Monday, 23 September 2013

వర్ధిల్లాలీ సమైక్యాంధ్ర!!



"వర్ధిల్లాలీ సమైక్యాంధ్రా" సుబ్బారావు గట్టిగా, పక్కనున్న నారాయణ కాస్త నెమ్మదిగా అరిచారు. గంటనుండీ అలాగే అరుస్తున్నారు. అదేదో సమైక్యాంధ్రకోసం ధర్ణా అట. బడిపిలగాళ్ళంతా చక్కగా రంగురంగు యూనిఫారాలతో ఒద్దికగా కూర్చున్నారు. అక్కడక్కడ సుబ్బారావు, నారాయణ లాంటి మరికొందరు నడివయసు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎవరో ఒక పెద్దాయన నినాదాలిస్తుంటే బడి పిల్లలు చక్కగా గొంతు కలుపుతున్నారు. సుబ్బారావు కూడా వారితో పాటు గట్టిగా అరుస్తున్నా మిగతా జనాలు మాత్రం పెద్దగా పట్టించుకోవట్లేదు.

నారాయణకు కాసేపటికి తామెందుకలా అరుస్తున్నామనే సందేహం వచ్చింది. సుబ్బారావ్, సమైక్యాంధ్ర వర్ధిల్లడమంటే ఏంటి?

సుబ్బారావుకు కోపమొచ్చింది. "అంటే ఈరాష్ట్రాన్ని యిడగొట్టకుండా ఇలాగే కలిపి ఉండాలని".

మరి యెవలిడగొడుతున్నరు?

నారాయణ, నువ్వసలు బొత్తిగా ఏం జరుగుతుందని తెలుసుకోవు లాగుంది. తెలంగాణోల్లు తమకు వేరే రాష్ట్రం కావాలని ఉద్యమం చేస్తున్నరు. ఈమధ్యనే కేంద్రం వాల్ల డిమాండుకు ఒగ్గేసి విడగొట్టడానికి ఒప్పుకుంది. అందుకే మనం ఇలా ధర్ణా చేస్తున్నాం.

ఆహా!! వాళ్ళు విడగొట్టమని, మనోళ్ళు కలిసుందామనీ అంటున్నరన్నమాట. ఇప్పుడేం జెయ్యాల? మనం మాత్రం కలిసుండీ వాళ్ళు విడిపోతె సరిపోద్ది గద?

నారాయణా, అసలు నీకేం తెల్వదు. వాళ్ళు విడిపోయి మనం కలిసుండడమంటె రాష్ట్రం విడిపోయినట్టే గద?

సుబ్బారావ్, నువ్వు చెప్పింది నిజమే కని మనం మాత్రం కలిసుండాలంటె సమైక్యాంధ్ర ఎట్ల వర్ధిల్లుతది?

నారాయణ, వాళ్ళు విడిపోతె మనకేంది గానీ, విడీపోతూ విడిపోతూ వాళ్ళు హైదరాబాదును కూడా తమతోపాటు తీసుకెలుతున్నరట. మన నాయుడుగారి యాపారాలన్నీ నేమో హైదరాబాదులనే ఉండె. అందుకే ఈపోరాటం. అందుకే మన నాయుడుబాబుగారు మనల్ని యిక్కడకి రమ్మని పిలిసిండు.

అట్లనా! అట్లయితే మనం హైదరాబాదు మనగ్గావాలని కద పోరాటం జెయ్యాల్సింది? మరి నడిమిట్ల సమైక్యాంధ్ర వర్ధిల్లాలని అనుడెందుకు?

అట్లడిగితె హైదరాబాదు మనకు రాదంట. నాయంగ హైదరబాదు వాల్లదేనంట. కలిసేటప్పుడు మనం దాన్ని తీసుకెల్లలేదు, అది మన ప్రాంతంల లేదు. ఎటు జూశినా అది మనకు దక్కే ఉపాయంలేదు. అందుకే సమైక్యంగ ఉంటె హైదరాబాదుమీద నాయుడుగారి పెత్తనం అట్నే నడుస్తది, ఆయన యాపారాలు అట్నే సాగుతయని నాయుడుగోరి ఆశ.

ఓహో..సూటిగడుగుతందుకు మనదగ్గర నాయం లేదు గనక యిట్ల డొంకతిరుగుడు యవ్వారం జేస్తున్నమన్నమాట. ఏమైనా నాయుడుగారిది గొప్ప తెలివే సుబ్రావ్. ఇంతకూ మనకేది మంచిగుంటది?  

మనమాహైదరాబాదును ఎప్పుడన్న సూశినమ, పెట్టినమా? మనరాజధాని మన బెజవాడ దగ్గరుంటె కనీసం అప్పుడప్పుడన్న పొయ్యిరావచ్చు. మనకు పనులు పెరుగుతయి. విడిపోతనే మనకు మంచిది.

ఈయిసయం ఇంతమెల్లగ చెబుతవేంది సుబ్రావ్? మన కోరికల నాయం లేకపాయె, మనకు లాభం లేకపాయె. మన నాయుడుగారి లాభంకోసం పొద్దాక మనమెందుకు ఈడ కూసోని గొంతుబొయ్యేదాక అరవాలె? సదువుకునే పిలగాళ్ళెందుకు సదువులు పాడు చేసుకుని అరవాలె. నాకిదేం బాగనిపిస్తలేదు. పోదాం పద.

సరే..నాకూ అదే అనిపిస్తుంది. పద ఇంటికెల్దాం. రేపటినుంచి నాయుడుగారిదగ్గర పని మానేసి ఇంకెక్కడన్న చూసుకుందాం. 


17 comments:

  1. stop all these noncense , am from rayalaseema , i never been to hyderabad , all my studies and job is in bangalore only , but i feel that united andhra pradesh is best

    ReplyDelete
    Replies
    1. tell me 10 reasons, what is the benifit for telanagana people if AP is united

      Delete
    2. tell me 10 reasons,What is the benifit for telangana people,if AP is united

      Delete
    3. OK. Which Naidu has then told you that state should be united?

      Delete
    4. best for whom? and for what?

      Delete
    5. Best for whom? and for what?

      Delete
  2. Why telangana required till now nobody answered?

    ReplyDelete
    Replies
    1. It was answered umpteen number of times. Now is the time you should answer why samaikyandhra.

      Delete
  3. జై సమైక్యాంధ్ర!ప్రత్యెక రాష్ట్రంగా సమైక్యాంధ్ర వర్ధిల్లాలి!రాయలసీమ ఎన్నటికీ విడిపోరాదు!తెలంగాణా రాష్ట్రం ఎప్పుడో ఏర్పడింది!కొన్ని లాంచనాలు మాత్రం మిగిలాయి!అవికూడా డిసెంబర్ వరకు పూర్తి అవుతాయి!కనుక కోస్తాంధ్ర,రాయలసీమలు శాశ్వతంగా సమైక్యంగా కలసి ఉండాలి!జై సమైక్యాంధ్ర!

    ReplyDelete
    Replies
    1. @surya prakash apkari

      సత్యం చెప్పారు. సీమాంధ్రలో మాత్రం జరిగే ఉద్యమం వారిని మాత్రం సమైక్యంగా ఉంచడానికి సరిపోతుంది. ఎలాగూ ఆంధ్రప్రదేశ్లో మిగిలేది సీమాంధ్రే.

      Delete
  4. మీ నాయకుల కాళ్ళ అద్దాలతో చూడడం మానేయ్యండి.
    ఇక నాయుడు చెప్పలేదు
    ఒకరి ౧౦ కారణాలు కావలంట
    కొత్త రాష్ట్రం ఏర్పడటానికి డబ్బులు ఎక్కడ నుంచీ వస్తాయి, అవి ప్రజల మీద పన్నులు మోపి లేదా మన రాష్ట్ర వాటా ను విభజించి - దీనికన్నా కలిసి ఉండి అందరం నీరు అందని ప్రదేశాలకు నీరు అందించే project గురించి అడుగుదాం.
    ఇక నిరుద్యోగం అది రాజ్యాంగం వల్ల వచ్చింది నాయకుల కుయుక్తుల వల్ల పెరిగింది. మన రాజ్యాంగం ప్రకారం పదవీ విరమణ కాలం ౬౦ సంవత్సరాలు. ఇక దాని వల్ల చాలా నిరుద్యోగ సమస్య ఉండనే ఉంది. తరువాత నాయకుల కుయుక్తులు. దాన్ని పోగొట్టాలి అంటే పదవీ విరమణ కాలం తగ్గించాలి అని అడుగుదాం అందరం కలిసి ఉండి.
    ఇక విదేశీ వస్త్ర బహిష్కరణ దిశగా ముందుకు అడుగు వేద్దాం మన చేనేత కార్మికులు నేసిన బట్టలనే కట్టుకుంటే వచ్చే లాభం గురించి అందరికీ అవగాహన పెంచుదాం.

    ReplyDelete
    Replies
    1. @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు

      - మీరు పది కారణాలు కాదుగదా, ఒక్కటికూడా ఇవ్వలేదు. నిధులు ఎక్కడీనుండి వస్తాయి అనేది కారణం కాదు ఊహాజనిత భయం. ఇలాభయపడితే ఏదీ చేయగూడదు.

      - ఇప్పటిదాకా జరగనివి ఇప్పుడు అది చేద్దాం,ఇది చేద్దాం అంటే మరీ నవ్వులాటగా ఉంటుంది.

      - సమస్య వివక్ష అయినపుడు పదవీ విరమణ 40 ఏళ్ళకు కుదించినా లాభం ఉండదు.


      Delete
    2. what is % of seemandhra people discriminated Telangana people, Do you have any idea?

      Delete
    3. How will reducing retirement age help? The retiring guy will become unemployed, won't he?

      Delete
    4. మా సీమాంధ్రా వోళ్ళకు మా బహుజనుల, బలహీనవర్గాల అభిప్రాయానికి గౌరవం ఇద్దామనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. సమైక్య రాష్ట్రం బడాబాబులకే కావాలి. మేం తెలంగాణ విభజనకే ఓటేస్తున్నాం. ఆంబేద్కర్ ఆశయం ఇదే. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి సాధకాలు! ఇది తెలీని మధ్య తరగతి వోళ్ళంతా, ఆ పెట్టుబడిదార్ల తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మీ తెలంగాణా వోళ్ళ బ్లాగుల్లోకి వొచ్చి, అడ్డమైన ప్రశ్నలతో వాళ్ళేదో అసమాన దేశభక్తుల్లా వాగుతున్నారు. నిజానికి తెలంగాణా ఇస్తే మా సీమాంధ్ర ప్రజలకేమీ ఇబ్బందులుండవు! వొచ్చే యిబ్బందల్లా ఆ పెట్టుబడిదార్లకే!
      అనవసరంగా బడిపిల్లల్ని, సామాన్య ఉద్యోగుల్నీ బజారు కీడ్చారు. బలహీన వర్గాల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు! ఇకనైనా ఈ దొంగ సమైక్యాంధ్ర ఉద్యమం ఆపితేనే మంచిది. ప్రజలు సంతోషిస్తారు.

      జై సీమాంధ్ర! జై తెలంగాణ!!

      Delete
    5. @Anonymous23 September 2013 18:26

      సత్యం పలికారు.

      Delete
  5. Hyd లొ స్ట్రైక్స్ జరిగినప్పుడు యెందుకు రాయలెదు ఇలాంటి comments. మీరు చెసెది నిజమైంది యెదుటివాల్లది కాదా? యెదుటివాల్లని గౌరవించటం నెర్చుకొ...

    ఆంధ్ర లొ ప్రజలు స్వచందంగ చెస్తున్న strike ఇది. ఒకసారి వెల్లి చూడు నీకె తెలుస్తుంది.

    ReplyDelete

Your comment will be published after the approval.