ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ గురించి తెలిసినవారికి "లీన్" (LEAN) మెథడాలజీ గురించి తెలిసే ఉంటుంది. "లీన్"లో ఒక ప్రాజెక్టు ప్రాసెస్‌ను అధ్యయనం చేసి అందులో ఉత్పత్తి తగ్గడానికి విధానంలో ఉన్న అవరోధకాలను (pain areas) తెలుసుకుని, ఈఅవరోధకాలను అధిగమించడానికి ప్రణాలికను తయారుచేయడం "లీన్" లో ఒక ముఖ్యమైన అంశం.
చంద్రబాబు మామను దించేసి ముఖ్యమంత్రిగా అయినతరువాత "లాప్‌టాప్స్"తో పవర్ పాయింటు ప్రెజెంటేషన్లు దంచేసి హైటెక్ ముఖ్యమంత్రిగా పచ్చపత్రికలతో బాకా ఊదించుకుంటున్న రోజుల్లో ఎవరో ఈయన చెవిలో "లీన్" ప్రాజెక్టు గురించి సమాచారాన్ని చేరవేశారట. వెంటనే మన చంద్రబాబుకు 1999 ఎన్నికల్లో గెలవాలంటే వోట్లు దండుకోవడానికి నామామకూడా లేడు, నామొహాన్ని జూసి మీటింగు పెడితే ఒక్కరు కూడా రాడు కదా అన్న విషయం గుర్తొచ్చింది. ఇంకేముంది ఎలక్షన్లలో ఎలా గెలవాలో ఒక "లీన్" ప్రాజెక్టు చేయమని తన పచ్చతమ్ముళ్ళకు పురమాయించాడట.
ఈవిషయ్మ్ మీద స్టడీ చేసిన పచ్చతమ్ముల్లు ఇల్ల ఆలోచించారు. ఎలక్షన్లలో నెగ్గాలంటే నాలుగు మార్గాలు 1) ఎంటీఆర్ లా ప్రజాకర్షణ కలిగి ఉండడం 2) మంచిపనులు చేసి ప్రజల మనసులు గెలవడం 3) మీడియాలో బాగా ప్రచారం పొందడం 4) రిగ్గింగ్ చెయ్యడం. మొదటిది అసాధ్యం. రెండవది కష్టం. మూడవది ఎలాగూ పచ్చపత్రికలద్వారా జరుగుతూనే ఉంది కానీ సరిపోదు. నాల్గవదానిపై ఏంచెయ్యాలి?
"రిగ్గింగ్" అనే ప్రాజెక్టులో అతిపెద్ద అవరోధం (pain area) ఏమిటంటే డబ్బులు తీసుకున్నవాడిదగ్గరనుండి వోటు రాబట్టడం. అన్ని పార్టీలూ డబ్బులిస్తాయి, వోటరు అందరిదగ్గరా డబ్బు తీసుకుంటాడు గానీ చివరికి ఎవరికి వోటేస్తాడో తెలియదు. మరి వోటరుకు డబ్బు ఇచ్చాక ఖచ్చితంగా వోటు రాబట్టడం ఎలా?
దీనికోసం రాత్రింబవళ్ళు ఆలోచించి తెలుగు తమ్ముళ్ళు చివరికి ఒక పక్కా ప్రణాలికను చంద్రబాబుకు సమర్పించారు. అదేమిటంటే ఎలక్షన్లరోజు ప్రతి బూతులోనూ ముందు ఒక తెదేకార్యకర్త వోటు వెయ్యడానికి వెల్తాడు. అయితే వోటు వెయ్యడం కోసం ఇచ్చిన బ్యాలెట్ పేపరును పోలింగ్ డబ్బాలో వేయకుండా ఒక తెల్లకాగితం మడిచి వేస్తారు, బ్యాలెట్ పేపరును జాగ్రత్తగా రహస్యంగా బయటికి తీసుకొస్తారు.
ఆతరువాత ఆబ్యాలెట్ పేపరుపై ముందే సైకిలు గుర్తుపై స్టాంపు గుద్ది దాన్ని వోటరు మహాశయునికిస్తారు. వోటు వెయ్యడానికి పోలింగ్‌బూత్ లోపలికి వెల్లే వోటరు మహాసయుడు ఇప్పుడు తనకిచ్చిన ముందే స్టాంపు గుద్దిన బ్యాలెట్ పేపరును డబ్బాలో వేయాలి, తనకిచ్చిన ముద్ర గుద్దని బ్యాలెట్ పేపరును బయటికి తీసుకురావాలి. అలా ముద్రగుద్దని బ్యాలెట్ పేపరును బయటికి తీసుకొస్తేనే రిగ్గింగ్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే డబ్బులు ఇవ్వరు.
తరువాతి వోతరుకు మల్లీ ఈబ్యాలెట్ పేపరుపై ముద్ర గుద్ది ఇస్తారు, మల్లీ అదేపద్దతి ఇప్పుడూ రిపీట్ అవుతుంది.
ఈవిధంగా పక్కాగా తయారుచేసిన ప్రణాలిక చంద్రబాబుకు వెంటనే నచ్చేసింది. రాష్ట్రమంతటా అన్ని బూతుల్లో ఇదేపద్దతి పాటించండని తెలుగుతమ్ముళ్ళకు పురమాయించాడు. రహస్యంగా పకడ్బందీగా తయారు చేసిన ఈప్రణాలికతో రిగ్గింగు చెయ్యడం, పచ్చపత్రికల్ల్లో ఊదిన బాకా తోడవ్వడంతో 1999 ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రేస్‌పై గెలిచేశాడు. ఎన్‌టీఆర్ను కాదని చంద్రబాబు తన సొంత బలంతో గెలిచిన ఒకే ఒక ఎన్నిక ఇది.
ఈపద్దతిని 2004 ఎన్నికల్లోగా కాంగ్రేస్ తెలుసుకుందో లేదో యెలియదు గానీ 2004లో వచ్చిన ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లతో చంద్రబాబు ప్రణాలిక మాత్రం అమలు జరపడం కుదరలేదు. అప్పటినుంచీ చంద్రబాబు ఈవీఎంలమీద ఏడుస్తూనే ఉన్నాడు.
ఇలా అని మీకెవఱు చెప్పారో ! ఇలా చేయడం పూర్తిగా అసాధ్యం.
ReplyDelete@Anonymous23 October 2012 21:34
Deleteఅభిగ్ఙవర్గాల భొగట్టా. ఎందుకసాధ్యం?