సీమాంధ్ర వాదులు, సీమాంధ్ర రాజకీయనాయకులు తమ నాయకుల యూ-టర్న్ ను సమర్ధించుకోవడం కోసం ఎప్పుడూ చేసే వాదన ఏమిటంటే డిసెంబరు 9 చిదంబరం ప్రకటన ముందు వరకూ విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు మానాయకులకు తెలియదు అందుకే వివిధ రాజకీయ నాయకులు, పార్టీలు తెలంగాణ ఏర్పాటును అంతకు ముందు సమర్ధించాయి, తమ మానిఫెస్టోల్లో పెట్టుకున్నాయి, తెలంగాణ ప్రజలకు ఆవిధంగా వాగ్దానాలు చేశారు, ప్రణబ్ కమిటీకి లేఖలు ఇచ్చారు, డిసెంబరు 9 పొద్దున కూడా ధమ్ముంటే బిల్లు పెట్టండి మేం సమర్ధిస్తం అన్నారు, అయితే డిసెంబరు 9 ప్రకటన తరువాత ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మానాయకులు మాట మార్చారు అని.
ఇందులో ఎంత అబద్ధం ఉందో అలా చెప్పేవారికి కూడా తెలుసు. చిదంబరం ప్రకటన చేసింది డిసెంబరు 9 అర్ధరాత్రి. ఆపాటికి ప్రజల్లో ఎక్కువమంది నిద్రలోకి జారుకున్నారు. లగడపాటి రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం దీక్ష ప్రారంభించింది ఒక అరగంట వ్యవధిలో. ఇంకొన్ని గంటల వ్యవధిలో మిగతా సీమాంధ్ర ఎమ్మెల్యేలూ, ఎంపీలూ రాజీనామ చేసి తమ దీక్షలూ, లూటీలు, బందులూ మొదలు పెట్టారు. ఆకొన్ని గంటల్లో ఈనాయకులకు ప్రజల రెస్పాన్స్ చూసి తమ మాట వెనక్కి తీసుకునే అవకాశమే లేదు.
అంటే ప్రజల ప్రతిస్పందన ఏమిటో ఇంకా తెలియక ముందే ఉద్యమం మొదలయిపొయ్యింది. ఒక్కసారి ఉద్యమం మొదలు పెట్టగానే పయ్యవుల కేశవ్ లాంటి నాయకులు తమ అనుచర గణంతో విధ్వంసం కూడా మొదలు పెట్టారు. మరి వీరు చెప్పినట్లు ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాట మార్చినవారయితే అసలు ప్రజలు నిద్రిస్తుండగానే రాజీనామాలు చేసి విధ్వంసం ఎందుకు మొదలు పెట్టారు?
వాస్తవం ఏమిటంటే డిసెంబరు 9 వరకూ సీమాంధ్ర నాయకులెవరూ కేంద్రం తెలంగాణకు అనుకూలనిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదు కాబట్టి అన్ని పార్టీలు, అందరు సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలను అంభ్యపెట్టడానికి, ఇతర పార్టీలపై పైచేయి సాధించడానికి, ఇతర పార్టీలను ఇరుకున పెట్టడానికి తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు నటించారు. అయితే ఒక్కసారి చిదంబరం ప్రకటన వెలువడగానే వీరికి దిమ్మదిరిగింది. హైదరాబాదులో ఉన్న తమ కబ్జాభూములపై భయం పుట్టుకొచ్చింది. కొందరికి తమ రాజకీయ మైలేజీ పెంచుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. కొన్ని పార్టీలకు తమ ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టి లాభపడొచ్చనిపించింది. వీటన్నిటి ఫలితమే సమైక్యాంధ్ర ఉద్యమ నాటకం తప్ప విభజనపై అక్కడి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కాదు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటానికి ఒకటి రెండు గంటల ముందు ప్రజా ప్రతినిధుల రాజీనామాల పర్వం ప్రారంభం అయింది. నాకు తెలిసి అసెంబ్లీ సమావేశాలు అర్ధ రాత్రి ప్రారంభం అవవు అనుకుంటాను. ఇక పోతే సీమాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత రాలేదు అదంతా నాటకమే అనే అబద్ధాన్ని ఎన్ని సార్లు చెప్తారు సర్? ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చినప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తామని అంటే బుద్ధి బుర్ర ఉన్న వాడెవడూ గంగిరెద్దులా తలూపడు. సీమాన్ధ్రలో జరిగిందీ అదే. నిజానికి ఆంధ్రాలో జనాలు కే.సి.ఆర్. దీక్షను సీరియస్ గా తీసుకోలేదు. అది తనకు మామూలే అన్నట్టు వదిలేశారు. కానీ తమను లెక్కలోకి తీసుకోకుండా కేంద్రం ప్రకటన చేయడంతో వాళ్లకి ఎక్కడో కాలింది. మీ ఇంట్లో పంపకాలు చేస్తామన్న విషయం మీకు చెప్పకుండా ఎప్పుడో అర్ధ రాత్రి ప్రకటించి నిర్నయిన్చేస్తే మిమ్మల్ని అవమానించినట్టు ఫీలవరా? అక్కడా అదే జరిగింది. నువ్వేవడ్రా మా గురించి నిర్ణయం తీసుకోడానికి అని తమ విశ్వరూపం చూపారు. ఆ దెబ్బకి ప్రజాప్రతినిధులు జడిశారు.
ReplyDeleteఈ లేఖకి మీ సమాధానం ఏంటి? తెలంగాణా లో డబ్బులిచ్చి ఉద్యమం చేయిస్తున్నారు అని నేనంటే జవాబు ఏం చెప్తారు? ఇది కూడా సీమాంధ్రుల కుట్ర అనకండి సార్? అప్పుడు ఈటెల రాజేందర్ కూడా ఆ కుట్రలో భాగస్వామే అంటారు జనాలు.
ReplyDeletehttp://visalandhra.blogspot.com/2011/06/blog-post_04.html
అగ్నాత,
ReplyDeleteలగడపాటి రాజీనామా గురించి ప్రకటించింది చిదంబరం ప్రకటన తరువాత గంటలోపే, ఆ తరువాత కొన్ని గంటలలోపు దివాకర్ రెడ్డి, మరికొందరు చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం లోపు అందరూ చేశారు, వీరంతా ప్రజలు చెబితే చేశారా? అలా నమ్మటానికి మీరేమయినా చెవిలో పూలు పెట్టుకున్నారా? రాసినదాన్నే మల్లి ఎందుకు నాతో రాపిస్తారు?
రాష్ట్ర ఏర్పాటు గురించి పదికోట్ల ప్రజలందరినీ ఎవ్వరూ అడగరు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తారు. వారితో చర్చించి అన్నిపార్టీల ఆమోదం తీసుకున్న తరువాతే నిర్ణయం జరిగిందని గమనించండి.
అగ్నాత 2 ( చైతన్య??):
ఒకవేళ నిజంగా మీడియా మేనేజ్ చెయ్యాలంటే దానికి లెటర్లూ, డాక్యుమెంటరీ ఆధారాలు పెట్టుకుంటారా ఎవరయినా? సీమాంధ్ర నాయకులు, మీడియాలాగా లోపాయకారీ ఒప్పందాలు జరుగుతాయి గానీ? ఆ లెటరు నలమోతు ఇంగ్లీషులో చెబితే దాన్ని VMSలో ఒకరు తెలుగులో టైపు చేసి ఉంటారు, కింద లగడపాటి సంతకం కెలికి ఉంటాడు. అంతకన్న చెప్పేదేముంది?
ఈ రాష్ట్రంలో ఇంతవరకూ తెలంగాణ విషయంపై ఒక చక్కటి చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసి రాష్ట్రం నలుమూలలా అందరు విద్యావంతులు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్న హెచెంటీవీ వారిని అభినందించాలి. సీమాంధ్ర విషపూరిత వార్తల్లాగా కాగా అది నిశ్పక్షపాతంగా జరిగింది.