తెలంగాణవాద వ్యతిరేకులు తరుచుగా ఉపయోగించే వాదన "వెనుకబాటుతనం ఒక్క తెలంగాణలోనే కాదు అన్ని చోట్లా ఉంది, మా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడలేదా?" అని. వీరు చెప్పేదాంట్లో నిజం లేకపోలేదు, రాయలసీమలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాలు వర్షాభావం వల్ల కరువుతో బాగా వెనుకబడ్డాయి. అలాగే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం కూడా పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు.
అయితే ఇక్కడ తెలంగాణ ఏర్పాటును కోరేవారు చెప్పేది కేవలం తెలంగాణ వెనుకబాటుతనం కాదు, తమ వనరులను తమకు కాకుండా జేసి వివక్షతో సమైక్యాంధ్రలోని ప్రభుత్వాలు వెనక్కి నెట్టేయడం వలన తెలంగాణ వెనుకబడింది అనేది ఇక్కడ విషయం. కాబట్టి అనంతపూర్, చిత్తూరు వెనుకబాటు తనానికీ తెలంగాణ వెనుకబాటు తనానికి తేడా ఉందనేది ఇక్కడ ముఖ్య విషయం. ఈ విషయంలో ఉత్తరాంధ్ర కూడా వివక్షకు గురయిందని అక్కడి ప్రజలు, నాయకులు చెబుతున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. అందుకే ఉత్తరాంధ్రకు చెందిన అనేక నాయకులు, ప్రజలు తెలంగాణకు మద్దతు ఇస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్రకు ఒక రాష్ట్రంగా మనగలిగేంత స్థాయి లేదు కనుక వారు ఒక ప్రత్యేక ప్యాకేజీని కోరుతున్నారు. ఒకవేళ రాయలసీమ వారు తాము కూడా వివక్షకు గురయ్యామని భావిస్తే వారూ రాష్ట్రం అడుగుతారు, కానీ అది వాస్తవం కాదు గనుక, సమైక్య రాష్ట్రంలో వారు లబ్ది పొందుతున్నారు కనుక వారు స్వరాష్ట్రం అడగడం లేదనేది బహిరంగ రహస్యం.
ఏవిధమయిన వివక్షకు గురయిందనేదానికి ముఖ్యమయినది సాగునీటిలో జరిగిన వివక్ష. గోదావరిపై గ్రావిటీ బూచి చూపించి ప్రాజెక్టులు అస్సలు కట్టకపోవడం, గ్రావిటీ సమస్య లేని శ్రీరాం సాగర్‌కు నిధులు అందించక నిర్లక్ష్యానికి గురిచెయ్యడం కాగా క్రిష్ణా నదిని పూర్తిగా తెలంగాణకు కాకుండా జేసి మొత్తం క్రిష్ణా జలాలను సీమాంధ్రకు తరలించి ఏదో కొద్దినామ మాత్రం నీటిని తెలంగాణ మొహం కొట్టడం ప్రధానమయినది. ఒక్కసారి శ్రీశైలం ఎడమ, కుడి కాలువలకు విడుదల అయిన నిధులను చూస్తే తెలుస్తుంది ఈ వివక్ష. వ్యవసాయ ప్రధాన దేశంలో సాగునీరులేక రైతులు నడ్డి విరిగిపోగా కూలీలు పనులు దొరక్క దూరప్రాంతాలకు వలసలు వెలుతున్నారు.
వ్యవసాయం ఎలాగూ సాగదు, ఇక మిగిలిన ఉద్యోగాల విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగింది, దీనిపై ఎన్నో కమిటీలూ వేసి అన్యాయం నిజమే అని నిరూపణ అయినా ప్రభుత్వం మాత్రం అన్యాయాన్ని దశాబ్దాలుగా సరిచెయ్యలేక పోయింది. ఒక పది సంవత్సరాల క్రితం వరకూ ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలే ఆధారం, ఇప్పూడు పారిశ్రామీకరణ జరిగినా ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ప్రభుత్వ సెక్టారులోనే ఉన్నాయనేది నిజం. నీళ్ళూ, నియామకాలు పోగా మూడోది నిధుల పంపిణీ. బడ్జేట్‌లో ఆదాయం ఎక్కువగా తెలంగాణ నుంచి రాగా వ్యయంలో మాత్రం తెలంగాణాది వెనుక సీటు.
కనుక ఇకనుంచీ సమైక్యవాదులారా, వెనుకబాటు తనం మాదగ్గరా ఉంది అంటూ మూస సమాధానాలు ఇవ్వకండి. మీదగ్గరా వెనుకబడిన ప్రాంతాలు ఉంటే ఇకనేం విడిపోయిన తరువాత మీప్రాంతాన్ని మీరు బాగుచేసుకోండి, మాప్రాంతాన్ని మేం బాగు చేసుకుంటాం.
ఇది చదివిన వెంతనే కొందరు "మరి వివక్ష జరుగుతుంటే మీప్రాంత నాయకులేం చేస్తున్నారు? మీప్రాంతం నుంచి మంత్రులూ, ఎమ్మెల్యేలూ లేరా? మీప్రాంతమ్నుంచి కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు కదా? లాంటి ప్రశ్నలు వేస్తారని తెలుసు కానీ ఆప్రశన్లు ఇప్పుడే వెయ్యకండి, వాటిని మరో FAQలో ఇంకో టపాలో తప్పక చర్చిద్దాం.
బాగా రాస్తున్నారు విశ్వరూప్ గారూ!
ReplyDeleteకొణతం దిలీప్
కోస్తా ఆంధ్రకి చెందిన రైతులలో 40% మంది తమకి వేరే ఉపాధి దొరికితే వ్యవసాయం మానేస్తామన్నారు. తెలంగాణాకి చెందిన రైతులైతే వేరే ఉపాధి దొరక్క, ఉన్న ఉపాధిలో బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది వెనుకబాటుతనంలో ఒక ప్రాంతానికి, ఇంకో ప్రాంతానికి మధ్య ఉన్న తేడా.
ReplyDeleteఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి ఇక్కడ అందుబాటులో ఉన్న నీటి వనరులు కారణం. ఇక్కడ నాగావళి నది తప్ప మిగిలిన నదులన్నీ వేసవిలో ఎండిపోతాయి. తెలంగాణాలో గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాలలోనూ వెనుకబాటుతనం ఉంది.
ReplyDelete"కోస్తా ఆంధ్రకి చెందిన రైతులలో 40% మంది తమకి వేరే ఉపాధి దొరికితే వ్యవసాయం మానేస్తామన్నారు."
ReplyDeleteఓహ్ అలా అని మీతో చెప్పారా????
ఒక టివి చానెల్ వార్తలలో విన్నాను. వేరే ఉపాధి దొరికితే 40% మంది వ్యవసాయం మానెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులే చానెల్ వాళ్ళకి చెప్పారు.
ReplyDeleteదిలీప్ గారు,
ReplyDeleteధన్యవాదాలు. మీ అనుమతి లేకుండా missionTelangana బ్లాగ్ నుండి కొంత సమాచారం ఉపయోగించాను, మన్నించండి.
విశ్వరూప్ గారూ చాలా స్పష్టంగా, హుందాగా రాస్తున్నారు. నాకు చాలా కాలంగా ఒక సందేహం. టీం వర్క్ కీ, కలిసి పని చేసే ప్రతిభకీ ప్రాముఖ్యమిచ్చే ఈ కాలంలో అవతలివారి దౌర్జన్యాన్ని విడిపోవడం ద్వారా మాత్రమే ఎదుర్కోగలమని చెప్పడం వల్ల తెలంగాణా వారికి ఏమీ నష్టం వుండదంటారా!
ReplyDeleteఅగ్నాత గారు,
ReplyDeleteచాలామంచి ప్రశ్న వేశారు.
There is a clear difference between team and masses. A team works together with a common goal with clear division of responsibilities, while masses do not have a common goal at all.
కాబట్టి సామాన్య ప్రజానీకానికి టీంవర్క్ కుదరదు. మేనేజ్‌మెంట్‌లో టీంలీడింగ్ స్టైల్తో మాసెస్‌ను అట్రాక్ట్ చెయ్యడం కుదరదు. ఒక కంపనీని మంచి స్థానంలో నిలబెట్టే CEO ఒక ప్రజానేతగా ఎదిగిన సందర్భాలు తక్కువ.
ఒక రాష్ట్ర ప్రజల్లో అందరికీ విభన్నమయిన లక్ష్యాలు ఉంటాయి. కాబట్టి ఒక రాష్ట్రానికీ టీంకు తేడా ఉందని గమనించండి.
ముకేష్, అనిల్ అంబానీలు విడిపోయిన తరువాత ఇద్దరూ ఎక్కువ వృద్ధి సాధించారు. కలిసి ఉండి తగవులాడుకోవడం కంటే విడిపోయి ఎవరి దారి వారు చూసుకోవడం ఇద్దరికీ మంచిది.
ReplyDeleteవిశ్వరూప్‌గారు.. మీరు పైన మీ వ్యాసంలో ఒక చోట ఉదహరించిన ఒక విషయంలో మీకు స్పష్టమైన అవగాహన వున్నదా అన్ని నా సందేహం..మీరు చెప్పిన ఈ " ఒకవేళ రాయలసీమ వారు తాము కూడా వివక్షకు గురయ్యామని భావిస్తే వారూ రాష్ట్రం అడుగుతారు, కానీ అది వాస్తవం కాదు గనుక, సమైక్య రాష్ట్రంలో వారు లబ్ది పొందుతున్నారు కనుక వారు స్వరాష్ట్రం అడగడం లేదనేది బహిరంగ రహస్యం. "
ReplyDeleteఈ అభిప్రాయానికి ఎలా రాగలిగారు...మీరు..? కాస్త వివరించగలరా..? ఊరికే అనవసరంగా ఇలాంటి అభిప్రాయాలతో మీ చుట్టూ వున్న జనాన్ని నమ్మబలకగరలరేమో గాని మాలంటి వాళ్ళను కాదు.
కమల్,
ReplyDeleteఆవిషయం విభజన తప్పనిసరి అయితే రాయలసీమ తెలంగాణతో కలిసి ఉండాలి, లేదా మహబూబ్నగర్తో కలిపి గ్రేటర్ రాయలసీమ కావాలి అనే మీ నాయకులనడగండి. లేదా క్రిష్ణా జలాలు సమైక్య రాష్ట్రంలో ఎలా పంచబడుతున్నాయో కుడి ఏదమ కాలవల వ్యత్యాసం ఏమిటో కాస్త రీసెర్చ్ చెయ్యండి.
మా నాయుకులా..? ఎవరు వాళ్ళూ..? ఎవరి ఏది నోటికొస్తే అది మాట్లాడుతున్నారు..! ఎవరూ ప్రజల ఆలోచనలను పరిగణలోకి తీసుకోవట్లేదు..! ప్రత్యేక రాయలసీమ కావాలని అడగకపోవడానికి చాలా కారణాలున్నాయి రాయలసీమ ప్రజల్లో..! జె.సి ఒకలాగ మాట్లాడతాడు..! జి.వెంకటేష్ ఒకటి మాట్లాడతాడు..అసలు జి.కె. కి బుర్ర లేదన్న సంగతి కర్నూల్ ప్రజలందరికీ తెలుసూ..! అసలు ఎవరూ అతన్ని నాయకుని కింద జమ కట్టట్లేదు. బ్రదరూ నేను ఒకప్పటి సివిల్ ఇంజనీర్‌నే నాకు తెలుసు..వాటి పంపకాలు..మీకు తెలియదేమో.." శ్రీబాగ్ " ఒడంబిక..దాని వలన తెలంగాణ కంటే ఎక్కువగా నష్టపోయింది రాయలసీమ ప్రాంతమే. వెళ్ళి..కేవలం ప్రాంతీయ అభిమానంతో వ్యవహరించే ఇంజనీర్స్ నుండి కాకుండా అసలు సిసలైన సాంకేతిక నిపుణలు చెప్పిన విషయాల మీద మీరు రీసెర్చ్ చేయండి.
ReplyDeleteశ్రీబాగ్ ఒడంబడిక రాయలసీమ, కోస్తాంధ్ర మధ్య. దానికి తెలంగాణ కడుపు ఎందుకు కొట్టడం? శ్రీబాగ్ ఒడంబడిక రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కోస్తాంధ్ర కన్న ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతుంది, తెలంగాణకన్న కాదు. అందునా తెలంగాణ కడుపుగొట్టి తెలంగాణ వాటాను సీమకు, కోస్తాకు ఎందుకు ఇవ్వడం? దానితరువాత వచ్చిన పెద్ద మనుషుల ఒప్పందానికే దిక్కులేదు, శ్రీబాగ్ ఒప్పందం మీకెలా గుర్తొచ్చింది? అసలు కారణం యాభై ఏళ్ళలో నలభై ఏల్లదాకా మీప్రాంతంవాడో, లేక ఆప్రాంతానికి ప్రాతింధ్యం వహించిన NTRలాంటివారో అధికారంలో ఉండడం.
ReplyDeleteసరే, మీరు సమైక్యరాష్ట్రంలో అభివృద్ధి చెందడం లేదనుకొంటే మీరూ రాష్ట్రం అడగండి, మేం సమర్ధిస్తాం.
హ హ ..! అభివృద్ది చెందకపోవడం వలన విడిపోవడమే పరిష్కారమా..? విడిపోతే అబివృద్ది జరుగుతుందా..? అదెలా..? కలసి వున్నా విడిపోయినా అదే రాజకీయనాయుకల పరిపాలనలోనే మనం బతకాలి..! మరదే రాజకీయ నాయుకులు విడిపోయాక కూడ పరిపాలిస్తున్నప్పుడు ఎలా అబివృద్ది చెందగలం..?
ReplyDeleteతెలంగాణ కడుపుకొట్టి రాయలసీమకు వాటాను తీసుకెళ్ళారా..!! ఎక్కడ..?.
నేను మీకు ముందే చెప్పాను పరిపాలించేది మీ ప్రాంతం వాడా లేక మా ప్రాంతం వాడా అన్నది కాదు ముఖ్యం..? అన్ని చోట్ల వుండేది " మనిషే " అయినప్పుడు, ఆ మనిషి రాజకీయనాయుకుడు అయినపుడు కుల,మత,ప్రాంతీయాలకు అతీతంగా దోచుకోవడానికి చూస్తున్నాడు..! మరెక్కడ మీ ప్రాంతం వాడు..మా ప్రాంతం వాడు అన్న ప్రశ్న ఉదయస్తుంది..? మీరు పదే పదే అదే విదంగా మాట్లాడుతున్నారు..మూలాలను చూడకుండ. కాస్తో కూస్తో యన్.టి.ఆరే రాయలసీమకు ఒకటిరెండు మంచిపనులు చేశాడు ప్రాంతాలకతీతంగ.
నేనేమి రాయలసీమ రాజకీయ నాయకులు గొప్పోళ్ళు, మంచోళ్ళు అని చెప్పట్లేదు..నిజం చెప్పాలంటే చేతకాని చవట దద్దమ్మలు రాయలసీమపు రాజకీయనాయకులు..ఎవరి స్వార్థం వారిది, ఎప్పుడు చూసినా ఎంత దోచుకుందామా.. అని చూస్తారే గాని తమ ప్రాంతపు అబివృద్ది( మరొకరి కడుపు కొట్టకుండ ) గురించి ఆలోచించరు..! ఈ విషయంలో మాకు స్పష్టత వున్నది బ్రదర్.
విడిపోతే ఎలా అబివృద్ధి సాధ్యమో మరో FAQలో చెబుతాను, ధన్యవాదాలు.
ReplyDelete