Wednesday, 15 June 2011

ఒక మేతావి కామెంటుకు స్పందన


అనుకోకుండా ఈరోజు ఒక మేతావిగారి కామెంటు నాకళ్ళబడి కాసేపు మైండు బ్లాంకయింది.తరువాత ఈమేతావి గారి పురుషాహంకారము, కులాహంకారము, ప్రాంతీయ దురహంకారములగురించి ఇదివరకు వినియుండడం వలన కాసేపటికి తేరుకుని ఇక్కడ సమాధానం ఇస్తున్నాను. వారి కామెంటు ఇక్కడ యధాతధంగా:

**********
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం (బ్లాగు: ఆనందిని)
  "తెలంగాణ రాకపోవడం మంచిదే. విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదు. బాగుపడదు. వాస్తవంగా తెలంగాణకి అవసరమైనది ప్రత్యేక రాష్ట్రం కాదు. తెలంగాణలో పనిసంస్కృతి మెఱుగుపడడం. ప్రైవేట్ ఇనీషియెటివ్ పెంపొందడం. తెలుగు అక్షరాస్యత వృద్ధి చెందడం. తెలంగాణలో ప్రజాస్వామిక భావాలు వికసించాలి. ఈ ప్రాంతం ఇంకా ముస్లిముల కాలపు నిరంకుశ మానసిక పోకడల నుంచి బయట పడలేదు. ఇక్కడ ప్రజలూ, నాయకులూ అందఱూ ప్రజాస్వామ్య భావనలకు వ్యతిరేకులే. ఎదుటివాళ్ళు చెప్పేది బొత్తిగా వినిపించుకోరు. అవతలివాళ్ళక్కూడా అభిప్రాయాలుంటాయనీ, ఉండాలనీ అంగీకరించరు. మీదపడి కొడతారు. 


తెలంగాణ ప్రజల్లో మొబిలిటీ కూడా పెఱగాలి. "ఇక్కడే ఉంటాం, అన్నీ మా దగ్గఱికే రావా" లంటే అది ఈ కాలంలో సాధ్యం కాదు. హైదరాబాదుతో ఉన్న భౌగోళిక సామీప్యం వల్ల తెలగాణ్యుల మొబిలిటీ బాగా దెబ్బదిన్నది."
**********

నా సమాధానం:

తెలంగాణ రాకపోవడం మంచిదే. విడిపోతే ఈ ప్రాంతం ఎప్పటికీ మారదు. బాగుపడదు
ఎవరికి మంచిది, నీకా? నీబోడి ఒపీనియన్ ఎవడికి గావాలి?

వాస్తవంగా తెలంగాణకి అవసరమైనది ప్రత్యేక రాష్ట్రం కాదు
మాకేం గావాలో మాకు తెలుసులే, ఇంకా నీదగ్గర నేర్చుకోవాల్సిన దౌర్భాగ్యం బట్టలేదు.

తెలంగాణలో పనిసంస్కృతి మెఱుగుపడడం.
ఔరా, ప్రతి పనికిమాలిన వెధవ, మూడున్నర కోట్ల ప్రజల పనిసంస్కృతిని వెక్కిరించేవాడే. తోటి ప్రజలమీద ఇంత తేలికభావం కలిగిఉన్న దురహంకారులు ఇంకా సమిక్యత గురించి మాయమాటలు జెప్పుడెందుకు? చేద్దామంటె పనిదొరక్క మావోల్లు పొట్టచేతిలొ బెట్టుకుని భీవండి, సూరత్ పోతుండ్రు, మీలాగ  తేరగ దింటూ ఇంఖొడి పొట్టగొట్టుడు ఎరుకలేదు మాకు. నీలాంటి సంస్కారం లేని, తోటి ప్రజలను గౌరవించని అహంకారులతో మాకు పనిలేదు, అందుకే మారాష్ట్రం మాకు కావాలంటున్నం.

తెలుగు అక్షరాస్యత వృద్ధి చెందడం.
మాకు తెలిసిందే తెలుగుమీడియం గవుర్నమెంటు స్కూల్లు, గండ్ల ఏమి జెప్తె గదే నేర్సుకుంటం, గక్కడ తెలుగే జెప్పుతరని ఇప్పటిదాక అనుకుంటున్నం, నీకేమన్న పారసీ గిట్ల కనబడ్డదా? మీలెక్క కార్పొరేట్ స్కూల్లల్ల ఇంగ్లీసు మీడియం మేం జదువుకోవడం మాకు శాతగాదు, గన్ని పైసలు మాతాన లెవ్వులే.

తెలంగాణలో ప్రజాస్వామిక భావాలు వికసించాలి.
గీ ప్రజాసామికమంటె ఏందో మాకు పెద్దపెద్ద మాటలు రావు గని, మాకు దెలిసింది ఐదేండ్లకోసారి ఎలచ్చెన్లొస్తె నచ్చినోడికి వోటెయడం. మీలెక్క కులానికో పార్టి పెట్టుకోని కులపోడు ఎంత దోస్తున్నా సపోర్ట్ జేసుడు మాకు దెల్వదులే. గట్లనే మానాయకులు మీవోల్ల లెక్కన కడప బాంబులు పేల్చి వాల్లె వోట్లు గుద్దుకోరు, మావోట్లు మేమె ఏస్తం.

ఈ ప్రాంతం ఇంకా ముస్లిముల కాలపు నిరంకుశ మానసిక పోకడల నుంచి బయట పడలేదు.
బయట పడ్దామంటే మీరెక్కడ పడనిస్తున్నరే, పొయిపొయి రోట్లె తలకాయ పెట్టినట్టు మాతలకాయలు మీఆంధ్ర దొరలకి అప్పజెప్పితిమి. గాళ్ళు ముస్లిములకన్న నిరంకుశంగా పరిపాలన జేసి మాకడుపుగొట్టి మాబతుకులు బుగ్గిజేసి మానీల్లు, మాఉద్యోగాలు, మావనరులు మాగ్గకుంట జేస్తుండె. ఇంక బయటపడుడెట్ల జెప్పు? గందుకే మారాష్ట్రం మాగ్గావలని అంటున్నం.

ఇక్కడ ప్రజలూ, నాయకులూ అందఱూ ప్రజాస్వామ్య భావనలకు వ్యతిరేకులే.
మీఎరుకన పెజాస్వామ్యమంటే కులస్వామ్యం, ధనస్వామ్యం, ముఠాస్వామ్యం అయితె గాదానికి మేం వ్యతిరేకమేలే.గది మీదగ్గరే ఉంచుకోన్రి.

ఎదుటివాళ్ళు చెప్పేది బొత్తిగా వినిపించుకోరు. అవతలివాళ్ళక్కూడా అభిప్రాయాలుంటాయనీ, ఉండాలనీ అంగీకరించరు. మీదపడి కొడతారు.
ఎదుటివాల్లంటె ఇక్కడ నువ్వేనా పెద్దన్నా? నీమాటలు మేము గాదు, ఎవ్వలు వినరులే, మీదగ్గర కూడ నీమాటలు ఎవ్వరు వినరు. నీ మతాహంకారము, మగజాతి హక్కుల సిద్దాంతాలు, నీకులగజ్జి, నీతాగుడు లెక్కలు జూసి నీమీద ఉమ్మేయనిది ఎవరు జెప్పు?

తెలంగాణ ప్రజల్లో మొబిలిటీ కూడా పెఱగాలి. "ఇక్కడే ఉంటాం, అన్నీ మా దగ్గఱికే రావా" లంటే అది ఈ కాలంలో సాధ్యం కాదు. హైదరాబాదుతో ఉన్న భౌగోళిక సామీప్యం వల్ల తెలగాణ్యుల మొబిలిటీ బాగా దెబ్బదిన్నది."
గీ మొబిలిటీ ఏందో మాకు తెల్వదు గని మేం పొట్టకూటికోసం ఎంత దూరమన్న వెలతం. రోజు మావోల్లు భీవండి, నౌసారి, సోలాపురం, దుబాయి, సూరత్ పొయ్యి పని జేసుకుంటున్నరు. మానీల్లు మాపక్కోల్లు దోసుకపోతుంటె చేసుకోవడానికి మాదగ్గర పనిలేదు గనక మేం దూరదేశాలు పోతున్నం. అయితె ఒక్కమాట, మేం ఎంత దూరమన్న పనికోసం పోతం గని నీ ఏరియ మాత్రం రాము, నీకులగజ్జికి తలవంచం. కడుపుగాలినా పరువలేదు గాని నీ అహంకారానికి మాత్రం మేం దాసోహం గాబోము, యాది బెట్టుకో.

ఇవ్వాల తెలంగాణల సంటిపిల్లోడు సైతం జైతెలంగాణ అంటుండంటె దానికి కారణం నీలాంటి దురహంకారులే. మీదగ్గర నేర్సుకోవడానికి రికార్డు డాన్సులు దప్ప ఇంకేమి లేవు గని పొయ్యి నువ్వు నీపెద్దపురం కొంప పక్కన శివరాత్రి రోజు గంతులేసుకో పైసలొస్తయి, మాతెలంగాణల మాత్రం ఉండకు. ఇక్కడ మాతోటి కలిసి ఉండేటోల్లను ఎవ్వరినైనా మేం ఆదరిస్తం గానీ నీలాంటి దురహంకారులకు ఇక్కడ స్థానం లేదు.

15 comments:

  1. ఓ రోజు ట్రెయిన్‌లో వెళ్తున్నప్పుడు ఒక మేతావి ఇలాగే మాట్లాడుతోంటే విన్నాను. అతని వాదన ప్రకారం తెలంగాణా రాష్ట్రం ఏర్పడినా తెలంగాణా అభివృద్ధి చెందదట, తెలంగాణా ప్రజలు తాగడానికి డబ్బులు ఖర్చుపెడతారట!

    ReplyDelete
  2. కొన్ని మంచి విషయాలు చెప్పారు తాడేపల్లిగారు. ఎవరినైనా ఏమన్నా అన్నారా ? లేదే ! సమైక్యవాదిగా ఆయన సమైక్యాన్ని కోరుకోవడంలో తప్పులేదు. కానీ తెలంగాణవాదులుగా మీరేం చేశారు ? ఆయన్ని ఊరికే అశ్లీలంగా దూషించారు. ఒక్క అంశాన్నయినా తార్కికంగా ఖండించగలిగారా ?

    ReplyDelete
  3. ఓబుల్‌రెడ్డి గారు,

    తార్కికంగా రాసేవారికి తార్కికంగా సమాధానాలు ఇవ్వవచ్చు కానీ కేవలం ఒకప్రాంత ప్రజలను అందరినీ తాగుబోతులు, పనిచెయ్యరు, మాదగ్గర అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని అహంకారపు మాటలకు సమాధానాలు ఎలాగివ్వాలో మాకు తెలియదండి.

    ఇక అశ్లీలం అంటున్నారు, ఎవరు రాశారు సార్ అశ్లీలంగా? తన అహంకారపు మాటలతో 3.5కోట్ల ప్రజలను దూషించినవాడిని కూడా మేం ఎక్కడా తిట్టలేదు. సమస్య ఏమితంటే మన సమైక్య రాష్ట్రంలో తెలంగాణ యాసలో రాయడమే మీబోటివారికి అశ్లీలంగా కనిపిస్తుంది. అది మీబలహీనత, నానేరం కాదని తెలుసుకోండి.

    అదే మన రాష్ట్రంలో సమస్య..మనకు కావలసినవారు ఎంతతప్పు మాట్లాడినా ఒప్పుగానే కనిపిస్తుంది, మనకు నచ్చనివారు మెత్తగా సమాధానం ఇచ్చినా అశ్లీలం కనిపిస్తుంది. క్షమించాలి, నేను మీమెప్పుకోసం అబద్దాలు రాయలేను.

    ReplyDelete
  4. ఇంతకు ముందు తాగుబోతుల సంఖ్య తెలంగాణాలో ఎక్కువ అని తాడేపల్లి గారు వాదిస్తే రాష్ట్రంలో మందు షాపులు కోస్తా ఆంధ్రలోనే ఎక్కువగా ఉన్నాయని ఒకాయన ప్రభుత్వ లెక్కలు చూపించాడు. ఆ లెక్కలు ప్రకారం తెలంగాణాలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే మందు షాపులు ఎక్కువగా ఉన్నాయి. కూకట్‌పల్లి, చందానగర్, BHELలలో ఏ ప్రాంతంవాళ్ళు ఎక్కువగా ఉన్నారో తెలుసా? అటువంటప్పుడు తెలంగాణావాళ్ళే తాగుబోతులు అంటే అందులో అర్థమేమిటి?

    ReplyDelete
  5. విశ్వరూప్ గారు ,
    చక్కగా రాశారు . బాగా కోపంగా ఉన్నట్లున్నారు . నన్ను మీ సమాధానాలు భలే నవ్వించాయి . చీల్చి చండాడారేంటండి బాబు !

    ReplyDelete
  6. రమణ గారు,

    ధన్యవాదాలు. ఈయనకిది మొదటిసారి కాదండి, ఇలాంటి అవాకులు పేలడం బాగా అలవాటయింది.

    ReplyDelete
  7. "Paade" kattinavu po na kodukki.
    "samaikyandhrulu Parannajeevulu"
    Jai telangana!!!!

    ReplyDelete
  8. @విశ్వరూప్ గారు

    మీ సమాధానాలు చాలా బాగున్నాయి. ఇది పోట్లాట లా కాకు౦డా ఒక చర్చ లా భావి౦చ౦డి. తాడేపల్లి గారి అభిప్రాయ౦ కూడా ముఖ్యమే మీ టపా కు.

    ReplyDelete
  9. విశ్వరూప్ గారు, తాడేపల్లి గారు మగవారి హక్కుల గురించి ప్రస్థావించంటం ఎలా తప్పు అవుతుందో, పురుష అహంకారమౌతుందో తెలియటంలేదు. దానికి తెలంగాణా వాదానికి లింక్ పెట్టి తిట్టటం ఎంత వరకు సబబో నాకైతే అర్థం కావటం లేదు. మగవారి హక్కుల విషయం లో ఆయన రాసే ప్రతి అక్షరానికి నేను సమర్దిస్తాను. మగవారి హక్కుల గురించి మాట్లడేవారంతా పురుషహంకారులు, మత దురభిమానులని ముద్ర వేయటాన్ని ఖండిస్తున్నను.

    ReplyDelete
  10. Rama,

    ఇది చాలా పాత టపా. అప్పటి సందార్భాని బట్టి కలిపి చదువుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలో నాకు తెలిసి అణచివేతకు గురిచేయబడ్డవారు హక్కులకోసం పోరాడుతారు, ఆధిపత్యం చెలాయిస్తున్నవారు కాదు. మగవారిహక్కులు, అగ్ర వర్ణాల హక్కులు, అగ్రరాజ్యాల హక్కులు, ప్రభుత్వ యంత్రాంగపు హక్కులు, బలవంతుల హక్కులు అంటూ ఎవరైనా ఉద్యమాలు చేస్తే అది కేవలం తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడంలో భాగమేనని నా అభిప్రాయం.
    ఇకపోతే పురుషాధిపత్యం, మత దురభిమానం అనేవి రెండు వేర్వేరు అంశాలు, రెంటినీ ఎందుకు కలిపారో నాకర్ధం కాలేదు.

    ReplyDelete
  11. An anonymous' comment is not published to avoid diverting topic. Rights for either male or female is not the primary intention of the post.

    ReplyDelete
  12. Godd answer anna.. 9 reverse ayi 6 padindhi tadepilli chempa meedha

    ReplyDelete
  13. ఈ టపా ఇప్పుడే చూస్తున్నాను. మీరు నన్ను అపార్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఫర్వాలేదు. తెలంగాణ మీద నాకేమీ చిన్నచూపు లేదు. నేనూ తెలంగాణప్రాంతం గుఱించే ఆలోచిస్తూంటాను. ఉద్యమాలతో విడిపోవడం మంచిది కాదని నా అభిప్రాయం. ఇది Eno తాగి భోంచేయడంలాంటిది. దేనికైనా ఒక సహజ సమయం, సహజ పరిస్థితులూ ఉంటాయి. ఆ సమయం వచ్చేదాకా ఓపికపట్టాలి. పరస్పర ద్వేషాలు లేనప్పుడు 23 రాష్ట్రాలుగా జీవిస్తున్నా ఫర్వాలేదు. కానీ అవి ఉన్నాయి కనుక ఈ పరిస్థితుల్లో విడిపోవడం మంచిది కాదు. నేను చెప్పేది మీకు విచిత్రంగా అనిపించవచ్చు.కానీ మనం ఏ మార్గంలో ఒకటి సంపాదించామో ఆ మార్గంలోనే దాన్ని నిలబెట్టాల్సి వస్తుంది. ద్వేషంతో సంపాదించే రాష్ట్రాన్ని ద్వేషంతోనే నిలబెట్టాల్సి వస్తుంది. But hatred is very costly. ఈ విషయంలో నేనేం మాట్లాడినా తెలంగాణవాళ్ళు అపార్థం చేసుకునే వాతావరణం ఉంది కనుక ఇంతటితో విరమిస్తున్నాను. నాకీ అవకాశం ఇచ్చినందుకు నెనర్లు.

    ReplyDelete
    Replies
    1. @LBS

      తమరింతకుముందే ఈటపా చూశారులెండి, ఇప్పుడూ మరిచిపోయినట్లున్నారు. తమరి ఉద్దేషాలేంటో సమాధానం ఇవ్వబడ్డ మీకామెంటును చూస్తే చక్కగా అర్ధం అవుతుంది, ఇప్పుడు కవరింగులెందుకు? వృధా ప్రయాస!

      ఉద్యమాలతోనే తమరు గతంలో తమిలులనుండి విడిపొయ్యారు, అప్పుడు ఉద్యమాలద్వారా విడిపోవడం బహుషా పసందుగా అనిపించి ఉంటుంది.

      అవును ద్వేషంతో విడిపోవడం మంచిదికాదు, కానీ ద్వేషం కడుపునిండా నింపుకుని రోజూ అవహేళనచేస్తూ పైకి మాత్రం కలిసే ఉందాం అంటే అసహ్యంగా ఉంటుంది, అలా ఉండడ సాధ్యం కాదు, దానికి పరిష్కారం విడిపోవడమే. బహుషా ఈవిషయం మీకెన్నటికీ అర్ధం కాదేమో!

      Delete

Your comment will be published after the approval.