ఉయ్యాల బ్లాగరు మిత్రుడు మంచి ప్రశ్న ఒకటి అడిగాడు. బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ పండుగను తెలంగాణా వాసులు తెలంగాణలో జరుకోవడంతోపాటు న్యూయార్క్, డల్లాస్, అట్లాంటా, సిడ్నీ, దుబాయి, లండన్ లాంటి ప్రపంచంలోని పలుచోట్ల ఉన్న తెలంగాణ వాసులు జరుపుకున్నారు. మనదేశంలో సూరత్, ఢిల్లీ, ముంబాయి, షోలాపూర్ లాంటి పలుచోట్లకూడా అక్కడ ఉన్న తెలంగాణ వాసులు బతుకమ్మపండుగ జరుపుకున్నారు. కానీ సీమాంధ్రలో గుంటూరులోగానీ, బెజవాడలోగానీ, ఒంగోలు, కర్నూలు లల్లో, ఇంకెక్కడా బతుకమ్మ పండగ జరుపుకోలేదు. కారణం?
ఎవరి పండగలు వారివి. సీమాంధ్రులు బతుకమ్మ పండగ ఎందుకు జరుపుకోలేదనేది ఇక్కడ ప్రశ్నకాదు. అలాగే తెలంగాణవాసులు సంక్రాంతికి కోళ్ళపందాలు, అట్లతద్ది, పైడితళ్ళి పండగలు చేసుకోరు. కానీ అక్కడి తెలంగాణవాసులు ఎందుకు బతుకమ్మ పండగ చేసుకోలేదు? ఏం, పట్టుమని పదిమంది తెలంగాణ ఆడపడుచులు సీమాంధ్ర పట్టణాల్లో లేరా? ఎందుకు లేరు?
వ్యవసాయానికి సాగునీరులేక, పంటలు పండక, పనులు దొరకక తెలంగాణావాసులు దశాబ్దాలుగా నౌసారి, భీమండి, బొంబాయి, షోలాపూరు, దుబాయి, మస్కట్, రియాద్ వలస వెళ్ళి పనులు వెతుక్కుంటున్నారు. బ్రతుకుతెరువుకోసం అక్కదికి వెళ్ళినవారు తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారు. ఇటీవల ఐటీ బూమ్‌లో అందరితోపాటు తెలంగాణవాసులు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లకు వెళ్ళారు. ఉద్యమంలో భాగంగా జరుగిన సంస్కృతి పునర్నిర్మాణంలో భాగంగా అక్కడా బతుకమ్మ జరుపుకున్నారు.
కానీ ఏవ్యవసాయకూలీలూ పనులకోసం పక్కనే ఉన్న గుంటూరుకో, కర్నూలుకో వెల్లిన ధాకళాలు కనపడవు. ఉద్యోగస్తులు కూడా ఎవరూ సీమాంధ్ర ట్రాన్స్‌ఫర్‌కు ఇష్టపడరు. కారణం: మనుషులు పొట్టకూటికోసం వలస వెలతారు, కానీ పొట్టకంటే కూడా మనిషి రక్షణ, మర్యాదలకు విలువనిస్తాడు, అవి దొరకనిదగ్గరకు వలస వెల్లడు.
హైదరాబాదు రాజధాని కనుక ఇక్కడ పనులు దొరుకుతున్నాయి కనుక మేం వస్తున్నాం అని చెప్పుకునే వారు తెలుసుకోవాల్సిన విషయం: సీమాంధ్రులు ఒక్క హైదరాబాదులోనే కాదు, నల్లగొండ,నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ఇలా ఎక్కద చూసినా పళ్ళె, పట్టణం తేడాలేకుండా తెలంగాణలో సీమాంధ్రులు నివాసం ఏర్పరుచుకుని ఉన్నారు. చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఒక గుంటూరు వాడ ఉంటుంది, అక్కడ సీమాంధ్రవారు నివాసం ఏర్పరుచుకుని ఉంటారు. మరి సీమాంధ్రలో మాత్రం తెలంగాణవారు ఎందుకు లేరు?
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమయిన విషయం, తెలంగాణలో సీమాంధ్రవారు మాత్రమేకాదు, ఎప్పటినుంచో బిహారీలు, మార్వాడీలు, సింధీలు, పంజాబీ, మహరాష్ట్రియన్లు, కన్నడిగలు ఉన్నారు, తెలంగాణ వాసులతో మమేకమయి నివసిస్తున్నారు, వారి వారి సంస్కృతిని, ఐడెంటిటీని కాపాడుకుంటునారు. సీమాంధ్రలో తోటి తెలుగువారయిన తెలంగాణప్రజలు లేనట్లే, అక్కడ బిహారీలు, పంజాబీలు, మహరాష్ట్రియన్లు ఎవరూ లేరు. కారణం అక్కడ కొత్తవారిని కలుపుకుపోయే స్వభావం తక్కువకనుక, పక్కవారిని తక్కువవారిగా చూడడం, అణచివేయడం పరిపాటి కనుక.
ఈపరిస్థితికి ఇంకా ఫ్యూడలిజం వాసనలు తొలగిపోని సీమాంధ్రలో జనం కులాలుగా విభజించబడి తమకులమే అధికమనే భావన కలిగిఉండడం ఒక కారణం కావొచ్చు. ముఠాకక్షలు, దళితులపై దాడులు సాధారణమయిన ఇక్కడ కొత్తవారికి రక్షణ అనిపించదు. ఇటీవల తెలంగాణ ఉద్యమం బలపడినతరువాత వీరి పరప్రాంత అసహనం మరీ పెరిగింది. తెలంగాణవాసులు గుడికెల్దామని వెలితే దాడులు, వైజాగ్‌లో బాక్సింగ్ పోటీలకని వెల్లినవారిపై దాడులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.