Monday 23 September 2013

ముఖ్యమంత్రి మార్పు



రాష్ట్రవిభజన గురించి కాంగ్రేస్ నిర్ణయం తీసుకున్నతరువాత తోక జాడిస్తున్న ముఖ్యమంత్రిపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. నిర్ణయానికి ముందు అంతా మీయిష్టం అంటూ హైకమాండ్‌కు చెప్పొచ్చిన సీల్డ్‌కవర్ ముఖ్యమంత్రి ఆతరువాత వారంరోజులకు సుషుప్తావస్త నుండి బయటికి వచ్చి రాష్ట్రాన్ని విభజిస్తే నీళ్ళ సమస్యలెలా తీరుస్తారు, విద్యుత్ సమస్యలెలా తీరుస్తారు అంటూ మాట్లాడి తన అవగాహనారాహిత్యాన్ని చాటుకోవడమే కాక సీమాంధ్రలో  కిరాయి ఉద్యమాన్ని సృష్తించడం కోసం అషోక్‌బాబు లాంటి పావులను కదపడంపై ఢిల్లీ కోపంగా ఉంది.

నిజానికి విభజన ప్రకటన తరువాత సీమాంధ్రలో వారం రోజులపాటు ఎలాంటి ఆందోళనలూ లేవు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా భాయాందోళనలు రగిలించడమె కాకుండా కొందరు కిరాయి మనుషులతో ఆందోళనలు ప్రోత్సహిస్తున్నాడనేది బహిరంగ రహస్యం. ఏపీఎంజీవోలు హైదరాబాద్‌లో జరిపిన మీటింగుకి కర్త, కర్మ, క్రియా అన్నీ తానే అయి నడిపించడమే కాకుండా ఏసీ బస్సులూ, ప్రత్యేక రైల్లూ అరేంజ్ చేశాడు. 

తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడంకోసం సభలకు అనుమతుల నిరాకరణతోపాటు ముందస్తు అరెస్టులూ, రబ్బరు బుల్లెట్లూ, విచక్షణారహితంగా లాఠీఛార్జీలూ చేపించే ముఖ్యమంత్రి సీమాంధ్ర ఆందోళనల్లో జాతీయ నాయకుల విగ్రహాలు కూలగొడుతున్నా పట్టించుకోలేదు. 

సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య నాటకానికి ముగింపు పలకడానికి కేంద్రం ముఖ్యమంత్రిని మార్చి తెలాంగాణకు చెందిన నాయకున్ని ముఖ్యమంత్రిని చెయ్యడమో లేకపోతే రాష్ట్రపతి పాలన విధించడమో చేయనున్నట్లు సమాచారం. ఇదేజరిగితే సమైక్యాంధ్ర ఆందోళనలు ఆపడానికి అక్కడ కూడా ముందస్తు అరెస్టులూ, లాఠీచార్జీలూ, కేసులు బనాయించడం చేస్తే వాటిని తట్టుకుని సమైక్యాంధ్ర సమర్ధకులు ఆందోళనలు ఎంతవరకు కొనసాగిస్తారనేది ప్రశ్నార్ధకమే. కడుపు కాలినవాడు పోలీసులనెదిరించి పోరాడుతాడు కానీ కడుపు నిండినవాడు చేయలేడుకదా? 

11 comments:

  1. లెస్స వచించితివి మిత్రమా! తథా sస్తు!! కడుపు మండిన పోరాటం మనది, కడుపు నిండిన పోరాటం వాళ్ళది! కడుపు నిండినవాడు చల్లకదలకుండా పోరాడుతున్నాడు. ముందస్తు అరెస్టులూ, బైండోవర్లూ...(మనమనుభవించినవి) తట్టుకోగలరా? ఎంతైనా, cut & paste గాళ్ళకు సొంత ఉద్యమ తెలివితేటలెక్క డేడిశాయి? చూద్దాం...

    ReplyDelete
  2. కడుపు నిండిన వాడెవడూ ఉద్యమం చెయ్యడు. ఈ రాష్ట్రంలో నాయకులకు తప్ప ప్రజలెవ్వరికీ కడుపులు నిండలేదు. ఇక ప్రాంతాల పరంగా చూస్తే కడుపు నిండిన ప్రాంతం హైదరాబాద్ ఒక్కటే.

    ReplyDelete
    Replies
    1. ha ha ha ha h bhale cheppav! inko sari cheppu lekunte vallaki artham kaademo?

      Delete
    2. @ప్రసాదు

      కడుపు నిండినవాడు ఉద్యమం చెయ్యడు గానీ నాటకం చెయ్యగలడు. ప్రస్తుతం సీమాంధ్రలో సమైక్యాంధ్ర పేరుతో నడిచేది ఉద్యమం కాదు నాటకం.

      ప్రాంతాలకు కడుపులు ఉండవు నిండడానికి. హైదరాబాదు అంటే బంజారాహిల్స్, జుబిలీ హిల్స్, కూకట్‌పల్లి మాత్రమే కాదు. అడ్డగుట్ట, జగద్గిరిగుట్ట లాంటి ప్రాంతాలకెల్లి చూడండి అక్కడ కడుపు నిండిందో, ఎండిందో?

      సీమాంధ్రలో కూడా కడుపు నిండనివారు ఎందరో ఉన్నారు..కానీ వాళ్ళు సమైక్యాంధ్ర కోరుకోవడంలేదు, విభజనే కావాలని ఇప్పటికే పలు సందర్భాల్లో సమావేశాలు పెట్టి మరి వాళ్ళు చెప్పారు..కానీ మీమీడియా వాళ్ళ గొంతు వినిపించనివ్వదు, కేవలం అక్కడ జరిగే నాటకాన్నే చూపిస్తుంది.

      Delete
    3. మీడియా తెలంగాణాలోని సమైక్యవాదుల గొంతుకూడా వినిపించదు. వాళ్ళకు కావలసింది సెన్సేషన్ మాత్రమే.

      Delete
    4. @ప్రసాదు

      1. తెలంగాణలో ఎవరైనా సమైక్యాంధ్రకు మద్దతుగా గొంతువినిపిస్తే అది సెన్సేషనే అవుతుంది కనుక మీడియాకు అది అవసరమే. చూపించడానికి వారు రెడీగా ఉంటారు. కాకపోతే అలాంటివారు తక్కువ. ఉదాహరణకు కిరణ్‌రెడ్డి చంచా జగ్గారెడ్డి అప్పుడప్పుడూ సమైక్యాంధ్రకు మద్దతిస్తూ మాట్లాడితుంటాడు, దాన్ని సీమాంధ్ర మిడియా హైలైట్ చేస్తుంది.

      2. సీమాంధ్రలో ఎవరైనా విభజనకు మద్దతిచ్చినా అదీ సెన్సేషనే అవుతుంది. అయినా సీమాంధ్ర మీడియా అది చూపించదు. కారణం: సెన్సేషన్ కంటే కూడా సీమాంధ్ర మీడియాకు వారి వారి సామాజిక వర్గాల ప్రయోజనాలూ, వారు కొమ్ముగాసే పార్టీల ప్రయోజనాలు ముఖ్యం.

      Delete
  3. కటువుగా చెప్పవలసి వస్తోంది, కేవలం మీ‌ నిందాలాపాలకు విసుగు పుట్టి.

    తెలంగాణా ఉద్యమం ప్పేరుతో KCR & Co ఇన్నాళ్ళూగా ఆడుతున్నదంతా నాటకమే కదా?
    మీ KCR చేసినట్లు ప్రచారం చేసుకుంటున్న హడావుడి నిరాహారదీక్ష కేవల పరమనాటకం అని ఒక్క తెలంగాణా వాళ్ళూ, వాళ్ళ అవసరం నటించే సోనియమ్మ & కంపెనీ వాళ్ళూ మాత్రమే‌ నమ్ముతున్నారు ఈ‌ భూప్రపంచంలో


    చాలా?

    క్షమించండి. మాటలు విసరటం అందరూ చేయగలరు. మీ పక్షం ఒకటే కాదు! కాని ఇవి సాధించే ఘనకార్యం ఒక్కటే. విద్వేషాలను పెంచటమే సుమా. ఇలా విన్నవిస్తున్న కొద్దీ మీరు అదోదో చేతగాని తనం అన్నట్లుగా అవలి పక్షాన్ని దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. దీనికి అంతం ఎక్కడ? దయచేసి, రెచ్చగొట్టే మాటలు ఆపండి తక్షణం. అంతకంటే ఎవరూ చెప్పేది ఏమీ‌ లేదు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారూ,

      అసలు మీదృష్టిలో నిందలంటే ఏమిటో. మీచత్త కామెంట్లు చూసి చూసి కూడా విసుగు పుడుతుంది. ఇప్పటివరకు ఎంతమంది తెలంగాణవాదులబ్లాగుల్లో దూరి నిందలు నిందలూ అంటూ ఏడ్చారు? జరిగేది రాస్తే మీకు నిందలాగా కనిపిస్తుందా? అదే పచ్చిబూతులు రాసే సీమాంధ్ర బ్లాగర్లజోళికి మాత్రం వెల్లరు. అడిగితే నాదృష్టికి రాలేదు అని బుకాయిస్తారు. లింకులిస్తే మళ్ళీ కనబడరు. ఎందుకింత పక్షపాత వైఖరి?

      ఇక మీ మిగతా కామెంటు గూర్చి.

      తెలంగాణ ఉద్యమం ఒక్క కేసీఆర్& కో మాత్రం చేయలేదు.లక్షలమంది రోడ్లపైకి వచ్చి లాఠీలనూ, భాష్పవాయుగోళాలనూ ఎదుర్కొని ఉద్యమించారు, లాఠీదెబ్బలు తగిలి, భాస్పవాయుగోళాలు తగిలి కాళ్ళు విరగ్గొట్టుకున్నవారు కొందరయితే ప్రాణాలు కోల్పోయినవారు కొందరు. ఎంత అణచివేయడానికి ప్రయత్నిస్తే అంత ఎక్కువ ఉద్యమించారు ప్రజలు. ఉద్యమమంటే అదీ. మీవోళ్ళలా ముఖ్యమంత్రి దగ్గరుండి బస్సులు అరేంజ్ చేసి సభలు పెట్టిస్తే వచ్చి వాగడం, బడిపిల్లలనూ చంటిపిల్లలనూ వాడుకోవడం ఉద్యమం అనరు, నాటకమనే అంటారు.

      మీహ్రస్వదృష్టిలో తెలంగాణ ఉద్యమమంటే కేసీఆర్ &కో మాత్రమే, కానీ మాకు కాదు. కేసీఆర్ కేవలం ఎప్పటినుంచో ప్రజలలో ఉన్న భావనను ముందుకు తీసుకెళ్ళాడు. అందులో ఎందరో ప్రజాసంఘాలు RSU నుంచి RSS దాకా ఒక్కటై పోరాడారు. అది మీకు ఎన్నటికీ అర్ధమవుతుందనుకోను.

      మాటలు విసరగానే సరిపోదు, అందులో నిజాలు ఉండాలి, దానికోసం విషయంపై అవగాహన ఉండాలి.

      Delete
    2. ఇలా ఎవరికి వారు మేమే గొప్ప ఉద్యమం చేసేస్తున్నామూ పరమధర్మాతత్ములమూ అనుకోవటం వలనే చిక్కులన్నీ. మీ‌ధోరణి మీదే. కానివ్వండి.

      Delete
    3. Well said sir., Malli Shyamaleeyam garu kanapadaru..... Nijam mee Blog nunchi nenu chala neruchukannanu... Jai Telangana....

      Delete
  4. శ్యామలీయంగారూ! వీళ్ళ లక్ష్యాన్ని మీరు అర్ధం చేసుకోవటంలేదు. ఇది ప్రాపగాండా కార్యక్రమం. తెలంగాణ దోచుకోబడింది, సీమాంధ్రవాళ్ళు దొంగలు. ఎంతసేపు చెప్పినా ఇదే. దీనిపైనే ఉన్నవీ, లేనివీ కల్పించి లక్ష చెబుతారు. సీమాంధ్ఱలో జరుగుతున్నదంతా కిరాయి ఉద్యమం అంటారు...కళ్ళముందు ప్రజలు మహోద్యమం చేస్తున్నా కూడా. అక్కడి ప్రజల భావాలను గౌరవించే కనీస సంస్కారం లేని వీళ్ళని పట్టించుకోకూడదు. లైట్ గా తీసుకోండి.

    వీళ్ళ ఉద్యమంలో ధర్మంకూడా లేదు కాబట్టి, ఇది ఎలాగూ విజయవంతంకాదు...ఆ తెలంగాణా కూడా వచ్చేది కాదు. మరెందుకు మీరు బాధపడటం.

    ReplyDelete

Your comment will be published after the approval.