1969లో మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినపుడు ఉత్తరాంధ్రకు చెందిన బడుగువర్గాల నేత సర్దార్ గౌతు లచ్చన్న తానుకూడా స్వయంగా ఉద్యమంలో పాల్గొని తెలంగాణకు మద్దతుగా నిరాహారదీక్ష కూడా చేపట్టాడు. గౌతు లచ్చన్న పెద్ద మనుషుల ఒప్పందం పై ఆంధ్ర ప్రాంతం తరఫున సంతకం చేసినవారిలో ఒకరు. మిగతా ఆంధ్రా పెద్దమనుషులు, మరీ ముఖ్యంగా ఆ తరువాత ముఖ్యమంత్రులయిన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేయగా గౌతు లచ్చన్న మాత్రం ధర్మానికి కట్టుబడి తెలంగాణకు మద్దతుగా నిలిచారు. అగ్రకులాలకు చెందినప్పటికీ నిజాయితీపరుడిగా పేరున్న ఎన్.జీ.రంగా కూడా అప్పట్లో తెలంగాణకు మద్దతు పలికాడు.
ఇప్పటి తరంలో సీమాంధ్రా దళితులు ప్రధానంగా తెలంగాణాకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. పెద్ద రాష్ట్రాలలో ధనబలం కలిగిన అగ్రకులాల పెత్తనం మరీ బలంగా ఉంటుంది కాబట్టి రాష్ట్రం చిన్నదయితే వీరికి అవకాశాలు పెరుగుతాయనడంలో వాస్తవం ఉంది. దళిత మహాసభకు చెందిన కత్తి పద్మారావు, దళిత వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తెలంగాణకు మద్దతు ఇస్తున్నారు.బీసీల్లో కూడా అనేక మంది తెలంగాణాకు మద్దతు ఇస్తున్నారు. బొత్సా ఇప్పటికే మద్దతు ఇవ్వగా ఇంకొంతమంది బయటపడకున్నా తెలంగాణకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరి రాష్ట్ర ఏర్పాటు విషయంలో పూర్తి మద్దతున్న తెలంగాణ ప్రజలు, సీమాంధ్రలోని మెజారిటీ దళిత బీసీ వర్గాల వారి మాట నెగ్గాలా, లేక రెండు మూడు సీమాంధ్ర అగ్రకుల ధనిక వర్గాలవారి మాట నెగ్గాలా? సమైక్య రాష్ట్రంలో ఎప్పుడూ అధికారం ఈరెండుమూడు సీమాంధ్రా అగ్రకులాల చేతిళొనే ఉంటుంది, ఎప్పుడూ వారి మాటే నెగ్గుతుంది కాబట్టి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వారు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు, అది వారి స్వలాభానికి చెందిన విషయం మరి.
ఇక్కడ చాలా మంది తెలంగాణాకి వ్యతిరేకం కాదు. సమైక్యాంధ్ర ఆందోళనలు జరిగినప్పుడు ఉత్తరాంధ్రలో వైజాగ్, విజయనగరం, ఆముదాలవలసలలో మాత్రమే ఎక్కువ హింస జరిగింది. విజయనగరం అశోక్ గజపతి రాజుకీ, ఆముదాలవలస తమ్మినేని సీతారాంకీ సొంత ఊర్లు కావడంతో వాళ్ళ ఊర్లలో హింస ఎక్కువ చెయ్యించుకున్నారు.
ReplyDeleteప్రవీణ్ గారూ అందరి తరపున తెలంగాణా కు వ్యతిరేకం కాదు అని మీరెలా స్టేట్ మెంట్ ఇస్తారండీ? మీ వరకు మీ అభిప్రాయం చెప్పండి. మీకా స్వేచ్చ ఉంది.
ReplyDeleteనేను ఉండేది శ్రీకాకుళం పట్టణంలోనే. సమైక్యవాదులు బంద్ పిలుపు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉదయం పూట ఆందోళనకారులని చూసి దుకాణాలు మూసేసి సాయింత్రం పూట తెరిచేవాళ్ళు. ఇక్కడ సమైక్యవాదం అంత బలంగా లేదు. ఇక్కడ హైదరాబాద్‌లో ఆస్తులు సంపాదించినవాళ్ళు చాలా తక్కువ. తెలంగాణా వచ్చినా, రాకపోయినా ఇక్కడ చాలా మంది జీవితాలు మారవు. అందుకే ఇక్కడివాళ్ళు సమైక్యవాదానికి మద్దతు ఇవ్వలేదు.
ReplyDeleteనేనూ అదే చెబుతున్నాను నేను ఉండేది హైదరాబాద్ లో. ఇక్కడ తెలంగాణా వాదులు బంద్ కి పిలుపు ఇచ్చినప్పుడు ఉదయం మూసేసి సాయంత్రం దుకాణాలు తెరిచేవారు. తెలంగాణా వచ్చినా, రాకపోయినా ఇక్కడ చాలా మంది జీవితాలు మారవు. అంత మాత్రాన ఇక్కడ తెలంగాణా వాదం లేదని నేను అంటే ఒప్పుకుంటారా? . మీ వరకు మీ అభిప్రాయం చెప్పండి. మీ ప్రాంత జనాల అభిప్రాయాలని మీరెలా నిర్ణయిస్తారు?
ReplyDeleteహైదరాబాద్‌లో ఏ ప్రాంతమో చెపుతారా? కూకట్‌పల్లి & BHELలో స్థిరపడిన కోస్తా ఆంధ్రవారిలో తెలంగాణావాదం అంత బలంగా ఉంటుందా? సికందరాబాద్‌లో స్థిరపడిన మార్వాడీ & గుజరాతీ వ్యాపారులలో తెలంగాణావాదం అంత బలంగా ఉంటుందా?
ReplyDeleteSHANKAR and Praveen:
ReplyDeleteబంద్ ఎక్కడ జరిగినా అది వ్యాపారస్థులకు ఇబ్బందే. వారి వారి వాదాలకు అతీతంగా వ్యాపారస్థులకు ఎవరికైనా తమ వ్యాపారాలు చెడగొట్టుకోవడం ఇష్టం ఉండదు. కాబట్టి బంద్ ఎలా జరిగిందనే దానిపై ప్రజల భావాలు అర్ధం చేసుకోలేము.
శంకర్ గారూ, ఒక్కసారి HMTV దశ దిశ సీమాంధ్రలో జరిగిన భాగాలు చూడండి. ఉత్తరాంధ్ర ప్రతినిధులు, సీమాంధ్ర దళిత బీసీ ప్రతినిధులు అన్నిచోట్లా తెలంగాణకు అనుకూలంగానే మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ఒక్క దళిత బీసీలే కాక మెజారిటీ ప్రజలు తెలంగాణ సమర్ధించడానికి కారణం ఉత్తరాంధ్ర కూడా తెలంగాణ లాగే నిర్లక్ష్యానికి గురయింది. హైదరాబాదుకు దూరంగా ఉండే ఉత్తరాంధ్రవాసులకు హైదరాబాదు వల్ల ఒరిగేదేమీ ఉండదు, విడిపోతే వారికి దగ్గరలో అవకాశాలు పెరుగుతాయి.
హైదరాబాద్ వరకు ఎందుకు? సిర్పూర్ నియోజక వర్గంలో బెంగాలీ శరణార్థులు (బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులు) ఉన్న గ్రామాలు ఉన్నాయని అక్కడ తెరాస ఓడిపోతుందని అనుకున్న రోజులు ఉన్నాయి. తాతల కాలంలో తెలంగాణాలో స్థిరపడినవాళ్ళు తప్ప కొత్తగా స్థిరపడినవాళ్ళు తాము తెలంగాణావాళ్ళమని చెప్పుకోవడం లేదు.
ReplyDeleteహ హ హ ప్రవీణ్ గారూ, అయితే తార్నాక, హబ్సిగూడా తో కలిపి సికింద్రాబాద్ వైపు తెలంగాణా వాదం ఉండదంటారు. అలాగే కూకట్ పల్లి, bhel కూడా సమైక్య వాదమే అంటారు. అంతేనా? పాతబస్తీ ఎలాగా ఉండదు. ఇక మిగిలింది ఉప్పల్ వైపు. దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ వైపు కూడా వలసవాదులు ఉన్నారు కాబట్టి మీ లెక్క ప్రకారం అక్కడా ఉండటానికి వీల్లేదు. ఇక చిక్కడపల్లి, కోఠి, హిమాయత్ నగర్ ఏరియాల గురించి చెప్పాలి. మనలో మనమాట ఎన్నేళ్ళయింది సార్ మీరు హైదరాబాద్ వచ్చి? అయినా అడిగారు కాబట్టి చెబుతున్నా నాది కార్ఖానా ప్రాంతం. ఇంక సమర్ధించుకోండి మీ తెలంగాణా వాదాన్ని.
ReplyDeleteవిశ్వరూప్ గారూ,
ReplyDeleteప్రవీణ్ గారు బంద్ జరిగిన తీవ్రత, శైలి ని బట్టి వాళ్ళ ప్రాంతీయ వాదాన్ని నిర్ణయించవచ్చు అన్నట్టు మాట్లాడితే జవాబిచ్చాను. ఈ రోజుల్లో స్వచ్చంద బంద్ అంత బూతు మాట లేదు.
పట్టణంలో నా షాప్ మేడ మీద పోర్షన్‌లో ఉంది. బంద్ సమయంలో నేను లోపలి నుంచి షటర్లు వేసి లోపల కంప్యూటర్లలో వర్క్ చేసుకునేవాడ్ని. ఇక్కడ బలవంతంగా జరిగిన ఉదయం పూట బంద్‌లనే సమైక్యవాద చానెళ్ళు ప్రశాంతంగా జరిగిన బంద్‌లుగా చూపించాయి.
ReplyDeleteబంద్ ప్రామాణికం అనుకోకపోతే సమైక్యవాద చానెళ్ళు బలవంతపు బంద్‌ని స్వచ్ఛంద బంద్‌గా ఎందుకు చూపించినట్టు?
ReplyDeleteViswaroop: most "samaikyavadis" actually live in Hyderabad & RR districts. These are basically middle class upper caste andhra men who moved recently. These "Y2K andhras" (aka "KPHB andhras") are out of touch with both andhra and telangana.
ReplyDeleteప్రవీణ్ గారు చెప్పిన ఒక పాయింట్ ఆలోచింపజేసేలా ఉంది. తమ్మినేని, అషోక్ గజపతిరాజు లాంటి సమైక్యవాద నాయకులకు సొంతబలం ఉన్న ఊర్లలో ఎక్కువ విధ్వంసం జరిగింది. ఎందుకంటే మరి సమైక్య ఉద్యమం కేవలం నాయకులు ఆడించిన నాటకం కదా? ఆ విధ్వంసం కూడా నాయకుల అనుచరబృందమే చేశారు, అందుకే వారిపై తెలంగాణలోలా పెద్దగా కేసులు పెట్టలేదు.
ReplyDelete"బంద్ ఎక్కడ జరిగినా అది వ్యాపారస్థులకు ఇబ్బందే. వారి వారి వాదాలకు అతీతంగా వ్యాపారస్థులకు ఎవరికైనా తమ వ్యాపారాలు చెడగొట్టుకోవడం ఇష్టం ఉండదు. కాబట్టి బంద్ ఎలా జరిగిందనే దానిపై ప్రజల భావాలు అర్ధం చేసుకోలేము. "
ReplyDeleteబహుశా విశ్వరూప్ గారు చెప్పింది మీకు అర్ధమయినట్లు లేదు. సర్లెండి మీరు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు. ఓకేనా?
మరి సిద్ధిపేట, కరీం నగర్ లలో తెలంగాణా వాదం మిగిలిన ప్రాంతాల కన్నా ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటారు? హరీష్, కే.సి.ఆర్ ల స్వంత ఏరియాలనా? అవి వాళ్ళు బలవంతం గా జరిపించారనా?
ReplyDeleteవైజాగ్‌లో కూడా హింస ఎక్కువే జరిగింది కానీ ఆంధ్రా యూనివర్శిటీలోని మాదిగ విద్యార్థులు ప్రత్యేక తెలంగాణాకే మద్దతు ఇచ్చారు. విజయనగరం, ఆముదాలవలసలలో హింస చెయ్యించింది అశోక్ గజపతిరాజు & తమ్మినేనిల అనుచరులే. లక్షకి పైగా జనాభా ఉన్న శ్రీకాకుళం పట్టణం కంటే నలభై వేలు జనాభా ఉన్న ఆముదాలవలసలోనే హింస ఎక్కువ జరిగింది.
ReplyDelete@SHANKAR S
ReplyDeleteసిద్దిపేట్, కరీం నగర్ లలో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదట మొదలయింది, కారణం మీరన్నట్టు అక్కడ కేసీఅర్, హరీశ్ రావు ఉండడమే అయుంటుంది. కానీ చిదంబరం ప్రకటన తరువాత గత 18 నెలలనుంచీ తెలంగాణాలో అన్నిచోట్లా బలంగా ఉంది. ముందర నత బలంగా లేని నల్లగొండ, మహబూబ్న్నగర్, మెదక్ లలో ఇప్పుడు ఉత్తర తెలంగాణా కంటే ఎక్కువ బలపడింది.
ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఏ నాయకుడి చేతిలోనూ లేదు, ప్రజలందరిలో బలంగా పాకింది.
@Jai
ReplyDeleteWell said. These Y2K Andhras are mainly worried about their real estate property prices than what happens to the state.
There are some more strong samiakyandhra supporters in rayalaseema and middle costa who are currently reaping the benefit disproportionately with the divertion of krishna waters, which will be difficult to get in future with the formation of telangana state.