Tuesday, 17 September 2013

సత్యవాణి..కబ్జాల రాణి

నోరు తెరిస్తే.. ఆధ్యాత్మికం, కాలు కదిపితే కబ్జా ఆమె స్టైల్. శివ.. శివ అంటూనే గుడితో సహా లింగాన్ని మింగే ఘనురాలు. సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చి వందల ఎకరాల భూమిని సంపాదించడం ఎంత వీజీనో శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ఓనర్ గొట్టిపాటి సత్యవాణిని అడిగితే తెలుస్తుంది. సత్యవాణి సమైక్యసభలో చెప్పిన సుద్దులకు.. అధ్యాత్మికం మాటున నిర్వహించే దందాలకు ఏమాత్రం సంబంధంలేదని ఆమె గురించి కొంత తెలుసుకున్నా అర్థమైపోతుంది. ధార్మిక క్షేత్రం మాటున సత్యవాణి అక్రమించిన సర్కారు స్థలం 520ఎకరాలపైమా సమాచారం. మియాపూర్‌లో సత్యవాణి ఆక్రమించిన స్థలంలో ఒక చెరువు ఉండేదని.. ఇందు లో గ్రామస్థులు బతుకమ్మలు కూడా వేసేవారని స్థానికులు చెబుతున్నారు.

satya2hg
సత్యవాణి ప్రవేశం తర్వాత ఆ స్థలంలో మియాపూర్‌వాసుపూవ్వరూ అడుగుపెట్టే పరిస్థితి లేదని.. వనభోజనాలు నిర్వహించుకునేందుకు సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారినే అనుమతిస్తారని వాపోతున్నారు. సత్యవాణి శిష్యురాలు సరళారాణి ఈ విషయాన్ని ‘టీ మీడియా-టీ న్యూస్’కు వెల్లడించారు. ఈ స్థలంలో ఏర్పాటుచేసిన శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ప్రాంగణంలో శివాలయం, సాయిబాబా మందిరం, సరస్వతి దేవాలయం, విజయదుర్గాదేవీ మందిరాలు నిర్మించారు. దేవాలయాల్లో హుండీలు ఏర్పాటు చేసి భారీగా డబ్బులు గుంజడమే లక్ష్యంగా ఆమె ట్రస్టు రోజువారీ కార్యకలాపాలు సాగుతాయనే విమర్శలున్నాయి. 

దీప్తిశ్రీ నగర్‌ను బుక్కపెట్టిన సత్యవాణి, అట్లూరి: సీమాంధ్రకు చెందిన ప్రశాంత్ బిల్డర్స్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ చైర్మన్ అట్లూరి సుబ్బారావు అండ దండలే సత్యవాణిని ఈస్థాయిలో నిలబెట్టిందని తెలుస్తున్నది. అట్లూరి చలవతోనే సత్యవాణి మియాపూర్ స్థలాన్ని కబ్జా చేసి ట్రస్టు మాటున సర్కారు భూములను బుక్కపెట్టినట్లుగా ఆరోపణలున్నాయి. మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101లో ఉన్న దీప్తి శ్రీనగర్ కాలనీలో దీప్తి శ్రీ బిల్డింగ్ సొసైటీ 1985నుంచి 1990వరకు మూడు ఫేజ్‌లకు అనుమతులు పొందింది. అక్కడి నుంచే సత్యవాణి, అట్లూరి సుబ్బారావు కబ్జా కథ మొదలైంది. నిజమైన దీప్తిశ్రీ బిల్డింగ్ సొసైటీవాసులు ఎవరు లేకుండానే సత్యవాణి, అట్లూరి సుబ్బారావు తామే ఈ సొసైటీ పెద్దలమని నాటకం మొదలు పెట్టారు. సత్యవాణిని సొసైటీ అధ్యక్షురాలుగా అధికారులను నమ్మించి ఈమేరకు రిజిస్ట్రేషన్ చేయించా రు. 

ఆ తర్వాత 1996నుంచి దీప్తిశ్రీ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షురాలి పేరుతో సత్యవాణి సొసైటీ లేఅవుట్‌ను కాంప్రహెన్సివ్ రివైజ్‌డ్ లే-అవుట్ చేసి ప్రజాప్రయోజనార్థం నిర్దేశించిన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం మొదలు పెట్టారు. దీనికి ఉదాహరణగా ఫేజ్-1 లే అవుట్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ కోసం 1.18ఎకరాల విస్తీర్ణం గల భూమిని నిజమైన దీప్తిశ్రీ బిల్డింగ్ సొసైటీ లేఅవుట్‌లో చూపించింది. ఈ స్థలంపై కన్నుపడ్డ అట్లూరి సుబ్బారావు సత్యవాణితో కలిసి ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. ఆ తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్‌ను పార్క్ స్థలంలోకి మార్చారు. పార్క్ కోసం కేటాయించిన 50X275 =13750చదరపు అడుగుల స్థలాన్ని అట్లూరి సుబ్బారావు సొంతం చేసుకున్నారు. అదే విధంగా ఫేజ్-2 లేఅవుట్‌లో స్కూల్ కోసం నిర్దేశించిన 5270చదరపు గజాల స్థలాన్ని మరోసారి అట్లూరి సుబ్బారావు 1500గజాలు ఆయన భార్య పద్మావతి 1500గజాలు దక్కించుకున్నారు.

పైగా స్కూల్ కోసమంటూ నిర్దేశించిన 5270చదరపు గజాల స్థలం సొసైటీ ఆధీనంలోనే ఉన్నట్లు చూపి జీహెచ్‌ఎంసీ కమిషనర్ నుంచి స్కూల్ నిర్మాణం కోసం సత్యవాణి అనుమతి పొందారు. అట్లూరి సుబ్బారావుకు, ఆయన భార్య పద్మావతికి అమ్మగా మిగిలిన 2270చదరపు గజాల స్థలాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు స్కూల్ పేరుతో అమ్మే ప్రయత్నం జరుగుతున్నది. సత్యవాణి చేస్తున్న ఈ అక్రమాలన్నీ కాలనీ ప్రయోజనాలకు విరుద్ధమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడమే అవుతుందని కాలనీవాసులు అంటున్నారు. తమకు తెలియని సొసైటీ ప్రెసిడెంట్ ఎవరా..? అని ఆర్‌టీఐ చట్టం కింద ఆరా తీస్తే సత్యవాణి అని తేలిందని కాలనీవాసులు అంటున్నారు. ఇప్పటికే పై అక్రమాలను ప్రస్తావిస్తూ వారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేఖ కూడా రాశారు. కాగా, రెండు దశాబ్దాల క్రితం ఏర్పడిన దీప్తిశ్రీ నగర్ సొసైటీలో ఇప్పటివరకు ఒక్కసారికూడా ఎన్నికలు జరగలేదు. 

ఆలయాల ప్రాంగణంలో ప్రకృతి చికిత్సాలయం
దైవాన్ని చూపించి వందల ఎకరాల స్థలాన్ని బుక్కపెట్టిన సత్యవాణి ఈ ప్రాంగణంలోనే ఓ ప్రకృతి చికిత్సాలయం, గెస్టు హౌస్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయంపై గతంలోనే అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే ట్రస్టులో సాగుతున్న మరో దందా నీళ్ల అమ్మకం.. ఎండాకాలంలో హోటళ్లకు, ప్రైవేటు హాస్టళ్లకు ఇక్కడినుండే నీళ్లు వెళ్తాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా చుట్టుపక్కల ఎన్ని బోర్లు వేసినా నీళ్లుపడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టులో నాంపల్లి బాబా స్పెషల్‌గా కనిపిస్తాడు. వాస్తవానికి ఈయన ఎక్కడా ఏ ఆధ్మాత్మిక కార్యక్షికమాల్లో పాల్గొనలేదని స్థానికులు చెబుతారు. గతంలో ఈ నాంపల్లి బాబా నాంపల్లి రైల్వేస్టేషన్‌లో గంజాయి తాగుతూ తిరిగేవాడని అక్కడి స్థానికులు చెబుతుంటారు. కానీ ఈ బాబాకు సత్యవాణి గుడి కట్టించేశారు.

20 comments:

 1. మంచి విషయం ఉన్న టపా.
  ఈ సత్యవాణిగారి విషయంలో విచారణ జరిపించమని ప్రభుత్వాన్ని అడగవచ్చును.
  తగిన అధారాలతో ముందుకు వెళితే మంచి ఫలితం‌ తప్పక ఉంటుంది.
  వీలుంటే తప్పకుండా న్యాయస్థానం తలుపులు తట్టవచ్చును.

  ReplyDelete
 2. సత్యవాణిగారు గురివి౦ద అని నాకు తెలియదు!మీరు బాగా పరిశోధించి విషయం తేటతెల్లం చేశారు!కనువిప్పు కలిగించినందుకు ధన్యవాదాలు!దొంగాబాబాల పేరుతొ చేసిన భూకబ్జాలన్నీ బహిర్గతం చేసి నేరస్తులను శిక్షి౦చాలి!

  ReplyDelete
  Replies
  1. @surya prakash

   ఇది నేను రాసింది కాదండి, ఇవ్వాల నమస్తే తెలంగాణ లో వచ్చిన వ్యాసం.

   Delete
 3. ఆరోపణలు రాగానే మనం గురివింద అనో‌ దొంగబాబా అనో‌ బిరుదులు తగిలించటం ఉచితం కాదు.
  వాటి విషయమై ఆధారాలు ఉంటే విచారణ కోరవచ్చును.
  రుజువయ్యాక చూడవచ్చు ఏఏ బిరుదులు వగైరా ఇవ్వచ్చునో

  ReplyDelete
  Replies
  1. kaani kcr vishayamlo maatram meeru ee siddhaantaalu vallincharu!

   Delete
  2. KCR మీద కూడా అవసరం ఐతే విచారణ చేయవచ్చును. ఎందుకు చేయకూడద? అయన అన్న అనేకమైన రెచ్చగొట్టే మాటలు విచారణార్హంగానే ఉన్నాయి మరి.

   Delete
  3. Me kenduku e gurivida ginjalaga, astyavni tharapuna vakaltha,

   Delete
  4. @శ్యామలీయం
   బాబాల్లో దొంగబాబాలు తప్ప మంచి బాబాలుంటారా? మంచిబాబాలయితే వారికి వందల ఎకరాలెందుకు?

   Delete
  5. "బాబాల్లో దొంగబాబాలు తప్ప మంచి బాబాలుంటారా"

   Viswaroop, why not, just check Dinesh Reddy's old city baba. Any one in his right mind has to call him a manchi baba :)

   Delete
 4. All sarf-e-khas & waqf land deals after 1994 must be investigated on a fast track basis.

  ReplyDelete
 5. Pi aaropanalanni nijame aite immediate ga T Brothers take action against her. If they r not done agitation on her, it should be think they may settled the issue with her.

  ReplyDelete
 6. శ్యామలీయంగారూ, సూర్యప్రకాష్ గారూ!,

  వీళ్ళు చెప్పినవన్నీ అలా గుడ్డిగా నమ్మేయకండి. అబద్ధాలు, అవాస్తవాల పునాదులపైనే తెలంగాణ ఉద్యమం నిర్మితమైందనే విషయాన్ని మరవకండి. బ్రాహ్మడు, మేకపిల్ల కథ చందాన, రవ్వంతయినా వాస్తవం లేకపోయినా సీమాంధ్రప్రాంతంవారిపై ఏదో ఒక విధంగా బురద చల్లడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు.

  మరి ఆ ధేబ్యం ముఖం కవిత చేసిన దోపిడీ గురించి, గల్లీనుంచి ఢిల్లీదాకా టీఆర్ఎస్ నాయకులు బెదిరించి చేసుకుంటున్న వసూళ్ళగురించి చెప్పరేం.

  ReplyDelete
  Replies
  1. Nuvvu sathya Vani tothuva... besharamvala...

   Delete
 7. Replies
  1. సిగ్గుపడవలసిన విషయాలైతే రెండువైపులా ఉన్నాయనే అనుకుంటునన్నాను.

   Delete
  2. Enadu ku menu gurivida laga behave checthunaro make the luau.

   Delete
  3. అసమదీయులను అశోకచక్రవర్తి తోటి, కానివారిని తమ్ముడూ అని పిలుస్త్తోనే దుర్యోధనుని తోటి పోల్చే ఈ మహాతల్లి అదే నోటితో బతుకమ్మ పాటను అపవిత్రం చేయనందుకు సంతోషం.

   Delete
 8. ఈ సత్యవాణి గారి గురించి ఇదివరకు ఎప్పుడూ వినలేదు కాని, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో మిగతావాళ్ళకంటే చాలా ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించింది.

  ReplyDelete
 9. All politicians (Andhra or Telangana) are thieves and they want loot the common people. If Telangana state comes there will be two CM'S as well as capitals and others will remain as it is!!!!. Keep quiet, what is the need to quarel with each other?.

  ReplyDelete
 10. satyavaani mariyu k.c.r meeda vachana aropanala meeda vicharana jaripinchadi

  ReplyDelete

Your comment will be published after the approval.