ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు తమ ఆకాంక్షలను ప్రభుత్వానికి చెప్పే ఏకైక మార్గం నిరసన. ఈనిరసన హక్కును ఇప్పుడు తెలంగాణలో విచక్షణారహితంగా ప్రభుత్వం అణచివేస్తుంది. దేశానికి ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా లేనట్టుగా ఘోరమయిన నిరంకుశ పాలన చేస్తుందీ సీమాంధ్ర ప్రభుత్వం. ఇలా ప్రజలహక్కుల హననం జరుగుతుంటె జరిగేది మనకు కాదు ప్రక్కప్రాంతం వాడికేలే అని సమర్ధిస్తే రేపు మనకు జరిగినప్పుడు ఎవారూ తోడు రారు. ప్రాంతాలకతీతంగా నిరంకుశత్వాన్ని ఖండిద్దాం, మనలో ఇంకా మానవత్వం ఉందని నిరూపిద్దాం.
ప్రధానమంత్రి హైదరాబాద్ రాక సందర్భంగా నల్ల బెలూన్లతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని పోలీసులు అరెస్టు చేస్తున్న వైనం.
తెలంగాణ మార్చ్ సందర్భంగా జరిగిన అరెస్టులూ, లాఠీ చార్జి, భాస్పవాయు ప్రయోగం.
జీవవైవిధ్య సదస్సు సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులకు అనుమతి నిరాకరించి వివక్ష చూపించిన ప్రభుత్వం తరువాతరోజు నిరసన తెలుపుతున్న జర్నలిస్టులను ఈడ్చుకెల్తున్న దృశ్యం.
శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళా జర్నలిస్టును ఈడ్చుకెల్తున్న మగ పోలీసులు.
ఉస్మానియాలో లేడీస్ హాస్టల్లో దూరి విచక్షణారహితంగా కరెంటు తీసి మరీ మహిళలపై ఘోరంగా లాఠీచార్జి చెసిన సంఘటణ.
అదేదో వాఘా బోర్డర్ అయినట్టు ఉస్మానియాను చుట్టు మట్టి చీటికీ మాటికీ రబ్బరు బుల్లెట్లు, భాష్పవాయు గోళాలు ప్రయోగిస్తూ మానవహక్కులను హరిస్తున్న ప్రభుత్వం.
విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంగా నిరశన తెలుపుతున్న మహిళను కృరంగా జీపుపైనుండి తోసేస్తున్న ఒక శాడిస్టు పోలీసు.
ఇందిరాగాంధి అప్పుడు తన అధికారం నిలుపుకోవడానికి విధించింది ప్రకటిత ఎమర్జెన్సీ అయితే ఇప్పుడు సీమాంధ్ర పెత్తందార్లు తెలంగాణాపై అధికారాన్ని నిలుపుకోవడానికి తెలంగాణాపై విధిస్తున్నది అప్రకటిత ఎమర్జెన్సీ.
ReplyDelete