Monday 6 June 2011

ఉద్యమంలో మీడియా మేనేజ్మెంట్ - ABN దొంగ లెటరు

తెలంగాణ విషయం తేల్చమని ప్రజాధనం వెచ్చించి కేంద్రప్రభుత్వం ఒక కమిటీ వేస్తే అది తెలంగాణ సమస్య పరిష్కారానికి మార్గాలు సూచించడం మానేసి ఏవిధమైన అనైతిక, మోసపూరిత చర్యలు చేపడితే తెలంగాణ ఉద్యమాన్ని అణచివెయ్యొచ్చో ఒక రహస్య నివేదిక రూపొందించింది.

ఈరహస్యనివేదిక అనైతిక సూచనలలో ముఖ్యమయినవి తెలంగాణ ఉద్యమ నేతలకు పదవుల ఆశ చూపించి వారిని లొంగదీసుకోవాలి, రాష్ట్ర మీడియాను అడ్వర్టైజ్మెంట్లతో, ఇతర మార్గాలతో లొంగదీసుకోవాలి అని. అదే రిపోర్టులో తెలుగు మీడియాలో ఒక్క రెండు చానెల్లు తప్ప మిగతా టీవీ చానెల్సూ, దినపత్రికలూ ఇప్పటికే సీమాంధ్రకు కొమ్ముగాస్తున్నాయనే రహస్యాన్ని కూడా బహిర్గతం చేసింది.

ఇలాంటి అనైతిక నివేదిక తయారుచేసినందుకు ప్రస్తుతం ఆకమిటీ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుంది. ఈవిధంగా మీడియాను అడ్వర్టైజ్మెంట్ల ఆశ చూపి లొంగదీసుకోవాలని రాయడం మీడియా అసోసియేషన్లు నిర్ద్వందంగా ఖండించాయి. ఈపరిస్థితిని గమనించిన సీమాంధ్ర నేతలకూ, శ్రీక్రిష్ణ కమిటీని అప్పటిదాకా ఆకాశానికి ఎత్తిన సీమాంధ్ర వాదులకూ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది.మీడియా మేనేజ్‌మెంట్‌పై పోయిన పరువు మల్లీ తెచ్చుకోవడం కోసం తెలంగాణ వాదులకు కూడా ఇదే మచ్చను అంతగట్టడం కోసం చూస్తున్నాయి.

సీమాంధ్ర మీడియాలో భాగమయిన ABN చీఫ్ రాధాక్రిష్ణ టీఆర్పీలో అట్తడుగున ఉంటూ తమ చానెల్ స్థాయిని పెంచుకోవడం చేతకాక ఇతర చానెల్స్ పై బురద చల్లడం మొదలు పెట్టాడు. ఇతకుముందు ఆంధ్రజ్యోతిలోనే పని చేసిన రామచంద్రమూర్తి తనకంటే ఎక్కువ పేరు తెచ్చుకోవడం కూడా ఇతను సహించలేకపోతున్నాడు. రాధాక్రిష్ణ తెదేపా లీడరు కోడెల శివప్రసాదరావుతో కలిసి ఈ పన్నాగం పన్ని లెటరు తయారు చేశాడు. లెటరు సారాంశం తెరాస HMTV వారి దశ-దిశ కార్యక్రమాన్ని మేనేజ్ చేసిందని. ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి మన మీదే పడినట్లు ఈసంఘటన తరువాత ABN ఆశించినట్లు మీడియా వర్గాల్లో ఎవరూ ఈలెటరును సీరియస్గా తీసుకుపోగా రాధాక్రిష్ణ పరువే పోయింది.

ప్రస్తుతం తెలుగు మీడియా అంతా ఒక్కొక్కరు ఒక్కో నాయకుడికీ, పార్టీకి కొమ్ముగాస్తూ ఉంటే మీడియా విలువలు చక్కగా పాటిస్తున్న ఏకైక చానెల్ HMTV. తెలంగాణ అంశంపై ఒక వేదికపై ఇంతవరకూ దశ-దిశ కాకుండా మరెక్కడా అర్ధవంతమయిన చర్చ జరుగలేదనేది సత్యం, అసెంబ్లీతో సహా.

తెలుగు మీడియాలో ఒక్కొక్కటి ఒక్కో పార్టీకి ప్రాతింధ్యం వహిస్తున్నా అన్ని పార్టీలూ సీమాంధ్ర అధినేతల చెప్పుచేతల్లో నడుస్తున్నట్లు అన్ని మీడియా సంస్థలనూ సీమాంధ్ర వ్యాపారులే నడిపిస్తున్నారు. డిసెంబరు 9 తరువాత వీరంతా సీమాంధ్రకు కొమ్ముగాస్తూ తెలంగాణ వ్యతిరేక కధనాలు వండుతున్నారనేది అందరికీ తెలిసిందే. వీరు టీఆర్పీ పెంచుకోవడానికి నలుగురు నాయకులను పిలిచి ఒకరినొకరు తిట్టుకునే టాక్‌షోలు రోజూ పెడతాయి, మధ్యమధ్యలో వార్తలకు వారి వ్యూస్ జోడించి ఉద్యమాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్న చేస్తాయి తప్ప ఎప్పుడూ అర్ధవంతమయిన చర్చలు పెట్టవు. ఎందుకంటే నిజమయిన చర్చలో నిజాలు బయటికి వస్తాయి, అప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయాలు బయటికి వస్తాయి, అది వారికి ఇష్టం ఉండదు.

ఇలాంటి పరిస్థితిలో అన్ని ప్రాంతాలు తిరిగి అందరు మేధావులకు, విద్యావంతులకూ, వివిధ సంఘాల నేతలకూ అవకాశం ఇచ్చింది HMTV దశ-దిశ మాత్రమే. ఇది సీమాంధ్ర మీడియాకు కంటకింపుగా తయారయింది, కారణం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన  నిజాలు బయటికి రావడంతో పాటు HMTVకి క్రెడిట్ రావడం.

ఇప్పుడు HMTV దశ-దిశపై బురద జల్లడంలో భాగమే ఈ తెరాస లెటరు. అసలు నిజంగా మీడియాతో కుమ్ముక్కు అయితే ఎవరయినా సొంత సంతకంతో లెటర్లు రాసుకుని డాక్యుమెంటరీ ఎవిడెన్సులు తయారుచేస్తారా? కొసమెరుపేమిటంటే ఇంతవరకూ శ్రీక్రిష్ణ కమీషన్ మీడియా మేనేజ్మెంటు సూచనలను ఎన్నడూ ఖండించనివారూ, పైగా సమర్ధించినవారూ ఇప్పుడూ ఈలెటరు నిజమయినదా కాదా అని కనీసం వెరిఫై చేసుకోకుండా తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మేస్తున్నారు. ఇలాంటి పక్షపాత జీవులు ఎప్పటికైనా ఎదుటివారి దృక్పధాన్ని అర్ధం చేసుకుంటారనేది కళ్ళ. వీరి వాదనలు చూస్తుంటేనే తెలంగాణ ఎందుకు అవసరమో తెలిసిపోతుంది.

ఇట్లాంటి లెటర్ తనకేదీ అందలేదని, ఇది కేవలం దుష్ప్రచారమని శ్రీరామచంద్రమూర్తి గారు. ఇప్పటికే ఖండించినారు. కొత్తగా విశాలాంధ్ర మహాసభ అనే వెబ్ సైటూ, బ్లాగూ పెట్టుకున్నవారు కొత్తబిచ్చగాడికి పొద్దెరగదన్నట్లూ రోజూ ఏదో చత్త తెచ్చి రాస్తున్నారు. వీరిది ఎంత దిగజారుడు కార్యక్రమం అంటే బ్లాగు పెట్టుకుని రెండు నెలలయినా ఇంతవరకూ వారు ఒక్క విషయంలో కూడా తెలంగాణ ఉద్యమంలో తప్పు ఎత్తిచూపడం గానీ, సమిక్యంగా ఎందుకు ఉండాలో చెప్పడం గాని చెయ్యలేకపోగా తమకు సొంతంగా రాయడం చేతకాక బ్లాగుల్లో ఎక్కడ ఎవరు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా రాసినా తెచ్చి తమ బ్లాగులో పెట్టుకుంటారు. ఇలా తమ బ్లాగు టీఆర్పీ పెంచుకునే ప్రయత్నంలో మరో పొరపాటే ఏమాత్రం అవగాహన లేకుండా నిజానిజాలు తెలియకుండా ఒక లెటరు కనపడగానే తెచ్చి ప్రచురించడం. ఇలా వీరు తమ సిగ్గులేనితన్నాన్ని చూపించుంటూ సమైక్యంగా ఉండడం అంటే అర్ధం తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మడమే అనే కొత్తనీతిని మొదలుపెట్టారు. VMS, shame on you!!

1 comment:

  1. క్షమించాలి, ఈలెటరు ముందు అనుకున్నట్లుగా నలమోతు సృష్టి కాదు, ఇది ఏవిధంగానైనా ఇతర మీడియా చానెల్స్‌పై బురద జల్లి వాటిని కిందకు నెట్టివేసి తాను పైకి పోవాలని తహతహలాడుతున్న ABN చీఫ్ రాధాక్రిష్ణ తెదేపా నాయకుడు కోడెల శివప్రసాదరావు కలిసి వేసిన ఎత్తు అని తెలిసింది.

    ReplyDelete

Your comment will be published after the approval.