Wednesday, 24 October 2012

ఎవరిది దాడులకు పాల్పడే నైజం?




తెలంగాణవాదాన్ని విమర్శించడానికి సీమాంధ్ర మిత్రులు ఉపయోగించే ఒకానొక ఆయుధం "మీరు సీమాంధ్రులపై దాడులు జరుపుతున్నారు", "మీకేసీఆర్ నరకండి, చపండి అంటడు", "మీరు మా ఆస్థులపై దాడి చేస్తారు" లాంటి కొన్ని అవాస్తవాలు, అభూతకల్పనలు. అయ్యా, తెలంగాణ వాదులు మీపై ఎప్పుడు దాడులు చేశారు, ఎప్పుడు కేసీఆర్ నరకండి చంపండి అన్నాడు అంటే వీరిదగ్గర సమాధానం ఉండదు. కారణం అవి పూర్తి అవాస్తవాలు గనక, గత పన్నెండు సంవత్సరాల ఉద్యమంలో ఎప్పుడూ తెలంగాణలోని సీమాంధ్రులపై దాడులకు పాల్పడదం గానీ అందుకు నాయకులు ప్రేరేపించడం గానీ జరగలేదు గనక.  

అసలు దాడులకు పాల్పడే నైజం ఎవరిది? ఫాక్షనిజం, రౌడీయిజం, దళితుల ఊచకోత సాధారణంగా ఎక్కడ జరుగుతుంటాయి అంటే వాటికీ వీరిదగ్గర సమాధానం ఉండదు. కారణం వారి అసలురంగు అదే కావడం, అసెంబ్లీలో సగం సీమాంధ్రనేతలు ఫాక్షనిజానికి కొమ్ముకాసేవారుకాగా నాటి పదిరికుప్పం, కారంచేడులదగ్గరినుండి ఇటీవలి లక్షింపేటదాక వీరి దళితుల ఊచకోతకు అనేక ప్రత్యక్ష నిదర్శనాలు ఉండడం. 
  
ఫాక్షనిజం, దళితుల ఊచకోతలు సీమాంధ్రకే పరిమితం కదా, దానివళ్ళ తెలంగాణవారికేంటి బాధ అని ఎవరైనా అడగొచ్చు. ఈసంఘటణలు వారి నైజానికి ప్రతీకలు కాగా ఇలాంటి రౌడీ ఫాక్షనిస్టులను వారు గెలిపిస్తూ ఉండడం వలన వారు అధికారంలోకొచ్చి పరిపాలనాయంత్రాంగాన్ని ఒక మాఫియా ముఠాలా తయారుచేయడంవలన తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇదిమాత్రమే కాక ప్రస్తుత సున్నిత వాతావరణంలో సీమాంధ్రలో పలుమార్లు తెలంగాణప్రజలపై దాడులు జరుగుతున్నాయి.


వైజాగ్‌లో తెలంగాణ బాక్సర్లపై దాడి:

ఆటలను ఆటలుగా చూసే క్రీడాస్ఫూర్తిలేని కొందరు తెలంగాణ బాక్సర్ గెలుపును ఓర్వలేక దాడులకు పాల్పడ్డ హేయమైన చర్య ఇటీవల  ఇటీవలి ఉదంతం. ఈనెల 19న వైజాగ్‌లో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు జరిగాయి. అందులో హైదరాబాద్‌కు చెందిన ఒక బాక్సర్ ఆంధ్రాకు చెందిన మరోబాక్సర్‌పై గెలవగా అది సహించలేని సీమాంధ్రా బాక్సర్లు మూకుమ్మడిగా ప్రేక్షకులు చూస్తుండగానే తెలంగాణ బాక్సర్లపై దాడి చేశారు. ఘటనలో ఏడుగురు తెలంగాణ బాక్సర్లు తీవ్రంగా గాయపడ్డారు.


పెనుగంచిప్రోలులో తెలంగాణ కుటుంబంపై దాడి:



కొన్నినెల్లలక్రితం నల్లగొండ జిల్లాకు చెందిన ఒక కుటుంబం మొక్కు చెల్లించుకోవడానికి నల్లగొండకు ఆనుకుని క్రిష్ణాజిల్లాలొని పెనుగంచిప్రోలు తిరుపతమ్మగుడికి వెళ్ళారు. వీరు ఒక రెంటల్ సుమోను అద్దెకు తీసుకుని వెల్లగా ఆసుమోపై "జైతెలంగాణ" అనే స్టికర్ ఉండడం పాపమయిపోయింది. అక్కడి ఊరివారు వీరిపై మూకుమ్మడిగా దాడిచేసి స్త్రీలు, గర్భినీ అని కూడా చూడకుండా పాశవికంగా దాడి జరిపారు. అక్కడి మూకలు రాడ్లతో దాడిచేసిన ఈఘటనలో కుటుంబంలో అందరికీ తీవ్రగాయాలయ్యాయి. గర్భిణీ స్త్రీనికూదా కిరాతకంగా నేలపై పడేసి కొట్టారు. 




రాజోలిబండ రగడ:



కర్నూలు, మహబూబ్‌నగర్లమధ్య ఉన్న రాజోలిబండ ప్రాజెక్టు మహబూబ్నగర్లో కొన్ని మండలాలకు నీళ్ళిస్తుంది. దీనికి దిగువన ఉన్న సుంకేశుల బ్యారేజీ కర్నూలుకు నీళ్ళందిస్తుంది. రెండు ప్రాంతాలకూ నీళ్ళు సమానంగా వచ్చేట్లుగా రాజోలిబండలో సగం గేట్లు తెరిచి, సగం మూయబడి ఉంటాయి. మహబూబ్‌నగర్¨కు నీళ్ళు రాకుండా చెయ్యదానికి గత పది సంవత్సరాలలో మూడు సార్లు ఇక్కడ సీమాంధ్ర నేతల అధ్వర్యంలో ఫాక్షన్ మూకలు రాజోలిబండ గేట్లను పగల గొట్టడం జరిగింది. మొన్నటికి మొన్న చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా నిరశన తెలపడానికి జేయేసీ ప్రయత్నించగా అవతలివైపునుంచి కర్నూలు ఫాక్షన్ మూకలు సుమోళ్ళో కత్తులు, గొడ్డల్లు, బరిసెలతో చేరుకున్నారు.


నంద్యాల ఎడ్లపందెంలో దాడి:

ఇంతేకాక నంద్యాలలో ఎడ్లపందాలు జరిగినపుడు తెలంగాణ నుండి కొందరు తమ ఎడ్లను పందానికి పంపగా తెలంగాణా ఎడ్లను దుండగులు రాళ్ళతో కొట్టడం జరిగింది. ఎడ్లేం పాపం జేసాయో?

ఇవి కేవలం కొన్ని దృష్టాంత్యాలు కాగా ఇలాంటి సంఘటణలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. సీమాంధ్ర నాయకులు హింసను ప్రోత్సహిస్తున్నట్లుగా బయటపడరు, కానీ ఇలాంతి పనులు వారి కనుసన్నల్లో వారి అణుచరులచేతనే జరుగుతుంటాయనేది జగమెరిగిన సత్యం. 





15 comments:

  1. ఇది చాలా దారుణం. నేను ఆంధ్రా నుండే వచ్చినా , ఇటువంటి హింస సపోర్ట్ చేయను, నేనే కాదు ఎవరు ఇటువంటివి సపోర్ట్ చేయరు. why did nt they complain to police ? they should have filed a case against those stupids.

    ReplyDelete
    Replies
    1. Anonymous24 October 2012 13:07

      పోలీసులు, అధికారులూ చూస్తుండగానే ఈసంఘటణ జరిగింది, జరుగుతుంటే పోలీసులు, అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు అంటె కంప్లైంట్ ఇస్తే న్యాయం ఏపాటి దొరుకుతుందో తెలిస్తుంది కందండీ. ఇవన్నీ మన అంధ ప్రదేశ్‌లో మామూలే, ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముగాస్తున్నంతవరకూ మరొకరికి న్యాయం దొరకదు.

      Delete
  2. ఈ దాడి చాలా అమానుషం, నా సొంత ఊరు విశాఖపట్నమె, కాని ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం.
    తప్పు ఎవడు చెసిన తప్పె, దానికి అంధ్ర తెలంగాణ రాయలసీమ ఏ ప్రాంతమైనా తప్పు తప్పే, క్షమించ కూడదు.
    అలాగే ఎవరో కొంతమంది మూర్ఖుల పనికి అందరిని ఒకే గాటన కట్టి అంధ్రొళ్ళు ఇంతె అనడం మూర్ఖత్వానికి పరాకాష్ట.
    ఇది ఆంధ్రపదేశ్ ఇటువంటి దాడి విశాఖపట్నం/కరీం నగర్/అనంతపురం ఎక్కడ జరిగినా బుద్ధున్నవాడెవడు ఇలాంటివి సపోర్ట్ చెయ్యరు.

    ReplyDelete
    Replies
    1. @sharma24 October 2012 14:13

      1) ఆంధ్రోళ్ళందరినీ ఒకేగాటన ఎవరూ కట్టలేదు, ఎక్కడైనా ఇలాంటి శక్తులు కొన్నే ఉంటాయి. సమస్యేమిటంటే కొందరు చాలు ఇతరులను భయభ్రాంతులను చేసి అశాంతి క్రియేట్ చెయ్యడానికి.

      2)కేవలం ఎవరు చేసినా తప్పే, అమానుషం అంటే సరిపోదు, అలాంటిపనులు చేసినవారిపై చర్య తీసుకోవాలి, కానీ ప్రభుత్వ యంత్రాంగం పక్షపాతధోరణితో ప్రేక్షకపాత్ర వహిస్తే, పోలీసులే చూస్తూ ఊరుకుంటే, అధికారులు అంతా చూసి కూడా తెలంగాణ బాక్సర్లకు వాకోవర్ ఇస్తే మరి న్యాయం ఎలా జరుగుతుంది, ఎక్కడ దొరుకుతుంది? సమైక్యాంధ్రలో ఉన్నపాపానికి ప్రతిరోజూ ప్రతిదానికీ పోరాటం చెయ్యాల్సిందే అంటే ఎలా?

      3) "ఆంధ్రోళ్ళనందరినీ ఒకేగాటనకట్టడం మూర్ఖులు చేసేపని" అంటూ మెట్టవేదాంతం చెప్పేవారు అసలు ఎలాంటిదాడులకు పాల్పడని, పైగా ప్రతిరోజూ ప్రతిదానికీ అరెస్టులూ, భాష్పవాయువులూ ప్రయోగించబడుతుంటే హక్కులు కోల్పోతున్నవారినీ పట్టుకుని వీళ్ళు తెలబాన్లూ, వీళ్ళు దాడులు చేస్తారు అంటూ రాతలు రాసే దగుల్బాజీగాళ్ళనేమనాలి? మీరెప్పుడైనా అలాంటి విషపురాతలు రాసేదగుల్బాజీలను ఖండించారా?

      Delete
  3. తెలంగాణలో కొద్దిమంది దాడిజేసినా, దేనిమీద? ఫ్లెక్సీల మీద.. విగ్రహల మీద .. ప్రపంచంలొ ఏ ఉద్యమంలనైన ఇది మామూలె.
    కాని ఇట్లా మనుషుల మీద దాడిజెయడం విష సంస్కృతి కాదా?

    ReplyDelete
  4. @1 ఆ కొందరు అన్ని చోత్ల ఉన్నారు సార్, నెను అనేది కూడా అదె ప్రోబ్లం వాల్లతో మొదలై అది ఎక్కడికో వెళ్తుంది.

    ऽ తప్పు అమానుషం అనే మాటలు జరిగిన దానికి కాంపన్సేషన్ కోసం అన్నవి కాదు, ఆ మాటల వలన జరిగినది మాసిపోదు కూడా... పోలీసులు అధికారులు చర్యలు తీసుకుని మళ్ళి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి.

    @3 ఇష్టానుసారం దాడులు చేస్తు ప్రభుత్వ ఆస్తులు తగులబెడుతూ ఉద్యమం పేరుచెప్పి ఇష్టానికి ప్రవర్తిస్తాం అనుభవించండి, అంధ్రా వాళ్ళు హైదరాబాద్ లో ఉండకండా పొండి అన్న వెధవలని మాత్రమె మూర్ఖులు అని అన్నది. అందరిని కాదు, నిజమైన ఉద్యమం చేసే వాళ్ళ మాట ఎవరైన విని తీరాల్సిందే న్యాయం జరగాల్సిందే.. అంధ్రప్రదెశ్ లొ చాలామంది వ్యక్తులు నాయకులు కొన్ని ప్రాంతాలపై వివక్ష చూపించిన మాట నగ్నసత్యం.. అదులో తెలంగాణ జిల్లాలు మాత్రమే కాదు శ్రీకాకుళం విజయనగరం తో పాటు రాయలసీమ జిల్లలో కూడా చాలా ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. @sharma24 October 2012 16:17

      /** ఆ కొందరు అన్ని చోత్ల ఉన్నారు సార్ **/

      ఆకొందరు అన్నిచోట్లా ఉన్నారని తమరు చెబుతున్నారు, ఉదాహరణలు చూస్తే మాత్రం సీమాంధ్రలో మాత్రమే తెలంగాణవారిపై దాడులుజరిగినట్లున్నాయి. గత పన్నెండు సంవత్సరాలుగా ఇంతపెద్దున ఉద్యమం జరుగుతున్నా, ఎందరో సీమాంధ్రులు తెలంగాణలో ఉన్నా ఎక్కడా దాడులు జరిగిన సంఘటణలు లేవు.

      వాస్తవాలు ఇలాగుంటే ప్రచారం మాత్రం పత్రికల్లోనూ, టీవీల్లోనూ, బ్లాగుల్లోనూ తెలంగణవాదులే సీమాంధ్రులపై దాడులు చేస్తున్నట్లుగా జరుగుతుంది.

      దాడులు మరో ప్రాంతం వారిపైనే చేయక్కర్లేదు. ఒకే ఊరిలో ఒక అగ్రకులం వారు దళితులపై దాడులు చేసినా, రెండు ఊర్లవారు ముఠాలుగా విడిపోయి దాడులు చేసుకున్నా అమానుషమే. ఇవి ఎక్కడ జరుగుతాయో మనకు తెలుసు.

      /** అంధ్రా వాళ్ళు హైదరాబాద్ లో ఉండకండా పొండి అన్న వెధవలని మాత్రమె మూర్ఖులు అని అన్నది **/
      ఎవ్వరూ అలా అనలేదు.

      /**తెలంగాణ జిల్లాలు మాత్రమే కాదు శ్రీకాకుళం విజయనగరం తో పాటు రాయలసీమ జిల్లలో కూడా చాలా ఉన్నాయి.**/

      అది ఇక్కడ చర్చాంశం కాదు.

      Delete
  5. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టెయ్యమన్నాట్ట మీలాంటి వ్యక్తి. ఇవ్వాళ నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త చూశారా? ఇదిగో చూడండి:

    "విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో తనపై దాడి జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని మహబూబ్‌నగర్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి మహబూబ్ అలీ తెలిపారు. పోటీల సందర్భంగా జరిగిన గొడవలో తాను గాయపడినట్లు, ఆస్పవూతిలో చికిత్స పొందినట్లు వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. ఆ గొడవతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు."

    ఇలాంటి వార్తల గురించి రాసే ముందు ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకుంటే బాగుంటుంది.

    ReplyDelete
    Replies

    1. @Anonymous24 October 2012 19:08

      ఇవ్వాల్టి పేపర్లో వచ్చింది మహబూబ్ అలీ పైన మాత్రం దాడి జరగలేదని, మొత్తం తప్పని కాదు. రిపోర్టర్ ఒకపేరు ఎక్కువ రాయ్డం వల్ల దానికి దిద్దుబాటు రాశారు. దాడి వాస్తవమేనని మహేశ్ చారి ధృవీకరించాడు. తమరు మరీ దున్నపోతు ఈనదు అంటే అసలు దూదలు ఉండవు అని తీర్మానించవద్దు.

      ఇంకా మిగతా పెనుగంచిప్రోలు, రాజోలిబండ విషయాలకేం చెబుతారు? ఇవి కేవలం కొన్ని మచ్చుతునకలు మాత్రమే.

      Delete
  6. babu ilanti sanghatana lu hyderabad lo kudaa jarugutunnayi....

    anduku nene pratyaksha sakshi.

    nenu undedi kukatpally lo.

    appudu bundh jarugutunna time. oka roju night 9-10 prantham lo oka 10 mandi oka room lo unna 3guru pai daadi chesi, chithaka badaaru...

    tarvatha vellipothu..... "Ekkadi nundo batakataniki maa telangana vachi ikkada rubabu chestarra!" ani vellipoyaru...

    asalu aa room lo unnavalla tappu em ledu.


    kaabatti.... andhrollu andaru tappu cheyatledu....
    telangana vallu andaru manchi kudaa cheyatledu....

    ekkada jarige dhourjanyaalu akkada jarugutunnayi...

    warangal jilla lo oka andhra R.I ni oka room lo bhandinchi uncha ledaa?

    medak jilla lo oka andhra teacher ni uri nundi vellipommani cheppaledaa?

    ReplyDelete
  7. భయ్యా, మొదటి మాట, ఈరోజుల్లో మీడియా ఉన్నది ఉన్నట్లుగా రాయకుండా, వాళ్లు రాయాలనుకున్నది రాస్తున్నారు... ఏ ప్రాంతం మీడియా వాళ్ళు, ఆ ప్రాంతం అనుగుణంగా, ఆయా మీడియా అధిపతుల ఆలోచనా సరళి ప్రకారం రాస్తున్నారు. పై సంఘటనే చూడండి, కొందరు క్రీడాకారుల మధ్య గొడవను, వ్యక్తుల మద్య గొడవను ప్రాంతాల మధ్య గొడవగా చుయిస్తూ, ప్రాంతాల మద్య విద్వేషాలను రెచ్చగొట్టేలా రాసారు.

    రెండవది, వ్యక్తుల్లో మంచి చెడు వుంటాయి కాని, ప్రాంతాలలో కాదు, ప్రతీ ప్రాంతంలో మంచి, చెడు రెండు వుంటాయి.

    మూడవది, తెలంగాణాకి అడ్డంకి ఎవరో బయటి వ్యక్తులు కాదు, మన రాజకీయ నాయకులలో చిత్తశుద్ది లోపించడం. తెలంగాణా రాజకీయ నాయకులూ, రాజకీయ స్వప్రయోజనాల కోసం కాకుండా, తెలంగాణా సాదిద్దాం అన్న దృడ సంకల్పంతో ప్రయత్నిస్తే, తెలంగాణా పక్షం రోజులను వస్తుంది.. కాదంటారా?

    ReplyDelete
  8. Goebbls PROPAGANDA as usual

    ReplyDelete
  9. "మీరు సీమాంధ్రులపై దాడులు జరుపుతున్నారు", "మీకేసీఆర్ నరకండి, చపండి అంటడు", "మీరు మా ఆస్థులపై దాడి చేస్తారు" లాంటి కొన్ని అవాస్తవాలు, అభూతకల్పనలు. అయ్యా, తెలంగాణ వాదులు మీపై ఎప్పుడు దాడులు చేశారు, ఎప్పుడు కేసీఆర్ నరకండి చంపండి అన్నాడు అంటే వీరిదగ్గర సమాధానం ఉండదు"

    బాబు విషరూప్ పిల్లి కళ్ళు మూసుకొని ఎవరు చుడట్లెదు అనుకునట్టే ఉంధి మొదటి పేరలొ నువ్వు రాసింది

    మీరు ఎవరు మీదా దాడి చెయ్యలెదా ఎవర్ని నరకండి చంపండి అనలేదా

    నవ్వకుండ ఉండలెకపొతున్నాను బాబు

    ReplyDelete
    Replies
    1. @Anonymous25 October 2012 12:45
      కనిపిస్తనే ఉంది గద ఎవరు జేస్తున్నరో? క్రీడాకారులను, గర్భిణీ స్త్రీలను కూడ కొట్టే కిరాతకులెవరో.

      Delete
  10. Lecturers ni oU lo ventapadi kottindi PG counciling lo arhatha vunna attend aithe certificates chimputhamai bedirinchi papmpadam i vanni emto

    ReplyDelete

Your comment will be published after the approval.