Wednesday, 1 June 2011

రజాకార్ల వారసులకు సమైక్యాంధ్ర ఎందుకు?

ఆఖరు నిజాం కాలంలో భూస్వాముల దోపిడీకి వ్యతితేకంగా తెలంగాణలో సాయుధపోరాటం మొదలవగా, అదే సమయంలో సాయుధ పోరాటాన్నీ, హిందువులు స్థాపించిన ఆర్యసమాజ్‌ను అణచివెయ్యడానికి నిజాం కనుసన్నల్లో ఖాసిం రజ్వీ అధ్వర్యంలో రజాకార్ల సేన మొదలయింది. ఈ రజాకార్లు హైదరాబాద్ హిందువులను, తెలంగాణ సాయుధ పోరాట యోధులను ఊచకోత కోశారు. ఆ ఖాసిం రజ్వీ వారసులే ఇప్పటి మజ్లీస్ పార్టీ ఓవైసీలు. మరి వీరికి సడెన్‌గా సమైక్యాంధ్ర మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? తెలంగాణకు వీరెందుకు వ్యతిరేకం? ఎందుకు విభజన తప్పకపోతే రాయలతెలంగాణ కోరుతున్నారు? పాతబస్తీలో మాత్రమే బలమున్నవారికి సమైక్య రాష్ట్రంతో ఏం పని?

1. గత ఇరవై సంవత్సరాల కాలంగా వీరికి కాంగ్రేస్ తో దోస్తీ నడుస్తుంది. దాని వలన వీరు బలపడ్డారు. రాజకీయంగా కాంగ్రేస్‌తో పొత్తు పెట్టుకోగా లోపాయకారీగా కొంతమంది రాయలసీమ నాయకులతో వీల్ల కూటమి కూడా బాగానే ఉంది.

ఎప్పుడు కాంగ్రేస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చాలన్నా పాతబస్తీలో గొడవలు సృష్టించడం మామూలే. లోపాయకారీగా సీమ నుంచి గూండాలను దించడం దానికి ఇక్కడి మజ్లీస్ కూడా తోడ్పడం జరుగుతుంది. ఇలా ఒకరికొకరు ఇన్నాల్లూ తోడూనీడలాగా ఉన్నారు. ఇప్పుడు విడిపోతే ఆ బంధం తెగిపోవచ్చు. అందుకే రాయల తెలంగాణ అయితే కొంత బెటర్.

2. తెలంగాణ మొత్తం రాష్టంగా కాకుండా గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రమయితే వీరు బలమయిన శక్తిలాగా తయారయి అధికారం చేజిక్కించుకోవచ్చు, కానీ అలా డైరెక్టుగా చెప్పలేరు. కాబట్టి ఏదోలా తెలంగాణకు అడ్డుతగిలి హైదరాబాద్‌ను విడగొట్టడానికి ఆంధ్రనాయకులు వత్తిడి తెచ్చేల చెయ్యడం ఒక ప్లాన్ కావొచ్చు.

3. తెలంగాణలో బీజేపీ బలపడి వీరిని అణచివేసే ప్రయత్నం చేస్తారనే భయం ఉండొచ్చు.

4. తాము తెలంగాణలో నాడు ఊచకోతకోసినదానికి తెలంగాణ ప్రజలు ప్రతీకారం తీర్చుకోవచ్చుననే భయం ఉండొచ్చు.


అయితే మజ్లీస్ మాట తెలంగాణ ముస్లిముల మాట కాదు. తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో ఉన్న ముస్లిములు, హైదరాబాద్ లో, సికందరాబాద్లో ఉన్న మజ్లీస్‌కు చెందని అనేక ముస్లిములు తెలంగాణ రావాలనుకుంటున్నారు.

ముస్లిములలో కొద్దిమంది మిడిల్ ఈస్ట్ నుంచి వలస వచ్చినవారు కాగా ఎక్కువ మంది ఇక్కడి దళిత, బీసీ వర్గాలు ముస్లిములుగా కన్వర్ట్ అయినవారు, వీరు హైదరాబాదులో చిన్న చిన్న పనులు, వ్యాపారాలు చేసుకునే వారు. వీరు సమైక్యాంధ్రలో నష్టపోయామని భావిస్తున్నారు కనుక వీరికి తెలంగాణ ఒక అవసరం.

1 comment:

  1. ఒవైసీ కుటుంబంవాళ్ళు నిజాం ఒస్మాన్ అలీ ఖాన్‌కి బంధువులని కోస్తా ఆంధ్రవాళ్ళ యాజమాన్యంలో ఉన్న టివి చానెల్‌లోని వార్తలలోనే విన్నాను. నిజాం నవాబులకి వ్యతిరేకంగా పోరాడినవాళ్ళలో కొంత మంది ముస్లింలు కూడా ఉన్నారు. ఒకప్పుడు కృష్ణా జిల్లా పరిటాల ప్రాంతం నల్లగొండ జిల్లా మునగాల సంస్థానంలో భాగంగా ఉండేది. పరిటాల ప్రాంతంలోని ఒక గ్రామంలో ముస్లిం మత పెద్దలు ముస్లింలు నిజాంకి వ్యతిరేకంగా పోరాడకూడదని ఫత్వా జారీ చేశారు. ఆ ఫత్వాని ధిక్కరించి కొంత మంది ముస్లింలు నిజాం నవాబులకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీని గురించి 'వార్త‌' దిన పత్రికలో చదివాను.

    ReplyDelete

Your comment will be published after the approval.