రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? ముఖ్యమంత్రే మద్దతిస్తే సీమాంధ్రులు హైదరాబాదులో సభ పెట్టడం కష్టమా? రాయలసీమ ఫాక్షనిస్టులు సుమోల్లో దండయాత్రలకెలితే ఏపీఎన్జీవోలు సభకు ఏసీబస్సుల్లో, ప్రత్యేకరైల్లలో వచ్చారు. ఇందులో ఎందరు ఎన్జీవోలో, ఎందరు కిరాయి గూండాలో తెలియదు. ఈసభకు దొంగ పాసులను కూకట్‌పల్లిలో పంచిపెడుతూ దొరికిపోయారంటే సీమాంధ్రనుండి వచ్చిన వారిలో ఎనదరు దొంగపాసులతో వచ్చారో తెలిస్తుంది.
సభకు వచ్చిన ఒక ఆకురౌడీ నిజాం కాలేజీ విద్యార్థులను మెడలు నరికేస్తామంటూ సైగలు చేస్తున్న దృష్యాన్ని కింది వీడియోలో చూడొచ్చు. బాబూ ఆకురౌడీ, మీరు కత్తులతోనైనా తడిగుడ్డలతోనైనా గొంతులు కోయగలరని మాకు తెలుసు, నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకేగదా ఈ ఫాక్షనిస్తులతో మాకుపడదు, విడిపోతామనేది?
తెలంగాణవాదులు సభ పెట్టుకుంటామంటే అనుమతులు ఇవ్వకపోవడం, ఎక్కడికక్కడ బస్సులు, లారీలు, రైళ్ళను అపేయడం, ముందస్తు అరెస్టులూ, అవసరం లేకపోయినా లాఠీ ఛార్జీలూ చేయడం, భాష్పవాయుగోళాలను ప్రయోగించడం చేసే పోలీసులు ఈసీమాంధ్ర సభను మాత్రం దగ్గరుండి జరిపించారు. రైల్వే సహాయమంత్రి మూడు ప్రత్యేక రైళ్ళు వేయగా, అనేక ప్రభుత్వ, ప్రైవేటు బస్సులో జనాలను తరలించారు. సభ జరిపేది తెలంగాణవాదులైనా సీమాంధ్రవాదులైనా తెలంగాణ విద్యార్థులకు లాఠీ దెబ్బలు తప్పవని నిరూపిస్తూ నిజాం కాలేజీ హాస్టల్, ఓయూ విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపించి విచక్షణారహితంగా కొట్టారు ఈసభద్వారా మరోసారి సమైక్యరాష్ట్రంలో తెలంగాణపై వివక్షను చూపించి ఇది సీమాంధ్ర ప్రభుత్వం, తెలంగాణప్రజలు సవతి పిల్లలని ప్రభుత్వం నిరూపించింది.
సభకు కేవలం ఉద్యోగులు రావాలని హైకోర్టు అనుమతి ఇస్తే ఎందరో రాజకీయనాయకులు, ఇతరులకు అనుమతినిచ్చారు. ఘజల్ శ్రీనివాస్‌కు అనుమతిలేదని ముందు వెనక్కి పంపిస్తే ఒక ఐయేఎస్ అధికారి దగ్గరుండి లోపలికి తీసుకెళ్ళాడు.
సభలో ఉద్వేగానికి లోనయిన ఒక తెలంగాణ పోలీసు "జైతెలంగాణ " అని నినదించగా ఆపోలీసును మిగతా పోలీసులూ, ఏపీఎంజీవోలు విచక్షణారహిత్మగా కొట్టారు. నిజాం కాలేజీలో లాఠీచార్జి చేస్తున్న పోలీసులు ఒక విద్యార్థిని ఉద్దేషపూర్వకంగా పాశవికంగా బిల్డింగుపైనుండి తోసివేశారు. సభకు ర్యాలీగా వస్తున్న సెక్రటేరియట్ సీమాంధ్ర ఉద్యోగులు ఒక ఓయూ విద్యార్థిని కిరాతకంగా కొట్టగా అతను ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు.
ఇంతచేసి తెలంగాణ గడ్డపై తెలంగాణప్రజలను రెచ్చగొట్టెవిధంగా సభపెట్టుకున్న వారు సభలో కేసీఆర్ను తిట్టడం, నాయకులను రాజీనామాలు చేయమనడం మినహా ఒక్కరు కూడ ఎందుకు కలిసి ఉండాలి, విడిపోతే వచ్చే నష్టాలు, కలిసుంటే లాభాలు ఏమిటి అని మాట్లాడలేదు.
తెలుగు జాతి సమైక్యత, ఆత్మగౌరవం అంటూ గొప్పగా మాట్లాడిన వాళ్ళు వేదికపై ఇంతపెద్దగా పెట్టిన బ్యానరుపై కూడా అచ్చుతప్పులు రాస్తూ సమై"ఖ్య" ఆంధ్ర ఉద్యమం అంటూ రాసుకున్నారు.
పదమూడు జిల్లాలవారు మాత్రమే సభకు వస్తే అది ఏపీఎంజీవోల సభ ఎలా అవుతుంది, సమైక్యాంధ్ర సభ ఎలా అవుతుందనేది ఎప్పటిలాగే ఎప్పుదూ ఉండే ప్రశ్న. ఇలాంటి దండయాత్రలు సమైక్యతన్ సాధించవు సరికదా, తెలంగాణ ప్రజలు ఎందుకు ఈరాష్ట్రంలో కలిసి ఉండడం సాధ్యం కాదో మల్లీ మల్లీ తెలియజెబుతాయి.
మొత్తానికి ఈసభ సమైక్యతకోసం కాదు, తెలంగాణ ప్రజలను రెచ్చగోట్టడానికి అనీ, ఇన్నిరోజు ఉద్యమం జరుగుతున్నా ఒక్కసారికూడా హైదరాబాదులో సీమాంధ్ర సెటిలర్లపై ఎలాంటి అవాంచనీయ సంఘటనలకూ పాల్పడని తెలంగాణవాదులను దాడులకు ఉసిగొల్పడం, తద్వారా హైదరాబాదును యూటీ చెయ్యాలనేడిమాండును తీసుకురావడానికి కిరణ్ రెడ్డి అషోక్‌బాబుతో కలిసి ఆడిన నాటకమనీ తెలుస్తుంది.
కొసమెరుపు: ఏపీఎన్‌జీవోల సభకోసం వచ్చిన కొందరు నిన్నరాత్రి అమీర్‌పేట సితార హోటల్లో బసచేసి వ్యభిచారులతో గడుపుతూ రైడింగ్‌లో దొరికిపోయారుట. బుద్దులు ఊరికేపోతాయా?
అబ్బబ్బా ఏం క్రమశిక్షణ, ఏం హుందాతనం ,ఏం సంస్కారం , ఒక విగ్రహం పగలలేదు , ఒక రెచ్చగొట్టే మాట లేదు. ఒక రాయి విసరలేదు .
ReplyDeleteచొక్కాలు విప్పుకుని నడుము కి కట్టుకోలేదు , కర్చీఫ్ లు తో మొహాలు కప్పుకుని రౌడి ల్లా తిరగలేదు , రాళ్ళు విసరలేదు .
దూషణలు లేవు . తిట్లు లేవు . ఇచ్చిన టైం కి వచ్చారు , సభ జరుపుకున్నారు , వెళ్ళారు . క్రమశిక్షణ అంటే ఇది .
చేల మీదకి కోతుల దండు వచ్చినట్టు , ఏది పడితే అది విరిచేసి, జనాలని భయభ్రాతులు చేసి వెళ్ళలేదు .
తెలంగాణా బందు ,
వచ్చే జనాల మీద రాళ్ళు విసరడం
బస్ లని నడపకుండా బందు పాటించి జనాలని ఆపడం
శాంతి యాత్ర పేరుతొ రెచ్చ గొట్టడం .
రౌడి లుని హాస్టల్ లో దాయడం .
ఇలాంటివి ఎన్ని ఆటంకాలు పెట్టినా, అన్ని దాటుకుని హైదరాబాద్ నడిబొడ్డున సభ జరుపుకోవడం , అదీ ఈ సున్నిత సమయం లో అత్యంత క్రమశిక్షణ ( ఈ పదం కొంచెం ఒత్తి చదువుకోగలరు ) తో పూర్తీ చేయడం మామూలు మాట కాదు .
సీమంధ్ర ప్రజలకి హాట్స్ ఆఫ్ చెప్పచ్చు .
అవతలి వాడు పీక కోస్తానని చెప్పి ఉంటాడు , వీడు అదే చెప్పాడు .
రెచ్చగొట్టే బుద్దులు ఎవరివో ఇన్నాళ్ళు జనం చూస్తూనే ఉన్నారు
ప్రభుత్వతీరుకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తే అది ఉద్యమం. ప్రభుత్వమే వెనుకుండి డిజీపీ, పోలీసుల కనుసన్నల్లో చేసేది ఉద్యమం కాదు, దొంగ నాటకం. అది ఎప్పుడైనా పకడ్బందీగా వేసుకున్న ప్లాను ప్రకారం జరుగుతుంది.
Deleteతెలంగాణ ఉద్యమంలోలా ఎక్కడికక్కడ బస్సులు ఆపేసి, జనాలను అరెస్టు చేసి లాఠీలతో కొడితే తెలిసేది మీ సంయమనం.
mee janaalu already raalla daadi start chesaranta..
Deleteyem udhyamam raa babu meedi.
మీ ఉద్యమం వెనుక ఎవరు ఉన్నారో అందరకీ తెలుసు. ప్రజల నుండి పుట్టిందా ? లేక ఫాం హౌస్ లో బుసకొట్టిందా ?
Delete@Anonymous7 September 2013 19:37
Deleteఒక్కడు ఫాంహౌస్ నుండి బుసగొడితెనే ఇంత ఉద్యమం నిజంగా వస్తే ఆ ఒక్కడు మహా గొప్పోడు అయుంటాడు. ఎంతసేపు వాడిమీద ఏడుపు. పోలీసులు దగ్గరుండి మాఉద్యమాన్ని జేయించలేదు మీలాగ.
మీరు ఇట్టాగే క్రమశిక్షణతో కార్యక్రమాలు చేసుకోండి, అక్కడ కేంద్రం ఇంకా క్రమశిక్షణతో తెలంగాణా ఏర్పాటుకు ముందుకెలుతుంది.
Deletenice post. "Samaikhya" word written on banner is correct. remove that lines and pic.
ReplyDeleteBEFORE BLAMING SEEMANDRA PEOPLE YOU PUPIL CHANGE THE POLITICIANS WHO ARE PRO TO SAMAIKHAYA ANDHRA IN TELANGANA POLITICS.
ReplyDeleteThe banner might have been written by Telangana guy. it is pronounced like that in telangana.
ReplyDeleteహైదరాబాదు లేకుంటే మీరు బతకలేరు అనుకున్నాం, కనీసం బానర్ కూడా రాసొకొరాదా!! అది తెలుగు పరిరక్షకుల తెలుగు జ్ఞానం.
Deletemee blag lo meeku mee lOPAALU etti choopE AE vyakhya publish cheyaraa? kallu moosukuni paalu taagutoo memu pattina daaniki moode kaallantaaraa?
ReplyDeleteఅయినా సమైక్య సభ స్టేజ్ ముందు జై తెలంగాణ అంటే ఎవరైనా ఊరుకుంటారా? అదే మీరైతే చంపేసే వారే...
ReplyDeleteతెలంగాణకొచ్చి సమైక్యాంధ్ర అనొచ్చు, సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ అనొద్దా? నీమొహం, అయినా సమైక్యాంధ్రలో తెలంగాణ లేదా?
Deleteఇప్పుడే ఆకాశ రామన్న సైటు లో ఒక కామెంట్ సదివా, వీళ్ళ సభ పూర్తీ కాగానే అక్కడ కేంద్ర ప్రభుత్వం 'తెలంగాణా ఏర్పాటుకు రాజకీయ సంబంద కార్యక్రమాలు అయిపోయాయి, ప్రభుత్వ కార్యక్రమాలు మొదలవుతాయి' అని. lol.
ReplyDeleteఈ బల్లి ఏదో మంచి శకునం లా ఉంది, వీళ్ళు అన్నట్లు ఆ మిలియన్ మార్చ్ ఏదో తొందరగా చేసేస్తే బాగుండు, అప్పుడు కేంద్రం, మా పని కూడా అయిపొయింది, తెలంగాణా బిల్లు నెక్స్ట్ వీక్ పెడతాం అంటుంది.
ఈ సభ తెలంగాణా ఎందుకు కావాలనో మరొక్క సారి నిరూపించింది. పదేళ్ళ ఉమ్మడి రాజధాని అవసరం లేదని నిరూపించింది. ఇక వాళ్ళు తట్టా బుట్టా సర్దుకొని, ఆ పాత గుడారాలు దుమ్ము దులిపి చిరుగులు ఏమైనా ఉంటె కుట్టుకునే కార్యక్రమం మొదలు పెడితే బాగుంటుంది.
ReplyDelete