Saturday 13 October 2012

తెలంగాణ సినిమాలకు అవార్డుల పంట



2011 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులను ప్రకటించారు. అవర్డుల్లో ఈస్సరి తెలంగాణ సినిమాలు అవార్డుల పంట పండించాయి.

తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో రూపొందిన చిత్రం జైబోలో తెలంగాణ దర్శకుడు ఎన్. శంకర్‌కు ఉత్తమ దర్శకుడు అవార్డు, జై బోలో తెలంగాణకు ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం అవార్డు, గద్దర్‌కు "పొడుస్తున్న పొద్దు మీద" పాటకు ఉత్తమ గాయకుడు అవార్డు వచ్చాయి.

ఇంకా విడుదలకు నోచుకోని మరో తెలంగాణ సినిమా "ఇంకెన్నాళ్ళు" లో నటించిన సుజాతారెడ్డికి ఉత్తమ సహాయనటి అవార్డు వచ్చింది. తెలంగాణ ఉద్యమం నేపధ్యంలో రఫి నిర్మించి దర్శకత్వం వహించిన ఈసినిమా విడుదలకు థియేటర్లు దొరక్క సినిమా విడుదల కాలేదు. రాష్ట్రంలోని సినిమాహాళ్ళన్నీ ఒక నలుగురి కంట్రోళ్ళో ఉన్నవిషయం తెల్సిందే.

తెలంగాణ నేపధ్యంగంతో రూపిందిన మరో సినిమా రాజన్నకు కూడా అవార్డులు వచ్చాయి. అయితే ఈసినిమాకు దర్శక నిర్మాతలతో సహా ఎవరూ తెలంగాణవారు కారు. తెలంగాణ ప్రజాకవీ, గాయకుడు అందేశ్రీ పాతకు ఉత్తమ గేయం అవార్డు రాకపోవడం దురదృష్టం.    

8 comments:

  1. ప్రభుత్వాన్ని అంత సులభంగా నమ్మలేము. తెలంగాణా ప్రజలని మునగచెట్టు ఎక్కించడానికే ఆ అవార్డ్ ఇచ్చి ఉండొచ్చు. ఇల్లు అలకగానే పండగ కాదు అనే డైలాగ్ ఆ సినిమాలోనే ఉంది.

    ReplyDelete
    Replies
    1. This is not just a question of possibility. I am 100% sure about my above comment.

      Delete
    2. ప్రవీణ్,

      అవార్డు ఇవ్వడానికి ప్రభుత్వానికి మరో ఉద్దేషం ఉందేమో నాకు తెలియదు. అయితే ఏకారణం చేత ఇచ్చినప్పటికీ ఇది తెలంగాణకు సంతోషకరమయిన వార్త. సినీఫీల్డును మొత్తం మూడు నాలుగు కుటుంబాల చేతిలో ఉంచుకుని ఆకుటుంబాల్లో వారి కొడుకులూ మేనళ్ళుల్లూ చింపాంజీ మొహాలతో ఉన్నా వాల్లనే హీరోలు చేసి మనమీదికి రుద్దే పరిస్థితి. సినీఫీల్డులో హీరోలయితే ఈమూడు నాల్గు కుటుంబాలవారే రావాలి, ఇక మిగతా పోస్టులకు కూడా తమ కులం, తమ ప్రాంతం వారికే పెద్దపీట వేస్తూ తెలంగాణ భాషను, సంస్కృతిని హేళనాపూరితంగా చూపించే ఈసినీమాయాలోకానికి తెలంగాణ పోరుమీద తీసిన సినిమాకు అవార్డు రావడం ఒక చెంపపెట్టు.

      తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దేశసమగ్రతకే ముప్పు అంటూ గోబెల్స్ చిలకపలుకులు పలికే సీమాంధ్ర నేతలకు జైబోలో తెలంగాణకు జాతీయసమగ్రతా అవార్డు రావడం ఒక చెంపపెట్టు.

      ఇక బాలయ్య పెడబొబ్బలకూ, దాసరి మొరుగుడుకూ అవార్డులు ఇచ్చినప్పుడు మాట్లాడనివారు తెలంగాణ సినిమాకు అవార్డు వస్తే బ్లాగుల్లో ఏడుస్తున్నారు కదా, అలాంటివారికి ఈఅవార్డుతో ఇప్పుడు నిద్రరావడం లేదులాగుంది, ఏడుస్తూనేఉంటారు.

      Delete
    3. జై బోలో తెలంగాణా సినిమా నేను చూశాను. సినిమాలో సెన్సార్ కట్స్ వల్ల స్క్రీన్ ప్లే అస్పష్టంగా అనిపించింది. సినిమా విడుదల అవ్వకముందే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వం ఆ సినిమాకి నిజంగా అవార్డ్ ఇచ్చిందంటే అది నమ్మశక్యం కాని విషయమే.

      Delete
  2. మల్లి లొల్లి చేస్తారని ఇచ్చి ఉంటారు. లేకపోతే జై బోలో తెలంగాణా కి ఉత్తమ దర్శకుడు అవార్డు ఏంది నా బొంద.

    ReplyDelete
  3. అయ్యా అనానిమసూ !
    తమరి బొందే !
    నడుస్తున్న చరిత్రను అప్పటికప్పుడు అంత ధైర్యంగా, చక్కగా, ఎవరి మనసులు నొప్పించకుండా తీసి ఒప్పించిన దర్శకుని పతిభ, సత్తా .. అర్థం కాని తమరి బొంద కాక ఇంకేమిటి?

    ReplyDelete
  4. మాకు తెలంగాణా ప్రజల అభిప్రాయాలంటే గౌరవం ఉంది కాబట్టి మేము తెలంగాణా ఇవ్వకపోయినా ఏమీ కాదు అని చెప్పడానికే తెలంగాణా సినిమాలకి అవార్డ్‌లు ఇచ్చారు. సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికే డైరెక్టర్‌ని ఎంతో ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆ డైరెక్టర్ తీసిన సినిమాకి అవార్డ్ ఇస్తుందంటే నమ్మాలా?

    ReplyDelete

Your comment will be published after the approval.