Tuesday, 10 September 2013

వినాయకుడి భూలోక యాత్ర



మూషికా! నేడు వినాయక చవితి కదా? మరిచేపోయాను. నాకోసం భక్తులు ఏమేం వండారో, పద భూలోకంలో ఆంధ్రప్రదేశ్ వెల్దాం. అక్కడయితే ఉండ్రాల్లు దొరుకుతాయి. 

వద్దూ ప్రభూ. అక్కడ పరిస్థితులు బాగోలేవు ఈసారి ఇంకెక్కడికైనా వెల్దాం.

ఏమయింది మూషికా?

ఆ ఆంధ్రప్రదేశ్ పేరుకు మాత్రం తెలుగువారందరి రాష్ట్రం, కానీ అక్కడ పెత్తనం మాత్రం ఎప్పుడూ ఒక ప్రాంతం వారిదే. వీల్లు తెలంగాణ ప్రాంతం అనబడే ప్రాంతాన్ని యాభై ఆరేళ్ళుగా రాచి రంపాన పెడుతున్నారు. వాళ్ళ నీళ్ళూ, నిధులూ, ఉద్యోగాలు ఏవీ ఆప్రాంతం వారికి దక్కనీయడంలేదు.  

ఇది తప్పు కదా మూషికా? మరి ఆప్రాంతం వారేం చేస్తున్నారు?

ఈరాష్ట్రం ఏర్పడకముందునుంచీ ఇప్పటిదాకా  ఆప్రాంతంవారు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోట్లాడుతూనే ఉన్నారు ప్రభూ. కానీ అధికారం, మెజారిటీ, డబ్బూ ఉండడం చేత ఈమిగతా ప్రాంతంవారు వాళ్ళ ఆకాంక్షను అణచివేస్తూనే ఉన్నారు.

మరి కేంద్రం ఏమీ చేయడం లేదా? 

కేంద్రం కూడా ఇన్నినాళ్ళూ మెజారిటీ ఎక్కవైన ఈ ఆంధ్రా లాబీ మాటలు వింటూ తెలంగాణ వారి గొంతును వినిపించుకోవడం లేదు. కానీ ఇటీవలే  మనసు మార్చుకుని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఒప్పుకున్నారు.  

మంచి పని. ఇక సమస్య తీరినట్లేగదా?

లేదు ప్రభూ, ఈ ఆంధ్రలు అంత సులభంగా సమస్యను తెగ్గొట్టనిస్తారా. ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టాడానికి వీళ్ళేదని యాగీ మొదలు పెట్టారు.

అదేమిటి మూషికా? వీళ్ళు మాత్రం కలిసుందాం అంటే సమైక్యత సాధ్యం అవుతుందా? ఒక్కచేత్తో చప్పట్లు సాధ్యమా? పోనీ ఆంధ్రులు ఏమైనా తెలంగాణ ప్రజల సమస్యలు ఇప్పటికైనా తెలుసుకుని పరిష్కరిస్తామంటున్నారా?

పక్కోడి సమస్యను అర్ధం చేసుకోవడం ఆంధ్రోళ్ళ ఇంటా వంటా లేదు ప్రభూ. కేవలం వాళ్ళు విడగొడితే మా తడాఖా చూపిస్తాం అంటున్నారు.

ఇదెక్కడిగోల మూషికా? ఇలాంటివారితో తెలంగాణ ప్రజలు ఎలా వేగుతున్నారో కదా? ఇంతకూ ఆంధ్రాలో రాజకీయ నాయకులేం చేస్తున్నారు?

ఆంధ్రా నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒకడు లక్షల కోట్లు మింగి ఇప్పుడు జైళ్ళో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఎంత దొంగయినా ఇప్పుడు ఆంధ్ర జనాలకి వాడే పెద్ద నాయకుడు. ఇతగాడు  విభజనకు వ్యతిరేకంగా తన చెల్లెలును రాష్ట్రంలో తిప్పుతున్నాడు. అదేదో సమన్యాయం కావాలంట. అదే ఉంటే తెలంగాణ ప్రజలు విభజన ఎందుకు కోరుకుంటారు?  

సమన్యాయం కోరుకుంటే మంచిదే కదా మూషికా?

అక్కడే ఉంది తిరకాసు. వాళ్ళు చెప్పే సమన్యాయం ఏమిటంటే విభజన తరువాత కూడా తెలంగాణపై దోపిడీ కొనసాగాల్సిందేనని.

ఇదేమి వైపరీత్యం. ఇంకా మిగతా వాళ్ళేం చేస్తున్నారు?

ఇంకో దొంగబాబు ఉన్నాడు. మోసం, వెన్నుపోటు అతడికి  నిత్యకృత్యాలు. అతగాడికి ఒకరోజు విభజన వద్దనీ, ఇంకో రోజు కావాలనీ, మళ్ళీ వద్దనీ పూటకో మాట మార్చడం వలన ప్రజలు వాన్ని పట్టించుకోవడం మానేశారు.

మరి అక్కడి ముఖ్యమంత్రేం చేస్తున్నాడు? కేంద్రంలో వీళ్ళదే ప్రభుత్వం కనుక కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నాడా?

అతడొక నికృష్టుడు ప్రభూ. సొంతంగా సర్పంచి పదవికి కూడా గెలవలేని వాడు కేంద్రం జెయ్యబట్టి ముఖ్యమంత్రి అయిండు. నిన్నటిదాకా కేంద్రం ఏనిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాననేవాడు, ఇప్పుడు విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించండి అంటూ అక్కడి ఉద్యోగులను ఎగదోస్తున్నాడు.  తెలంగాణవారు సభపెట్టుకుంటామంటే నానా రభస చేసే ఈముఖ్యమంత్రిగాడు అదే ఆంధ్రాప్రాంతం వారి సభలకు మాత్రం దగ్గరుండి వసతులు సమకూరుస్తుండు. వీడికి కుంభీపాకం శిక్ష వేసినా తక్కువే ప్రభూ. క్రిమీభోజనం చేయించి తరువాత కుంభీపాకం చెయ్యమని యముడికి చెప్పాలి.

ఇంతకూ ఆంధ్రా ప్రజలేమంటున్నారు మూషికా? 

అక్కడి మెజారిటీ ప్రజలకు కలిసున్నా విడిపోయినా పొయ్యేది, వచ్చేది ఏమీలేదు ప్రభూ, వాళ్ళ పని వాల్లు చూసుకుంటున్నారు. కానీ కొన్ని ధనిక భూస్వామ్య వర్గాలకు మాత్రం విభజన వల్ల నష్టం లాగుంది. హైదరాబాదులో కబ్జాలు బాగా చేశారుట, అవేమవుతాయోనని భయం పట్టుకున్నట్టుంది, వారు బడిపిలగాళ్ళాను ఎండల్లో కూర్చోబెట్టి టీవీల్లో దాన్నో పెద్ద ఉద్యమంలా జూపిస్తున్నారు.

విభజన వల్ల నష్టపోయే ఈవర్గం ఎవరు మూషికా?

ఉన్నారులే ప్రభూ. లగడపాటి, కావూరు, రాయపాటి అని కొందరు వీళ్ళ నాయకులు.

మూషికా ఈదోపిడీదారుల పని పట్టాల్సిందే. నేను తెలంగాణకెల్లి ఉండ్రాళ్ళు తినొస్తా, ఈలోపల నువ్వు ఆంధ్రాకి నీదండుతోసహా వెళ్ళి ఈదోపిడీదారుల బొక్కసాలన్నీ కొళ్ళగొట్టిరా! వెళ్ళవయ్యా మూషికా వెళ్ళు. 



11 comments:

  1. http://jaigottimukkala.blogspot.in/2013/09/stay-calm-in-face-of-provocations_9.html

    ReplyDelete
  2. విద్వేషం బాగా వంటపడితే ఇలాంటి కతలే వస్తాయి. పెద్ద ఆశ్చర్యం లెదు.మీరు ఇంతకుమించి ఆలోచించలేరు

    ReplyDelete
    Replies
    1. ఉన్నమాట రాస్తే విద్వేషమంటావేంటి సోదరా? మీ బాగోతాన్ని ఇంకెట్ల రాయమంటవ్? లేనిది ఉన్నట్లుగా రాసి మీ నాయకులంత మాటకు కట్టుబడి ఉన్నరని రాయాలా, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మొత్తం రాష్ట్రంలో (తెలంగాణతో సహా) చేస్తున్నరని రాయాల్నా?

      Delete
  3. Babu gaaru again changed his stand.

    http://www.andhrabhoomi.net/content/t-280

    ReplyDelete
  4. ఇన్నాళ్ళు మన ఉద్యోగాలు, నిధులు, నిల్లు సిమాంద్ర దోపిడీ దారులు ఎత్తుకు పోయారన్నా, తెలంగాణా రాష్ట్ర ప్రకటన రాగానే మన ఉద్యమ ఐడియాలు కూడా ఎత్తుకు పోవటం మొదలు పెట్టారు, ఇప్పుడు ఎవడో సిమాంద్ర దొంగల రాజు వాళ్ళ పెట్టుబడి దారి నాయకుడు ఆదేశించాడేమో, ఇప్పుడు బ్లాగు పోస్టులు కూడా ఎత్తుకుపోవటం మొదలు పెట్టారు. ఫ్రీ గా వస్తే ఫినాయిల్ కూడా అని ఊరికే అనలేదు ఈ సీమంద్ర దోపిడీ దారుల గురించి.

    ReplyDelete
    Replies
    1. దొరికితే కొళ్ళగొట్టడం, వీలుకాకపోతే కాపీ గొట్టడం వీళ్ళ నైజం. ఇప్పుడే టీవీ9లో చూశా, T.R.S.కి పోటీగా వీళ్ళొక S.R.S. పార్టీ పెట్టారుట. బ్లాగు పోస్టును కాపీ కొట్టడంలో ఆశ్చర్యం ఏముంది.

      సొంత రాజధాని నిర్మించుకోవడం చేతకాదు, సొంతబుర్ర వాడ్డం చేతకాదు, ఇలా కాపీ కొట్టయినా సరదా తీర్చుకోనీ.

      Delete
    2. SRS అనే కొత్త పార్టి పెట్టారని తెలియగానే ఇది తయారు చేశా

      http://i.imgur.com/qXx3gZV.jpg

      Delete
    3. ముల్లుని ముల్లుతోనే తియ్యాలి కదా !

      Delete
  5. Telanganaku valla nayakule oppukunnaru... paiki matram samaikyamani dramalu aduthunnaru....

    ReplyDelete

Your comment will be published after the approval.