Sunday, 22 September 2013

అర్ధంలేని భయాలు, మాటున దాగున్న కఠొర సత్యాలుసీమాంధ్ర టీవీ ఛానెల్లలో విభజన గురించి జరుగుతున్న చర్చాగోష్ఠుల్లో పాల్గొంటున్న కొందరు వెలిబుచ్చుతున్న భయాందోళనలు చూస్తుంటే అక్కడి ప్రజలను వారి నాయకులు ఎంతగా బెదరగొట్టారో తెలుస్తుంది. అయితే వీరు వెలిబుచ్చే భయాందోళనలను పరిశీలించి చూస్తే చరిత్రలో దాగిన కఠోర సత్యాలు కనిపిస్తున్నాయి.

ఒక ప్రభుత్వ ఉద్యోగిని అంటుంది: రాష్ట్ర ఆదాయంలో అరవైశాతం హైదరాబాదు నుంచేనట. మరి విడిపొÓతే మాకు జీతాలెవరిస్తారు? నిజానికి ఇప్పుడు హైదరాబాదుకింద చూపించే ఆదాయం అంతా హైదరాబాదుది కాదు. రాజధాని హైదరాబాదు కనుక పన్నులన్నీ హైదరాబాదుకిందికి వస్తాయి కానీ విడిపోతే అందులో సీమాంధ్ర వాటా సీమాంధ్రకే చెందుతుంది కనుక జీతాలు ఇవ్వలేని పరిస్థితి అనేది ఒక ఎక్జాగరేషన్. అయితే దీని మాటున దాగున్న సత్యం: 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపూర్వం ఆంధ్రరాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. తెలంగాణతో కలవడానికి ఇక్కడ మిగులు ఆదాయం ఒక ప్రధాన కారణం.

మరో ప్రభుత్వ ఉద్యోగి: "నలభై వేలమంది ఉద్య్'ఓగులు హైదరాబాదు విడిచి వెల్లాల్సి వస్తుంది". ఇది కూడా ఎక్జాగరేషన్. పదేళ్ళవరకూ హైదరాబాద్ కామన్ కాపిటల్ అయితే పదేళ్ళు వదిలి వెల్లాల్సిన అవసరం ఉండదు. అంతలోగా ఎందరో రిటైర్ అవుతారు. అయితే ఇక్కడ  బయట పడే సత్యం: ఇన్నాళ్ళూ సీమాంధ్రులు హైదరాబాదులో అక్రమంగా తమ వాటా కంటే చాలా  ఎక్కువగా ఉన్నారని చెప్పినప్పుడు ఒప్పుకోనివారు కలుగుల్లో ఎలుకల్లా తమ సంఖ్యను తామే బయట పెట్టుకున్నారు.

"మన థెర్మల్ పవర్ ప్లాంట్లకు తెలంగాణ వారు బొగ్గు ఇవ్వరు". ఇది ఏమీ పరిష్కరించుకోలేనటువంటి సమస్య కాదు. దానికి సంబంధించి ఒప్పందం చేసుకోవచ్చు, పైగా దిగుమతి కూడా చేసుకోవచ్చు. ఎలాగూ మన బొగ్గు మన అవసరాలకు సరిపోవట్లేదు. అయితే ఇక్కడ దాగున్న సత్యం: బొగ్గు తెలంగాణలో ఉన్నప్పటికీ, కోస్తాంధ్రలో పంటపొలాలతో ఉన్న భూములు థెర్మల్ కేంద్రాలకు అనుకూలంగా లేనప్పటికీ థెర్మల్ ప్రాజెక్టులు మాత్రం అక్కడ పెట్టించారు. కారణం: ఆఉద్యోగాలన్నీ అక్కడివారికే చెందాలనే అత్యాశ.

మరొకావిడ చెబుతుంది:"నదీపరివాహిక ప్రాంతమంతా అక్కడ ఉంటే సీమాంధ్రకు సముద్రపు నీల్లే గతి". మరి పరివాహిక ప్రాంతమంతా తెలంగాణలో ఉన్నప్పుడు ఇన్నాల్లూ ఇక్కడ ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? అప్పుడెందుకు గ్రావిటీ బూచిని చూపి తెలంగాణ ప్రాజెక్టులు అటకెక్కించారు? ఇన్నాల్లూ లేనిది ఇప్పుడుమాత్రం ఒక్కసారే ఎత్తుగడ్డపైనున్న తెలంగాణలో ప్రాజెక్టులు సాధ్యమయి నీరు క్రిందికి రాకుండా ఆపగలం?

ఇంకా ఒక ఆర్టీసీ ఎంప్లాయీ బాధ: " విడిపోతే ఆర్టీసీ మూత బడుతుంది". ఇన్నాల్లూ నడిచింది ఇప్పుడెందుకు మూతబడుతుంది? ఆర్టీసీ అంతా తెలంగాణ ఆదాయంపైనే నడుస్తునందనేది ఇక్కడ దాగిన సత్యం, పెత్తనం మాత్రం అన్నిటిలాగే ఇక్కడ కూడా ఆంధ్రాదే.


4 comments:

 1. అదే కదండి!
  ఇన్నాళ్ళూ.. మమ్మల్ని దొంగలంటారా?... దోపిడీదారులంటారా?.... అంటూ గుండెలు బాదుకొని, గుండీలు తెంపుకొన్నవారు - "ఇన్నాళ్ళు దోపిడీ చేసి దొంగల్లా బతికి బట్టకట్టాం.... ఇప్పుడు రాష్ట్రం విడిపోతే దోపిడికి వీల్లేక చంక నాకిపోతాం" అని సిగ్గు, ఎగ్గు లేకుండా చెప్పుకొని ఏడుస్తున్నారు.

  ReplyDelete
  Replies
  1. @shayi

   తేలు కుట్టిన దొంగలు ఏదుస్తున్నరు.

   Delete
 2. వీళ్ళ ఆర్తనాదాలు వింటుంటే ఎంత వినసొంపుగా ఉన్నవో.

  మొన్న ఎవడో ఎబ్రాసో లేక ఎరాసో పేరు సరిగా గుర్తు లేదు, ఆ నాయకుడు 'సమైక్యంద్ర కోసం అవసరమయితే పెద్దమనుషుల ఒప్పందం అమలు చేస్తాం' అని బిచ్చపొనిలా తెలంగాణా కాంగ్రేసోల్లను అడుక్కోవటం. అంటే ఒప్పందాలు అమలు కాలేదని చేబుతున్నట్లేగా, మరి ఇన్ని రోజులు చెప్పలేదు అదే మాట ? ఇట్లాంటివి అన్ని మొదట చెయ్యాల్సిన పనులు, విల్లేమో చివర్న చేస్తున్నారు. ఇన్ని రోజులు కళ్ళు నెత్తిక్కెక్కి మనను అస్సలు కానలేదు, ఇప్పుడేమో 15ఏళ్ళు ముక్య మంత్రి పదవి మిరే తీసుకోండి, ఇంకేం కావాలో చెప్పండి అంటూ కాళ్ళ బేరానికి వచ్చారు. ఛి చీ .... పౌరుషం లేనోళ్ళు ..

  ReplyDelete
  Replies
  1. @Green Star
   తెలంగాణ లేకపోతే బతకలేమన్నసంగతి వాల్లకి ఇప్పటికి అర్ధమయినట్టుంది, కాళ్ళబేరానికొస్తున్నారు.

   Delete

Your comment will be published after the approval.