కాంగ్రేస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నతరువాత మొదలయిన మలివిడత "సమైక్యాంధ్ర" అలజడిలో సీమాంధ్ర నేతలూ, ఆందోళనకారులు, కొందరు బ్లాగరులూ హైదరాబాద్ విషయంపై అనేక అపోహలూ, అబద్దాలూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఒక్కటి కూడా నిజం కాదని, వారి వాదనలో ఆవగింజంత నిజం కూడా లేదని వారికి కూడా తెలుసు, అయినా వాదనకోసం ఈఅబద్దపు వాదనలు చేస్తునే ఉన్నారు. మచ్హుకు కొన్ని ఉదాహరణలు, వాటికి సమాధానాలు!!
1) ఉన్నపళంగా పొమ్మంటే ఎక్కడికి పోతాం:
ఇదొక అసత్యపు, అర్ధం లేని, మూర్ఖపు వాదన. కాస్తో కూస్తో రాజకీయ ప్రగ్నానం ఉన్నవాళ్ళు ఎవ్వరైనా నవ్వుకునే వాదన. రాష్ట్రం విభజించబడ్డంతమాత్రాన హైదరాబాద్‌లోని సీమాంధ్రులను ఎవ్వరూ ఎక్కడికీ వెళ్ళమనడం లేదు, వారు కూడా ఎవ్వరు ఎక్కడికీ వళ్ళారని వారికీ తెలుసు. అసలా మాటకొస్తే హైదరాబాదులో ఏళ్ళతరబడి ఉంటున్నవారికెవరికీ వదిలి వెల్లాలనే భయం లేదు.
కాకపోతే హైదరాబాదు సీమాంధ్ర సెటిలర్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు భావిస్తున్న లగడపాటి లాంటి కొందరు సీమాంధ్ర నాయకులు, కొందరు స్వయంప్రకటిత మేధావి సంఘాధ్యక్షులూ ఇలాంటి అపోహలు కల్పిస్తున్నారు. మద్రాసునుండి విడిపోయినంతమాత్రాన అక్కడి తెలుగువారందరూ మద్రాసు నగరం విడిచి ఆంధ్రాకు రాలేదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు.
అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు వేరవుతాయి కనుక సహజంగా సీమాంధ్ర నేటివిటీ ఉన్నవారు సీమాంధ్ర ప్రభుత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. వారికి కూడా పదేళ్ళు ఉమ్మడి రాజధాని కనుక హైదరాబాదులో ఉండే వెసులుబాటు ఉంది.
2) ఉమ్మడిగా అభివృద్ధి చేసుకున్నాం, ఇప్పుడు మొత్తంగా మీరే కొట్టేస్తే ఎలా?
1956లో తెలంగాణ, ఆంధ్రా కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ నిధులు (హైదరాబాదుతో సహా) తెలంగాణాలో, ఆంధ్రా నిధులు ఆంధ్రాలో ఖర్చు పెట్టాలి. ఆనిబంధన పాటించినట్టయితే ఎలాంటి పంచాయితీ ఉండేది కాదు. కానీ వాస్తవానికి తెలంగాణ నిధులు ఆంధ్రాకు తరలించబడ్డయి తప్ప ఆంధ్రా నిధులు హైదరాబాద్ రాలేదు. కనుక ఆంధ్రావారు తమ సొమ్ముతో హైదరాబాద్ బాగుపడ్డది అనే అపోహ తొలగించుకుంటే మంచిది.
ఇక ఇక్కడికొచ్చి ఒక ఇళ్ళు కట్టుకున్నా, ఒక కంపెనీ పెట్టినా అది వారి సొంత లాభానికి తప్ప సిటీని అభివృద్ధిచెయ్యడం కోసం కాదు. ఆంధ్రా వ్యాపారులకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా మల్టీనేషనల్స్ ఇక్కడ పెట్టుబడి పెట్టారు. వారు పెట్టింది లాభాలకోసమే, తెలంగాణవస్తే వాల్ల లాభాలకు ఢోకా లేదని తెలుసుకనుక వారెవ్వరూ చింతించట్లేదు.
హైదరాబాదులో వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, మెట్రో రైలు లాంటి ప్రాజెక్టులు అన్నీ ఇక్కడి జనాభా అవసరానికి అనుగుణంగా సహజంగా ఇతర మెట్రోసిటీల లాగానే వచ్చిన ప్రాజెక్టులు. వాటికి పెట్టుబడులు బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ప్రకారం ఆయా కంపెనీలు పెట్టడమో, లేక అంతర్జాతీయ బ్యాంకులద్వారా ఋణాలు సేకరించడం ద్వారానో జరిగింది. ఆ అప్పులు ఎలాగూ తెలంగాణ రాష్ట్రానికే వస్తాయి కనుక ఈప్రాజెక్టులగురించి కూడా సీమాంధ్రులకు చింత అవసరం లేదు.
3) హైదరాబాదు లాంటి మరో రాజధానిని నిర్మించుకోవాలంటే ఎన్నేళ్ళు పట్టాలి?
నాలుగొందల ఏళ్ళు పడుతాయి. ఎందుకంటే హైదరాబాదు కూడా నాలుగొందల ఏళ్ళతరువాతనే ఇలాగుంది. కాకపోతే ఒక రాజధానికి ఇంతపెద్ద నగరం అవసరం లేదు. గుజరాత్ లాంటి ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రానికి కూడా ఉన్న రాజధాని అతిచిన్న నిగరం.
నిజానికి ఒక ప్రణాలిక లేకుండా ఇలా పెరిగిన ఈహైదరాబాదు నగరంలో లాభాలకంటే నష్టాలే ఎక్కువ. దీనికంటే చిన్న చిన్న నగరాలు ఎక్కువ అభివృద్ధి చేసుకుంటే సుఖంగా ఉంటుంది. సీమాంధ్రలో ఎలాగూ అనేక చిన్న నగరాలు ఉన్నాయి.
4) ఉద్యోగావకాశాలన్ని హైదరాబాదులోనే ఉన్నాయి
ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాదులో ఉన్న అవకాశాలగురించి ఈఏడుపు. అయితే ప్రైవేటు ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాళ్ళా నేటివిటీ నిబంధనలేవీ లేవు. మబవాళ్ళెందరో రోజూ బెంగుళూరు, నోయిడాల్లాంటి నగరాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. కనుక రేపు వేరే రాష్ట్రమయినా హైదరాబాదుకు సీమాంధ్ర యువకులు వచ్చి ఉద్యోగాలు వెతుక్కోవచ్చు. ఇక్కడ సీమాంధ్రలో లాగా ఫాక్షనిజం రౌడీయిజం లేవు కనుక ఎవరైనా ప్రశాంతంగా బతుకొచ్చు. అందుకే ఈనగరం అభివృద్ధి చెందింది.
5) ఆదాయంలో డెబ్బై శాతం హైదరాబాదునుండే!
రాష్ట్ర ఆదాయంలో ఎక్కవ భాగం హైదరాబాదు నుండి రావడం ఇప్పుడు మొదలు కాలేదు, 1956 నుండే ఉంది. ఆ ఆదాయం చూసే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్ర నాయకులు వచ్చి తెలంగాణను కలుపుకున్నారు.
అయితే ఇప్పుడొస్తున్న ఆదాయంలో కూడా ఎక్సైజ్, సేల్స్ టాక్స్ లాంటి ఆదాయాలు ఆఫీసు ఆంధ్రాలో ఉన్నా హైదరాబాదు కిందే వాస్తాయి. అయితే రాష్ట్ర విభజన తరువాత అవి సీమాంధ్ర అక్కౌంటు కిందికి వస్తాయి కనుక ఆదాయం గురించి చింత పడాల్సిన అవసరం లేదు.
6) ఆంధ్రప్రదేశ్ రాజధాని కనుకనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది
ఇదొక పచ్చి అబద్దం. 1956లోనే హైదరాబాదు దేశంలో ఐదవ పెద్దనగరం. మిగతా పెద్ద నగరాలు ఏరేటులో అభివృద్ధి చెందాయో హైదరాబాదు కూడా అంతే ( కాస్త తక్కవే) రేటులో పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి కాకుండా ఇన్నాళ్ళూ తెలంగాణ రాజధానిగా ఉన్నా హైదరాబాదు ఇలాగే ఉండేది. కర్నూలు ఆంధ్ర రాజధానిగా కొనసాగిన అది సుమారు అలాగే ఉండెది, కాకపోతే కాస్తడబ్బొచ్చిన తరువాత డేఋఆలకు బదులు బిల్డింగులు కొన్ని కట్టేవారేమో.
నగర అభివృద్ధి రాజధాని వలన అవదు. వ్యాపార అవకాశాలు, కొత్తవారిని చేర్చుకోవడంలో ప్రజల కలుపుగోలుతనం, భౌగోళిక స్థితిగతులు లాంటి వాటిపైన అభివృద్ధి చెందుతుంది. అలాగే ఐటీ,ఫార్మా కంపెనీలు టాలెంట్ పూల్ లభ్యమయ్యేదగ్గరే ఏర్పడతాయి. అవన్నీ హైదరాబాదుకు ఉన్నాయి గనుకే హైదరాబాదు అభివృద్ధి చెందింది.
అన్నింటితోబాటు హైదరాబాదు చుట్టు పక్కల కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు సరిపడే స్థలం ఉంది. అది ఆంధ్రా సిటీల్లో దొరకదు.
you are correct
ReplyDeleteమద్రాసునుండి విడిపోయినంతమాత్రాన అక్కడి తెలుగువారందరూ మద్రాసు నగరం విడిచి ఆంధ్రాకు రాలేదు.వారికి అక్కడ ఏ హక్కులున్నాయి?
ReplyDeleteభారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చు. వారిని 7 న సభ పెట్టుకోనిస్తారా? వారికి వాక్ స్వాతంత్ర్యం ఉంతుందా? బానిసల్లా మీకు తాళమేస్తు బ్రతకాలా?
తమ సొమ్ముతో హైదరాబాద్ బాగుపడ్డది అనే అపోహ తొలగించుకుంటే మంచిది." దోచుకొవాలంటే మీదేమి లెదనె అనాలి కదా మరి?లేకుంటే వాటా ఇవ్వాల్సి ఉంటుంది "
ఎక్సైజ్, సేల్స్ టాక్స్ లాంటి ఆదాయాలు ఆఫీసు ఆంధ్రాలో ఉన్నా హైదరాబాదు కిందే వాస్తాయి. "ఎన్ని సంస్థలు సీమాంధ్ర లొ ఆఫీసు లు పెట్టుకొన్నాయి?"
ఆంధ్రప్రదేశ్ రాజధానికి కాకుండా ఇన్నాళ్ళూ తెలంగాణ రాజధానిగా ఉన్నా హైదరాబాదు ఇలాగే ఉండేది."అయ్యుండొచ్చు.సీమాంధ్ర పెట్టుబడులన్నా అక్కడ ఉండేవి కదా. ఇంకొ రాస్త్ర రాజధానికి కొటాలొ రావాలిసిన సంస్థలు కూడా ఇక్కడె పెట్టారు కదా?"
అలాగే ఐటీ,ఫార్మా కంపెనీలు టాలెంట్ పూల్ లభ్యమయ్యేదగ్గరే ఏర్పడతాయి. అవన్నీ హైదరాబాదుకు ఉన్నాయి గనుకే హైదరాబాదు అభివృద్ధి చెందింది. అవును నిజమె." ఉద్యోగాలాన్నీ అంధ్రొల్లు దొబ్బేసారు. మన పిల్లలకి ఉద్యొగాల కొసం తెలంగానా కావాలి అని చెసిందంతా విష ప్రచారమేనా.తరువాత డిజప్పాయింట్ ఐన ప్రజల వొట్ల కోసం తరువాత ఎవర్ని తన్ని తరుము తారు?(పాకిస్తాన్ తమ ప్రజల ద్రుష్టి సమస్యల నుంచి మరల్చడానికి సరిహద్దుల్లొ ఉద్రిక్తతలు పెంచినట్లు)
మీ గత స్టేటుమెంట్లు(దున్నేస్తాం,లాక్కుంటాం,ఆప్షన్లు లేవు,ఇక్కడి ఉద్యోగాలన్నీ మాకే,జాగొ భాగొ ) అన్నీ చూసాక వచ్చే దాకా కడుపులొ పెట్టుకుంటారు,తరువాత అంధ్ర గొ బాక్ అంటారనెది ప్రజల నమ్మకం.
@Anonymous4 September 2013 19:30
Delete/*మద్రాసు నగరం విడిచి ఆంధ్రాకు రాలేదు.వారికి అక్కడ ఏ హక్కులున్నాయి? */
దోపిడీ జేసే హక్కు మాత్రం లేనట్టుంది. అదే గదా మీ ఇంటరెస్టు?
/*వారిని 7 న సభ పెట్టుకోనిస్తారా? వారికి వాక్ స్వాతంత్ర్యం ఉంతుందా?*/
సభకు అనుమతి ఇచ్చారు, గతంలో తెలంగాణవాదులు చేసిన అనేక కార్యక్రమాలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. తెలియడంలా సమైక్యరాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఎన్ని హక్కులు ఉన్నయో? మీబుద్దులు ఇలాంటివి గనుక అందరూ మీలాగే అనుకుంటే ఎలా?
/* ఎన్ని సంస్థలు సీమాంధ్ర లొ ఆఫీసు లు పెట్టుకొన్నాయి?"*/
ఏం, సీమాద్ణ్రలో ఎక్కడా హోటల్లూ, దుకాణాలూ లేవా? వాళ్ళు టాక్సులు కట్టరా?
/*అయ్యుండొచ్చు.సీమాంధ్ర పెట్టుబడులన్నా అక్కడ ఉండేవి కదా*/
గ్యారంటీ ఏం లేదు, వ్యాపారస్థులు లాభాలు ఎక్కడొస్థయనుకుంటే అక్కడ పెట్టుబడులు పెడుతరు, సరిహద్దులు చూసుకోరు.
/* ఇంకొ రాస్త్ర రాజధానికి కొటాలొ రావాలిసిన సంస్థలు కూడా ఇక్కడె పెట్టారు కదా?" */
సంస్థలకు కోటాలుండవు, అనుకూలత ముఖ్యం.
/*ఉద్యోగాలాన్నీ అంధ్రొల్లు దొబ్బేసారు. మన పిల్లలకి ఉద్యొగాల కొసం తెలంగానా కావాలి అని చెసిందంతా విష ప్రచారమేనా*/
ప్రభుత్వోద్యోగాలు దోచుకుంది నిజమేకదా, మీకు తెలీదా?
/**మీ గత స్టేటుమెంట్లు(దున్నేస్తాం,లాక్కుంటాం,ఆప్షన్లు లేవు,ఇక్కడి ఉద్యోగాలన్నీ మాకే,జాగొ భాగొ ) అన్నీ చూసాక**/
మావాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చిన్రు గని, మీవోళ్ళు గత నెలరోజుల్లో చానాచోట్ల దాడులు కూడా చేశారు. తెలీదా?
>>వారికి అక్కడ ఏ హక్కులున్నాయి?
Deleteహక్కులు లేనప్పుడు ఇంకా అక్కడ ఎం చేస్తున్నారు ?
>>వారిని 7 న సభ పెట్టుకోనిస్తారా? వారికి వాక్ స్వాతంత్ర్యం ఉంతుందా? బానిసల్లా మీకు తాళమేస్తు బ్రతకాలా?
మీ ముక్యమంత్రే ఉన్నాడుగా ఇప్పుడు ? మా ఇలాకల మాకు వఎతిరేకంగా సభ ఎలా పెట్టుకోనిస్తం? మీ నీళ్ళ కోసమో, నిదులకోసమో సభ పెట్టుకోండి, ఎవ్వనికి నష్టం లేదు, అంతే కాని ఈ సమైక్యం అనే ఒంటి చేతి చప్పట్లు ఏందిరాబై?
ఒప్పందాలు, చట్టాల ప్రకారం నడుచుకుంటే మీకు ఈ గతి పట్టేది కాదు కదా? మీ పైసల్ హైదరాబాదుల ఎన్ని ఖర్చు పెట్టింద్రో సుపెట్టుండి, మీ వోళ్ళే రాజ్యమేలుతుండ్రు గద ? గాప్పుదేప్పుదో లెక్కల్ దీస్తే మీరే మాకు చానా బాకీ వడ్దర్.
>>ఉద్యోగాలాన్నీ అంధ్రొల్లు దొబ్బేసారు.
http://www.telangana.org/Articles/Art.asp?id=16
>>వచ్చే దాకా కడుపులొ పెట్టుకుంటారు,తరువాత అంధ్ర గొ బాక్ అంటారనెది ప్రజల నమ్మకం.
తెలంగాణా కలిసే దాక సల్లగ మాటలు జెప్పి, కలవంగనె ఒప్పందాలు చట్టాలు మీరు ఎలా ఉల్లంగించినారో మొదట మాట్లాడుకుందామా?
హైదరాబాద్ విషయంలో సీమాంధ్రలో పెట్టుబడిదారులు,నాయకులు వ్యాపింపజేసిన అపోహలు,అపార్థాలు విని సీమాంధ్రలో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు!విశ్వరూప్ గారి టపా వాటిని పూర్వపక్షం చేసి పూర్తిగా పటాపంచలు చేస్తుంది!సీమాంధ్ర ముఖ్యమంత్రులు విలువైన హైదరాబాద్ ఖాళీ స్థలాలను అడ్డగోలుగా మల్టీనేషనల్ సంస్తలకు తేరగా వాళ్ళు ఆశించినదానికన్నా ఎక్కువగా అందించి వాళ్ళు లబ్దిపొందారు!ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు చేయడం సీమాంధ్ర ప్రజలకే చాలా అసౌకర్యం కలిగిస్తుంది!ఒక దశాబ్దం పాటు అస్తవ్యస్తతకు దారి తీస్తుంది!రెండు కత్తులు హైదరాబాద్ ఒరలో ఇమడడం కష్టం!పొరపొచ్చాలు పెరుగుతాయేమోనని నా భయం,అనుమానం!
ReplyDeleteGood one....Krishna
ReplyDelete>>పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమం విశాలాంధ్ర ఏర్పాటుకి పునాది వేసింది.
ReplyDeleteఅవునా, అయితే ఇంకా వివరంగా చెప్పాలంటే విశాలాంద్ర ఏర్పడటానికి పొట్టి శ్రీ రాములు గారు మద్రాసు రాజధాని గల ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసాడు అది విశాలన్ద్రకు ఒక పునాది (విశాలాంద్ర ఆయన లక్ష్యం అయితే రాజధానిగా హైదరాబాదు ఉందిగా, మరి మద్రాసు ఎందుకు కావలన్నాడో లాజిక్కులు అడక్కండి, నాకు తిక్క లేస్తుంది అలాంటివి అడిగితె), అయితే అంతకు ముందు పటేల్ గారు పోలిస్ యాక్షన్తో హైదరాబాదును భారత్ లో కలిపాడు, అదే జరిగుండక పొతే విశాలాంద్ర కుదిరే పని కాదు, సో ఆయన కూడా విశాలన్ద్రకు అలా ఒక పునాది వేసాడు. గాంది గారు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసాడు, దేశ శ్వతంత్రం లేకుంటే విశాలన్ద్రనే లేదు కదా, అలా గాంది గారు కూడా విశాలంద్రకు పునాది వేసాడు. అంతకు ముందు చిన్న చిన్న సంస్తానాలుగా ఉన్న భారత్ ను ఒక దేశంగా తయారు చేసిన ఘనత బ్రిటిష్ వారిది, వారు అలా చెయ్యకపోతే విశాలాంద్ర సాద్యం అయ్యేది కాదు, అలా బ్రిటిష్ రాణి కూడా విశాలంద్రకు పునాది వేసారు. రెండవ ప్రపంచ యుద్ధం లో భారీగా నష్టపోవటం చేత బ్రిటిష్ చేతులెత్తేసి భారత్ కు స్వతంత్రం ఇచ్చిందని ఒక చర్చ, అలా అయితే రెండవ ప్రపంచ యుద్ధం మొదలు పెట్టిన జర్మని కూడా విశాలన్ద్రకు పునాది వేసినట్లే. మన దేశం బ్రిటిష్ రాణి అధికారంలోకి రావటానికి ఈస్ట్ ఇండియా కంపెని కారణం, సో వాళ్ళు లేకపోతె కుడా విశాలాంద్ర కష్టం అయ్యేది, అంటే ఈస్ట్ ఇండియా కంపెని కూడా విశాలంద్రకు పునాది వేసింది .... ఇంకా ఉంది తర్వాత రాస్తా.