Wednesday, 18 September 2013

మాకడుపులు కొట్టి సంబరాలా?

నలభై రోజులుగా జరుగుతున్న సమ్మె వల్ల జీతం రాక కోపంతో ఒక ఆర్టీసీ డ్రైవరు మాకడుపులు కొట్టి మీరు సంబరాలు చేసుకుంటారా అంటూ విశాఖపట్నంలో సమైక్యాంధ్ర దీక్షల్లో డాన్సులు చేస్తున్న నాయకులపై విరుచుకుపడ్డాడు. యధాప్రకారం దీన్ని కూడా ఈనాడు ఎక్కడో లోకల్ ఎడిషన్లో లోపలి పేజీల్లో వేసింది.


6 comments:

  1. ఇది నీకు ఎలా కన్పించింది?

    ReplyDelete
  2. అతని బాధ ఉద్యమంలో మీలాగా పాటలు పాడి పండగ చేసుకున్నందుకు కానీ ఉద్యమం జరగనందుకు కాదు.
    అతనికి కావలసినది సమిఖ్యంగా జీవించడం.
    ఇక అన్నదమ్ముల్లా విడిపోదాం అని పదే పదే అనడం ఎవరికీ రుచించట్లేదు ఎందుకంటే విడిపోయిన అన్నదమ్ములు నష్ట పోయారు మధ్యవర్తి లాభ పడ్డాడు అన్నది చరిత్ర చెప్పిన సత్యం.

    ReplyDelete
    Replies
    1. మధ్యవర్తి సంగతి దేవుడెరుగు, అన్నదమ్ములెవరూ ఇప్పుడు కలిసి ఉండడం లేదు, కలిసుంటే ఉండే కష్టాలు తెలుసు కాబట్టి.

      ఐనా అన్నదమ్ముల్లా ఎందుకు, రాష్ట్రాలుగానే విడిపోదాం.

      Delete
  3. దీంట్లో తప్పేంటో అర్థం కాలా!

    ReplyDelete
  4. Ilanti picha news spread cheusunta bathakandi ra...pitcha naaa....

    ReplyDelete
  5. మా అసిస్టెంట్ వచ్చి "సార్! ఊరెళ్ళాలి. నాలుగు రోజులు లీవ్ కావాలి" అన్నాడు. అతడి ఊరు విశాఖపట్నం ప్రక్కన ఉండడం వల్ల - "ఎందుకయ్యా? అక్కడంతా ఉద్యమం గొడవలు నడుస్తున్నాయి. వెళ్ళి ఏం చేస్తావు?" అన్నాను నేను యథాలాపంగా.
    దానికి సమాధానంగా ఆయన చెప్పిన మాటలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. "ఎవరన్నారు సార్? కాలేజీలు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు, ఆర్టీసీ బస్సులు తప్ప అంతా మామూలే. ఏ గొడవలు లేవు. వాళ్ళూ డ్యూటీ డుమ్మా కొట్టినందుకు ఒక గంట సేపు ఏదో ఒక సెంటర్లో ధర్నాలో, డాన్సులో, మీటింగులో చేసి, తరువాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకొంటున్నారు."
    "అదేంటయ్యా? మరి టీ.వీ. ఛానళ్ళలో అంత ఊదరగొడుతున్నారు కదా!" అన్నాను నేను ఆశ్చర్యంగా.
    "అదేముంది సార్! ఆ గంట కార్యక్రమాన్నే టీ.వీ.లల్లో 24 గంటలూ చూపుతున్నారు." అన్నాడతడు.
    నేను అవాక్కయి లీవ్ లెటర్ మీద సంతకం పెట్టా.

    ReplyDelete

Your comment will be published after the approval.