Wednesday 4 September 2013

చల్లకొచ్చి ముంత దాస్తే!



చల్లకొచ్చి ముంత దాస్తే ఏమవుతుంది? చల్లా దక్కదు, ముంతా మిగలదు. సీమాంధ్ర నేతల సమైక్యాంధ్ర ఉద్యమం పరిస్థితి కూడా ఇంతే. ఎలాగూ విభజన తధ్యమని తెలిసిన తరువాత ఉద్యమించాల్సింది వారి హక్కులకోసం. ఇంకా సమైక్యాంధ్ర అంటూ వేలాడితే చివరికి న్యాయమైన హక్కులు కూడా దక్కవు.

రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు కావల్సిందేమిటి? కొత్త రాజధానిని నిర్మించడానికి కాస్త ప్యాకేజీ, నీటిపారుదలలో కాస్త వాటా. వాటికోసం పోరాడితే కాస్త బాగుంటుంది కానీ వీరు చేసేది ఏమిటి? ఒకటి ఎలాగూ జరగని సమైక్యాంధ్ర పోరాటం. ఒకవైపు వాళ్ళు మాత్రమే మేము సమైక్యంగా ఉంటాం అంటే సమైక్యత ఎలా కుదురుతుందో కూడా ఈమట్టిబుర్రలకు అర్ధం కాదు. ఒకవైపు ప్రజలు సమిక్యత కోరుకుని మరొక వైపు ప్రజలు విడిపోదామంటున్నారంటే అప్పటికే ప్రజల్లో విభజన జరిగినట్లే.

సమైక్యాంధ్రా కాకుండా వీరి మిగతా డిమాండ్లు హైదరాబాదును యూటీ చెయ్యాలి లేదా హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలి. ఈరెండు డిమాండ్లద్వారా సగటు సీమాంధ్రునికి నయాపైస లాభం ఉండదు. అయినా ఇక్కడి నాయకుల డిమాండ్లు మాత్రం ఇవే. అంటె వీరిప్రేమ సీమాంధ్ర ప్రజలపై కాక హైదరాబాదు కబ్జాభూములపైనేనని తేలిపోతుంది.

ఈనాయకులను ఇలాగే గుడ్డిగా నమ్మి సీమాంధ్ర ప్రజలు కూడా అవేడిమాండ్లు చేస్తూ ఉద్యమిస్తుంటే చివరికి న్యాయమైన ప్యాకేజీ కూడా లభించదు.  

1 comment:

  1. బర్రె మొత్తం నాకే కావలె అని మొత్తుకుంటుంటే మీరు కొంచం చల్ల ఇస్తనంటే ఎట్లబై? బర్రెను చంపనయిన చంపుతరు కానీ మీకయితే వదలరు ఎర్కలెదా వారీ?

    ReplyDelete

Your comment will be published after the approval.