Tuesday, 17 September 2013

సీమాంధ్ర బందులు - పేదవిద్యార్థులే పావులుసమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యోగులు నలభై రోజులుగా సమ్మె చేస్తుండడం వలన ప్రభుత్వ పాఠశాలలు అన్నీ మూతబడి పిల్లల చదువులు గందరగోళమయ్యాయి. అయితే కార్పోరేట్ స్కూల్లు మాత్రం యధావిధంగా నడవడం వలన ధనిక వర్గాలకు చెందిన విద్యార్థులపై ఈబందు ప్రభావం ఏమీ లేదు. ఎటొచ్చీ పేద విద్యార్థులు మాత్రం బలి పశువులుగా అయిపొయ్యారు.

తెలంగాణలో ఎంత ఉద్యమం జరిపినా ఇలా వరుసపెట్టి స్కూళ్ళు బందు పెట్టింది లేదు. సకల జనుల సమ్మె సందర్భంగా మాత్రం ఇరవైనాలుగు రోజులు అన్ని విద్యాసంస్థలూ ( ప్రభుత్వ మరియు ప్రైవేటు) మూతబడ్డాయి, కానీ అందులో పది రోజులు దసరాసెలవులు  కావడం వలన నికరంగా బందు ప్రభావం వలన మూతబడ్డది పద్నాలుగు రోజులే. దానికే గగ్గోలు పెట్టిన సీమాంధ్ర మీడియా ఛానెళ్ళు నలభై రోజులుగా మూతపడ్డ సీమాంధ్ర ప్రభుత్వ పాఠశాలలగురించి పట్టించుకుంది లేదు.

విశాలాంధ్ర మహాసభ అని పేరుపెట్టుకున్న ఒక సంఘం వారు సకలజనుల సమ్మె సందర్భంగా బడులు మూతబడి పిల్లల చదువులు పాడవుతున్నాయి అని తెగబాధపడిపోయి కూకట్‌పల్లిలో ఒక ర్యాలీ కూడా తీశారు. పదిమందికూడాలేని ఈగుంపు చేసిన ర్యాలీని సీమాంధ్ర మీడియా విపరీతంగా ప్రచారం చేసి,డిస్కషన్లు పెట్టి హడావుడి చేశింది. అయితే సీమాంధ్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గోడు మాత్రం ఈవిశాలాంధ్ర మహాసభకు ఎంతమాత్రం పట్టినట్టులేదు.  

సీమాంధ్రలో పలు చోట్ల తమ బడులు తెరిపించాలని పేద విద్యార్థులు ధర్ణాలు చేస్తున్నప్పటికీ సీమాంధ్ర మీడియా వాటిగురించి ప్రచారం జరగకుండా జాగ్రత్తపడుతుంది. కొండొకచో ఆధర్ణాలను కూడా సమైక్యాంధ్ర అకౌంట్లో కలుపుతున్నారు. ఇదీ సీమాంధ్ర ఉద్యమం తీరు. 8 comments:

 1. Abba Entha daya ra meeku seemandhra peda vidyardula meeda? Telangana udyamam lo athma hatyalu chesukunnadi antha peda valla pillala or dabbunnodi pillala? Ekkadaina nastapoyedi valle. AP ki ee paristhi create chesi ippudu enduku ra pakka valla meeda edupulu?

  ReplyDelete
  Replies
  1. @Raj

   బడిపిల్లలకేం తెలుసు రాష్ట్రవిభజన గురించి? వాల్లేమయినా స్వచ్చందంగా బందులు చేస్తునారా? సమర్ధించడానికి కాస్త సిగ్గుండాలి. మీదగ్గర స్వచ్చందంగా ఉద్యమంలో జనం పాల్గొనకపోవడం వల్లనే బడిపిల్లలను అడ్డంపెట్టుకుంటున్నరనే సత్యం తెలుసుకుంటే మంచిది

   Delete
 2. Neekanta jali daya avasaram ledu kani,
  OU lo chadive vallanta tegabalisina vallani nee uddesama. Alagayite telangana enduku.

  ReplyDelete
  Replies
  1. @Anonymous16 September 2013 20:28

   ఓయూలో చదివేవాళ్ళు ఎదిగిన వాల్లు, విభజన, సమైక్యతల గురించి, వాటి పర్యవసానాలగురించి తెలిసి స్వచ్చందంగా ఉద్యమించినవారు. మరి బడిపిల్లలకేం తెలుసు రాష్ట్రవిభజన గురించి? వాల్లేమయినా స్వచ్చందంగా బందులు చేస్తునారా? సమర్ధించడానికి కాస్త సిగ్గుండాలి. మీదగ్గర స్వచ్చందంగా ఉద్యమంలో జనం పాల్గొనకపోవడం వల్లనే బడిపిల్లలను అడ్డంపెట్టుకుంటున్నరనే సత్యం తెలుసుకుంటే మంచిది.

   Delete
 3. సమ్మె విశ్వరూపం ఇప్పుడు ఈ వేడిలో తెలియదు ఆనక అన్ని రంగాలలో దాని ప్రభావం వ్యాపించి నష్టం చేస్తుంది!సామాన్యులే సమిధలు అవుతారు!పేదలు మరింత పేదవారు అవుతారు!

  ReplyDelete
 4. అబ్బ చా .... ఇప్పుడు గుర్తొచ్చిందా తమరికి , తెలంగాణా ఉద్యమం చేస్తున్నప్పుడు రాలేదా ?

  ReplyDelete
  Replies
  1. @Anonymous17 September 2013 09:47

   తెలంగాణ ఉద్యమంలో ఎన్న్నడూ ప్రభుత్వపాఠశాలలను మూసి ప్రైవేటు బదులు తెరవలేదు. పైగా ఇన్నిరోజులు బళ్ళు బందు పెట్టలేదు. రెండువారాలకే గగ్గోలు పెట్టారు కదా. కాస్త టపా చదివి కామెంటు చేస్తే ఉపయోగం.

   Delete
  2. anna tv 9, abn andhra jyothy , parents sangalalo , kancha iallaiha latollu ippudu e pokka lo sochindre

   Delete

Your comment will be published after the approval.