మన స్వయంప్రకటిత మేధావి జేపీ నారాయణ తెలంగాణ ఊసెప్పుడు వచ్చినా వేసే రికార్డు జిల్లా ప్రభుత్వాలు. మేము మా మానిఫెస్టోలో పెట్టిన జిల్లా ప్రభుత్వాలే సర్వరోగ నివారిణి, తెలంగాణా సమస్యకు మూలకారణాలన్నీ మా జిల్లా ప్రభుత్వాలతో తొలగిపోతాయి అంటాడు. ఈమధ్యన విశాలాంధ్ర మహాసభ అంటూ పెట్టుకున్నవారు గాంధీ చెప్పిన గ్రామస్వరాజ్యం అమలు చేస్తే చాలు, చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యవలసిన అవసరం లేదు అని చెబుతున్నారు.
అసలు state reorganization committy ఏర్పాటుచేసినప్పుడు ఆరోజుల్లోనే అంబేద్కర్ రాబోయే సమస్యలను కల్లకు కట్టినట్లుగా ఊహించి తన రిపోర్టులో పొందు పరిచారు. రాష్ట్రాలు పెద్దవయితే అభివృద్ధి చెందిన వర్గం వారు బలమయిన వర్గంగా తయారయి మిగతావారి అవకాశాలను కొల్లగొట్టే అవకాశం ఉంది, బలహీనమయిన వారు ఎక్ష్ప్లాయిటేషన్‌కు గురవ్వొచ్చు అని రాశారు. అలాగే ఒకే రాష్ట్రంలో ఒకటికంటే ఎక్కువ భాషలు మాట్లాడే ప్రజలు ఉంటే వారిమధ్య ద్వేషాలు పొడసూపే అవకాశంకూడా ఉంది అని రాశారు. కాబట్టి అంబేద్కర్ ప్రతిపాదన ఏమిటంతే ఒకభాష మాట్లాడే ప్రజల్లో ఎన్ని విభిన్న ప్రాంతాలు ఉంటే అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యాలి. గాంధీగారి ఫాన్సీ ఐడియాలలాగా కాకుండా అంబేద్కర్ ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పడనేదానిలో సందేహం అక్కరలేదు.
అధికార వికేంద్రీకరణ, గ్రామస్వరాజ్యం, పంచాయితీలకు ఎక్కువ అధికారాలు, జిల్లాలకు ఎక్కువ నిధులు అందరూ అడిగేదే, అందులో కొత్తవిషయం ఏమీలేదు, అందరూ అడిగేదే. అయితే ఇదే సర్వరోగనివారిణి, ఇలాచేస్తే తెలంగాణా అవసరం లేదు, చిన్నరాష్ట్రాల అవసరం లేదు అనే వాదనమాత్రం పూర్తిలోపభూయిష్టమయినది.
గ్రామస్వరాజ్యం గానీ, జిల్లాప్రభుత్వాలుగానీ వ్యవస్థీకృత వివక్షను అడ్డుకోలేదు. ఒకపంచాయితీకి తమ ప్రాంతానికి కాలువలద్వారా నదీజలాలను తరలించే అధికారం ఏగ్రామ స్వరాజ్యం వచ్చినా ఉండదు. జిల్లా ప్రభుత్వాలు 610 జీవోను అమలు చెయ్యలేవు, ప్రభుత్వ శాఖలలో, పబ్లిక్ సర్వీస్ కమీషన్ లలో నియామకాలు, పదోన్నతులలో జరిగే వివక్షను అడ్డుకోలేదు, దొంగ రెసిడెన్సీ సర్టిఫికెట్ల పంపిణీ అరికట్టలేదు, ఉన్నత విద్యాలయాలు, యూనివర్సిటీల ఏర్పాటులో, నిధులపంపిణీలలో జరిగే వివక్షను అడ్డుకోలేదు. మరి ఈజిల్ల ప్రభుత్వాల సర్వరోగనివారిణీ తెలంగాణా ప్రజలు చెబుతోన్న ఏసమస్యను తీర్చగలదు?
కాబట్టి ఇక్కడి ప్రజలు కోరుకునేదేమంటే అధికారవికేంద్రీకరణ, లోకల్ బాడీలకు ఎక్కువ అధికారాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చెయ్యాలి, కానీ దానికి తెలంగాణాతో గానీ చిన్నరాష్ట్రాలఏర్పాటుతోగాని లింకు పెడితే లాభంలేదు. ఇక జయప్రకాశ్ నారాయణగారు వారి ఫ్యాన్సీ ఐడియాలను ముందు ఏదో ఒకప్రాంతంలో పైలట్ ప్రాజెక్టులాగా అమలుచేసి నిరూపించాలి అంతే గానీ ఊరికే ఉపన్యాసాలు దంచి ప్రజలమీద ప్రయోగాలు చేస్తానంటే లాభం లేదు.
జిల్లా ప్రభుత్వాలతో అధికార వికేంద్రీకరణ జఱిగినప్పుడు జిల్లాల్లోని ఉద్యోగాలు యెక్కువగా ఆయా జిల్లాల వారే ఉండటం జఱుగుతుంది. అందువలన 610 ప్రభుత్వాజ్ఞ (GO) అవసరం లేదు. నదీ జలాలు వంటివి అప్పటికీ రాష్ట్రజాబితా (State List) విషయాలుగానే ఉంటాయని నాకు అర్థమైంది. (జిల్లా ప్రభుత్వాలు రావాలంటే దానికి అర్థం రాష్ట్రప్రభుత్వం రద్దవ్వాలని కాదుగా?!) అలా జిల్లా ప్రభుత్వాలున్నప్పుడు ప్రతీ జిల్లాకూ యెక్కువ మంది ప్రతినిధులుంటారు; వాళ్ళకి చిత్తశుద్ధి, చేవ ఉంటే తమ జిల్లాకి జఱగవలసిన న్యాయం జఱిపించుకుంటారు. (తెలంగాణా వాళ్ళని అణగద్రొక్కుతారన్న అఱిగిపోయిన రికార్డు మీరూ వేయకండి మఱి. ప్రతి యెన్నికల్లో 100 మందికి పైగా తెలంగాణా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలూ యెన్నికవుతున్నారుగా? వాళ్ళంతా యిన్నేళ్ళూ తమ తమ లాడ్స్ నిధులని పూర్తిగా, సక్రమంగా ఖర్చు చేసారా? తెలంగాణా ద్రోహులంటే వాళ్ళేనని మీరు గ్రహించిన రోజు బాగుపడుతుంది మన తెలంగాణా! అప్పటి దాకా యెందఱు వచ్చిపోయినా, ఎన్ని ప్రభుత్వాలు మాఱినా ఉపయోగం లేదు. ప్రజలని మోసం చేసే బుద్ధి ప్రతినిధులలో పోవాలి మొదట! అది గ్రహించి ఉంటే యేనాడో బాగుపడేవాళ్ళం!)
ReplyDeleteనచకి గారు,
ReplyDelete1)610 జీవో ఇకముందు నియామకాలగురించి మాత్రమే కాదు, ఇప్పటికే జరిగిన అన్యాయం గురించి. జిల్లాలలో ఉద్యోగాలు పెరుగుతాయనే భావన నిజమనే అనుకున్నా అది మరేవిధంగాను ఇంకో ప్రాంతం నుండి అక్రమ రెసిడెన్సీ సర్టిఫికేట్లద్వారా వచ్చేవారిని అడ్డుకోదు. అలాగే రీజనల్, జోనల్, రాష్ట్రస్థాయి ఉద్యోగాలు అలాగే ఉంటాయి. ఇంకా రాష్ట్రస్థాయి అనేక డిపర్ట్మెంట్లలఓ జరిగే వివక్ష ఎక్కడికీ పోదు. ఇది ముందే టపాలో వివరించాను, మరొకసారి మీకోసం చెబుతున్నాను. ప్రాంతీయవాదం ప్రాంతీయ వివక్షనుంచ్బి పుట్టింది, వివక్షను ఆపకుండా వాదాన్ని మాత్రం ఆపలేరు.
2) చిత్తశుద్ది, చేవ లాంటి డైలాగులు వినడానికి బాగుంటాయి, కానీ పెత్తనం ప్రక్కవాడిదగ్గర ఉన్నంతవరకూ అవేవీ పనిచెయ్యవు. ఇప్పుడు ఇంతపెద్ద ఉద్యమం జరుగుతున్నా తెలంగాణా తెదేవారు అధినేత మాటకాదని ఏమన్నా చెయ్యగలుగుతున్నారా? నీటిమంత్రి తెలంగాణా వాడయి వుండి కూడా ఇన్నాల్లూ తెలంగాణాకు ఇరిగేషన్లో జరిగే అన్యాయాన్ని ఆపాడా? ఇవేవీ స్వపరిపాలనకు ప్రత్నామ్యాయాలు కావని గమనించండి.
3) ఈ అరిగిపొYఇన రికార్డు డైలాగులు ఎన్నిసార్లు ఎందరు చెబుతారు? ఇక్కడ ఎమ్మెల్యేలూ, ఎంపీలూ ఉన్నప్పటికీ వారి జుత్తు ప్రక్క వాడిదగ్గర ఉన్నంతవరకూ ఇక్కడ పనులేమీ జరగవని ప్రజలకు అర్ధం అయింది. అందుకే ఈఉద్యమం.
4) తెలంగాణాకు నిధులవిషయం వచ్చేవరకు ఎంపీలాడ్సూ, ఎమ్మెల్యే లాడ్సూ ఎందుకు జనాలకు గుర్తొస్తాయి? ఏం, లక్షకోట్లకు మించిన బడ్జెట్లో తెలంగాణాకు మాత్రం నిధులు లేవా? ముష్టి ఎంపీలాడ్సుతో సరిపెట్టుకోవాలా? ఎందుకిలాంటి మోసపూరిత వాదనలు?
తెలంగాణా ఉద్యమం సీమాంధ్రకు వ్యతిరేకం కాదు, మాహక్కులకొరక మాతర్మే ఈపోరాటం, మీరూ అర్ధం చేసుకొని సహకరించండి.
Looks like you haven't learn the spirit of decentralization. If the decentralization is followed according to what is written in constitution now even implementation/monitoring of 610 G.O comes into purview of District govt. JP has stated this many times in several interviews,watch out.
ReplyDelete