ఈమధ్య తెలుగులో ఒక కొత్త బ్లాగు విశాలాంధ్ర మహాసభ పేరుతో మొదలయింది. వీరికి ఒక సొంత వెబ్‌సైటూ, ఒక ఫేస్బుక్ గ్రూపూ ఉన్నాయి. ఈబ్లాగు వెనుక సీమాంధ్రవాద ధురంధరులు నలమోతు చక్రవర్తి, పరకాల ప్రభాకర్ లాంటివారు ఉన్నారు.
వీరు బ్లాగును రెండునెలలక్రితం ఆశావహంగా మొదలుపెట్టారు. వీరు తెలంగాణకు వ్యతిరేకమయినా, తెలంగాణవాదులు ఎందరో వీరి ఇనీషియేటివ్‌కు సంతోషించారు. కారణం తెలంగాణవాదులకు కావలిసింది సహృద్భావ చర్చ. చర్చ జరిగితే వారికి తమ వాదననూ, తెలంగాణ ఆవశ్యకతనూ తెలిపే అవకాశం లభిస్తుంది. అంతా ఈబ్లాగువారు కనీసం తెలంగాణ ఉద్యమంలో ఉన్న తప్పొప్పులను నిశ్పక్షపాతంగా బయట పెడతారనీ, సమైక్యాంధ్ర ఆవశ్యకతను తార్కికంగా వివరిస్తారనీ భావించారు.
వీరూ మొదట్లో కాస్త ఉత్సాహంతో ఇరిగేషన్ లాంటి విషయాలు చర్చించారు. గోదావరి నీటిని ఎందుకు ట్యాప్ చెయ్యలేకపోతున్నామో, గోదావరి నీటిని క్రిష్ణాకు తరలిస్తే రాష్ట్రానికి (సీమాంధ్రకు) ఎలా లాభమో వాదించారు. ఆతరువాత బ్లాగుల్లో ఈవాదనలోని అబద్దాలు, ఇరిగేషన్లో వాస్తవాలు బయటపెట్టారు.
తరువాత్తరువాత వీరికి రాయడానికి విషయం లేకపోయింది. సమైక్యవాదమంటే కేవలం తెరాసను విమర్శించడమే అనే భ్రమలో బతుకుతూ తెరాసపై కొన్ని కధనాలు రాశారు. ఆతరువాత తమకు సొంతంగా రాయడం చేతకాక ఏతెలుగు బ్లాగులో తెలంగాణ వ్యతిరేక టపా ఉన్నా తెచ్చి తమ బ్లాగులో పెట్టుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం చదువరి బ్లాగు నుంచి ఎత్తుకురావడం పూర్తయింది.
ఆతరువాత వారికి రాయడం చేతకాక ఎప్పుడో ABN రాధాక్రిష్ణ ఈటెల రాజేందర్ పేరుతో తయారు చేసిన ఒక దొంగ ఉత్తరాన్ని కనీసం అందులో నిజానిజాలు ఏమాత్రం తెలుసుకోకుండా తెచ్చి బ్లాగులో పబ్లిష్ చేసి తమ సిగ్గులేనితనాన్ని చాటుకున్నారు. వీరికి తోడుగా ఎక్కడ తెలంగాణ ఉద్యమాన్ని తక్కువచేసి చూపే విషయం కనబడుతుందా అని ఆశగా ఎదురుచూసే కొంతబంది అత్యుత్సాహం కలిగిన బ్లాగరులు వెంటనే వెల్లి అక్కడ తెరాసను తిడుతూ వాఖ్యలు చేశారు. మరి ఇలా వాఖ్యలు చేసిన పెద్దమనుషుల్లో ఎవరయినా శ్రీక్రిష్ణ కమీషన్ మీడియాను మేనేజ్ చెయ్యమంటూ చేసిన అనైతిక సూచనలను ఖండించారా అంటే లేదు. ఒకేరకం సంఘటన తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఉంటే ఒకలాగ వ్యతిరేకంగా ఉంటే మరోలాగ స్పందించే ఈపక్షపాత జీవులకూ, తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న విషాంధ జీవులకు మరి తెలంగాణతో కలిసి ఉండడం ఎందుకూ అంటారా, మరి అది వారి సొంత లాభం కోసం.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విడిపోయే ముందు కూడా బ్రిటిష్‌వాళ్ళు ఆంగ్లేయుల సమైక్యత పేరు చెప్పి అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించారు. ప్రాంతీయాభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం జాతి సమైక్యత గురించి మాట్లాడితే అది అరిగిపోయిన రికార్డ్ కంటే పాత పాటే అవుతుంది. టిజి వెంకటేశ్‌లాగ తాము కేవలం హైదరాబాద్ కోసమే తెలంగాణాని వ్యతిరేకిస్తున్నామని డైరెక్ట్‌గా చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పుకోకుండా సమైక్యత పాట ఎందుకు?
ReplyDelete