గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణ ప్రాంత ప్రజలను, సంస్కృతిని, ఉద్యమాన్ని చులకనచేస్తూ సినిమాలు తీస్తూ వస్తోంది. దీనిపై తెలంగాణ ప్రజలు అనేక విధాలుగా తమ నిరసన వెలిబుచ్చారు. అయితే ఈ సారి ఆ ఆగ్రహం కట్టలుతెంచుకుంది. పట్టరాని ఆగ్రహానికి పవన్ సినిమా తెలంగాణలో నడవలేని పరిస్థితి వచ్చింది. దీనికి తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణపై చూపిస్తున్న వివక్ష ఒక కారణం కాగా దీనికి మరో ప్రధాన కారణం అటు చిరంజీవి, ఇటు పవన్ కల్యాణ్ తెలంగాణకు చేసిన వ్యక్తిగత ద్రోహం.
మూడున్నరేళ్ల క్రితం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు పలికాడు. జగిత్యాల రోడ్ షోలో చాలా ఉద్వేగంగా ప్రసంగిస్తూ (నటిస్తూ?) తెలంగాణ ఉద్యమానికి తాను వెన్నుదన్నుగా ఉంటానని నమ్మబలికాడు.
అన్న బాటలోనే తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా తెలంగాణ రాష్ట సాధన ఉద్యమానికి మద్ధతిచ్చాడు. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీలోనే ఒక సభ పెట్టి అక్కడ పెద్దపెద్ద మాటలు మాట్లాడాడు.
కరీం నగర్లో జరిగిన ఒక సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తెలంగాణపై తమకున్నంత చిత్తశుద్ధి మరెవరికీ లేదన్నాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. పైకేదో సామాజిక స్పృహ, గాడిదగుడ్డు అని ఫోజులు కొట్టే ఈ హీరో ఎంత ఘోరంగా తెలంగాణ ప్రజలను వంచించాడో.
ఆ రోజుల్లో తెలంగాణలో లక్షలాది మంది అభిమానులు ఈ అన్న, తమ్ముళ్ల మాటలు నమ్మారు. డిసెంబర్ 9, 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాగానే అటు అన్న, ఇటు తమ్ముడు రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించారు.
చిరంజీవి బూటకపు సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకోగా, తమ్ముడు పవన్ అప్పటి నుండి ఈ విషయంపై మాట్లాడమే మానేశాడు.
అట్లాంటి మనిషి ఇప్పుడు ఏకంగా తెలంగాణ ఉద్యమాన్నే టార్గెట్ చేస్తూ సినిమా తీసేసరికి ఇక్కడి ప్రజలకు గుండె మండింది. నమ్మించి తమ గొంతుకోసినందుకే పవన్ కల్యాణ్ తాజా సినిమాపై తెలంగాణ ప్రజల ఆగ్రహం రెట్టింపైంది.
వివాదం తరువాత సినిమాలో దాదాపు 15 సీన్లను కత్తెర వేయాల్సి వచ్చిందంటే ఒకసారి ఊహించుకోండి పవన్, పూరి జగన్నాధ్ ఈ సినిమాను ఎంత నిర్ల్యక్షంగా తీశారో.
source. missiontelangana.com
gummadi kaaya donga evaru ante, boojalu tadumukonnatu undi, mee vyavaharam
ReplyDelete"పవన్ కల్యాణ్ తాజా సినిమాపై తెలంగాణ ప్రజల ఆగ్రహం రెట్టింపైంది."
ReplyDeleteCollections speak the otherway.
ప్రకాష్ రాజ్ పాత్ర రాజ్ థాకరే ని పోలి ఉంటే మీరెందుకు భుజాలు తడుముకుంటారు? స్పీచ్ ఇచ్చే ముందు మందు తాగే సీన్‌లో మాత్రం కేసియార్ గుర్తొచ్చాడు.అయినా రాజ్ థాక్రే కు మీకు ఏంటి తేడా? పవన్ చెప్పిన డైలాగ్స్‌లో తప్పేముంది? తెలుగు తల్లిని ఎవడి తల్లి ఎవడికి తల్లి అని తూలనాడిన తెలబాన్లకి తెలంగాణ తల్లిని గౌరవించాలనే డిమాండు చేసే నైతిక హక్కు లేదు.సోది ఆపి స్కూలు కట్టెయ్యండి.
ReplyDeleteDonot put waste and useless comments, just by collecting photo graphs and videos. whether u have voted for chiranjeevi, even after he told that he is for telanagana
ReplyDelete@Anonymous24 October 2012 14:18
Delete1) Lakhs of people have voted to PRP. they won 2 seats from Telangana. Chiranjeevi, PK are responsible for hurting the sentiment by violating his stand and answerable to people.
2) Whether a party wins an election or not, they have to abide to the election manifesto. Only opportunistic foxes will change their stand and deviate from manifesto after the election.
అసలు "తెలంగాణా అంటే ఏంటి ? అదేక్కడుంది ?" అని వాయిలార్ రవి తెలంగాణా ని వాళ్ళ సెంటిమెంట్ని కూరలో కరివేపాకు ల...తోక లో ఈక లా తీసి పారేసారు. అలా అంటున్న వాళ్ళు వస్తున్నారు పోతున్నారు ...మీరేమో చెక్క గల్లగా ..పెదాలు తడుముకుంటూనే ఉన్నారు. ఒక సినిమా నష్టపోతే మరేం పర్వాలేదు ...నష్టపోయేది తెలంగాణా బయ్యర్లే కదా.
ReplyDelete@Redael Selrahc24 October 2012 20:07
Deleteఓహో. వాయలార్ రవి అలాగన్నాదు కాబట్టి మేం ఇలా శాంతియుతంగా ఉద్యమం చేయకుండా సీమాంధ్ర ఫాక్షనిస్టుల్లో రెచ్చిపోవాలంటారు!!
meedi santhi yuthamaina poratamaa?
Deleteaa mata inkosari anoddu. kcr badhapadthdu.
ala ayithe aa roju million march lo vigrahaalenduku pagalakodataru....?
police lanu enduku kodataru....?
bussulanu enduku tagalabedataaru....?
prayaneekulani addukuni hyd rakundaa enduku aapaaru.......?
ట్యాంక్ బండ్ పై విగ్రహాలని అడగండి మీది శాంతియుత ఉద్యమమో కాదో చెప్తాయి
ReplyDelete@తంగేడుపూలు
Deleteట్యాంకుబండు విగ్రహాలగూర్చి ఏడ్చేముందు ఒక్కసారి అసలు సీమంధ్రాలో ఎక్కడయినా తెలంగాణావ్యక్తుల విగ్రహాలు ఉన్నాయేమో చూడండి. లెకపోతే ఎందుకు లేవు?
తెలంగాణలో ఎక్కడ చూసినా సీమాంధ్ర వ్యక్తుల విగ్రహాలే. ట్యాంకు బండు విగ్రహాలు కూలాయంటే ముందు అక్కడ అవి ఉన్నాయి కాబట్టి. తెలంగాణవ్యక్తి విగ్రహాన్ని మీరు ఒక్కరోజు కూడా సహించరు కాబట్టే ఎక్కడాలెవు.
http://tinyurl.com/b23xdqm
ReplyDeleteసినిమాను సినిమాగా చూడండి
@a2zdreams,
'రాంబాబు’ సినిమాలో పూరి జగన్నాథ్ రాజకీయ నాయకులను ఏకి పాడేసాడు. ఉద్యమం అంటే పక్కోడి తల్లిని తిట్టడం కాదు, తల్లి ఎవరికైనా తల్లి. తల్లిని గౌరవించు. అని చాలా బాగా చెప్పాడు.
పూరి సినేమాలను సినేమాగా చూడాలా? మతిచేడిన ఆంధ్రోళ్ళు ,అడగకపోయినా సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు. అసలికి పూరి కున్న నీతి, నిజాయితీ ఎమిటి? ఆయాన రాజకీయ నాయకులను ఏకీపారేయటానికి. ఆంధ్రా సంస్కృతే వేరు, మీ దగ్గర నుంచి నేర్చుకోవటానికి ఎమీలేదు.
ప్రజాస్వామ్యం అంటే ధనమదం పట్టిన భుస్వాములను ఎన్నికలల్లో పోటిచేసి గెలవటమే పూరికి ఉన్న అభిప్రాయం లాగా ఉంది. సంక్రాంతి కోడిపందేలా సంస్కృతి కలిగిన ఆంధ్రోళ్ళు, ఎన్నికల సమయంలో ఏ రాజకీయ నాయకుడు గెలుస్తాడని , బెట్టింగ్ లు కట్టి డబ్బు చేసుకోవటమే వారికి తెలిసిన ప్రజాస్వామిక చైతన్యం. ఎన్నికలలో గెలిచిన ఆ భూస్వాములే భారతదేశ స్కాం సూపర్ స్టార్లు. వాళ్ళె సినేమా కిపెట్టుబడి దారులు. వాళ్ళు విసిరేసి ఎంగిలి మెతుకులకోసం అంగలార్చే వాడు, ఇతరులను గౌరవించాలని మాట్లాడటం ,ఆయన అజ్ణానికి పరాకాష్ట. పూరికి నీతి,నిజాయితి ఉంటే జైలో కూచొని ఉన్న వ్యాపార,రాజకీయ నాయకుల జీవితం మీద సినేమా తీయమను. మంచి కథ. సినేమాకి కావలసీ అన్ని మసాలాలు ఉన్నాయి. ఎవరైనా తమ అస్థిత్వం కోసం వాణిని వినిపిస్తే వారిని చెడ్డగా చిత్రికరించటం కనీస సంస్కారం లేని అతని వ్యక్తిత్వాన్ని సూచిస్తున్నాది. తెలంగాణ వారు స్వార్ద రాజకీయ నాయకులకు, ఆంధ్రోళ్ళు తారచౌదరి లాంటి సామాన్య ప్రజల ను కూడా గట్టుకొని నిస్వార్ధ ప్రజాసేవ చేసి ప్రజాజీవితంలో తరిస్తున్నారు.
ఇన్ని సినేమాలకు దర్శకత్వం వహించినా పూరికి ప్రజా ఉద్యమాన్ని, సున్నిత సమస్యలను ఎలా చూపాలో తెలియదుగాని, ప్రేక్షకులు మాత్రం సినేమాను సినేమాగా చూడాలా? ఆపవయ్యా నీ గోల, చేతిలో బ్లాగుందిగదా అని గీకమాక.
ప్రజా ఉద్యమాలకి ప్రతినాయకుడు పూరీ జగన్నాధ్
http://jajimalli.wordpress.com/2012/11/02/ప్రజా-ఉద్యమాలకి-ప్రతినాయ/