Wednesday 22 June 2011

దేడ్ దమాక్ వాదనలు

కొంతమందికి మెడకాయలమీద తలకాయలు ఉన్నప్పటికీ, ఆతలకాయల్లో ఆలోచించే మెదడు ఉండదు, దాని స్థానంలో అహంకారము మాత్రము ఉంటుంది. అందుకే మెదడుతో గాక పొగరుతో ఆలోచించి తమ మిడిమిడి గ్నానాన్నే మహా తెలివితేటలని భావించి అందరినీ విమర్శించబోతారు, చివరికి తమ తెలివితక్కువతనాన్ని బయటపెట్టుకుంటారు. ఇలాంటిదే ఒకసారి ప్రజాకవి గోరేటి వెంకన్నపై చూపించబోయి అడ్డంగా దొరికిపొయ్యారు, అయినా బుద్ది మారలేదు.

వలసవాద ప్రభుత్వంలో ఉద్యోగం చెయ్యడానికి సిగ్గులేదూ అని అడిగే బుర్రలేని వెధవలకు బ్రిటిష్ వలసవాద ప్రభుత్వంలోనూ భారతీయులు, సీమాంధ్రులు ఉద్యోగాలు చేశారని తెలియదా? అసలు ప్రపంచంలో ఎక్కడయినా వలసవాద ప్రభుత్వాలు లోకల్ ఉద్యోగులు లేకుండానే పనిచేశాయా? బ్రిటిష్ పాలనలో ఉద్యోగాలు చేసిన మన పెద్దలకు సిగ్గులేదని, వారిబుద్ది శంకరగిరి మాన్యాలు పట్టిందని ఈయన అభిప్రాయమా లేక ఈయన మెడకాయపై ఉన్నతలకాయలోంచి మెదడు మోకాల్లద్వారా అరికాల్లలోకి జారిపోయి చితికిపోయిందా?

ఇక రెండొ శుష్కవాదన బావిలో నీల్లున్నా బావిపై ఉన్న మనుషుల దాహం తీరనట్టు పీఠభూమిలో నదులున్నా భూములకు అందదట, వహ్వా. బావిలో నీల్లుంటే బావిపైనున్న మనుషులు దాహంతో ఎండరు, చేదుకుని తాగుతారు. ఎవరైనా ఎండారు అంటే అది మనిషిలా ఆలోచించలేని జంతువులన్న అయ్యుండాలి, లేదా ఎవరైనా పెద్దదొరలు దౌర్జన్యం జేసి నీల్లను తాగకుండా మిగతా ప్రజలను ఆపనన్నా ఆపాలి. మరిక్కడ ఈయన వాదన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలివిలేని జంతువా, లేక కొంతమంది దౌర్జన్యంగా మిగతావారికి అందకుండా చేస్తున్నారా?

గుంటూరు నుంచి నల్లగొండకు రైల్లో వచ్చినా, బస్సులో వచ్చినా ఎక్కడయితే క్రిష్ణా జలాలు కాలువద్వారా అందుతాయో అక్కడ పచ్చగా ఉంటుంది, ఎక్కడయితే అందవో అక్కడ ఎండిపోతుందని ఈఅతితెలివి మహాశయునికి తెలియదు. దక్కన్ పీఠభూమిలోనే ఉన్న నిజామాబాద్, కరీమ్నగర్ లలో కూడా కాలువలు ఉన్నచోట పచ్చగానే ఉంటుందని పచ్చకామెర్ల మనిషికి తెలియదు.

ఇక ఆతరువాత నీరు పళ్లమెరుగును అని ఒక పెద్ద శాస్త్రాన్ని తానే కనుక్కున్నంత దర్జాగా చెప్పి కల్లు తెరిపించాడీ అతితెలివి మహానుభావుడు. నీరు పల్లమెరిగితే అది డెల్టాలో మాత్రం వాడడం ఎందుకు బంగాళాఖాతం ఇంకా పళ్ళంలో ఉంది కదా అని అక్కడికే పంపిద్దామా? లేక ఎగువన ఉన్న రాష్ట్రాలు నీల్లు పల్లమెరుగును కదా అని అన్నీ కిందకే విడిచిపెడుతున్నారా?

నిబద్దత ఉన్న ప్రభుత్వం ఆయకట్టు ఇప్పటికే ఉన్నచోట ఆయకట్టు స్థిరీకరణకోసం వేలకోట్లు ఖర్చుపెట్టేముందు అసలు లేని చోత ప్రాజెక్టులు చేపడతారు. కానీ ప్రభుత్వంలో చక్రం తిప్పేది మనమయితే ప్రాజెక్టు ఉన్నదగ్గరే మల్లీ మల్లీ కడుతాం, నియమాలు ఉల్లంఘించి గోదావరి నీల్లను క్రిష్ణా బేసిన్‌కు మల్లిస్తాం, పర్యావరణం పాడయినా, అడవులు మునిగిపొయినా, ఆదివాసిలు నిర్వాసితులయినా ఇంకా ఏమయినా ఫరవాలేదు. ఎగువన ఉన్న శ్రీరాం సాగర్ మాత్రం మూడొంతులకు కుదిస్తాం, ఎన్నటికీ పూర్తిచేయం, గ్రావిటీ బూచి చెప్పి ఇంకా ఏప్రాజెక్టూ చేపట్టం.

ఇప్పటికే క్రిష్ణాపై శ్రీశైలం ఎడమకాలువకు పూర్తిగా ఎగనామం పెట్టి, నాగార్జున సాగర్ ఎడమకాలువ అలైన్మెంటు మార్చి తెలంగాణ నోట్లో మట్టికొట్టారు, అడిగితే క్రిష్ణాలో నీల్లెక్కడ ఉన్నాయి ఇవ్వడానికి అని మన రాజశేఖరుడు సమాధానాలు చెబుతాడు. ఇక మిగిలిన గోదావరిపై తెలంగాణలో ఎన్నటికీ ప్రాజెక్టులు కట్టం, చూడండి ఎలాగూ సముద్రంలోనే కలుస్తున్నాయి కదా అని చెప్పి క్రిష్ణా డెల్టాకు మల్లిద్దాం.రేప్పొద్దున ఎవరైనా తెలంగాణలో గోదావరి నీల్లడిగితే ఇప్పటిదాకా గ్రావిటీ బూచిని చూపించినవారు రేపు గోదావరిలో నీల్లెక్కడ ఉన్నాయి, వాటిని క్రిష్ణా డెల్తాకి పంపించేశాం కదా, ఇప్పటికే ఉన్న ఆయకట్టుకదా ఎలా అంటాడు.

అతితెలివి మహాశయుడు ఇచ్చే మరో భారీ స్టేట్మెంటు మీదగ్గర పారిశ్రామీకరన చెందితే మేమేడుస్తున్నామా, నదీజలాలను మొత్తంగా మాకు తరలిస్తే మీరెందుకు ఏడుస్తారూ అని. అయ్యా.. మాదగ్గర పారిశ్రామీకరణ జరిగితే దాని వోనర్లు, ఉద్యోగులు, అటేందర్లు అందరూ మీవారే గదా? వ్యవసాయం పెరిగితే అక్కడి నివాసితులకు లాభం గానీ పారిశ్రామీకరణ వలన ఎవరికి లాభమో మీలాంటి అతితెలివి మనుషులకు తెలియదా చెప్పు? ఊరికే ఏడుపు ఏడుపు అని వాగొద్దు, మేం మాహక్కులకోసం అడుగుతున్నాం, మీపైసాకూడా మాకొద్దు. మావాటా మాకివ్వాల్సి వస్తుందని ఏడిచేది మీరే.

మనుషులు తమ పరిమితులు తెలుసుకోకుండా కంప్యూటర్ ఉందికదా ఏదయినా రాసేద్దాం, పెద్దవాల్లను బుద్దిహీనులు, మెడకాయమీద తలకాయలేని వారు అంటూ తిట్టిపోస్తే మనకు మైలేజీ పెరుగుతుందని ఇష్టం వచ్చింది రాస్తే సాధించేది ఏమిటి? తన మిడిమిడిగ్నానాన్ని మరో మారు చూపుకుంటూ పోలవరం ఇస్తే సీమాంధ్ర నుండి హైదరాబాదుకు వలసలు తగ్గిపోతాయి అంటూ మరో భారీ స్టేట్మెంటు??!! అయ్యా, పొట్టకూటికోసం వలసపొయ్యే కూలి జనాలకూ, ఊర్లో ఆయ్కట్టుకింద నాలుగెకరాలుండి అదక్కడ సాగు చేస్తూనే దొంగ సర్టిఫికెట్లు పెట్టి తెలంగాణ కోటాలో ఉద్యోగాలు దోచుకునే దోపిడీవారికీ తేడా తెలుసుకోండి. వలసలకూ వలసవాదానికీ తేడా తెలుసుకోండి.అయినా ఏదో మాఅమాయకత్వం గానీ నీతిమాలిన లగడపాటినికూడా నిస్సిగ్గుగ వెనుకేసుకొచ్చే మనుషులకెక్కడయినా నీతి ఉంటుందా?

PS: bad publicity is also good publicity. మీరు విమర్శిద్దామనుకుని ఆవీడియోలు మీబ్లాగులో పెట్టుకున్నా ఆవిధంగా మీరు తెలంగాణవాదానికి మంచే చేస్తున్నారు. మీబ్లాగులో ఆవీడియోలు చూసేవారంతా మీఅంత మూర్ఖవాదులూ, పక్షపాతంతో కల్లుమూసుకుపోయినవారు కాదు గనక వారు మీబ్లాగుద్వారా వీడియో చూసి నిజాలు గ్రహించనూ వచ్చు, తరువాత మీరాతలు చదివి సీమాంధ్రవాదుల పక్షపాతధోరణినీ తెలుసుకోవచ్చు. మీకు ధన్యవాదాలు.

నమస్తే!!

4 comments:

  1. అన్నా.. గీ దేడ్ దిమాక్ గాని కోడి మెదడుకు ఇవన్ని అర్థమైతయి అనుకుంటున్నవా? :)

    మల్ల రేపు ఇంకో బెహ్‌త్రీన్ అవిడియా పట్టుకొచ్చి తన తెలివితక్కువ తనం బయట పెట్టుకుంటడు సూడు.

    గివన్నీ అరిగిపోయిన రికార్డులే. వాదించే సరుకు లేనప్పుడు రిమిక్స్ చేసిన రికార్డ్ మల్లీ ఏస్తరు. ఓ నలుగు జూనియర్ ఆర్టిస్టులు దానికి రికార్డింగ్ డ్యాన్స్ షురూ చేస్తరు చూడు.

    ReplyDelete
  2. PS: bad publicity is also good publicity. మీరు విమర్శిద్దామనుకుని ఆవీడియోలు మీబ్లాగులో పెట్టుకున్నా ఆవిధంగా మీరు తెలంగాణవాదానికి మంచే చేస్తున్నారు. మీబ్లాగులో ఆవీడియోలు చూసేవారంతా మీఅంత మూర్ఖవాదులూ, పక్షపాతంతో కల్లుమూసుకుపోయినవారు కాదు గనక వారు మీబ్లాగుద్వారా వీడియో చూసి నిజాలు గ్రహించనూ వచ్చు, తరువాత మీరాతలు చదివి సీమాంధ్రవాదుల పక్షపాతధోరణినీ తెలుసుకోవచ్చు. మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. లఫంగ LOL.. ఇక్కడేదో దీర్ఘంపోయినట్లుంది.. "దీర్ఘంపోతే దాణాకూడా పెట్టనని" ఎవరో సుత్తికారుడు న్నారు. బావుంది ;)


    #bad publicity is also good publicity.

    This is always cent% true since people are more attracted to bad than good and in very quick manner. and that is sometime good:)

    ReplyDelete

Your comment will be published after the approval.