ఒన్‌డే క్రికెట్‌లో భారీ స్కోరును చేజింగ్ ఛేస్తున్న జట్టులో ఒక్కరొక్కరుగా అందరూ అవుటవుతూ, లక్ష్యం కనుచూపుమేరలో కూడా లేకుండా మిగిలిన బంతులూ, చెయ్యాల్సిన పరుగుల సమీకరణం అసంభవంగా ఉన్న సమయంలో ఆఖరున మిగిలిన బాట్స్‌మన్ అప్పుడప్పుడూ పిచ్చిపట్టినట్టు బ్యాటింగ్ చేసి ఫోర్లూ, సిక్సర్లూ కొడతాడు. బౌలర్లు కూడా ఎలాగూ అప్పటికే గెలిచిపోయామని తెలుసుకాబట్టి బాట్స్‌మన్ కొడుతున్నా పెద్దగా పట్టించుకోక నవ్వుతుంటారు. ఇలాంటి బ్యాటింగ్ గెలవడానికి ఏకోశానా పనికిరాదు గానీ బాట్స్‌మన్ వ్యక్తిగత రికార్డులను పెంచడానికీ, బాట్స్‌మన్ వ్యక్తిగత ప్రతిష్ట పెరగడం తద్వారా మరికొన్నాల్లు జట్టులో స్థానం నిలుపుకోవడానికీ మాత్రం పనికొస్తాయి. ఆబాట్స్‌మన్ జట్టును గెలిపించలేకపోయినా ఓడిన జట్టులో ఆరోజుకు ఛాంపియన్‌గా గుర్తుండిపోతాడు.
ఆఖరు బాట్స్‌మన్ అలాగ పరుగులు తీస్తుంటే చూసే జనం "అరె, ఇప్పటిదాకా ఇలాగే ఆడుంటే బాగుండు కదా, గెలిచేవాళ్ళం" అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇలా ఆఖరు నిమిషంలో చెలరేగే బాట్స్‌మన్ ఎవరూ కూడా లక్ష్యం అందుబాటులో ఉన్నప్పుడు అలా ఆడరు. కారణం లక్ష్యం చేయి దాటి అసాధ్యమని తెలిసినతరువాత బాట్స్‌మన్ పై వత్తిడి ఉండదు. ఔటయినా పోయేదేమీలేదు. అందుకే కళ్ళుమూసుకుని కొడుతూ ఉంటారు. అదే ఆట ముందు ఆడాలంటే ఔటయితే జట్టు మేనేజ్‌మెంట్ తిడుతుందేమోనన్న భయం మనసులో ఉంటుంది కాబట్టి ఆడరు.
ఇప్పుడు సీమాంధ్రలో కాంగ్రేస్, వైకాప, తెదేపా నాయకులందరికీ కూడా తెలంగాణ విభజన ఎలాగు జరిగిపోతుంది, ఆపడం తమవలన సాధ్యం కాదని తెలుసు. కానీ తమ పార్టీ ప్రతిష్ఠ పెంచుకోవడానికి, సీమాంధ్ర జట్టుకు ఛాంపియన్‌గా మిగలడానికి నానా తంటాలు పడుతూ యాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రేస్లో స్టార్ బాట్స్‌మన్, సీమాంధ్ర (సమైక్యాంధ్ర) జాక్‌లకు ఛైర్మన్ అని చెప్పబడుతున్న ముఖ్యమంత్రి ఛాంపియన్‌గా మిగలడానికి తనవంతు తంటాలు పడ్డాడు.
ఎలాగూ విభజన జరిగేది తధ్యం, నేనూ ఒకసారి సమైక్యాంధ్రకోసం గొంతు వినిపిస్తే రేపు విభజన తరువాత నాకు రాజకీయ మనుగడ ఉంటుంది అని చేసే ప్రయత్నమే తప్ప ఇది మరోటి కాదు. ఎలాగూ విభజన తరువాత కనీసం సీమాంధ్రకు కూడా ముఖ్యమంత్రిని కాలేనని తెలుసు గాబట్టి ఇప్పుడే కాస్త రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడితే అలాగయినా జనానికి గుర్తుంటానని ఈముఖ్యమంత్రి ప్రయాస. అయితే సొంతబలం ఏమాత్రం లేక సర్పంచి పదవికి కూడా సొంతంగా గెలవలేని ఈసీల్డ్‌కవర్ ముఖ్యమంత్రికి ఈప్రయత్నం మేలు చేయదు కదా బెడిసికొట్టి విభజన తరువాత దిక్కులేకుండాపోవడం ఖాయం.
అంతసేపు కష్టపడి, ఎంతో ప్రిపేర్ అయ్యి చేసిన ముఖ్యమంత్రి ప్రసంగంలో ఒక్క వాస్తవం కూడా లేకపోగా నవ్వుకునేలాగున్నది. ముఖ్యమంత్రి తన మాటలద్వారా తనకు నాగార్జునసాగర్ ఎప్పుడు కట్టిందీ కూడా తెలియదని నిరూపించుకున్నాడు. పైగా దేశాలమధ్య నీటి వాటాలు పంచుకుంటుంటే రాష్ట్రాలమధ్య పంపకం అసాధ్యమని తేల్చేయడం ముఖ్యమంత్రి అమాయకత్వాన్ని తెలియజేస్తుంది.
తన మాటలద్వారా ముఖ్యమంత్రి తన అవగాహనా రాహిత్యాన్ని చాటుకుంటున్నాడు. పోన్లే..కుర్చీలో ఉండేది మరో రెండు మూడూ రోజులేగదా. కాకపోతే ఈముఖ్యమంత్రి మాటలు చూసి తమ స్టార్‌బాట్స్‌మన్ చెలరేగాడని పండగ చేసుకుంటున్న సీమాంధ్ర ఆందోళనకారులు ముఖ్యమంత్రి పోయి రాష్ట్రపతి పాలన వచ్చినా, మరో ముఖ్యమంత్రి వచ్చినా తమ బతుకు బష్టాండే నని తెలుసుకుంటే మంచిది.
కోటి రత్నాల వీణా.... తీగలు తెగుతున్నాయి చూసుకో. జులై 30 న ఎపుడో తీర్మానం చేస్తే ఇప్పటికి రెండు నెలలు గడిచిపోయినా విభజన ప్రక్రియ ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదంటే అర్థం కావడం లేదా? లేక మీరు అర్థం అయీ కూడా కానట్లు నటిస్తున్నారా?
ReplyDeleteఅనానిమస్సు....
ReplyDeleteఅవుతుంది నీ నమ్మకమే తుస్సు....
>> ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదంటే
ReplyDeleteఅన్నా .. మీరు ఈ బరోసాతో గత పదేళ్లుకు పైగా ఉండటం వలెనే మా పని సులభంగా అయిపొయింది. మీరు ఇదే బరోసాతో హాయిగా నిద్ర పొండి, అస్సలు టెన్షన్ పడొద్దు, మివోల్లకు కూడా చెప్పండి తెలంగాణా రాదనీ, అందరిని వాళ్ళ పని వాళ్ళను చేసుకోమని.. కాన్ఫిడెన్స్ అంటే అట్లుండాల మిలేక్క ...
Arey anonymous Ga... TELANGANA raadantunnav kada.... mari Mee pichi vedhavalu samaikyandhra udymam enduku chesthunnattu... bevakoof logon...
ReplyDelete