Monday, 8 October 2012

తెలంగాణపై ఎందుకింత ద్వేషభావం?


ఈరోజు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో తమ హక్కుల సాధనకోసం నినదిస్తున్నారు. తమ రాష్ట్రం కోసం పోరాడుతున్నారు. లక్షలమంది ప్రత్యక్షంగా ఉద్యమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనపై తమకున్న బలమైన ఆకాంక్షను తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఎక్కడ తెలంగాణ కోసం సభ లేదా ర్యాలీ జరిగినా స్వఛ్చందంగా ప్రజలు పెద్దయెత్తున పాల్గొని తమ గొంతు వినిపిస్తున్నారు. వరుస బై-ఎలక్షన్లలో తెలంగాణ వ్యతిరేక శక్తులను చావుదెబ్బ కొట్టి ప్రజలు వోటు ద్వారా తమ ఆకాంక్షను బలంగా చాటారు. లక్షల ఉద్యోగులు నలభై నాలుగురోజులు సకలజనుల సమ్మెలో పాల్గొనగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వోర్చుకుని సమ్మెకు మద్దతునిచ్చి ప్రజలు తమ రాష్ట్రసాధనకోసం ప్రభుత్వాన్ని నిలదీశారు.


 కానీ మన సొంతరాష్ట్రంలో పక్కప్రాంతంలో ప్రజల ఆకాంక్షలు మాత్రం గౌరవించబడట్లేదు. మానవహక్కుల హననం జరుగుతుంటే స్పందించే హృదయం కరువయింది. ఇక్కడి ఉద్యమాన్ని మీడియా, సీమాంధ్ర నాయకులు తీవ్రవాదంతో పోలుస్తున్నాయి. కొందరు చదువుకున్నవారు పక్కన జరుగుతున్న అన్యాయాన్ని ఖండించకపోగా  తెలంగాణప్రజలను సోమరిపోతులంటూ, తీవ్రవాదులూ, తాలిబన్లూ  అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది? సమస్య ఎక్కడుంది?


కొందరి ప్రచారం "ఉస్మానియాలో విద్యార్థులు చదవరు, అంతా రౌడీలు, సోమరిపోతులు. ఉస్మానియాను మూసేయాలి. ప్రొఫెసర్ కోదండరాం చదువులు చెప్పడం మానేసి గొడవలు చేస్తున్నాడు." నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ సౌత్ఇండియాలోనే విద్యాప్రమాణాల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు ఒకసర్వే తేచిచెప్పింది . ప్రొఫెసర్ కోదండరాంతో సహా అనేకమంది తెలంగాణ ప్రొఫెసర్లు పౌరహక్కులవేదికల్లో భాగంగా అనేకసార్లు సీమాంధ్రలో ప్రజలపై, దళితులపై జరిగిన దౌర్జన్యాలపై పోరాడారు.

ఇది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. తెల్లవారు భారతదేశాన్ని ఆక్రమించుకుని ఇక్కడి ప్రాంతాన్ని దోచుకునేటప్పుడు ఇక్కడి ప్రజలను నాగరికతలేనివారిగా, సోమరిపోతులుగా చిత్రీకరించారు. అరబ్ దేశాలపై అమెరికా, యూరప్ దేశాలు ఒకవైపు దాడులు చేస్తూ, ప్రజాహక్కులను కాలరాస్తుంటే అదే అరబ్బులపై ద్వేషభావన కూడా అంతే ఎత్తులో ప్రచారం చేయబడింది. అమెరికాలో నల్లవారిని దోచుకునే రోజుల్లో అదే నల్లవారిని తెల్లవారు ద్వేషించారు. మనదేశంలో మనరాష్ట్రంలో దళితులపై అగ్రకులాలవారు కారంచేడు, చుండూరుల్లో దాడులు చేసినపుడు  దాడులను ఖండిచాల్సింది పోయి అక్కడి అగ్రకుల విద్యావంతుల్లో అధికభాగం దళితులపై ద్వేషభావన నింపుకున్నారు.


James W. Loewen అనే మహానుభావుడు ఈవిషయంపై చెప్పిన కోట్:
“It is always useful to think badly about people one has exploited or plans to exploit... No one likes to think of him or herself as a bad person. To treat badly another person whom we consider a reasonable human being creates a tension between act and attitude that demands resolution. We cannot erase what we have done, and to alter our future behavior may not be in our interest. To change our attitude is easier."

మనుషులు తము దోచుకునేవారిని చెడ్డవారిగా జమకడితే అది వారికి లాభదాయకం. అలా చేయకపోతే పక్కవాడిపై చేసే దోపిడీకి, దౌర్జన్యాలకు తమకు తామ సమాధానం ఇచ్చుకోవాల్సివస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు తమపనులమీద తమకే అసహ్యం వేసి తమ దోపిడీని ఆపాల్సొస్తుంది. అదే పక్కవాడిని దుర్మార్గుడిగా జమకడితే అప్పుడు తము చేసే దోపిడీకి జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం సులభం. మనుషులు తమ చర్యలను మంచివైపు మార్చుకోవడం కంటే ప్రవర్తనను దిగజార్చుకోవడం  సులభం.

 మొన్న జరిగిన తెలంగాణ మార్చ్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎంత కర్కషంగా అణచివేస్తుందో, మానవహక్కులను ఎలా కాలరాస్తుందో చెప్పడానికి ఒక నిదర్శనం. ప్రజలు తమ ఆకాంక్షను చెప్పడాని చేసిన ప్రయత్నాన్ని రైళ్ళూ, బస్సులూ ఆపేసి, ఎక్కడికక్కడ ప్రజలను మార్చ్‌కు రాకుండా అడుగడుగునా నిర్భందించి, లక్షలకొద్ది అరెస్టులు చేసి కాలరాసింది. ఉస్మానియా యూనివర్సిటీని నిర్భందించి విద్యార్థులు బయటికి రాకుండా వారిపై రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు, లాఠీలు ప్రయోగించింది. వేదికను చేరుకోవడానికి వీళ్ళేకుండా అడుగడునా ముల్లకంచెలు ఏర్పాటుచేసింది. ఒకవైపు మార్చ్ జరుగుతుంటే ఉద్యమకారులపై భాష్పవాయుగోళాలు నేరుగా మనుషులపైకి ప్రయోగిస్తే ఆ గోళాలు తాకి కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.

 భాష్పవాయువు వల్ల ఎందరో పిల్లలు, స్త్రీలు అనారోగ్యానికి గురయ్యారు. పోచయ్య అనే వికళాంగుడు రెండు కాళ్ళు అవిటివయినా కర్రలతో నాల్గు కిలోమీటర్లు నడిచి మార్చిలో పాల్గొన్నాడు.

రాజకీయనాయకులు, వ్యాపారులు, కబ్జాకోరులూ తమ స్వార్ధలాభాలకోసం తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మవచ్చు. కానీ ఉద్యమంపై, తెలంగాణపై ద్వేషాన్ని ప్రకటించే ప్రజలూ, విద్యావంతుల్లారా ఒక్కసారి ఆలోచించండి. హక్కులకోసం పోరాడుతున్న ప్రజలపై జరిగే దౌర్జన్యాలను సమర్ధిస్తే రేపు మీపై దౌర్జన్యం జరిగినపుడు మీకు తోడు దొరకదు. ఆత్మవంచన చేసుకుని అన్యాయాన్ని సమర్ధించకండి, ధైర్యంగా న్యాయాన్ని సమర్ధించండి.

19 comments:

  1. లక్షలకొద్ది అరెస్టులు..?

    ReplyDelete
    Replies
    1. అవును. ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణంలోనూ వేలకొద్ది యువకులను మార్చ్‌కు రెండు మూడు రోజులముందు అదుపులోకి తీసుకుని గృహనిర్భంధం, మేక్‌షిఫ్ట్ లాకప్‌లలో బంధించడం చేశారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఆపేయడమే కాక ప్రైవేటు వాహనాల వోనర్లను మార్చ్‌కు రావద్దని బెదిరించారు, తెగించి వచ్చినా వాహనాలను మధ్యలో నిలిపివేశారు. ఇది ఇప్పుడే కాదు మిలియన్ మార్చ్ ముందు కూడా జరిగింది, అరెస్టులు బీబీసీ కూడా రిపోర్టు చేసింది.

      శ్యామలీయం గారు,

      తెలంగాణ వాదులు ఎక్కడ టపావేసినా కాకిలా వచ్చి వాలి అచ్చుతప్పులను, లేదా చిన్న చిన్న విషయాలనూ ఎత్తి చూపే మీకు కొందరు సంస్కార హీనులు "తెలబాన్ తిప్పడు తిరునాళ్ళకు వెళ్ళాడు", "తెలబాన్లూ పండుగ చేసుకోండి" అంటూ రాసిన టపాలు కనబడలేదా? మీలాంటి పెద్దలేమయినా అలాంటికుసంస్కారపురాతలు రాసేవారిని గద్దించి వారిస్తారేమోనని ఆశపడ్డాను, నా ఆశ అత్యాశేమో.

      Delete
    2. అయ్యా,
      మీరు ఇతరుల కుసంస్కారం గురించి మాట్లాడే ముందు ఒక్క మాట గమనించాలి.
      పెద్దలు అని అంటూనే కాకిలా అనటం యెటువంటి సంస్కార మండీ?
      సరే, మీ ముచ్చట యెందుకు కాదనాలి? కాని, మరీ తరచుగా వ్యాఖ్యలు వ్రాయటం సాధ్యపడదు నాకు. చూద్దాం.

      Delete
    3. శ్యామలీయం గారు,

      మీద్వంద్వ ప్రమాణాలను ఎత్తిచూపితే అంత ఉలుకెందుకు మాష్టారు? మీ ప్రమాణాలు అత్యంత అధ్భుతంగా ఉంటాయి. రాసింది తెలంగాణ వాది అయితే "కాకిలా వాలడం" అనే తెలుగులో తరుచుగా అందరూ వాడే ఉపమానం కూడా పెద్ద దోషం, అదే రాసింది మీకు నచ్చినవాది అయితే ఒకరి కులాన్ని, భాషను, ప్రాంతాన్ని ఎగతాళి చేస్తూ నీచపు రాతలు రాసినా అవి తప్పుగా కనిపించవు. వయసులో పెద్ద అయితేనేం, మనసులో పెద్ద కావాలిగానీ? మీకు అలాంటి రాతలను తప్పుపట్టడానికి అస్సలు సమయముండదని తెలుసును లెండి.

      Delete
  2. ఈ లింక్ చదవండి: http://forproletarianrevolution.mlmedia.net.in/jux/563846

    ReplyDelete
    Replies
    1. నిజాం భజనపరులలో విశాలాంధ్రవాదులు కూడా ఉన్నారు. ఈ వార్తను చూస్తె తెలుస్తుంది.

      "హైదరాబాదు నిజాం గవర్నరుగా ఒకే ఒక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్నిర్మాణ కమిషన్ కు సమర్పించిన మెమొరాండం లో స్పష్ట పరిచింది. ఈ విషయాన్ని ఆంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ తెన్నేటి విశ్వనాధం గారు సాయంత్రం పత్రికా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు": గోలుకొండ పత్రిక 20-06-1954

      Delete
  3. విశ్వరూప్ గారు చాలా సహేతుకమయిన ప్రశ్న అడిగారు.

    " కానీ మన సొంతరాష్ట్రంలో పక్కప్రాంతంలో ప్రజల ఆకాంక్షలు మాత్రం గౌరవించబడట్లేదు. మానవహక్కుల హననం జరుగుతుంటే స్పందించే హృదయం కరువయింది. ఇక్కడి ఉద్యమాన్ని మీడియా, సీమాంధ్ర నాయకులు తీవ్రవాదంతో పోలుస్తున్నాయి. కొందరు చదువుకున్నవారు పక్కన జరుగుతున్న అన్యాయాన్ని ఖండించకపోగా తెలంగాణప్రజలను సోమరిపోతులంటూ, తీవ్రవాదులూ, తాలిబన్లూ అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది? సమస్య ఎక్కడుంది?"

    దీనికి కారణం మీ ఉద్యమ మూలాల్లోనే ఉంది. పొద్దున్న లేచినప్పటినుండి సీమంధ్ర వాళ్ళని దొంగలు దోపిడిదారులు అని అని తిట్టకపోతే తెలంగాణా ఉద్యమ కారులకి నిద్ర పట్టదు. సకల జనుల సమ్మెలో సీమంధ్ర వాళ్ళ మీద దాడులు, ఢిల్లీ లో చందర్ రావు మీద దాడి, ఇంకో కార్యాలయం (విద్యుత్ కార్యాలయం అనుకుంట) లో సీమంధ్ర వ్యక్తి మీద దాడి, ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు విరక్కోట్టటం, సమైక్యాంధ్ర సభ మీద, పరకాల ప్రభాకర్ గారి మీద దాడి, మాకు ఇష్టం లేకపోయినా తెలంగాణా లోని మా వాహనాల మీద TG అని దౌర్జన్యంగా రాయటం, తెలుగు తల్లి ఎవడికి తల్లి అనటం, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని పాడు చేయటం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రోజు మా మనోభావాల్ని కించపరుస్తూనే ఉన్నారు. మొదట్లో చూసి చూడనట్లు ఉన్న, రోజు రోజుకి తెలంగాణా వాదుల ఆగడాలు మితిమీరాయి. ఇవి మీ మీద మీ ఉద్యమం మీద సామాన్య సీమంధ్ర ప్రజలకి ద్వేషాన్ని పెంచింది. దానిని మాట్లలలోనే వ్యక్తీకరిస్తున్నారు తప్ప మీలా భౌతిక దాడులకి దిగలేదు. తెలంగాణా ఉద్యమ కారులు అవతలి వారిని కించ పరుస్తున్నప్పుడు కాని , దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు కానీ, మీరు కానీ , మీ మేధావులు కానీ ఖండించారా? లేదే . పైగా సమర్థించారు గుడ్డిగా. అది అన్యాయం కాదా?

    ReplyDelete
    Replies
    1. ఈ చత్త ప్రశ్నలకు ఇప్పటికే కొన్ని వందల సార్లు సమాధానాలు ఇచ్చి ఉంటారు. ఇంతకంటే ఎంతో ఘోరమయిన సంఘటనలు సీమాంధ్రలో జరిగినవి నేణూ ఏకరువు పెట్టగలను. అయితే విషయం ఇక్కడ అదికాదు..మీరు మీద్వేషం ద్వారా మీ దోపిడీని నిజం అని మీరే ఒప్పుకుంటున్నారు.

      Delete
    2. @Anonymous7 October 2012 18:27

      మీప్రశ్నలకు సమాధానలు:

      1) దోపిడీ: దోపిడీ జరుగుతుంది గనుక దోపిడీ దారులంటున్నారు. కేంద్రం రాష్ట్రవిభజనపై ఒక స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత ఎక్కడ దోపిడీ ఆగిపోద్దేమో అని రాత్రికి రాత్రి దొంగౌద్యమం చేసి మాటలు మార్చినందుకు దోపిడీదారులంటున్నారు. దోపిడీ దారులనేది సామాన్యులను కాదు, ఇక్కడి భూములను, సంపదను దోచుకునేవారిని, పెద్దల ప్రాపకంతో దొంగ సర్టిఫికెట్లతో ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లగొట్టేవారిని.

      మీరు అవేవీ చెయ్యకపోతే మీకెందుకు ఉలికిపాటు? మీరు దోపిడీ చెయ్యకపోతే ఇక్కడి ప్రజలనెందుకు ద్వేషిస్తున్నారు?

      2) దాడులు: దాడులు నిజంగా చేయాలనుకుంటే ఎంతమంది సీమాంధ్ర జనం హైదరాబాదులోనూ, ఇతర తెలంగాణలోనూ లేరు? ఇంత ఉద్యమం జరుగుతుంటే ఎన్నిసార్లు దాడులు జరిగాయి? మొన్న మార్చ్కు తరలివచ్చిన జనం ఎవరైనా సీమాంధ్ర ప్రజలపై దాడులు చేశారా?

      ఇదే ఉద్యమం సీమాంధ్రలో జరిగిఉంటే అక్కడి ఫాక్షన్ రౌడీ మూకలు ఎలా దాడులు చేస్తారో వేరే చెప్పాలా? మచ్చుకు ఒక ఉదాహరణ పెనుగంచిప్రోలులో గుడి దర్శనానికి వెల్లిన కుటుంబంపై పైశాచిక దాడి.

      3) మా వాహనాల మీద TG అని దౌర్జన్యంగా రాయడం:
      మహళలపై రౌడీమూకల దాడులకంటే పెద్దవిషయం కాదేమో?

      4) విగ్రహాలు: అసలు విగ్రహాలు కూలిపోయాయంటే దానికిముందు అక్కడ విగ్రహాలు ఇన్నిరోజులూ ఉన్నాయని గమనించాలి. అక్కడేకాదు తెలంగాణాలో ప్రతి ఊరిలోనూ సీమాంధ్ర నేతల విగ్రహాలు పుష్కలంగా ఉన్నాయి. మరి సీమాంధ్రలో తెలంగాణవారి విగ్రహాలు ఎవరివైనా ఉన్నాయా? ఎందుకు లేవు? తెలంగాణ వ్యక్తుల విగ్రహాలు ఉండడమనే ఊహనైనా భరించనివారు విగ్రహాలగురించి లొల్లి ఎందుకు చేస్తారు?

      అసలు తెలంగాణలోనే తెలంగాణ వ్యక్తుల విగ్రహాలు ఎక్కడైనా పెట్టుకోనిస్తున్నారా? సీమాంధ్ర నేతల విగ్రహాలు బలవంతంగా రుద్దేవారు కాళోజీ విగ్రహాన్ని కరీం నగర్లో పెట్టబోతే విచిత్రంగా విగ్రహాన్ని అరెస్టు చేశారు కదా?

      5) పొట్టి శ్రీరాములు విగ్రహాలు తెలంగాణలో ఎందుకు ఉండాలి? ఆయనేమయినా తెలంగాణకోసం పోరాడాడా? లేక కనీసం ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడాడా? ఆయన పోరాడింది ఆంధ్ర రాష్టృఅం కోసం, దానికి చెన్నై రాజధాని కావాలని, మరి మీదగ్గర పెట్టుకోక ఆయన విగ్రహాన్ని ఇక్కడెందుకు పెడతారు?

      మాహక్కులకోసం పోరాడితే అవి మీకు ఆగడాల్లా కనిపిస్తాయి. ఎందుకంటే మీదగ్గర అధికారబలం ఉంది, ఫాక్షన్ బలం ఉంది, మంద బలం ఉంది, ధనబలం ఉంది, ఈబలంతో పక్కవాడు న్యాయంకోసం పోరాడుతుంటే అణచివెయ్యొచ్చు. మీఅణచివేతను సమర్ధించుకోవడం కోసం ఇక్కడి ప్రజలపై చెడ్డవారిగా ముద్రవెయ్యడం, ద్వేషించడం మీరు చేసేపని.

      ఈచెత్తప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కాదు, చెప్పి చెప్పి మల్లీ అవే అడుగుతుంటే విసుగొస్తుంది.

      Delete
    3. నీ తెలబాన్ బుద్ది పోనిచ్చుకున్నావ్ కాదు. నీకు సంస్కారం ఉంది అనుకోవడం నాది బుద్ది తక్కువ. మీ వాదనలు అన్ని ఇలాగే తిక్క తిక్కగా ఉంటాయి. ద్వేషం ఎందుకు అన్నావ్ గా, నీవు రాసిన రాతలు చూసుకో చాలు నీకు అర్థమయిపోతుంది మీ లాంటి తెలబానులని ద్వేషించడానికి కారణం.
      కొన్ని ఉదాహరణలు చెప్తాను మీ వాదనలు ఎలా ఉంటాయో
      1 . మీ వాళ్ళు వెళ్లి ఒక ఆఫీసు లో ఒకతనిని కొట్టి వచ్చారు. అది తప్పు కాదు మీ దృష్టిలో. కాని లగడపాటి పరామర్శించడానికి వస్తే దుర్మార్గం, రెచ్చగొట్టటం. (ఏమి నోర్లు రా అవి. కొడితే తప్పు కాదు, పరామర్శిస్తే తప్పా?)
      2 . ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు కూల్చారు. కనీసం ఒక్కడికయినా అరె తప్పు చేశామే అనే ఆలోచన ఉందా? ఎవరయినా అడిగితే మీ సమాధానం 700 మంది బలిదానాల కంటే ఎక్కువా విగ్రహాలు అని? అంత కంపు నోర్లకి ఏమని సమాధానాలు చెప్తాం? అసలు 700 మంది బలిదానాలకి, విగ్రహాలు కూల్చడానికి ఏమైనా లింక్ ఉందా?
      3 మాట్లాడితే నిర్బంధం, అరాచకం, తొక్క, తోటకూర అంటారు. ప్రజాస్వామ్య పద్ధతి లో ఏమి చేసిన ఎవరు ఏమి అంటారు. వద్దు అన్న పని చేయటం, పోలీసులు దానిని ఆపడానికి ప్రయత్నిస్తే దాన్ని అరాచకంగా, నిర్బంధంగా చిత్రీకరించటం. పోలీసులు ఏమి చేయాలిట? పని పాట లేక, అచ్చోసిన ఆంబోతు లెక్క తిరుగుతున్న వాళ్ళందరిని ఊరి మీద వదిలేయమంటావా?
      ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గ్రంథం రాయొచ్చు. ఇప్పుడు జరిగిన సంఘటనని ప్రస్తావిస్తే, అన్నిటికి తింగరి సమాధానాలు. ఒక dictionary పెట్టుకుంటారనుకుంటా . మాట్లాడితే ఆత్మగౌరవం, కడుపు మంట, దోపిడీ, 700 బలిదానాలు, ప్రజాస్వామ్యం, శాంతియుతం, రాజ్యాంగబద్ధం ఇలాంటి పదాలు ఖచ్చితంగా రావాలి. మీరు మాట్లాడేటప్పుడు ఆహ ఎంత గొప్పగా కౌంటర్ ఇస్తున్నాం అనుకుంటారనుకుంటా. పక్కోల్లకి మాత్రం ఇంత V P మాటలు మాట్లాడుతున్నారెంట్రా బాబూ అనిపిస్తుంది. ఉదాహరణకి నీ సమాధానాలు.
      ఇంకో విషయం నువ్వే రాసిన ఈ పోస్ట్ చూడు.
      http://kotiratanalu.blogspot.com/2012/10/30.html
      ఇలాంటివి అన్ని అంటారు. మళ్లీ మా నోరు నొక్కుతున్నారు, కించపరుస్తున్నారు లాంటి వంకర మాటలు మాట్లాడుతారు. దీన్నే అంటారు ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అని.

      Delete
    4. @Anonymous9 October 2012 02:57

      /** నీ తెలబాన్ బుద్ది పోనిచ్చుకున్నావ్ కాదు**/
      నీకుసంస్కారం, నీ దగుల్బాజీ తనం, నీ ద్వేషం, నీ దోచుకునే బుద్ధీ, నీ దిగజారుడు మనస్తత్వం చూయించుకున్నావ్. అసలు నీ మొహానికి తాలెబన్లు అంటే ఎవరో, ముందు వారిని పెంచి పోషించింది ఎవరో తరువాత వారిని చెడ్డవారిగా చిత్రీకరించి అణచివేసింది ఎవరో తెలుసా?

      /** మీ వాళ్ళు వెళ్లి ఒక ఆఫీసు లో ఒకతనిని కొట్టి వచ్చారు. అది తప్పు కాదు మీ దృష్టిలో. కాని లగడపాటి పరామర్శించడానికి వస్తే దుర్మార్గం, రెచ్చగొట్టటం **/

      అసలు మీలగడపాటికి సొంత నియోజకవర్గంలో ఒక చిన్నరి వైష్నవి దారుణ హత్యకు గురయినప్పుడూ, ఒక బాలిక ఆయేషామీరా హత్యకు గురయి, వారికి న్యాయం జరగనపూడూ ఏనాడూ పట్టనిది, తన జిల్లాలో ఒక తెలంగాణ కుటుంబం గుడికని వస్తే మహిళలపై దాడులు చేసినప్పుడూ పట్టనిది హైదరాబాదులో ఎవరినో కొడితే కాకి కబురు పంపిందని వెల్లి వాల్తాడా? రెచ్చగొట్టడానికి కాకపోతే మరెందుకు? అసలు మీలాంటి మౌషుల సపోర్టువల్లే ఈకబ్జాకోరుగాడు ఇలా చెలరేగుతున్నాడు.

      అసలక్కడ ఎవరినీ కొట్టలేదు, ఒక సీమాద్ణ్ర ఆఫీసరు బెదించి సమ్మె సమయంలో పనిచేయిస్తున్నప్పూడు ప్రశ్నించారు. అడిగినవారిని దారుణంగా పోలీసులు కొట్టినప్పుడు అడగని నీబుద్ధి లగడపాటిని తప్పు పడితే అడుగుతున్నావా, సిగ్గుండాలి కనీసం.

      /** ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు కూల్చారు. కనీసం ఒక్కడికయినా అరె తప్పు చేశామే అనే ఆలోచన ఉందా? ఎవరయినా అడిగితే మీ సమాధానం 700 మంది బలిదానాల కంటే ఎక్కువా విగ్రహాలు అని? అంత కంపు నోర్లకి ఏమని సమాధానాలు చెప్తాం? అసలు 700 మంది బలిదానాలకి, విగ్రహాలు కూల్చడానికి ఏమైనా లింక్ ఉందా? **/

      విగ్రహాలగురించి పైనే సమాధానం ఇవ్వడం జరిగింది, మీ సీమాంధ్రలో ఒక్క తెలంగాణ మనిషి విగ్రహం లేదెందుకని, మల్లీ మొదలు పెట్టావా? 700 మంది బలి కావడానికి కారణం మీదొంగ ఉద్యమం, వారి చావుకు కారణం మీరు.

      /** ప్రజాస్వామ్య పద్ధతి లో ఏమి చేసిన ఎవరు ఏమి అంటారు. **/

      ఓహో, కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే రాత్రికి రాత్రే రాజీనామాల నాటకమాడి, మెజారిటీ ఉంది కదా అని రాజీనామాలతో బ్లాక్మెయిలు చెయ్యడం ప్రజాస్వామ్యమా? బస్సులూ, రైళ్ళూ, ప్రభుత్వ ఆస్థులూ ధంసం చెయ్యడం ప్రజాస్వామ్య పద్దతా? సిగ్గుండాలి.

      ఫాస్ఖనిస్టులూ, బెజవాడ రౌడీలూ, కులగజ్జితో నరుక్కు చచ్చేవారు మాకు శాంతిమంత్రాలు చెబుతున్నారా? పొయ్యి పని చూసుకో.


      Delete
  4. Unless seemandhra people agree telangana cannot be carved. convince them. u r taking the wrong route.

    ReplyDelete
    Replies
    1. @ Anonymous7 October 2012 20:40

      Don't worry, we know our way. We don't have to ask route from those who never want us to reach our destination.

      Delete
  5. దోపిడి, దోపిడి అని గొంతు చించుకుంటున్నారు. అంటే మీ దృష్టిలో తెలంగాణా ప్రజలు ఏమీ చేతకాని అమాయకులా? ఎవరో వచ్చి దోచుకుపోతుంటే అప్పనంగా అన్నీ అప్పగిస్తున్నారా? ఇకనైనా మీ ఊహాగానాలు మానండి. సీమాంధ్రలేమీ పరాయివారు కారే... వారి సొంత రాష్ట్రం, సొంత రాజధానిలో వారిని బతకనివ్వరా? ఎవరో రాజస్థానీలు, బీహారీలు హైదరాబాదుకొచ్చి బతకొచ్చుగానీ సొంత తెలుగు వాళ్లు ఇక్కడ బతకకూడదా? జాగో, భాగో అంటారా? రాష్ట్రం ఏర్పడి నప్పటి నుంచీ లెక్కలు తీస్తే మిగతా అన్ని ప్రాంతాలకన్నా తెలంగాణానే అభివృద్ధిలో బాగా ముందుంది. కానీ మీరొప్పుకోరు. మీకెపుడూ ఏదో ఒక ఏడుపు ఉండాలి. మీ రాజకీయ నాయకులు ఇంతకంటే భిన్నం కాదు. ఇంతకాలం వెనకబాటుతనం అన్నారు, లెక్కలు నిజం చెప్పిన తర్వాత ఇపుడు ఆత్మగౌరవం అంటున్నారు. రేపొద్దున ఇంకేమని చెబుతారో... సీమాంధ్రులకేమీ మీతో అంటకాగాలని లేదు. యాభై ఏళ్ల పాటు రాజధాని అభివృద్ధిలో పాలు పంచుకుని ఇప్పుడు వెళ్లిపోమంటున్నారనే బాధ తప్ప. మీకోసం కర్నూలు రాజధానిని త్యాగం చేశారు. కానీ మీరేం చేశారు, చేస్తున్నారు. రాష్ట్రాన్ని నిరంతరం రావణకాష్టంలా మార్చడం తప్ప.....

    ReplyDelete
    Replies
    1. @Anonymous8 October 2012 13:21

      /* దోపిడి, దోపిడి అని గొంతు చించుకుంటున్నారు. */
      ఆకలేసినవాడు ఆకలి ఆకలి అని గొంతుచించుకుంటాడూ, దోపిడీకి గురయినవాడు దోపిడీ దోపిడీ అని అరుస్తాడూ, అదికూడా తప్పేణా?

      /* అంటే మీ దృష్టిలో తెలంగాణా ప్రజలు ఏమీ చేతకాని అమాయకులా? */
      కొంతవరకూ ఇది నిజమే. అందుకే ఇన్నిరోజులూ సహించాం. కాకపోతే మీదోపిడీ సాగడానికి కారణం మీవోళ్ళదగ్గర అధికారం ఉండడం వలన అని గమనించాలి.

      /**సీమాంధ్రలేమీ పరాయివారు కారే.../
      అలాగనుకొనే ఉమ్మడిరాష్ట్రానికి ఒప్పుకున్నాం, గానీ తర్వాత తెలిసింది.

      /**వారి సొంత రాష్ట్రం, సొంత రాజధానిలో వారిని బతకనివ్వరా? ఎవరో రాజస్థానీలు, బీహారీలు హైదరాబాదుకొచ్చి బతకొచ్చుగానీ సొంత తెలుగు వాళ్లు ఇక్కడ బతకకూడదా?**/
      రాజస్తానీలు, బిహారీలు ఇక్కడ బతకడానికి వచ్చారు, బతకడానికి వచ్చేవారిని ఎవరినయినా మేం ఆదరిస్తాం. మీలాగా రౌడీయిజం, ఫాక్షనిజన్ చూపించి బెదరగొట్టం. అధికారం అండతో దోచుకునేవారితోనే సమస్య.

      /**జాగో, భాగో అంటారా?**/
      మాహక్కులకడ్డుపడేవారినెవరినయినా అంటాం.

      /**రాష్ట్రం ఏర్పడి నప్పటి నుంచీ లెక్కలు తీస్తే మిగతా అన్ని ప్రాంతాలకన్నా తెలంగాణానే అభివృద్ధిలో బాగా ముందుంది.**/
      అలాగా? లగడపాటి చెప్పాడా?

      /**యాభై ఏళ్ల పాటు రాజధాని అభివృద్ధిలో పాలు పంచుకుని ఇప్పుడు వెళ్లిపోమంటున్నారనే బాధ తప్ప.**/
      పొరపాటు, యాభై ఏళ్ళు అన్ని సమకూర్చిన వడ్డీంచిన విస్తరిలాంటి రాజధానిని అనుభవించారు. సంతోషించండి.

      /* మీకోసం కర్నూలు రాజధానిని త్యాగం చేశారు.**/
      మాకోసమా? అంత త్యాగం ఎవరు చేయమన్నారు, మామానాన్ మేంఉండే వాల్లం? అక్కడే టెంట్లకింద రాజధాని భేషుగ్గా ఉండేది మీకు.

      Delete
    2. Yes., You sacrified the capital that exists with tents..... how funny you are.....

      Delete
  6. Anthaa baane undi... Asalu kodandaram sir gaaru university ki eppudeppudu eltuntaaru paataalu eppudu cheptuntaaru?

    ReplyDelete
    Replies
    1. @Anonymous8 October 2012 18:21

      Good that you asked. Prof. Kodandaram is in long unpaid leave and he is using his unpaid leave for Telangana movement. Unlike Prof. Samuel who is heading Samaikyandhra JAC he is not using his paid time for any agitations. You should now ask the same question to Prof. Samuel of Nagarjuna University.

      Delete

Your comment will be published after the approval.