సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్రకోసం హైదరాబాదులో సభ పెట్టుకున్నారు. ఉద్యోగుల ముసుగులో సభకు విచ్చేసిన సీమాంధ్ర ఫాక్షన్ రౌడీ మూకలు తెలంగాణ ప్రజలకు పీకలు తెగ్గోస్తాం అంటూ సైగ చేసి చూపడంతో పాటు సభపై తమ నిరశన తెలిపిన విద్యార్థులు, ఒక పోలీసు, సీఐ లపై పాశవికంగా సీమాంధ్ర ఫాక్షన్ ముఠాల దాడులను గుర్తుచేస్తూ కొట్టారు.
దాడులకు కొందరి సమర్ధన - "సమైక్యాంధ్ర సభకు వచ్చి జైతెలంగాణ అంటే కొట్టరా" అని. పైగా మారాజధానిలో మేం సభ పెట్టుకుంటే వద్దనడానికి మీరెవ్వరు అనడం. పచ్చకామెర్లతో కళ్ళకు విషమెక్కిన వీరినుండి మనం ఇంతకన్న ఎక్కువ ఆశించడం అత్యాశే.
రాజధాని కదా అనీ ఢిల్లీకి వెల్లి ఢిల్లీ పౌరుల మనోభావాలకు వ్యతిరేకంగా సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇస్తారా. ఒకవేళ సభ పెట్టుకుంటే అక్కడి జనం ఊరుకుంటారా?భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉన్న ఈసమయంలో సీమాంధ్రులు హైదరాబాద్ వచ్చి తెలంగాణకు వ్యతిరేకంగా సభపెడితే ఉద్రిక్తతలు పెరగవా? అది ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టినట్టు కాదా? అలాంటి సభను ఎందుకు పెట్టుకోవ్వాలి? దానికి ప్రభుత్వం ఎందుకు అనుమతినివాలి? సమాధానం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. సీమాంధ్రకు కొమ్ముగాస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణను ఆపడానికి తానేస్వయంగా ఉద్యోగసంఘాలతో మాట్లాడి పెట్టించిన సభ ఇది. సీమాంధ్ర చంచా అయిన డీజీపీ దీనికి నాలుగురోజులు ముందుగానే అనుమతినిచ్చాడు.
సమైక్యాంధ్రసభను పెట్టుకున్న వాళ్ళు సమైక్యతకోసం ఏమన్నా నాలుగు మంచిమాటలు చెప్పారా? ఎందుకు కలిసుండాలో తెలంగాణప్రజలకేమయినా సందేషం ఇచ్చారా? తెలంగాణ ప్రజల సమస్యలేంటి, బాధలేంటి అని విచారించి తెలుసుకోవడానికి ఏమన్నా ప్రయత్నించారా అంటే అదేంలేదు, కేవలం మేము రాష్ట్రాన్ని విడగొట్టనివ్వమని బెదిరించారు. ఎందుకంటే వీరి ఉద్దేషం సమైక్యత కాదు, ఉద్రేకతలు రెచ్చగొట్టడం, తరువాత ఎవరైనా ఒక రాయి రువ్వితే దాన్ని సాకుగా చూపి హైదరాబాదును యూటీ చెయ్యాలని డిమాండ్ చెయ్యడం.
ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంటే నిరశన తెలపడం ప్రజల హక్కు.అదేలేకపోతే అది ప్రజాస్వామ్యం అవదు, నిరంకుశత్వం అవుతుంది. ప్రజలను రెచ్చగొట్టడానికి పెట్టుకున్న ఈసభను ఆపాల్సిన ప్రభుత్వమే దగ్గరుండి జరిపిస్తుంటే కోపగించిన ప్రజలు చేయగలిగింది నిరశన తెలపడం. అలా నిరశన తెలపడానికి వెళ్ళిన వారికి జరిగిన సత్కారం అనాగరిక సీమాంధ్ర ఫాక్షన్ సంస్కృతిని గుర్తుచేస్తూ పాశవికంగా కొట్టడం.
బాలరాజు యాదవ్ అనే ఓయూ విద్యార్థిని ఎల్బీ స్టేదియం బయట గేటుదగ్గర కడప ఎంజీవోలు రక్తాలు కారేలా కొట్టారు. చేగొండి చంద్రశేఖర్ అనే యువకుడు సభలో జైతెలంగాణ అని నినదించినందుకు తల పగలకొట్టారు. చివరికి కడుపు మండిన ఒక పోలీసు జైతెలంగాణ అన్నందుకు పోలీసును, ఆపడానికి ప్రయత్నించిన ఒక సీఐని పాశవికంగా కొట్టారు. ఎందుకంటే వీల్లకు ప్రజాస్వామ్య భావనలన్నా, ప్రజల ఆకాంక్షలన్నా పడితే కదా?
ఈసభ ద్వారా తేలిందేమిటి?
1. సమైక్యత అనేది ఇక సాధ్యం కాదు
2. సీమాంధ్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ప్రాధమిక హక్కులు గౌరవింపబడవు.
3. సీమాంధ్ర ముఖ్యమంత్రి, డీజీపీ ఉన్నంతవరకూ హైదరాబాదులో, తెలంగాణలో తెలంగాణ ప్రజలకు రక్షణలేదు. ఎంతదూరమైనా వచ్చి మరీ దాడులు చేయగల సమర్ధులు సీమాంధ్రలో ఉన్నారు.
తెలంగాణ ప్రజలపై తెలంగాణలో సీమాంధ్రులు దాడులు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో చంద్రబాబు పాలకుర్తి సభకు చంద్రదండు పేరుతో తరలి వచ్చిన సీమాంధ్ర గూండాలు తమతో సుమోల్లో కర్రలు తెచ్చుకుని తెలంగాణ ప్రజలపై దాడి చేశారు. అలాగే విజయమ్మ సిరిసిల్ల సభకు కూడా తనతోపాటు సీమ గూండాలను వెంటతెచ్చుకుని ప్రజలపై దాడిచేసింది. ఈరెండు సందర్భాల్లో వీరి వెనక ఉండి నాటకం ఆడించింది ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డే. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి ఉయోగుల ముసుగులో తెలంగాణప దాడి చేశాడు.
ఇటీవల విద్యుత్ సౌధలో జరిగిన ధర్ణాలో తెలంగాణ ఉద్యోగిపై ఇద్దరు సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేసి కొట్టడమే కాక ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు వెల్లి తెలంగాణ ఉద్యోగిపైనే కేసు పెట్టారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా దాడి చేసింది ఎవరో తెలిసిపోవడంతో అడ్డంగా దొరికిపోయారు.
తక్షణం సీమాంధ్ర ముఖ్యమంత్రినీ, డీజీపీనీ గద్దె దించి రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడమో, తెలంగాణా నాయకున్ని ముఖ్యమంత్రిని చేయడమో జరగకపోతే తెలంగాణ ప్రజలపై ఇంకిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. మొన్నటి సభలో తెలంగాణ నిరశనకారులపై సీమాంధ్రుల దాడులు, వాటికి ముఖ్యమంత్రి, డీజీపీల వత్తాసు చూసి ఆగ్రహించిన కేంద్రం అప్పుడె ఆదిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
emanna rasinava....
ReplyDeletemasthu gundi anna....
ika seemandhra vallaki samaikya pichi vadili...
JAI TELANGANA ani HYD lo vundadame.....
అసలు నువ్వేం రాస్తున్నావో నీకు అర్థమవుతోందా? డిల్లీ కి వెళ్లి డిల్లీ పౌరుల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడటం వీలవుతుందా అంటున్నావు? అంటే నీ దృష్టిలో హైదరాబాదు తెలుగోళ్లది కాదు, తెలుగు ప్రజలు హైదరాబాదులో సభలు పెట్టుకోకూడదు. సీమాంధ్రులు వస్తే తంతాం అంటారు. అర్థరాత్రి పూట బందులు ప్రకటిస్తారు. అసలు ఏంట్రా మీ సమస్య? తల నుంచి పాదం వరకూ వేర్పాటు వాదమనే విషాన్ని నింపుకుని మనిషి అన్న సంగతే మర్చిపోతున్నారు మీరు. బాగా ఎక్కించాడు మీకు కేసీఆర్. తాలిబన్లకు మీకు పెద్ద తేడాలేమీ కనిపించడం లేదు. ఎవరు అన్నారో కానీ మీకు బాగా పెరు పెట్టారు తెలబాన్లని. మీకు కచ్చితంగా సూటవుతుంది ఆ పేరు. అసలు ఎవర్రా రౌడీలు. ఉస్మానియా నాగం ను కుమ్మింది మీరు కాదా? అసెంబ్లీ ప్రాంగంణంలో జేపీని కుల్ల బొడిచింది మీరు కాదా? డిల్లీలో పాపం పేద దళిత ఉద్యోగిని చెంపలు పగులగొట్టింది మీరు కాదా? సభలో చెప్పులు చూపించిన వాడు విద్యార్థా? పక్కా గూండాలాగా ఉన్నాడు. అయినా ఏజ్ బారయిన వాడు విద్యార్థి అంటే ఇక్కడ నమ్మేవాడు ఎవడూ లేడు. రక్షణగా ఉండాల్సిన పోలీసు వెధవ తన కర్తవ్యాన్ని మర్చి పిచ్చోడిలా అరిస్తే వాణ్ణి చావగొట్టింది పోలీసు సోదరులే. సభలో ఉన్న వారు పూనుకుంటే వాడు తిరిగి బయటకు వచ్చేవాడు కాదని గుర్తుంచుకోండి. చెత్త నాకొడుకుల్లారా... ఇంకా రాష్ట్రం విడిపోకుండానే తెలబాన్ వేషాలు వేస్తున్నారు. అరవై ఏళ్లు కలిసి కష్టపడి అభివృద్ధి చేసుకున్న రాజధానిని మీరొక్కరే అనుభవించాలని అత్యాశ పడటం తప్పు కాదా? అయినా హైదరాబాదులో కార్పొరేటర్ గా కూడా గెలవలేని తెరాస దద్దమ్మలకు హక్కే లేదు. నూటికి ఎనభై మంది హైదరాబాదీలు సమైక్యమనే అంటారు. ఆ విషయం మీకు తెలుసు. అందుకే మూసుకుని కూర్చోండి. అంతగా విడిపోవాలనుకుంటే హైదరాబాదును వదులకుని వెళ్లండి. ఏ వరంగల్లో, కరీంనగర్ లోనో రాజధాని పెట్టుకోండి. తెలంగాణ వాదం వినిపించేది కేవలం మూడు జిల్లాల్లోనే కదా.. మరి మీకు మిగతా ఏడు జిల్లాలు ఎందుకు? అవి ఇప్పటిలాగే ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా ఉంటాయి లెండి. వాటిని వదిలేసి వరంగల్, కరీంనగర్, నల్గొండలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోండి. పొండి.
ReplyDelete@Anonymous11 September 2013 09:02
Delete- నాకు బాగానే అర్ధం అవుతుంది, మరి నీకవుతుందా?
- ఢిల్లీ దేశంలో అందరిదీ, వెల్లి ఢిల్లీ ప్రజలకు వ్యతిరేకంగా సభ పెట్టి చూడు.
- విషాన్ని నింపుకుని కూడా మీ అవసరం కోసం కలిసుందామంటున్నారు, సిగ్గులేదా?
- మా నాగమ్ను మేం కొడితే నీకెందుకురా ఉలుకు, ఒక దెబ్బ పడ్డాందుకు బుద్దొచ్చి ఇప్పుడు ప్రజల కోరికప్రకారం నడుచుకుంటుండు.
- నిండు అసెంబ్లీలో వైఎస్ వివెకానంద ముద్దుకృష్ణమనాయ్డును కొట్టిండు, తెలియదా?
- నిజంగా మేం హైదరాబాదును కొట్టేశ్తున్నాం అనిపిస్తే దానిగురించే అడగొచ్చుగా, పిరికివాల్లలా సమైక్యాంధ్ర అంతున్నారెందుకు, మీవాదనలో నిజంలేదు కాబట్టేగా?
- నీమొహం, అసలు నీకు తెలంగాణలో ఎన్ని జిల్లాలో కూడా తెలుసా? వెల్లి వాల్లనడుగు ఏంకావాలనుకుంటున్నారో. నువ్వెందుకు వకాల్తా పుచ్చుకోవడం?
correct gaa adigavu anna hyderbad vallaku hakku vundhi vallu nammuthe hyderbad kosam adigali kani . samkayndhraa endhuku aduguthunnaru
Deletecorrect gaa adigavannaa hyderabadulo variki hakku vundhi ani vallu nammuthe dhani kosam adigali kani , samkhyaandhraa lu endhi
DeleteManshiko Mata godduko debba... samaikya idiots Ki debbale correct...
Deleteతెలంగాణ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మూతి పళ్లు రాలుతాయ్... ఫ్యాక్షన్ నాయకులు, సీమాంధ్ర గుండాలు హైదరాబాద్ కు వచ్చి సభ పెట్టి, మా వారిని చితకబాది తాలిబాన్ల కంటే పెద్ద ఉగ్రవాదులని నిరూపించారు... కలిసి ఉండాలని కోరుకుంటూనే దాడులు చేయడం... భారత సరిహదుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలాంటిది.... ఇప్పుడు చెప్పండ్రా... సీమాంధ్రులు తాలిబాన్లా... తెలంగాణావారా...
Deleteతెలంగాణలో ఉద్యమం ఉదృతంగా ఉన్న రోజుల్లో కాంగ్రేసు, తెదేప, వైకాప పార్టి నాయకులు తెలంగాణాలో తిరగాలని అనిపించినప్పుడల్లా వాళ్ళ ప్యాంటు లు తడిసేవి.
ReplyDeleteఅదే సిమాన్ద్రలో ఉద్యమం ఉదృతం అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన తెదేప, వైకాపా పార్టి ల ప్యాంట్లు ఆ ప్రాంత ప్రజలు తడిపించటం దేవుడెరుగు, వాళ్ళ యాత్రలకు మాత్రం జనం తండోప తండాలుగా, జాతరలకు వచ్చినట్లు వస్తున్నారు, ఇక కాంగ్రేసు నాయకులు కూడా మరీ ఎక్కువ వ్యతిరేకత లేకుండానే తిరుగుతున్నారు. దీనిని బట్టి అర్థం కావటం లేదా సమైక్యం అనబడే ఉద్యమం కృత్రిమం అని, దానిని నిర్వహిస్తున్న వారు సిమాంద్ర నాయకులని?
good point
DeleteThe so called movement exists only in the Andhra media. Not just YCP/TDP meetings, even trade union leaders retirement felicitation rallies are attracting more crowd than the samai"kya" agitation.
Delete