Thursday 2 June 2011

తెలంగాణ FAQ-1: స్వార్ధ రాజకీయ నాయకులతో పోరాడండి??!!

తెలంగాణవాద విమర్శకులు తరుచూ ఎత్తుకునే వాదన "మీ సమస్యకు అసలు కారణం స్వార్ధ రాజకీయనాయకులు, మీరు ఆ స్వార్ధనాయకులతో పోరాడండి, రాష్ట్రం కోసం కాదు" అని. నిజమే స్వార్ధ రాజకీయనాయకులు దేశమంతటా ఉన్నారు, రాష్ట్రంలో ఇరువైపులా ఉన్నారు. ఇదొక జాతీయ సమస్య. అందరూ ఈవిషయంపై పోరాడవలిసిందే, కాదనేదేం లేదు.

మరిక్కడ కిటుకేమంటే మీనాయకులతో మేమెలా పోరాడుతాం, అందునా మీరు అలాంటి స్వార్ధ నీతిమాలిన నాయకులను గెలిపిస్తుంటే వారు అధికారం చేజిక్కించుకుంటే మేమెలా పోరాడేది? మానాయకులతోనే ఎందుకు సమస్య, మీతెలంగాణలో నాయకులు లేరా అంటారా? అధికారం ఎవరిదగ్గర ఉంటే వారితో పోరాడాలి గానీ అధికారం లేనివారితో పోరాడేం లాభం? ఎప్పుడూ సీమాంధ్రా నుంచే రాష్ట్ర అధినాయకులు ఉంటారు, వారి కనుసన్నలలో మెలిగే డమ్మీలు కొందరు తెలంగాణ నుంచి మంత్రి పదవులు దక్కించుకుంటే అలాంటి డమ్మీలతో పోరాడి ఏంలాభం?

అందుకే మేము ముందు స్వరాష్ట్రం కోసం పోరాడుతున్నాం, మా రాష్ట్రం వచ్చిన తరువాత మేం నా స్వార్ధనాయకులతో పోరాడుతాం. అదీ సంగతి.

స్వార్ధ రాజకీయ నాయకులతో మనం 60 ఏళ్ళనుండి పోరాడుతున్నాం, ఇకముందు కూడా పోరాడుతూనే ఉంటాం, ఆపోరాటం అంత తొందరగా ముగిసేది కాదు. మీరు చెప్పేది కొత్త విషయమేమీ కాదని గమనించండి. అయితే ఇక్కడ పాయింటేమంటే రాష్ట్రం ఎంత చిన్నదయితే స్వర్ధ రాజకీయ నాయకులతో పోరాడ్డం అంత సులభం, కాబట్టి విభజన జరిగితే మీరూ, మేమూ కూడా ఇప్పటికంటే సమర్ధవంతంగా స్వార్ధరాజకీయ నాయకులతో పోరాడవచ్చు.

8 comments:

  1. "అయితే ఇక్కడ పాయింటేమంటే రాష్ట్రం ఎంత చిన్నదయితే స్వర్ధ రాజకీయ నాయకులతో పోరాడ్డం అంత సులభం,"
    మరి చత్తీస్ ఘడ్, జార్ఖండ్ లో ఈ పాటికి శాంతి సామరస్యాలు వచ్చేసి ఉండాలే? అవి చిన్న రాష్ట్రాలయ్యయిగా? అక్కడ ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తూ ఉండాలే?

    ReplyDelete
  2. అయితే ఇక్కడ పాయింటేమంటే రాష్ట్రం ఎంత చిన్నదయితే స్వర్ధ రాజకీయ నాయకులతో పోరాడ్డం అంత సులభం, కాబట్టి విభజన జరిగితే మీరూ, మేమూ కూడా ఇప్పటికంటే సమర్ధవంతంగా స్వార్ధరాజకీయ నాయకులతో పోరాడవచ్చు....

    awesome..without HYD it will be even smaller and easier to fight..take it..take it with both hands...

    ReplyDelete
  3. గోవులకు బతుకు అంటే పోరాటమే.
    అడుగడుగునా పోరాడుతేనే వాటి మనుగడ.
    గోవులకు పోరాడమని వ్యాఘ్రాలు చెప్పనక్కరలేదు.
    అవి ఉచిత సలహాలు కావు వెటకారాలు.
    మదమెక్కిన పులుల కవ్వింపులు
    ఆ మదం దిగే వరకూ అవి అలాగే వాగుతంటాయి

    ReplyDelete
  4. Anon 1: You can check how uttaranchal, chattisghar, jharkhand are better off now after the separation from the economic times report in my previous post.

    Anon 2: If state is smaller it will be easier to fight with the bureaucracy, but that is not the only criteria. Why do you bother about hyderabad, what do you do with hyderabad if it is in the middle of telangana? Do you fly everyday to reach your capital?

    ReplyDelete
  5. @Anon, but the law of nature is cow can never win over tiger.. :)

    ReplyDelete
  6. above anon:

    Thanks for agreeing the fact that we are cows and you are tigers. As you said tigers only are winning in the samikya state, for that reason only we ask for separate state.

    ReplyDelete
  7. ఆవు పులిని తినడం ఆటవిక నియమం నాయనా. ఆకులూ, అలములూ తింటే పులి బతకదు. ఆ నియమం మనుషులకి వర్తించదు. ఎందుకంటే మనిషి సమాజంలో బతుకుతున్నాడు కానీ ఆటవికంగా బతకడం లేదు.

    ReplyDelete

Your comment will be published after the approval.