముఖ్యమంత్రులు అయినా వారు అందరికీ అవకాశాలు ఇస్తారు, మీవారిలాగా సంకుచిత ధోరణితో తమ ప్రాంతానికి, తమ కులానికి చెందిన వారికి అవకాశాలు ఇవ్వరు. మీరు అలాగ చేస్తారు కాబట్టే ఈఉద్యమం.

  ReplyDelete
 14. నిజం,

  ఏందిబై మీ లొల్లి! మీ మంత్రులు చేతగానోల్లు, మీ ఎమ్మేల్ల్యేలు పనికి రానోల్లు, మీరు నిబద్ధత లేనోల్లు, etc, etc...

  ఇదేనా మీరు చెప్పదల్చు కున్నది? ఐతే ఏమంటరు? మీకు చేతగాదు కాబట్టి మిమ్మల్ని మేం పరిపాలిస్తం అంటరా?

  బ్రిటీష్ వాడు గూడ అదే మాట అని, చివరకు వెళ్ళిపోయిండు. గుర్తు తెచ్చుకోండి.

  మా ఎమ్మెల్యేలకు, మంత్రులకు చేత గాక పోయినా తెలంగాణా ఎట్ల తెచ్చుకోవాల్నో మాకు తెలుసు. మీవోల్లు చేసే కుట్రలను ఎట్ల చేధించాల్నో కూడ తెల్సు. మేమేం చెయ్యాల్నో మీ సలహాలు అక్కర లేదు. అడ్డం పడకుంటే అదే మీరు మాకు చేసే మేలు.

  ReplyDelete
 15. I agree with Nijam. Please make a list. I don't understand why you are not coming forward for the noble cause.

  ReplyDelete
 16. above Anon:

  నేను లిస్టు తయారు జేసి ఇస్తె మీరెమన్న ఓదార్పు యాత్ర జేసి జగన్ కొల్లగొట్టిన డబ్బులోంచి ఇంటికో లక్ష చొప్పున ఇప్పిస్తరా? ఎందుకీ వ్యర్థ ప్రేలాపనలు?

  తెలంగాణ ఎందుకు ఇవ్వకూడదో చెప్పడం చాతకాక అయినా ఏదో విధంగా అడ్డుతగులాదామనుకొనే మీలాంటి పనికిమాలిన వెధవలంతా చెయాగలిగే పని ఇదే.. అర్ధం పర్ధం లేని పనికి మాలిన రాతలు హేళనలూ చేసి ఏదో సాధించానని జబ్బలు చరుచుకోవడం. ఇలాంటి రాతలు రాసి సమైక్యవాదులదగ్గర విషయం లేదని మీరే నిరూపిస్తున్నారు.

  ReplyDelete
 17. బాగా కాలింది కదా! మరి ఆంధ్రావారు దోపిడీదారులు, మా ఉద్యోగాలు దోచుకుంటున్నారు, మా నీళ్ళు దోచుకుంటున్నారు అంటే మిగతా వారికి కూడా మండుద్ది.ఎందుకు అంత అసహనం, మరి ఆంధ్రా నాయకులకి చంద్రబాబుకి మీరు ఎందుకు అసైన్మెంట్లు ఇస్తారు. ఈ బూమి మీద ఉన్న ప్రతిఒక్కరు జై తెలంగాణా అనాలా??? పొద్దున లేస్తే ప్రతిఒక్కరు అన్ని పనులు మానుకుని ప్రతిరోజు జై తెలంగాణా అనాలా? అంధ్రా వాళ్ళకు సవాళ్ళు విసురుతారా?బయపెడతారా?విగ్రహాలు కూలుస్తారా? వ్యాపారస్తులని బెదిరించి వసూళ్ళు చేసుకుంటారా? వాస్తవాలు మాట్లాడితే చాలా చాలా చేదుగా,ఖఠినంగా ఉంటాయి మిత్రమా.ఇప్పుడు సీమాంధ్రాలో కంటే కరీం నగరులోనే ఎక్కువ ఉత్తీర్ణత శాతం వచ్చింది మొన్నటి పదవ తరగతి పరీక్షలలో, అయినా ఇక్కడ సీమాంధ్రలో ఎవ్వరూ ఎడవడం లేదు! శుబ్రంగా ఎవరి చదువులు,పనులు వారు చేసుకుంటే వాళ్ళే అభివృద్ది చెందుతారు. ఈ కపట నాటకాలు,అస్సూయలు,యేడుపులు,దౌర్జన్యాలు,దహనకాండలు వద్దనేది చెప్పాలని నా ఉద్దేశం. అంతే కాని మిమ్మలను కించపరచి మీ బ్లాగులో నేనేదో వూడపొడుద్దామని కాదు. నాకు మూడు రకాల వ్యాపారాలు,ఉద్యొగాలు ఉన్నయి, పనిలేక మీకు వ్యాఖ్యానాలు పంపుతూ గడపటానికి నేను విశ్రాంత ఉద్యోగిని కాదు. మీ అలోచనలు వాస్తవ విరుద్దంగా ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం.ధన్యవాదాలు :)

  ReplyDelete
 18. అయ్యా శ్రీకాంతాచారి, పి.వి.చెన్నా రెడ్డి లాంటి తెలంగాణాకు చెందిన వ్యక్తులు ఆంధ్రప్రేదేశ్ ముక్యమంత్రులు అయ్యి పరిపాలిస్తే సీమాంద్రులకు ఏ బాధా లేఅదు కాని తెలంగాణకు చెందని వ్యక్తులు ఆంధ్ర ప్రదేశుని పాలిస్తే మీకెందుకు అంత బాధ నొప్పి.మీరేమైన ప్రత్యేక జాతికి చెందినవారా. మామూలు మనుషులేగా, తెలుగు వారేగా ఏమిటి ప్రత్యేకత ???

  మీరు లిస్టు తయారుచేస్తే ముందు చాలా నిజాలు తెలుస్తాయ్. అప్పుడు మరింత గొప్పగా పోరాడొచ్చు కదా???

  ReplyDelete
 19. నిజం,

  పీవీ, చెన్నారెడ్డి ముఖ్యమంత్రులయినపుడు సీమాంధ్రులకు ఏభాధా లేదా? సంవత్సరం తిరక్కుండానే ఒకరిని పాతబస్తీలో గొడవలు సృష్టించి, మరొకరిని జై ఆంధ్రా ఉద్యమం సృష్టించి దించివేసారుగా? ఎంత నిస్సిగ్గుగా ఇలాంటి అబద్దాలు మాట్లాడుతారండి మీబోటివాల్లు? ముఖ్యమంత్రులను దించడానికి జై ఆంధ్రా అని ఇప్పుడు మేం మా బాగు కోసం విడిపోతామంటే సమైక్యవాదం చేస్తున్న అవకాశవాదులకు ఎందుకండీ ఈ రాతలు?

  లిస్టు మీరు తయారుచేసి నిజాలు మీరు చెప్పండి, నిజం అని పేరు పెట్టుకున్నారుగా?

  ReplyDelete
 20. ఏమిచెప్పాలో తెలీక మీరు బూతులు వాడుతున్నారు.మొదట మర్యాదగా స్పందించండి. లేదా మీ బ్లాగుకి తెలంగాణా వాల్లు మాత్రమే సందర్షించండి లేదా వ్యాఖ్యానించండి అని ఒక ప్రకటన ఇవ్వండి. మేము మా తెలంగానా తెచ్చుకుంటం మీరు అడ్డు పడకండి అంటారా, ఆటలో ఒక్కరే ఆడుకుంటే గెలుపులు వోటములుండవ్. ప్రతి తెలంగాణా బ్లాగులో చివరి చర్చకొచ్చేసరికి బూతులు,నిందలు,తిట్లు,ప్రగల్బాలు!?

  ఆంధ్రావాళ్ళు మీడియాని గుప్పిట్లో పెట్టుకున్నారా? సంవత్సరాలతరబడి కష్టపడి అభివృద్ది చేసుకున్న పత్రికలు,చానెళ్ళు మీకు రాసివ్వాలా.( మీరు ఇప్పుడు రెండు చానెళ్ళు,ఒక దినపత్రిక పెట్టుకున్నారుగా, అందులో చాలా గొప్పగాంఫ్హ్ర వారిని తిడుతున్నారుగా, ఎవరడ్డొచారు)

  మీకు అంత బహు గొప్ప హృదయం వుంటే పి.వి.నరసిమ్హారావ్ గారికి తెలంగాణాలో ఒక్కరు కూడా తమ సీటు త్యాగం చేసి లోక్సభకు గెలిపించుకోలేకపొయ్యారు. నంద్యాలలో ఎందుకు నిలబడటం.(ఆ ఎన్నికకు ప్రతిపక్షములో ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చింది). తెలంగాణా వారికి తమ వ్యక్తి ప్రధాన మంత్రి అయ్యాడు, మద్దతు ఇవ్వాలి అని ఎందుకు తోచలేదు. ఆత్మగౌరవాలు ఎమైయ్యాయి. చూడంగా చూడంగా ఈ తెలబానులు రెచ్చగొట్టి ఇంకో వెయ్యొ రెండువేలో అమాయకపు(నిరాశా నిస్ప్రుహ నిండిన) విధ్యార్దులని చంపి మాకు ఆత్మ గౌరవాలు చాలా ఎక్కువ కాబట్టి మాకు ప్రత్యెక తెలంగాణా దేశం ఇవ్వమనేట్టున్నారు?

  నేను లిస్టు తయారు చేసి ఇవ్వాలా, అంధ్రవాల్ల మీడియా మీకు అప్పజెప్పలా, అన్ని వ్యాపార సంస్థలు, అంద్రపదేశ్ మొత్తం నీల్లు వనరులన్ని మీకు ఇవ్వాలా?. మరి మీరెం జేస్తరు తిని తొంగుంటారా! ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు? దీనికే చక్కని సామెత ఉంది " ఆడలేనమ్మ మద్దెలొడు సరి లేదు అందట". మీరు అబద్దలు రాయకండి మేము నిజాలు వ్రాయం, సరేనా!!!

  ReplyDelete
 21. నిజం గారు, బూతులు ఎవరు రాశారండీ? మీ కామెంట్లు మర్యాదగా ఉన్నాయా, లేక నావా?

  some how your comments gone into spam section, so I could not check them earlier.

  ReplyDelete
 22. నిజం గారు,

  సీమాంధ్ర కంటే కరీమ్నగర్లో ఎక్కువ ఉత్తిర్ణత వస్తే దానికి సీమాంధ్రవారు ఎందుకు ఏడవాలి? అసలు ఆ విషయం ఎత్తడంలోనే మీ ఏడుపు కనిపిస్తోందని గమనించండి.

  మీనీల్లను మీరు వాడుకొంటే, మీకోటా ఉద్యోగాలు మీరు అనుభవిస్తే మేం ఏడవడం లేదు, మానీళ్ళను మాక్క్కాకుండా చేసి మరీ మావాటానునూడా మీరు దోచుకుంటే ప్రశ్నిస్తున్నాము, మా ఉద్యోగాలను దొంగ రెసిడెన్సీ సర్టిఫికెట్లు పెట్టి మీరు కాజేస్తుంటే ప్రశ్నిస్తున్నాము, అదికూడా మీకు తప్పుగా కనిపిస్తోంది కదా? మాన్యాయమైన వాటాకోసం మేం అడుగుతుంటే దాన్ని ఏడుపు అనడంలోనే మీరు దోపిడీని సమర్ధిస్తున్నారని తెలుసుకోండి.

  నిజం అని పేరు పెట్టుకుని అబద్దాలు రాయడం మానండి.

  మీసొంత లాభంకోసం మీరు ఎంతకయినా తెగిస్తారు, ప్రధానమంత్రిని మంచి చేసుకొని మీప్రాంతానికి ఇంకొన్ని ఫండ్సు తెచ్చుకోవడానికి నంద్యాల ఇచ్చారు అదికూడా అప్పుడు హన్మకొండ తెదే గెలుచుకోవడం వలన. పీవీ లాంటివాడు ప్రధానమన్రిగా ఐదు సంవత్సరాలు మనగలిగాడు కానీ ముఖ్యమంత్రిగ సంవత్సరం ఉండలేకపోయాడు, మీ కుటిలనీతివల్ల, ఎందుకండీ ఈ ఫోజులు?

  ReplyDelete
 23. @nijam

  abbadalu cheppe 'nijam' nee comments chadivika nuvu samakyandhraku chendhaani(may be niku em kavalo from andhra pradesh) vadivi anni telusundhi nuvuu pakka padhi mandhini tokki paiki vochinodivi anni spastamga telisipothundhi. em matladutharu ra meeru eppudu okate sodhi kothaga matladadam neruchukondi ra...

  ReplyDelete

Your comment will be published after the approval.